Wednesday, January 14, 2009

సంక్రాంతి శుభాకాంక్షలు


ఇది భోగి ముగ్గు... నాకైతే రంగుల కంటే black and white ముగ్గులంటేనే ఇష్టం ( పాత సినిమాల్లా) ...

సంక్రాంతి ముగ్గు గొబ్బెమ్మలు, బంతిపూలతో ఎంత అందంగా ఉందొ కదా?? (ఈసారి కొంచం విషాదం ఏంటంటే , మొదటిసారిగా ఆవుపేడ డబ్బులెట్టి కొనాల్సి వచ్చింది )
పండగ రోజు స్వాగత తోరణం....
ఇక పండగ పిండివంటలు.. ఆర్ధిక మాంద్యం వల్ల , లారీల స్త్రైకుల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల తక్కువే చేశాను ఈసారి. తప్పదు మరి అడ్జస్ట్ అయిపోవాలి.

మళ్ళీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ సంవత్సరంలోని మొదటి పండుగ మీకందరికీ ఎన్నో విజయాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ.....

26 వ్యాఖ్యలు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

Kottapali

బాగున్నాయి ఫొటోలు. పండగ బాగా చేసుకున్నారనమాట. ముగ్గులు పొందిగ్గా ఉన్నాయి. పెట్రోలుకీ, లారీ రవాణాకీ, తెలుగు పండగలకీ ఉన్న అవినాభావ సంబంధం గురించి ఎవరన్న ఇకానమిస్టు రిసెర్చి చెయ్యాలి.

నిషిగంధ

జ్యోతి గారు మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.. ఫోటోలు చాలా బావున్నాయి :-)

మధురవాణి

జ్యోతి గారూ..
మీకూ.. మీ కుటుంబ సభ్యులకీ సంక్రాంతి శుభాకాంక్షలు..!
ముగ్గులు సూపర్ గా ఉన్నాయి.. అంత పెద్ద మెలికల ముగ్గు ఎంత చక్కగా వేసారో.. చూస్తుంటే ముచ్చటేస్తుంది. గచ్చు మీదైనా ముగ్గులు వేసి చక్కగా పండగ జరుపుకుంటున్నరన్నమాట..!
చెక్కలు, సకినాలు, కారప్పూస ఫోటో పెట్టి మరీ ఊరిస్తున్నారు :(
మీ ఫోటోలు చూసి మన బ్లాగు మిత్రులందరూ మీ ఇంటిపైకి దండ యాత్ర చేయగలరు మరి.. సిద్దంగా ఉండండి :)

జ్యోతి

నాగలక్ష్మిగారు,
ధన్యవాదాలు.

మధురవాణిగారు,
ఊరికే గూగులమ్మని అడగడమెందుకని, ఇలా కానిచ్చేసాన్నమాట..

కొత్తపాళీగారు,
"పెట్రోలుకీ, లారీ రవాణాకీ, తెలుగు పండగలకీ ఉన్న అవినాభావ సంబంధం గురించి ఎవరన్న ఇకానమిస్టు రిసెర్చి చెయ్యాలి"
ఇంతోటిదానికి ఎకానమిస్ట్ ఎందుకండి. ! ఏ మధ్యతరగతి గృహిణిని అడిగినా చెప్తుంది.అన్నింటికి ఉన్న సంబంధం డబ్బు.. విపరీతమైన ధరలు. ఏది కొందామన్నా మండిపోతుంది..

Kathi Mahesh Kumar

బ్లాగుల్లో సంక్రాంతి శోభలు బాగున్నాయ్!

teresa

మీ ఇంట్లో పండుగ శోభని మా అందరితో పంచుకోడం బావుంది. ముగ్గులు సూపర్‌! గుమ్మానికి పూల దండ అదుర్స్ :)
సంక్రాంతి శుభాకాంక్షలు.

Ramani Rao

సంక్రాంతి శుభాకాంక్షలు

Unknown

బాగా(రుచిగానే) ఉన్నాయండి మీ పిండివంటలన్నీను.ముగ్గులు బాగా ఉన్నాయి.

durgeswara

ayipoyaayaa ariselu koddigaa daachivumchammaa maaku.samkraamti subhaakaamkshalu.

ఆత్రేయ కొండూరు

జ్యోతి గారు
మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!

Unknown

jyoti garu miku sankranti, kanuma subhakankshalu.sankranty nadu teluginta mukyamaina pindi vantakam araselu missing fotolo?alage vinayakunni konchem yedama vypu ki jari pite straight ga vuntadu. gamanincha galaru.

