Monday 5 January 2009

పుణుకులు

"ఒరేయ్! సురేష్! నీకు తెలుసా మా ఆవిడా చాలా మంచిది. తనకు ఎప్పుడైనా నా మీద కోపమొస్తే అది బట్టల మీద చూపిస్తుంది తెలుసా?"
"అవునా? అదేంటి? కోపమొస్తే బట్టల మీద ఎలా చూపిస్తుంది?"
"సింపుల్. నా మీద కోపం లేకుంటే నేను బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపమొస్తే విప్పకుండానే ఉతుకుతుంది? :( "


**********


ఇల్లాలు , ప్రియురాలి గురించి చెప్పమంటే ఏమంటారో చూద్దాం.. ఈ మహాత్ములు...


డాక్టర్:
ఇల్లాలు : ఆయుర్వేదిక్ మందులాంటిది. స్ట్రాంగ్ గా ఉంటుంది కాని శాశ్వత పరిష్కారం.
ప్రియురాలు : అల్లోపతి మందులాంటిది. వేగంగా పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉండకుంటే, నిర్లక్ష్యం చేస్తే మాత్రం రియాక్షన్ వస్తుంది.


పోలీసు :
ఇల్లాలు : ఖాకీ డ్రెస్ లాంటిది. ఎప్పుడూ వేసుకోవాల్సిందే. దర్పం ఎక్కువగా ఉంటుంది.
ప్రియురాలు : సివిల్ డ్రెస్ లాంటిది. అప్పుడప్పుడు వేసుకుంటే బావుంటుంది. వినయంగా ఉండాలి.


ఉద్యోగి :
ఇల్లాలు : టంచనుగా వచ్చే జీతం లాంటిది. వచ్చినదాంతో సరిపెట్టుకోవాలి.
ప్రియురాలు : అప్పుడప్పుడు దొరికే లంచం లాంటిది. ఆకర్షణీయంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండకుందే సస్పెండ్ చేయిస్తుంది.


*********


గడియారంలో చిన్న ముల్లు, పెద్ద ముల్లు అలా నడుస్తూ వెలుతుంటాయి ఒకసారి చిన్న ముల్లు అలిగింది. అప్పుడు పెద్ద ముల్లు ఏమంది?

భూమికి , చంద్రుడికి ఉన్నా అనుబంధమేమిటి లేదా చుట్టరికం ఏంటి ?

మల్లెపూవు, చామంతి, జాజి, మందార ... ఇలా ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి అని మనకు తెలుసు. కాని ఒక పువ్వును మాత్రం వత్తిని చేసి దీపం వెలిగిస్తాం. అదేంటి??

11 వ్యాఖ్యలు:

సుజ్జి

hahaha.. wife,girl friend joke baagundi.

lastdi, pattipuvu ! correcteena?

krishna

్పుణుకులు రుచిగా వున్నాయి.
భూమి కొడుకు చంద్రుడు చందమామ కథాల ప్రకారం,పురాణాలను బట్టి అక్క.
అవునా జ్యోతి గారు.

జ్యోతి

sujji,

సమాధానం తప్పు..

కృష్ణుడు గారు,

మీరు కూడా తప్పే.. అలోచించండి...

Unknown

కాకరపువ్వొత్తి --అవునా

జ్యోతి

నరసింహగారు,
మీరు చెప్పింది నిజమే. మిగతావి కూడా ఆలోచించండి..

మున్నీ

భూమిని తల్లితో పోలుస్తారు. చంద్రుడంటే చంద 'మామ '. కాబట్టి భూమి, చంద్రుడు అక్కతమ్ముళ్ళు.

Anonymous

ఇదేంటి ఇంకా ఎవరూ జవాబులు చెప్పలేదా? అయితే మళ్ళీ వస్తాను

జ్యోతి

మున్నిగారు,
మీరు చెప్పింది రైటు..

ఇక అలిగిన చిన్నముల్లుతో పెద్దముల్లు ఇలా అంది.." డార్లింగ్! ప్లీజ్. అలగకురా! ఎంత గంటలో నీ దగ్గరకు వచ్చేస్తాగా! నా బుజ్జి కదూ!"

మున్నీ

థ్యాంక్స్ అండి జ్యోతిగారు... నేను వ్రాసింది రైటో కాదో నిన్న అంతా చాలా టెన్షన్ పడ్డాను. హమ్మయ్య నాకు కుడా జవాబులు తెలుస్తున్నయి.

Indiraayanam

నేను యీ బ్లాగింగు కి కొత్త. యీ రొజే ఒనమాలు దిద్దాను. indiraayanam.blogspot.com - నేను hyderabad లో ఉంటాను. నా బ్లాగుని కొంచెం బాగా చేసే మార్గం చెప్పండి

జ్యోతి

ఇందిరగారు, నాకు మెయిల్ చేయండి. అన్నీ చెప్తాను..

jyothivalaboju@gmail.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008