తప్పా... ఒప్పా.... కాస్త చెప్పరూ???
నిన్న టీవీలో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక కార్యక్రమంలో ఇలా చెప్పారు. Spiritual Process is not just going to temples .. i dont go to temples but i have intimate relationship with Shiva..
ఈ మాటలు విన్న నాలో మెదిలిన ఆలోచనా తరంగాలు...
దేవుడు అంటే ఏంటి? నేను భక్తురాలినా కాదా? నేను దేవుడిని నమ్ముతున్నానా లేదా. నేను ఒక తెలుగింటి గృహిణినా కాదా?... మనకంటే చాలా ఉన్నతుడు సర్వాంతర్యామి , అద్భుత శక్తి ఉంది. ఆ శక్తికి మనం ఇష్టమొచ్చిన పేర్లతో పిలుచుకోవచ్చు. కాని ఆ శక్తి ఉంది అని మనఃస్పూర్తిగా నమ్మాలి. అది ఏ రూపమైనా కావొచ్చు. ఇదీ నేను నమ్మేది. పండగలన్నీ సంప్రదాయబద్ధంగా చేస్తాను. కాని నోములు, వ్రతాలు మాత్రం చేయను. భర్త చల్లగా ఉండాలని మంగళగౌరీ వ్రతం చేయడం కంటే ఆ భర్తకు తోడూనీడగా , కుటుంబ అవసరాలలో చేయూతనిస్తూ గొడవలు పెంచకుండా ఉండడం మంచిది కదా. నాకు తెలిసిన ఒకావిడ భర్త, అత్తామామల మీద గృహ హింస క్రింద కేసు పెట్టి, భర్తను జైలుకు పంపించి ఇప్పుడు( కేసులన్నీ కొట్టేసారు లెండి) మంగళ గౌరీ వ్రతం చేస్తుంది. అది చూసి నాకు చిరాకేస్తుంది. ప్రతి సంవత్సరం మా చుట్టాల్లో చాలా మంది సంక్రాంతికి నోము, వినాయక చవితికి నోములు చేస్తుంటారు, ఆపసోపాలు పడి. ఎందుకు? అంటే భర్త పిల్లలు చల్లగా ఉండాలి అని. అంత భయంగా, బలవంతంగా చేయాలా?? ఆ వ్రతాలు చేయకుంటే నిజంగా కీడు జరుగుతుందా??
అందరికీ కష్టాలుంటాయి. లేకున్నా కూడా గుడికి వెళ్లి ప్రశాంతంగా కొద్ది సేపు కూర్చుని సేద తీరాలని అనుకుంటాము. ఆ దేవుడికి మన శక్తి కొలది పూజలు చేసి తరించాలని అనుకుంటాము. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా దోపిడీ. భక్తులు, దేవుడు తప్ప అందరూ దోచుకునేవారే. స్వార్ధపరులే. ఎవరి ఎలా లూటీ చేద్దామా అని చూస్తుంటారు. ఇక అష్టకష్టాలు పడి ఆ దేవుడి దగ్గరకు వెళ్లినా లాభం ఉండదు. తనివితీరా ఆ దేవదేవుడిని చూసుకోవాలన్నా కుదరదు. అంతా మెకానికల్‌గా లైన్లో వెళ్లడం, అలా ఒకసారి చూసి రావడం. లంచాలు ఇస్తే మాత్రం ఎక్కువసేపు దేవుడిని చూడొచ్చు. ఇలాంటి వాటివల్ల ఏ పుణ్యక్షేత్రానికెళ్లాలన్నా చిరాకేస్తుంది. ఏం చేసేది??
