Wednesday, December 10, 2008

విజ్ఞాన సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

రోజు తెలుగు వికిపీడియా ఐదవ పుట్టినరోజు .
సందర్భంగా వికీ సభ్యులకు, నిర్వాహకులకు , వినియోగదారులకుశుభాకాంక్షలు.

తెలుగు వికీపీడియా డిసెంబరు 10, 2003లో మొదలయ్యింది. తెలుగులో వికీపీడియా స్థాపించడానికి నాగార్జున వెన్న మొదటి సారిగా విజ్ఞప్తి చేసారు.వికీపీడియాలో రెండు రకాల నిర్వాహకులు ఉంటారు, (నిర్వాహకులు మరియు అధికారులు). నిర్వాహకులు వ్యాసాలను తొలగించగలరు, వివాదాస్పద వ్యాసాలలో మార్పులు చేయకుండా నిరోధించగలరు, మరియూ ఇతర సభ్యులను మార్పులు చేయకుండా నిరోధించగలరు కూడా. అధికారులు నిర్వాహకులు చేయగలిగే అన్ని పనులు చేయగలిగి కొత్త నిర్వాహకులను తయారు చేయలరు. ఈ పేజిలో నిర్వాహకులు, మరియూ అధికారుల జాబితా ఉంటుంది.


ఇక తెవికి లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు ఇక్కడ చూడవచ్చు. మీరు కూడా అందులో పాలు పంచుకోవచ్చు, ఆసక్తి , ఉత్సాహం ఉంటే .

ఈ వికిపీడియాలో నిస్వార్ధంగా , కృషి చేస్తున్న ఎందఱో ఔత్సాహికులు ఉన్నారు. అందులో కొందరి వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది.

భిక్షు - తెలుగు వికీపీడియాలో సభ్యత్వం తీసుకుని మొదటి సారిగా ఒక రచనను చేసిన సభ్యుడు.
సి.చంద్రకాంతరావు - క్రీడలు, రాజకీయాల వ్యాసాల పై చాలా కృషి చేసారు
చదువరి - తెలుగు వికీపీడియాకు ఒక విధి విధానాన్ని నిర్దేశించారు. ఎన్నో నిర్వాహణా వ్యాసాలను ఆంగ్ల వికీ నుండి తెలుగులోకి అనువదించారు.
చావా కిరణ్ - ప్రతీ తెలుగు గ్రామానికి ఒక వికీ పేజీ ఉండాలనే ఊహను మొదటి సారిగా పైకి తెచ్చారు.
జి.ఎస్. నవీన్ - తెలుగు సినిమాల ప్రాజెక్టుపై చాలా కృషి చేశారు.
ఎమ్ .ప్రదీప్ - మండలాల పేజీల సృష్టించడానికి, కొన్ని నిర్వహణా పనులు చేయడానికి, గణాంకాలను సేకరించడానికి బాట్లను తయారు చేసాను.
రాజశేఖర్ - తెలుగు వికీపీడియాలో జీవశాస్త్రానికి సంబహందించిన వ్యాసాలను బొలెడన్ని తయారు చేసారు.
బ్లాగేశ్వరుడు - ఆకతాయిగా మొదలు పెట్టి నిర్వాహకునిగా మారిన సభ్యుడు. తెలుగు వికీపీడియాలో కొన్ని వ్యాసాలకు తన గొంతుతో చదివి వినిపించారు. [ఉదా: వికీపీడియా:5_నిమిషాల్లో_వికీ]
త్రివిక్రమ్ - విశేష వ్యాసాల స్థాయి వ్యాసాను అందించిన సభ్యుడు. చందమామ వ్యాసం ఈయన తయారు చేసిన వ్యాసాలలో ఒక కలికితు రాయి వంటిది.
వీవెన్ - తెవికీ మొదటి పేజీని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. అలాగే వికీపీడియా సాఫ్టువేరును తెలుగులోకి అనువదించడంలో చురుకుగా పాల్గొన్నారు
నాగార్జున వెన్న - తెలుగు వికీ సృష్టికి బాటలు పరిచారు.
కాసుబాబు - తెలుగు సినిమాలతో మొదలు పెట్టి, ప్రతీ దేశానికీ తెవికీలో ఒక స్థానాన్ని కల్పించారు. ప్రతీ వారం ఒక కొత్త వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా ఎంపిక చేస్తుంటారు. అలాగే ఒక బొమ్మను కూడా ఈ వారం బొమ్మగా ఎంపిక చేస్తుంటారు.
రవిచంద్ర - మీకు తెలుసా శీర్షికను నిర్వహిస్తుంటాడు. ఎన్నో చిట్కాలను కూడా అందచేస్తుంటాడు.
విశ్వనాద్ .బి.కె. - ఎన్నో అందమైన బొమ్మలను తెవికీకి అందించాడు.
వైజాసత్య - తెవికీకి మొట్టమొదటి నిర్వాహకుడు, అధికారి. ప్రస్తుతం దశానిర్దేశాం చేస్తున్నారు. ఇతను కూడా తెవికీ నిర్వహనార్ధం కొన్ని బాట్లను నడుపుతుంటారు.
దేవ్ - ఎన్నో మూసలను తయారు చేసారు, ఒకప్పుడు నిర్వాహకుడు, ప్రస్తుతం స్వచ్చందంగా తన నిర్వాహకత్వాన్ని వదులుకున్నారు.
సాయి - వికీపీడియాను ఆదునీకరించడానికి చాలా కృషి చేసారు.
అహ్మద్ నిసార్ - ఇస్లాంకు సంభందించిన ఎన్నో వ్యాసాలను తెవికీకి అందించారు.
ఎం. రహమతుల్లా - చరిత్ర, కులాలు, ఇస్లాం ప్రముఖులకు సభందించిన పలు వ్యాసాలను తెవికీ అందించారు.
శివరామ ప్రసాద్ - హాం రేడీయో వ్యాసం తో మొదలు పెట్టి కొన్ని పుస్తకాల వ్యాసాలు తయారు చేస్తున్నారు.
కుమార్ రావ్ - చరిత్రకు సంభందించిన పలు వ్యాసాలపై పని చేస్తున్నారు.
బొజ్జా - ఫొటోగ్రఫీకి సంభందించిన వ్యాసాలను తయారు చేస్తున్నారు.
టి. సుజాత - ఎన్నో అక్షరదోశాలను సరి చేసారు. అమెరికాలోని ప్రముఖ పట్టణాలకు వ్యాసాలను తయారు చేస్తున్నారు.

