Thursday 1 January 2009

కత్తితో... జ్యోతి - పిచ్చాపాT

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఊరికే టపాలు రాస్తుంటే బోర్ కొట్టింది. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో నేను మొదలెట్టిన ఈ చర్చా కార్యక్రమం పిచ్చాపాT. మనకు ఎవరైనా వ్యక్తితో ఎన్నో విషయాలు అడగాలి, చర్చించాలి అని ఉంటుంది. అలాగే నేను ప్రమదావనంలో అతిథులను ప్రశ్నించేదాన్ని. కాని కందకు లేని దురద కత్తికెందుకు అన్నట్టు నాకు, సమాదానమిచ్చినవారికి లేని కష్టం చదివినవారికి వచ్చింది, నన్ను అధిక్షేపించారు... ఇలా కాదు అని ఈ చర్చా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేసి నా స్వంత పూచికత్తు మీద నా బ్లాగులోనే పెట్టాలని నిర్ణయించుకున్నాను. అప్పుడప్పుడు వివిధ రంగాలలో ఉన్నా వ్యక్తులతో ఇలా పిచ్చాపాటీ ఏర్పాటు చేసుకోవాలని చిన్ని ఆశ.. తప్పులుంటే దిద్దుకుని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాను.

మొదటి అతిథి : పర్ణశాల కత్తి మహేష్ కుమార్





జ్యోతి : నమస్తే మహేశ్ గారు , ముందుగా మీ వివరాలు చెప్తారా ? చదువు, ఉద్యోగం, కుటుంబం వగైరా..

మహేశ్ : పుట్టినూరు చిత్తూరు జిల్లా మదనపల్లి, ఇప్పుడు అమ్మానాన్నా వాయల్పాడులో ఉన్నారు.అమ్మానాన్న, ఒక అన్నయ్య,చెల్లెలు. డిగ్రీ ఆంగ్ల సాహిత్యం మైసూర్ లో పోస్టుగ్రాడ్యుయేషన్ కమ్మ్యూనికేషన్ లో. హైదరాబాద్ యూనివర్సిటీ కమ్మ్యూని కేషన్ కన్సల్టెంట్ గా ఉద్యోగం

జ్యోతి: మీరు చిన్నప్పటినుండి , చదువుకునేటప్పుడు ఏదైనా లక్ష్యం అంటూ పెత్తుకున్నారా . లేదా అలా చదివేసారా ?

మహేశ్ : చదువుకొనేప్పుడు ఖచ్చితమైన గోల్ అంటూ ఏమీ లేవు. కాలేజిలో ఫిల్మ్ క్లబ్ లో జాయినైన తరువాత సినిమా తియ్యాలనే కోరిక కలిగింది.

జ్యోతి: మీ ఇంట్లో ఇది చదువు, అది చదువు , పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలి అని చెప్పలేదా?

మహేశ్ : లేదు.ఇంజనీర్ అవ్వాలనే మా నాన్నగారి ఆశయం మా అన్నయ్య తీరుస్తుంటే నేను ఫ్రీగానే ఉన్నాను.
నాకు చేతనయ్యింది హ్యూమానిటీస్ ఒక్కటే అని నాకు అనిపిస్తే ఇంటర్మీడియట్ లో అదే తీసుకున్నాను

జ్యోతి: ఐతే మీ ఇష్టానికి చదువుకోమన్నారన్నమాట మీ నాన్నగారు.

మహేశ్ : అప్పుడు మా కుటుంబం కొంత నిరాశపడిన మాట వాస్తవం. ఎందుకంటే ఆర్ట్స్ అంటే పనికిరానోళ్ళు తీసుకునే కోర్సని పేరుకదా.

జ్యోతి: మరి ఉద్యోగం మీకు నచ్చిందే ప్రయత్నించారా . దొరికిన దాంట్లో చేరిపోయారా ?

మహేశ్ : ఆశయం సినిమా. కానీ ఇప్పటివరకూ అది చెయ్యలేదుకదా. అంటే బ్రతుకు తెరువుకోసం ఇప్పటికీ చాలా చేస్తున్నట్లే లెక్క. కానీ ప్రస్తుతం చేస్తున్నదాంట్లో ఆత్మతృప్తి కూడా ఉందికాబట్టిఆది బోనస్ అనుకోవాలి.

జ్యోతి: చదువు విషయంలో ఎటువంటి ఒత్తిడి లేదా? ఇప్పటి పిల్లల్లా ఇంజనీరు, డాక్టర్ అని ఉన్నట్టు.

