Monday 12 January 2009

కలనయంత్రానికే మాటలొస్తే ....

మనం రోజూ ఉపయోగించే కంప్యూటర్ లోని వివిధ భాగాలకే మాటలొస్తే...








* మానిటర్: పొద్దున్నుంచి అదే పనిగా నన్నే ఎగాదిగా చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది వదిలేయండి ప్లీజ్ .

* మౌస్: పొద్దున్నుంచి నన్ను అదేపనిగా అటు ఇటు కదిలిస్తున్నారు. నాకు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. నన్ను వదిలేయండమ్మా.

* కీ బోర్డు: పొద్దున్నుంచి మీ వేళ్ళతో అదే పనిగా తడిమేస్తున్నారు. నాకు చక్కిలిగింతలు అవుతున్నాయి. మీకు దండం పెడతా వదిలేయండి సార్.

* సి.పి.యు: పొద్దున్నుంచి అదే పనిగా డాటాను తోసేస్తున్నారు. నాకు అజీర్తి చేసేలాగుంది అప్పుడప్పుడు ఏదొ ఒక మాయరోగం తగులుకుంటుంది . ఆపరేషన్ చేసేస్తున్నారు. నాకు కాస్త రెస్ట్ ఇవ్వండి. అలా ఊర్లు తిరిగి రాకూడదు.

* స్పీకర్లు: అంత సౌండ్ పెట్టకండి సార్ నా చెవులు పగిలిపోయేలాగున్నాయి. కాని కొన్ని కొత్త పాటలు అలాగే వినాలేమో కదా.

* వెబ్ క్యామ్: అబ్బా అలా జిడ్డు మొహం వేసుకొని కూర్చోక కాసింత ఫ్రెష్ అప్ అయి స్మైల్ ఫేస్ తో రావచ్చు కదా? నాకూ కాసింత ఆనందం కలుగుతుంది. అలాగే మంచి డ్రెస్ వేసుకో.. నేను ఖుష్ , చూసేవాళ్లు ఖుష్.

* సిడి : అబ్బా ఎంత సమాచారాన్ని దాచి పెట్టుకోను. నావల్ల కాదు బాబు.

* మదర్ బోర్డ్: నావల్లే మీ పనులన్నీ జరుగుతున్నా కొంచెమైనా గుర్తింపు లేదు. హు... అంతే లేండి . న్యాయానికి దునియా లేదు.

* లాప్‌టాప్ : నాజూగ్గా ఉన్న నన్ను బియ్యం బస్తాలా సంచీలో వేసుకుని వీపుకు తగిలించుకుని ఒకటే తిప్పుతారు. ఒక్కదగ్గర కుదురుగా కూర్చోనివ్వరుగా.. అసలే సుకుమారిని. అలసిపోను. అర్ధం చేసుకోరు..

*ప్రింటర్ : మీకు పనీపాటా లేదు. నా శక్తి సామర్ధ్యాలు ఎంత అని ఆలోచించరా? ఒకటే కాగితాలు అచ్చేసుకుంటున్నారు. ఎన్ని అవసరమో అన్నే అచ్చేసుకుంటే మీ సొమ్మేం పోయింది.

* యు.పి.ఎస్: సార్…కరెంటు పోయి చాలా సేపయ్యింది. ఇప్పటికైనా ఆఫ్ చేసేయండి. లేకపోతే పైనుండే మా కొలీగ్స్ నాలో ఉన్న చార్జింగ్ అంతా ఆవిరి చేసేస్తారు. శోషొచ్చి నేనే ఠపీమని ఆగిపోగలను.

11 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar

అన్నీ వదిలెయ్యమంటే మనల్ని ఉద్యోగం వదిలెయ్యదూ!

మధురవాణి

హ్హా హ్హా.. హ్హా.. భలే భలే..!! :)

నేస్తం

జ్యోతిగారంటే జ్యోతిగారే ... :)ఇంత మంచి మంచి ఐడియాలు మీకు భలే వస్తాయి :)

muralirkishna

mee hasyapu chamakkulo saaru lu ekkuava ayyai avi leka pothe inkaa baaaga pandedi.ani naa feeling ny way mee krushiki maa satakoti vandaanalu

జ్యోతి

మురళీకృష్ణగారు,
మీరు చెప్పింది నిజమే. సరిచేసాను..

durgeswara

మీకుతెలియదా నేస్తం గారూ

ఈవిడ సరస్వతీ మాత అనుగ్రహాన్ని పొందారు.అందుకే అలా అలవోకగా రాసేస్తుంటారు.బాగావ్రాశారు అక్కగారూ

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

భలే ఉన్నయి మీ ఆలోచనలు!!

Ramani Rao

హ హ హ :-) సూపర్

Unknown

ante namma tokkala tv serials chustu time waste chesukune ninnu na dwara lokanikanta telisela famous cheste na sarrira bhagalni disect chesi lopala yemundo telusukuni mari rasi padesavu, total ga computer bhavamemo.

Unknown

బాగుందండి.
మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు.

జ్యోతి

రవిగారు,

నేను నెట్ ఉన్నా లేకున్నా కంప్యూటర్ వాడుతుంటాను ఏదో ఒక పని నిమిత్తం. మా అబ్బాయి ఊరికే అంటుంటాడు. మమ్మీ, కాస్త దానికి రెస్ట్ ఇవ్వు, వెళ్లి పడుకో అంటాడు..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008