Unknown

అరిశెలేవండీ బాబూ ? :-)

పండుగ చాలా బాగా జరుపుకున్నందుకు ఆనందం.

మరువం ఉష

చూసి కుళ్ళుకుంటాననేనా తల్లీ "చూసావా?" అని అడిగి మరీ రప్పించావ్ ఇక్కడకి? ఇపుడేమో ఏడుపొకటే తక్కువ నాకు. ఏంచేస్తాం సరే మరి, మిగిలిన పిండివంటలకి కాసినన్ని అరిశెలు కలిపి త్వరగా, త్వర త్వరగా మెయిల్లో పంపేయ్ మరి :)


మీకూ.. మీ కుటుంబ సభ్యులకీ సంక్రాంతి శుభాకాంక్షలు..!

శ్రీ

మీ టపాలో సంక్రాంతి పండగ కనిపిస్తుంది.ముగ్గులు, అరిశెలు బ్రమ్హాండంగా ఉన్నాయి.

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

కన్నగాడు

ఇదన్యాయం అసలే పండుగలకు మొగంవాచి ఉన్నం, మీరేమో సకినాలు, గారెలతో(హమ్మయ్య అరిసెలు చేసుకోలేదనుకుంటా!) బ్లాగెక్కారా :(

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

సుజాత వేల్పూరి

మీ బ్లాక్ అండ్ వైట్ ముగ్గు భలే ఉంది. కాపీ చేసుకుంటున్నా.

జ్యోతి

అసలు నేను చేయని వస్తువుల గురించి అడుగుతారేంటి? గత సంక్రాంతి కి అరిసెలు చేసాను కదా . ప్రతి సంక్రాంతికి అవే చేయాలా అని ఆలోచించి ఈసారి వదిలేసా. మావారిని అడిగా కూడా అరిసెలు చేయనా అని. ఏమొద్దు. నీకు తినాలనిపిస్తే చేసుకో అన్నారు. మా ఇంట్లో స్వీట్లు ఎక్కువగా తినేది నేనే . అరిసెలు చేసాక ఎవరూ తినకుంటే నేనే తినాల్సొస్తుంది. ఇంకేమన్నా ఉందా .. అందుకే కట్ చేసా.. ఎప్పుడైనా తినాలనిపిస్తే గంటలో చేసుకోవచ్చు. అదేం బ్రహ్మ విద్యా?

ఉషా, కన్నగారు,

తెరెసా గారు చెప్పినట్టు.. నా బ్లాగులో ఈ చిత్రాలు పెట్టింది దూరదేశాల్లో ఉండి ఈ పండగ మిస్ అయినవాళ్లందరికి పండగ శోభను పంచుదామని. బాధపడడమెందుకు.. చూసి(చేసుకునే అవకాశం లేకున్నా) ఆనందించండి.

కన్నగాడు

అంతకుమించి మేమేం చేయగలంలెండి.

సుజాత వేల్పూరి

జ్యోతి, ఈ సంజాయిషీ బాగాలేదు. అరిసెలు సంక్రాంతికి వండి తీరవలసిన పిండివంట. మీ ఇంట్లో ఎవరూ తినకపోతే మేము లేమా ఏమిటీ? మీరు మరీ!

సిరిసిరిమువ్వ

ముగ్గులు బాగున్నాయి.

అయినా అరిసెలు లేకుండా సంక్రాంతి పిండి వంటలేమిటండి చోద్యం కాకపోతేనూ!

krishna rao jallipalli

బాధపడడమెందుకు.. చూసి(చేసుకునే అవకాశం లేకున్నా) ఆనందించండి....
అదేదో సినిమాలో.. కోట శ్రీనివాసరావు తాడుకు కోడిని కట్టి కోడి కూర తింటున్నట్టు... మీ ఫోటోలు చూసి అలా చేస్తే సరి.
శుభ-ఆకాంక్షలు.

నేస్తం

సంక్రాంతి శుభాకాంక్షలు...జ్యోతి గారు :)

పరిమళం

జ్యోతి గారూ!సంక్రాంతి శుభాకాంక్షలు.

ప్రియ

కొంచం ఆలస్యం అయినా సరే నా శుభాకాంక్షలు అందుకోవాల్సిందే మరి.

mohanjoy2000

nice photos chala bagunnayi...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008