ఇలా నేను పైన చెప్పకుండా మర్చిపోయిన వారు, అనామకంగా వ్యాసాలపై పని చేస్తున్న వారు ఎందరో ఉన్నారు.
ఇక రోజు రోజుకు పెరుగుతూ వస్తూ వికీపీడియాలోని అన్ని బాషలలో తెలుగు అగ్రస్థానంలో ఉంది అని గర్వంగా చెప్పుకొనవచ్చు. ఈ అభివృద్ది వికీ ణాంకాలలో చూడవచ్చు.

ఈ విజ్ఞాన సర్వస్వంలో పాలు పంచుకుంటున్న వారందరికీ అభినందనలు .. ముందు తరానికి ఒక అపూర్వ నిధిని అందిస్తున్న మీ అందరికి మనఃపూర్వక ధన్యవాదములు.

వికీకి సంబంధించిన వివరాలు అందించిన ప్రదీప్ కు థాంక్స్.

4 వ్యాఖ్యలు:

లలిత

తెలుగు విజ్ఞాన సర్వస్వం తె.వి.కి. నిర్వహణకి, అభివౄద్దికి ,నిస్వార్ధంగా పాటుపడుతున్న తెలుగు భాషాభిమానులందరికీ నా హౄదయ పూర్వక అభినందనలు . అలాగే సుభాకాంక్షలు

దేవన అనంతం

తెలుగు వికిపిడియా వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

మధుర వాణి

తెలుగు భాషాభివృద్ధికి పాటు పడుతున్న తెలుగు వికీపీడియా కార్యవర్గ సభ్యులందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు... మరియు కృతజ్ఞతలు.
శ్రమ తీసుకుని చక్కటి వ్యాసం రాసినందుకు జ్యోతి గారికి కూడా :)

పరిమళం

తెలుగు భాషాభివృద్ధికి పాటు పడుతున్న తెలుగు వికీపీడియా కార్యవర్గ సభ్యులందరికీనా హృదయపూర్వక శుభాకాంక్షలు.జ్యోతి గారికికృతజ్ఞతలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008