మహేశ్ : మైసూర్ లో ఇంగ్లీషు లిటరేచర్ అంటే మొదట్లో భయపడినా స్నేహితులూ సీనియర్ల సహాయంతో నెగ్గుకొచ్చాను. ఆ తరువాత అదే సాహిత్యం పట్ల ప్రేమగా మారింది. సినిమా పట్ల నా ఆశయానికి ఊపిరినిచ్చింది

జ్యోతి: సినిమా జీవితాంతం బ్రతుకుతెరువుకు పనికొస్తుందా? .అది తాత్కాలికమే కదా

మహేశ్ : అందుకే ఇప్పుడు సినిమా తియ్యాలనుకుంటున్నానే గానీ దాన్ని బ్రతుకుతెరువు చేసుకోదలుచుకోలేదు.

జ్యోతి: తల్లితండ్రులు, పిల్లలు . ఒకరిపట్ల ఒకరికి బాధ్యత ఉందా? లేకుంటే వాళ్లిష్టం. అటువంటివి ఆలోచించకూడదు. ఎవరి జీవితం వారిది అంటారా ?

మహేశ్ : పెళ్ళితరువాత ఎవరి కుటుంబ జీవితం వారిదే. అంతమాత్రానా బాధ్యతలు లేనట్లు కాదు. కానీ ఒకరికుటుంబ విషయాలలో మరొకరి అనవసర జోక్యం మాత్రం ఖచ్చితంగా ఉండకూడదని ఆశిస్తాను. అదే వీలైనంత సౌమ్యంగా నిర్దేషిస్తానుకూడాను.

జ్యోతి : కాలేజిలో సీరియస్ గా చదువుకున్నారా ? లేక ఫుల్ ఎంజాయ్, అమ్మాయిలను ఏడిపించడం, ప్రేమలు గట్రా..

మహేశ్ : నా కాలేజి జీవితం ఒక ఆదర్శ కాలేజి జీవితం లాంటిదే. చదువూ,అల్లరి వేషాలూ,యవ్వన ప్రేమ, గొడవలూ, అలవర్చుకోదగి(గ)ని అలవాట్లూ అన్నీ ఉన్నాయి. జీవితాన్ని అర్థం చేసుకునే అన్ని తప్పుల్నీ సావకాశంగా చేసి, అనుభవించి,నేర్చుకున్న జీవితం. నా కాలేజీ జీవితం.

జ్యోతి : ప్రేమ అంటే ఏంటి మీ ఉద్దేశ్యంలో?

మహేశ్ : చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే ప్రేమను నిర్వచించడం మెదలుపెడితే, ప్రతినిర్వచనాన్నీ "ప్రేమ కాదు" అనుకోవచ్చనేది నా అభిప్రాయం.

జ్యోతి : ఓకె. మరి సినిమాలలో చూపించేది మాత్రం ఒకటే కదా

మహేశ్ : అందుకే నావరకూ ప్రేమ ఒక స్పందన. దానికి తర్కాలూ,హేతువులూ లేవు. అది అలా జరిగిపోతుంది. అంతే!

జ్యోతి : ప్రేమ అంటే యవ్వనంలో ఉన్న అమ్మాయి , అబ్బాయి మధ్య మాత్రమే ఉండేదా?.ఎక్కువ వయసు వారి మధ్య ఉండదా?

మహేశ్ : ప్రేమ అనే స్పందన ఏ వయసులోనైనా ఎవరి పట్లనైనా కలవచ్చు. దానికి కండిషన్స్ దానికి పర్యసానం ఏమిటి అనేదాన్నిబట్టి ఉంటుంది.

జ్యోతి : ఇష్టానికి , ప్రేమకి తేడా ఏంటి??

మహేశ్ : ఇష్టానికి పరిధి ఉంటుంది. ప్రేమకు పరిధి లెదని నా ఉద్దేశం. ప్రేమకు పర్యవసానం లేకుండా బేషరతుగా మనతరఫునుంచీ మనం ప్రేమించెయ్యడం ఉత్తమమని నా అభిప్రాయం.

జ్యోతి : ఇద్దరు యువతీయువకులు సన్నిహితంగా ఉంటే అది ప్రేమకు దారి తీస్తుందా? అది తప్ప వేరే సంబంధం ఉండకూడదా?

