Sunday 25 January 2009

వెలిగే జ్యోతి....

నన్ను ఎంతో అభిమానిస్తూ, ప్రోత్సహించే మిత్రులకు ముందుగా శతకోటి నమస్సులు.. ఈ రోజు ఆంధ్రజ్యోతి నవ్య లో నా బ్లాగు పరిచయం.. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్పనా.. సరిగ్గా ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి లో నా మొదటి రచన ప్రచురింపబడింది.


'మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీ జీవిత భాగస్వామి, స్నేహితుడు, పిల్లలు, గురువు.. కానీ మీకు క్లోజ్‌గా ఉండే ఆ నేస్తంతో మీ ఆలోచనలు, అనుభూతులు, సందేహాలు, సమస్యలు అన్నీ చర్చిస్తారా? ఇది సాధ్యం కాదేమో.. ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించండి. అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే, మీకు తోడుగా ఉండే మీ స్నేహితుడు ఎవరో కాదు.. అది మీరే. అవును. మీకు మీరే గొప్ప స్నేహితులు. మిమ్మల్ని మీరు అభిమానించండి. గౌరవించుకోండి. మీ విలువ తెలుసుకోండి.' అంటూ సాగుతుందొక వ్యక్తిత్వ వికాస పాఠం. 'కట్నం అనేదొక సమస్యయిపోయింది. అమ్మాయిలు, అబ్బాయిలు, తల్లిదండ్రులు అందరూ మారాలి...' అంటూ సాగుతుందొక సామాజిక ఆలోచన. 'చాలామంది ఆడపిల్లనొక భారంగా అనుకుంటారు.

కానీ అమ్మాయిలు పాపగా, కన్యగా, తల్లిగా, అమ్మమ్మగా మారినా కూడా తల్లి కోసం ఆరాటపడుతూనే ఉంటుంది.. తన ఇంటి బాధ్యతలతో అలసిన మనసు అమ్మనే తలచుకుంటుంది..' అని సాగుతుందో చిన్న కవితాత్మక భావం. ఇన్ని రకాల రాతలతో అలరించే 'జ్యోతి' బ్లాగ్‌కు ట్యాగ్‌లైన్ సరదా సమాలోచనల పందిరి. అచ్చం అలాగే కాస్త సరదాగా, కాస్త ఆలోచనాత్మకంగా సాగుతుంది ఈ బ్లాగు. ఆటలు, పాటలు, జోకులు, వంటలు, పురాణ సంగతులు.. ఒకటేమిటి.. 'జ్యోతి'లో ప్రతి టపా ఓ విభాగం. ఇప్పటికి 32 వేల మందికి పైగా చూశారంటేనే అర్థమవాలి ఆ బ్లాగుకున్న ఆదరణ. హైదరాబాదీ గృహిణి జ్యోతి వలబోజు దీన్ని నిర్వహిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

కంప్యూటర్‌తో పరిచయమే లేని ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక చాలా కృషి ఉంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే - "ప్రతి గృహిణిలాగే భర్త , పిల్లలు, వంట, ఇల్లు, టీవీ సీరియళ్లు... అప్పుడప్పుడు ఇరుగమ్మ పొరుగమ్మలతో బాతాఖానీ.. జ్యోతిక్కూడా రోజులిలాగే గడచిపోయేవి. అప్పుడే పిల్లల కాలేజీలు, కోర్సుల గురించి ఇంటర్నెట్‌ను పరిచయం చేసుకున్నారామె. కొడుకు నేర్పించిన విషయాలకు తన శోధనను కలిపి, తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని చూసిన జ్యోతి తన సొంత బ్లాగును ఏర్పాటు చేసుకున్నారు. "నెల సరుకుల జాబితా తప్ప వేరే రాతలు అలవాటు లేని నేను ఇప్పుడు కొన్ని దినపత్రికల్లో రచనలు చేస్తున్నానంటే అదంతా బ్లాగుల చలవే.

వీటివల్ల లాభం ఏంటంటే మనం ఆలోచించే విషయాలను ఎందరో చదువరులతో చర్చించవచ్చు.. తప్పులుంటే దిద్దుకోవచ్చు.. రాసే శైలిని మెరుగుపరుచుకోవచ్చు. సామాన్య గృహిణిగా ఉన్న నేను ఇప్పుడు తెలుగు బ్లాగర్‌ని

చిన్నపాటి రచయిత్రిని అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నానంటే ఈ క్రమంలోనే..' అంటారు జ్యోతి. విభిన్న విషయాలపై మరో ఆరు బ్లాగులను అలవోకగా నిర్వహిస్తున్నారామె. మంచి పాటల సాహిత్యాన్ని, వీడియోలనూ అందించే పందిరి 'గీతలహరి' బ్లాగు. రకరకాల వంటకాల తయారీ విధానాలను తేటతెలుగులో వివరిస్తుంది 'షడ్రుచులు'. అదే ఇంగ్లిష్‌లో 'అన్నపూర్ణ'గా మరికొన్ని వంటల తయారీని ఫోటోలతో సహా వివరిస్తారు.

