తడికో తడిక..
కొన్ని రోజుల క్రింద ఈటీవిలో ఈ పాట విన్నాను. భలే ఉండింది. కాని సినిమా పేరు తెలీదు. పాడింది ఎవరో తెలీదు. కాని పాటల ఖజానా పరుచూరి శ్రీనివాస్ గారి పుణ్యమా అని ఈ పాట దొరికింది. అది మీతో పంచుకుంటున్నాను. ఈ పాట అత్తా ఒకింటి కోడలే అనే చిత్రంలోనిది . పాడింది పిఠాపురం, స్వర్ణలత ...
AttaOkintiLodale_1... |
మాయదారి కీచులాట మా మధ్య వచ్చింది
రాయబారం సేయవే తడికో తడిక
ఆడి వగలమారి మాటలకు ఒళ్ళంత మండుతుంది
రాయబారమెందుకే తడికో తడిక
నేను ముక్కుపుడక తెచ్చాను
ముంత గూట్లో పెట్టాను
పెట్కోమని, దాన్ని పెట్కోమని
బేగి పెట్కోమని సెప్పవే తడికో తడిక
ఆడి ముక్కుపుడక ముక్కలవా
చూడపోతె రాళ్ళు లేవు
తిప్పబోతె సిన్నమెత్తు సీలలేదు
ఆడి పోసుకోలు మాటలకు
మోసపోను నేనింక - పొమ్మని
సెప్పవే తడికో తడిక
నేను పట్టుచీర తెచ్చాను
పెట్టెలోన పెట్టాను
కట్కోమని, దాన్ని కట్కోమని
బేగి కట్కోమని సెప్పవే తడికో తడిక
ఆడి పట్టుచీరకంచులేదు
కట్టబోతె చెంగులేదు
తెచ్చినాడి తెలివి తెల్లారిపోను
ఆడి యిచ్చకాలమాటలకు ఇరిగింది నా మనసు
ఇడిసి పొమ్మనవే తడికో తడిక
నన్నిడిసి పొమ్మనవే తడికో తడిక
రమణి ముద్దుల గుమ్మ తాను
రాజీకి రాకుంటె
రాతిరి శివరాతిరే తడికో తడిక
ఈ ఏటి కేడు ఏకాసె తడికో తడిక
వంకాయ వండాను వరికూడు తినమని
సెప్పవే తడికో తడిక
ఆణ్ణి తినమని సెప్పవే తడికో తడిక
వగలాడి సేతుల్తో వడ్డనా సేయకుంటె
దిగదని, ముద్ద దిగదని సెప్పవే తడికో తడిక
ఆడి యిచ్చకాల మాటలకు ఇరిగింది నా మనసు
ఇడిసి పొమ్మనవే తడికో తడిక
నన్నిడిసి పొమ్మనవే తడికో తడిక
సిన్నారి పొమ్మంటే సన్నాసం పుచ్చుకుని
ఇంటికింక రానే తడికో తడిక
ఇది యిశదంగ సెప్పవే తడికో తడిక
సన్నాసం ఎందుకు
అన్నాయం సేయకు
నిన్నిడిసి వుండలేను మావోయి మావా, నే
నిన్నిడిసి వుండలేను మావోయి మావా!
ఇక్కడ కూడా వినొచ్చు.
1 వ్యాఖ్యలు:
హహ్హ. 'తడిక రాయబారం' అనే నుడిని వినే వుంటారనుకుంటా.
ఈ పాటను నేనూ ఈమధ్యనే విన్నాను. ఈ జానపదంలోని సరసాన్ని హైలైట్ చేస్తూ చిన్నటపా రాయాలనుకున్నాను. అనుకున్నామని జరగవు అన్నీ - అనుకోలేదని ఆగవు కొన్ని - అన్నట్టుగా మీరు రాసేశారు.
Post a Comment