మహేశ్ : ఆడామగా సన్నిహితంగా ఉంటే ప్రేమ కలగకపోయినా ప్రేమ ప్రస్థావమాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది సహజం. కాకపోతే స్నేహం,ప్లెటోనిక్ బంధం,ఆత్మసంబంధం లాంటి పెర్లతో ప్రేమకు ఆల్టర్నేటివ్ పదాలు వాడుకుని సర్ధుకుపోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు eligible అడామగా ఉన్నప్పుడు అది చాలా "సాధారణంగా" జరిగే విషయం.

జ్యోతి : కాని మన దేశంలో ఇంకా ప్రేమ అనేది ఇంకా forbidden word అనిపిస్తుంది. అమ్మను కూడా ప్రేమించొచ్చు. I love you చెప్పొచ్చు. కాని చాలామంది ఇది ఒక బూతు మాటలా, అనకూడని పదంలా భావిస్తారు కదా!

మహేశ్ : ఇంగ్లీషులో ultimate expression of love is love making అంటారు. అంటే, ప్రేమకు పరాకాష్ట ప్రేమించడం(love making) అని. ఇక్కడ sex అనేపదం ఉపయోగించలేదని గమనించాలి.

జ్యోతి : కాని చాలా మందికి ఈ రెండు పదాలకు ఒకటే అర్ధం తీస్తారు.

మహేశ్ : అదే ఇక్కడొచ్చిన చిక్కు. మన దేశంలో శారీరక సంబంధాలు అవసరాలకోసమేతప్ప, అనుభూతులకోసం కాదు. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించిన తరువాత శారీరక పవిత్రతకిప్రత్యేకమైన విలువ ఇవ్వాలా అనేది వ్యక్తులు నిర్ణయించుకోవలసిన విషయం.

జ్యోతి : ఎవరైనా తమకు ఇష్టమైనవారిని Love you అంటే పెడర్దాలు తీస్తారు.

మహేశ్ : ప్రేమే ఒక పెడర్ధంగా తయారయిన సమాజంలో ప్రేమించడం తప్పుడుపనే.

జ్యోతి : కాని ప్రేమ అనే పదం చాలామందికి నచ్చదు.

మహేశ్ : అదొక సహజ ప్రక్రియ అని ఒప్పుకోలేని సంఘంలో అదొక బూతే. యవ్వనంలో ఉన్న యివతీయువకులు రహస్య ప్రేమ అనుభవించాల్సిన ఖర్మ పట్టించడం తప్ప ఈ ముసుగులు ఇప్పటివరకూ ఎందుకూ పనికొచ్చినట్లు నాకైతే అనిపించడం లేదు.

జ్యోతి : యవ్వనంలో ఉన్నవాళ్లే ప్రేమించాలా?

మహేశ్ : ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు. దానికి కావాల్సింది స్పందించే హృదయం. కాకపోతే ప్రేమ చాలా వరకూ యవ్వనానికి సంబంధించిన విస్ట్రుత సమస్యకాబట్టి అదే ఎక్కువ చర్చించడం జరుగుతుంది. అంతే!

జ్యోతి : కాని ఇక్కడ ప్రేమ అనేది శారీరక సంబంధం కాదని నా ఉద్దేశ్యం.

మహేశ్ : శారీరక సంబంధం ఒకటే ప్రేమ అని నాఉద్దేశం అసలు కాదు. అందుకే దాన్ని స్పందన అంటున్నాను కానీ కోరిక కాదు.

జ్యోతి : ok. మీరు బ్లాగులో రాస్తున్న టాపిక్స్ బయట కూడా చర్చిస్తారా ?

మహేశ్ : చేస్తాను. చాలావరకూ నేను చర్చించిన విషయాలే బ్లాగులో ఉంటాయి.

జ్యోతి : మరి అక్కడ స్పందన ఎలా ఉంటుంది.

మహేశ్ : ఇంకా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఒకరి ఎదురుగా ఒకరు కూర్చున్న తరువాత చర్చించడం ఇంకా సులభం.

జ్యోతి : మీరు రాసేది ఖచ్చితంగా సరైనది. ఎదుటివాళ్లు చెప్పేది తప్పు అని ఎందుకు వాదిస్తారు ?

మహేశ్ : నేను చెప్పింది ఖచ్చితంగా సరైనది ఎదుటివాళ్ళది తప్పు అని నేను ఎప్పుడూ వాదించలేదు. నేను చెప్పేది నాకు తెలిసిన ఒక ధృక్కోణం అని మాత్రమే బలంగా చెబుతాను.