ఆధ్యాత్మిక, పురాణ విశేషాలతో సాగుతుంది 'నైమిశారణ్యం'. మంచి ఫొటోలతో కొన్ని చిత్రాల మాలిక 'చైత్ర రథం'. ఈ జగన్నాటకంలో అందరూ పాత్రధారులే అన్న స్పృహను కనబరుస్తుంది 'జగన్నాటకం'. ఆరు బ్లాగులను నిర్వహిస్తున్న జ్యోతి శభాషనకుండా ఉండలేరెవరూ.
ఇదిగో ఆమె బ్లాగు చిరునామా : http://jyothivalaboju.blogspot.com

ఈ శుభ సందర్భంలో అందరికి ఒక చిన్ని కానుక.. ఆంధ్రజ్యోతి లో నే వచ్చిన దోసేలమ్మా దోసెలు వ్యాసం మీకోసం..

25 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli

great!congratulations!wish you more honours :)

Kathi Mahesh Kumar

అభినందనలు. You deserve it.

సుజాత వేల్పూరి

జ్యోతిగారు,
మనఃపూర్వక అభినందనలు!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

అభినందనలు. ఇలాంటి శుభసందర్భాలు మీకు మరెన్నొ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

SAMEEHA

తెలుగులో నేను చూసిన మొట్టమొదటి బ్లాగు జ్యోతి. ఆ ఇన్స్పిరేషన్ లోనే సమీహ వచ్చింది. మాటలలో అభిమానం, వాత్సల్యం ఉట్టిపడేలా వ్రాయడం ఆదరికి రాది. అది జ్యోతి గారి స్పెషల్.
అభినందనలు.

సిరిసిరిమువ్వ

మనఃపూర్వక అభినందనలు. మీరు ఇలాగే వెలుగొందుతూ మరిన్ని ప్రస్థానాలు చేరుకోవాలి.

Aloysius

congrats Jo... you rock :) multi talented mom :)

శ్రీనివాస్ పప్పు

జ్యోతిగారు,
మనఃపూర్వక అభినందనలు. మీరు ఇలాగే వెలుగొందుతూ మరిన్ని ప్రస్థానాలు చేరుకోవాలి.

కొత్త పాళీ

మరిన్ని గొప్ప విజయాలు మిమ్మల్ని వరించాలని కోరుకుంటూ అభినందనలతో ..

durgeswara

subhaakaamkshalu akkagaaroo

Anonymous

అభినందనలు.

సుభద్ర

congrats jyothi garu,
naalanti variki meere spurthi.
alupuyeragaka mee vellugu illaage maandari meda prasripacheyandi.

ఏకాంతపు దిలీప్

జ్యోతిగారు,
మనఃపూర్వక అభినందనలు. మీరు ఇలాగే వెలుగొందుతూ మరిన్ని ప్రస్థానాలు చేరుకోవాలి.

చైతన్య.ఎస్

జ్యోతిగారు, అభినందనలు.

పరిమళం

జ్యోతి గారూ ! హృదయ పూర్వక అభినందనలండీ .మిమ్మల్ని మీ బ్లాగ్ లోనే చూసే భాగ్యం కలిగింది .

Ramani Rao

మనఃపూర్వక అభినందనలు.

వర్మ

జ్యోతి గారు రియల్లీ వండర్ ఫుల్. మీ జీవిత ప్రస్తానం సాధారణ గ్రుహిణులెందరికో ఆదర్శం. మీకు స్పూర్తినిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వారిని అలాగే సహాయ సహకారాల్ని అందించాలిని వేడుకుంటూ..... మీరు ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ........ మీ బ్లాగు మిత్రుడు ....

చిలమకూరు విజయమోహన్

అక్కయ్యకు శుభాభినందనలు.అచ్చం మీరు మా మేనత్త విజయభారతిలా ఉన్నారు.

నిషిగంధ

హృదయపూర్వక అభినందనలు జ్యోతి గారు

psm.lakshmi

hearty congratulations jyothi
psmlakshmi

మధురవాణి

జ్యోతి గారూ..
మీకు అభినందన మందార మాలలు..!
ఇలాంటి విజయాల్ని మరెన్నో మీరు అందుకోవాలని.. ఖచ్చితంగా అందుకుంటారని ఆశిస్తున్నాను.
మొత్తానికి ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి.
ఎందుకంటే.. ఇలా అయినా మీ దర్శన భాగ్యం మాకు కలిగించినందుకు :))

kaartoon.wordpress.com

మీ బ్లాగు ఇప్పుడే మే మిద్దరం చూసాము.ఎంతో బిజీగా వుంటూ
పత్రికలలో రఛనలు,ఎన్నో విషయాలు మీ బ్లాగు ద్వారా చెబుతున్నందుకు,
నా లాటి వాళ్ళకు బ్లాగు నిర్వహనలో ఎంతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు.
యంవీ.అప్పారావు(సురేఖ)

శోభ

జ్యోతిగారూ..

హృదయపూర్వక అభినందనలండీ..

manu

congrats...........!

Lakshmi Raghava

జ్యోతీ గారూ
మీరు మరింతగా వెలుగొందాలని సదా కోరుతూ

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008