Thursday 11 December 2008

అంతర్జాతీయ తెలుగు బ్లాగర్ల సమావేశం

తెలుగు బ్లాగుల దినోత్సవం

ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రెండవ ఆదివారం తెలుగు బ్లాగర్ల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. తెలీదు అంటే ఇక్కడ చూడండి. కాని ఈ సమావేశాలు ప్రతి ఊర్లో ప్రతి దేశంలో నిర్వహించి, బ్లాగర్లు కలవడానికి వీలు కాదు కదా. అందుకే అంతర్జాతీయ బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేయడమైంది. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కూడలి కబుర్లకు వెళ్ళాలి అంటే. ఎప్పుడు అంటారా?? ఈ శనివారం సాయంత్రం ఆరుగంటలకు (భారత కాలమానం ప్రకారం) కూడలి చాట్ రూమ్ లో కలుద్దాం. దీనికోసం కొత్త స్థలం లో వేదిక ఏర్పాటు చేయబడింది. కంగారు పడకండి. మీపేరు తెలుగులో ఇవ్వడానికి వీలు కాదు . ఇంగ్లీషులో ఇవ్వండి. కాని లోపలికి వెళ్ళాకా ఇంచక్కా తెలుగులోనే మాట్లాడుకోవచ్చు. మరి ఆలస్యమెందుకు .. ఆ రోజుకు ఓ రెండు గంటలు ఖాళీ చేసుకోండి. అమెరికావాళ్ళకు కూడా వారాంతం కాబట్టి సమస్య ఉండదనుకుంటా . ఈ సమావేశాలకు బ్లాగర్లే కాక పాఠకులు కూడా ఆహ్వానితులే.

ప్రమదావనం స్నేహితులకు కూడా ఇదే నా ఆహ్వానం. మీరు కూడా ఈ సమావేశానికి వచ్చేయండి. దుమ్ము దులిపేద్దాం.(ఎవరిదో అది మాకే తెలుసు. మిగతావారు కంగారు పడొద్దని మనవి )

3 వ్యాఖ్యలు:

మధురవాణి

బయట కలవలేని మా లాంటి వారి కోసం అంతర్జాల సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు.
నేను తప్పకుండా వస్తాను :)

Anonymous

తప్పకుండా కలుద్దాం జ్యొతిగారూ
ఐతే చీపుర్లు ఎవరివి వారే తెచ్చుకోవాలాండీ

KumarN

చీపుర్లే!!? బాప్ రే!. ఆ ఉతికే కార్యక్రమం కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తారా? పాపం ఆ "దినకర్" ఎవరో :-)

అయినా 6.30AM అంటే మధ్యరాత్రి కదండీ బాబోయ్ నాలాంటాళ్ళకి?

Anyway, have fun.

Kumar

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008