జ్యోతి : అలా అని ఎదుటివాళ్లు చెప్పింది కూడా కరెక్ట్ అని ఒప్పుకోరుగా :) ..

మహేశ్ : ఎదుటివాళ్ళు వాళ్ళ కోణం నుంచీ కరెక్టయ్యుండచ్చు కానీ నా ధ్రుక్కోణంలో నాదే కరెక్టని ఖచ్చితంగా చెప్పడంలో తప్పులేదుగా!

జ్యోతి : పెళ్లి కాకుండా కలిసి ఉండడం అనే విషయం మీద మీ బ్లాగులో అప్పుడెప్పుడో గొడవ జరిగినట్టుంది..

మహేశ్ : ఇద్దరు consenting ఆడామగా కలిసి జీవించాలని నిర్ణయించుకుంటే చట్టానికే వాళ్ళను ఆపే హక్కులేదు.
అలాంటప్పుడు అనామక వ్యక్తులకు అది తప్పని వాదించే అధికారం ఎవరిచ్చారన్ది మాత్రమే నా ప్రశ్న.

జ్యోతి : నిజమే. అది తప్పు కాదా మరి?

మహేశ్ : అదితప్పని చట్టం నిర్ణయించనప్పుడు దాన్ని తప్పని ఎవరు నిర్ణయించాలి?

జ్యోతి : ఈ విషయంలో మీ ఉద్దేశ్యం ఏంటి మరి. అది తప్పు కాదా ?

మహేశ్ : నా వరకూ అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నాకు సంబంధం లేదు. జడ్జిమెంట్ పాస్ చేసే అధికారం లేదు.

జ్యోతి : సరే.

మహేశ్ : నిరసించే హక్కు అసలు లేదు.

జ్యోతి : బ్లాగింగ్ వల్ల మీ అనుభవం, అనుభూతి.

మహేశ్ : నా ఆలొచనల్ని రాసుకుని దాచుకునే ఒక ఫోరం నాకు దక్కింది. చూసి స్పందించే పాఠకులూ లభించారు. ఆనందమే.

జ్యోతి : దీనివల్ల మీకు మిత్రులు ఎక్కువయ్యారా? శత్రువులు మొదలయ్యారా?

మహేశ్ : మిత్రులే ఎక్కువయ్యారు. విభేధించేవాళ్ళు కొందరున్నా వాళ్ళని విరోధులని చెప్పలేను.

జ్యోతి : మీ ఆలోచనలు పంచుకుని, చర్చిస్తుంటే ఏమనిపిస్తుంది. అదీ ఎదుట మనిషి లేకుండా, ఎవరెక్కడివారో, ఎలా ఉంటారో తెలీకుండా...

మహేశ్ : నేను పోరాడేది ఆలోచనలతో,సిద్ధాంతాలతో అదే బ్లాగుల్లోనూ జరుగుతోంది. ఈ process చాలా వరకూ ఎదురుగా మనిషి లేకుండానే జరుగుతుంది. కాబట్టి బ్లాగింగ్ నాకు చాలా సహజంగా అనిపిస్తుంది.

జ్యోతి :ఇలా బ్లాగులు, చర్చల వల్ల మీ ఆలోచన, ఆవగాహన, రచనాశైలి... ఇలా ఏమైనా మార్పులు జరిగాయా?

మహేశ్ : ఆలోచనల్లో కొంత మార్పు వచ్చింది. అంటే ఇంకా స్థిరపడ్డాయి. శైలి ఖచ్చితంగా అభివృద్ది చెందింది. నాదంటూ ఒక మార్క్ కనిపించడం మొదలయ్యింది.

జ్యోతి : మీ బ్లాగులో రాసేది మీరు కరెక్ట్ అనుకునే విషయాలు కదా? ఇతరులు అది తప్పు అన్నా ఒప్పుకోరు , మీ పద్దతి మార్చుకోరు .. రైట్..

మహేశ్ : ఎవరో చెప్పారు కాబట్టి "తప్పు" అని వేరొకరు చెబితే నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. అయినా అది తప్పు అని వారు నమ్మితే నాకు సమస్య లేదు. ఆ అనుభవాన్నే వారి జీవితానికి అన్వయించుకో మనండి. కానీ, నన్ను వారి అనుభవం నమ్మకం ఆధారంగా సంస్కరించదలచడం నాకు ఆమోదయోగ్యం కాదు. నా పద్ధతి నా అనుభవాల పరిణామం. వారి దగ్గరున్న అనుభవాన్ని చెప్పి నన్ను convince చెయ్యగలిగేవరకూ నా నమ్మకమే నాకు సత్యం. కేవలం నన్ను వ్యతిరేకిస్తూ వాదించినంత మాత్రానా నేను మారాలంటారా? అదీ నా అనుభవ సారాన్ని పక్కనపెట్టి!

