వెరైటీగా సలాడ్స్ చేసుకుందామా...
ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని నవ్య విభాగంలో నా రచన.. సులువుగా సలాడ్స్.. ఎలా తయారు చేయాలో వివరాలు కావాలంటే క్రింది బొమ్మను నాజూగా తట్టండి.
|
సులువుగా సలాడ్స్.......
క్యారట్-శనగల సలాడ్
క్యారట్ నాలుగు
కాబూలి శనగలు 50గ్రా
క్యాప్సికం 1
కొత్తిమీర 2 చెంచాలు
నిమ్మరసం ఒక చెంచాడు
ఉప్పు తగినంత
మిరియాల పొడి అర చెంచా
నూనె చెంచాడు
ఆవాలు చిటికెడు
కరివేపాకు ఒక రెమ్మ
తయారు చేసే విధానం:
శనగలను రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. క్యారెట్ చెక్కు తీసి సన్నగా తరిగి ఆ ముక్కలకు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కలాయిలో నూనె తీసుకుని వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ పోపును క్యారెట్ మిశ్రమంలో కలపాలి. నాన బెట్టిన శనగలు వడకట్టి నీళ్లలో కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి. క్యాప్సికమ్‌ను సన్నని ముక్కలుగాతరగాలి. పోపు కలిపిన క్యారెట్ మిశ్రమానికి శనగలు, క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి వడ్డించాలి.
కీరా-టమాటో సలాడ్
కీరా దోసకాయ ఒకటి
టమాటాలు రెండు
ఉప్పు తగినంత
కొత్తిమీర రెండు స్పూన్‌లు
పచ్చి బఠానీలు రెండు టీస్పూన్‌లు
వెనిగర్ ఒక టీస్పూన్
మిరియాల పొడి అర స్పూన్
తయారు చేసే విధానం:
కీరా దోసకాయ, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో తరిగిన కొత్తిమీర, పచ్చిబఠానీలు, ఉప్పు మిరియాల పొడి, వెనిగర్ అన్నీ బాగా కలిపి కొద్దిసేపు ఫ్రిజ్‌లో చల్లబరచి తింటే బావుంటుంది. కావాలంటే ఇందులో కప్పు చిక్కటి పెరుగు కలిపి కూడా తినొచ్చు.
మొలకెత్తిన పెసలు-ఎగ్ సలాడ్
మొలకెత్తిన పెసలు ఒక కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి
ఉడికించిన కోడి గుడ్డు ఒకటి
సన్నగా తరిగిన టమాటా రెండు
తరిగిన కొత్తిమీర రెండు స్పూన్‌లు
ఉప్పు తగినంత
నిమ్మరసం ఒక టీస్పూన్
మిరియాల పొడి అర స్పూన్
తయారు చేసే విధానం:
ఒక వెడల్పాటి గిన్నెలో మొలకెత్తిన పెసలు టమాటా ముక్కలు ఉల్లిపాయల ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి ముక్కలన్నింటిని బాగా కలపాలి. చివర్లో కోడి గుడ్డు ముక్కలు వేసి కలపాలి.
తిరంగా సలాడ్
సన్నగా తరిగిన క్యారెట్ ఒక కప్పు
సన్నగా తరిగిన ముల్లంగి పావు కప్పు
సన్నగా తరిగిన కొత్తిమీర పావుకప్పు
ఉప్పు తగినంత
నిమ్మరసం ఒక స్పూన్
మిరియాల పొడి ఒక టీస్పూన్
తయారు చేసే విధానం:
క్యారెట్, ముల్లంగి, కొత్తిమీర ముక్కలను కలిపి ఈ మిశ్రమానికి ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడినికలిపి కాస్త చల్లబరిచి తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ సలాడ్‌తో ఒక కట్‌లెట్ కూడా జతచేస్తే కాంబినేషన్ అదుర్స్.
6 వ్యాఖ్యలు:
బాగుంది. తిరంగా సలాడ్ వెరైటీగా వుంది. :)
జ్యోతి గారూ !రాసింది మీరా ? బ్లాగ్ లో చూసేవరకు పేరు చూడలేదండీ.అభినదనలండీ ! డైటింగ్ చేద్దామనుకుంటున్నా .వెంటనే ట్రై చేస్తా .
సలాడ్ చాలా బాగుంది. ఇవాళ అదే ట్రై చేస్తి.
Jyothi gaaru 'cell phone' ni telugu lo emantaaru
వెంకట్ గారు,
హస్తభాషిణి అంటారండి...
Thanks Jyothi gaaru, mee blog baagundhi, I am expecting more posts from your blog
Post a Comment