జ్యోతి : మరి వేరే బ్లాగుల్లో రాసిన టపాలు కూడా అలాగే అనుకోవచ్చు కదా. అది వాళ్ల అనుభవం అని. ఎందుకు విమర్శిస్తారు ? వెక్కిరించినట్టు వ్యాఖ్యలు రాస్తారు . అది అ బ్లాగరుకు బాధ కలుగుతుంది అని తెలుసుకోలేరా ?

మహేశ్ : నేను చర్చకు ముఖ్యంగా సైద్ధాంతిక చర్చకు ఆహ్వనిస్తానే గానీ వారు చెబుతున్నది తప్పు అని చెప్పను.

జ్యోతి : మరి నేను రాసిన టపాలలో మీరు రాసిందేంటి? అది రాసినవారి అనుభూతి అని ఆలోచించకుండా దాన్ని మీ దృక్పధంలో ఆలోచిస్తే ఎలా?

మహేశ్ : ముఖ్యంగా మతపరమైన విషయాలలో అధికారాత్మకంగా ఎవరైనా చెబితే దాన్ని ప్రశ్నిస్తాను. ఎందుకంటే అక్కడ వారు తమ నమ్మకాన్ని కాక అదే ultimate knowledge అనే అహాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. అందుకే దాన్ని తార్కికంగా హేతుబద్ధంగా చర్చించాలి అని ఆహ్వానిస్తాను.


జ్యోతి : మతపరమైన విషయాలలో ఎవరి అభిప్రాయం వారిది. మరి మీరు ఇతరులతో ఎలా వాదించగలరు . మేము మీకు రుజువు ఎందుకు చూపించాలి. ఎందుకు చర్చించాలి. mee అనుభవం, అభిప్రాయం మీది ఐనప్పుడు నా అనుభవం, అనుభూతి నాది.

మహేశ్ : హరిసేవలో లేక మీ బ్లాగులో నేను రాసినవి alternate possibilities నేనక్కడ మీ నమ్మకాన్ని ప్రశ్నించడం కాకుండా ఆ నమ్మకం యొక్క source లో కొంత alternative ధృక్పధం యొక్క possibilities ని చూపించాను.

జ్యోతి : అది నా వ్యక్తిగత అభిప్రాయం. అది తప్పు లేదా మార్చుకోవాలి అనే మీకుందా ?

మహేశ్ : నాకు ఎవర్నీ మార్చే హక్కులేదు. నాకు తెలిసిన పర్యాయధృక్పధం తెలియపర్చడం తప్ప. మూఖ్యంగా మతపరమైన విషయాలలో. కానీ కులపర,రాజకీయ పరమైన విషయాలలో నాకు కొన్ని నిర్ధుష్ట్యమైన అభిప్రాయాలున్నాయి.

జ్యోతి : నిజమే ఉన్నాయి. కాని ఇతరుల అభిప్రాయాలను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం?

మహేశ్ : ప్రశ్నించడం ఎప్పుడూ సమంజసమే. కానీ నేను చెప్పింది ఒప్పుకొమ్మని భీష్మించడం సమంజసం కాదు. చర్చించడం, సమంజసం ఆ చర్చల్లో నాదే సరైందని నిరూపించబడాలనుకోవడం సమంజసం కాదు.


ఇంకా ఉంది....

21 వ్యాఖ్యలు:

worthlife

కత్తి లాంటి ముఖాముఖి. మిగిలిన భాగం కోసం ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శ్రీనివాసకుమార్ గుళ్ళపూడి

Purnima

Quite Interesting.. Awaiting for the other parts..

మురళీ కృష్ణ

ఈ పద్ధతేదో చాలా బాగుంది. ఆపకుండా కొనసాగించండి.
ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು

వర్మ

జ్యోతి గారు కొత్త ఆలోచన బాగుంది. పోస్టింగ్ మొదట్లో మహెష్ గారి బ్లాగ్ ఐడి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. కొత్తగా చదివే వారికోసం. ( వారి బ్లాగ్ లో వ్రాసే విషయాల గూర్చి కూడా పిచ్చాపాT లో చర్చించారు కాబట్టి )...........

durgeswara

హమ్మ! కత్తీ

నా అనుమానం నిజమే. మొన్న హైదరాబాద్ లో నిన్ను చూసాక ,నేను "మీది ఏకాలేజ్ అని అడుగుదామను కున్నాను ,అని మొన్న పోస్ట్ లో వ్రాసాను.నువ్వు తప్పనిసరిగా వెండితెరమీదకెళ్లవలసిన వాడవే.మంచి గ్లామర్ వుంది.ట్రై చేయగలరు.

చైతన్య.ఎస్

త్వరగా మిగిలిన భాగం పోస్ట్ చెయ్యాలి అని మనవి చేసుకుంటున్నా :)

Suresh Kumar Digumarthi

మీ కొత్త ప్రయత్నం బావుంది, చర్చ వేడిగా వుండాలనా ఆ విషయాన్ని ఎంచుకున్నారు. రెండో భాగం కోసం ఎదురు చూస్తూ....

శ్రీనివాస్ పప్పు

చర్చ చాలా బాగుంది.మంచి ప్రయత్నం.తదుపరి భాగంకోసం ఎదురు చూస్తున్నాము.మీ ఇరువురకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

happy new year!!

మేధ

మంచి ప్రయత్నం.. మిగతా భాగాల కోసం ఎదురు చూస్తూ...

పరిమళం

జ్యోతి గారు!మీ కొత్త ప్రయత్నం చాలా బాగుంది.కత్తిలాగుంది.రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నాము.

సుజాత వేల్పూరి

"కత్తితో జ్యోతి " అని చూడగానే జ్యోతి గారు కత్తులూ కటారులూ పట్టుకునే టైపు కాదే ఏమిటా విషయం అని ఇలా పరుగెత్తుకొచ్చి చూస్తే..ఇదా సంగతి? మీ ప్రయత్నం బాగుంది. రెండో భాగం ఎప్పుడో?

Anonymous

మంచి ప్రయత్నం

కొత్త పాళీ

good show.
ప్రశ్నలూ జవాబులూ కూడా బాగున్నాయి.
ఎంతో అనుభవజ్ఞులైన ఇంటర్వ్యూయర్ లాగా అడిగారు.
ఈ ప్రయత్నం, కనీసం నెలకొకటైనా, ఆపకుండ కొనసాగిస్తారని ఆశిస్తాము.

Dr. Ram$

జ్యొతి గారు..నూతన సంవత్సర శుభాకాంక్షలు..బావున్నారా??గుర్తు పట్టారా!

జ్యోతి

కొత్తపాళీగారు,
తప్పకుండా ప్రతినెల ఒక అతిథిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను..

డాక్టర్ గారు, మిమ్నల్నెలా మరిచిపోతాము.
అందిరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

Unknown

jyoti garu miku kotta savmvatsaram lo vachhina kotta alochana bavundy.ammo ante na pata samvatsrapu alochanalalu baleva ani dandettakandy. na uddesam adi kadu.ayite katty tone yela modalu pettalanukunnaro, plus katty ni mukhamukhy kalisi interview chesara leka fone lona rasi unte bavundedy.prema gurinchi yekkuva prashnalochaayemo ani pinchindy.

జ్యోతి

రవిగారు,

అలా ఎందుకు, ఎలా ఎక్కడ అనే వివరాలు అనవసరం అనుకుంటాను. నేను కూడా ఇలాంటివి పట్టించుకోను. ఇక ప్రేమ గురించి అంటే ,, మీకలా అనిపించిందా?? ఏమో మరి.. నేను గమనించలేదు..

సత్యసాయి కొవ్వలి Satyasai

జ్యోతి గారూ
ఇది ఎలాగో మిస్సయా. పొద్దులో లంకె చూసివచ్చా. మామూలు పిచ్చాపాటిలా కాక వినోద్ దువా మాదిరి వాడి ప్రశ్నలు వేసారు. ఆయన కూడా బాగా సమాధానాలు చెప్పారు.అభినందనలు. ఇది ముఖాముఖి జరిగినదా?

జ్యోతి

సత్యసాయిగారు,,

ధన్యవాదాలు...లేదండి.. జిమెయిల్ చాట్ లో జరిగింది.. ప్రతినెల ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను..

Anonymous

ఇద్దరికీ ఐ లవ్ యు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008