ఇక జాతక దోషలు ఉంటే వాటి నివారణకు జాతి రత్నాలు, పూజలు చేయాలంటారు. కాని ఆ రత్నాలు కూడా చాలా ఖరీదు. పూజలు కూడా తక్కువేమి అడగరు. మరి ఇంట్లో గడవడానికే కష్టంగా ఉంటే ఆ రత్నాలు ఎలా కొనుక్కునేది? ఎలా ధరించేది. ఆ పూజలు చేయిద్దామంటే కూడా ఆ పూజారి అదో డ్యూటీలా చేసేసి దక్షిణ పుచ్చుకుంటాదు. next అంటూ. సరే .. రోజూ ఇంట్లో స్తోత్రాలు, మంత్రాలు, పద్ధతి ప్రకారం పూజ చేయాలంటే అందరు ఆడవాళ్లకు కుదరదు కదా ఈ బిజీ బిజీ లోకంలో. పిల్లలు, స్కూలు, భర్త ఆఫీసు, తన ఉద్యోగం. అలా చేయలేకపోతే ఆ దేవుడికి కోపమొస్తుందా?? పొద్దున్నే పూజరూమ్‌లో కూర్చుని ప్రశంతంగా ఆరాధించే సమయం లేదు. వాటికంటే ఇంటి విషయాలే ముఖ్యమనిపిస్తుంది. ఏం చేసేది??
గుడికి వెళ్లకున్నా , నేను మనఃస్పూర్తిగా దేవుడిని నమ్ముతాను. అతను నాకు ఎల్లప్పుడూ తోడుంటాడు. నాకు అవసరమైనప్పుడల్లా మానసికంగా ధైర్యమిస్తాడు అని నా గట్టి నమ్మకం.
నేను చేసేది తప్పా?? ఒప్పా??
20 వ్యాఖ్యలు:
జ్యోతి గారూ...శక్తి భక్తి బానే ఉన్నది...ఈ శక్తుల, భక్తుల మీద మీకు వివరంగా సమాధానం చెప్పలేను కానీ, ఒక చిన్న ప్రశ్న ఎప్పటినుండో అడుగుదాము అనుకుంటున్నా - ఈ మీ బ్లాగులో అన్ని టపాలు మీరే రాస్తారా ? ఇంకెవరన్నా కూడా రాస్తారా ? అడగడానికి వేరే కారణం అంటూ ఏమీ లేదు. వివాదం చేద్దామన్న ఉద్దేశమూ లేదు...ఒక్కో సారి మీ టపాలు చదువుతున్నప్పుడు ఇవి అన్నీ ఒకరు వ్రాసినవేనా అని అనుమానం వస్తుంది నాకు...
వంశీగారు,
నా బ్లాగుకు నేనే మహారాణిని, సర్వాధికారిని.. ఎవ్వరూ కనీసం ఒక్క పదం కూడా రాయలేదు. అయినా ఈ డౌట్ ఇప్పుడెందుకొచ్చింది. ఈ టపా చూసా??
జ్యోతిగారు మంచి ప్రశ్నయే గాని ,ఏదో టపాలో స్నేహ గారన్నట్లు మన పెద్దవాళ్ళు చుట్టు సమాజం దేవుడంటె భయం పెట్టేసారు ..చిత్త శుద్దిలేని శివ పూజ లేల అని భక్తిగా కళ్ళు మూసుకుని ప్రశాంతం గా దేవుని తలుచుకోండి.. ఇన్ని చెబితున్నానా నాకు దేవుడంటే మహా భయం ఏదో మొక్కుబడికి మంత్రాలు చదివెస్తా గాని నా ఆలోచనలన్నీ పొయ్యి మీద అన్నం జావ అయిపోతుందేమో ,ఈ నెల కరెంట్ బిల్లు కట్టామా ఇలాంటి వాటి మీదకు వెళ్ళిపోతుంది ఒక్కోసారి :(
నేస్తంగారు,
నా బాధ అదేనండి. ప్రశాంతంగా ఉండదు మనసు. ఏదో ఆలోచనలు..
ఇంతకు మునుపు జమానా లో వచ్హిన స్వాములు గుడి గోపురం తీర్థం పుణ్యం అంటూ జనాల్ని ప్రేరేపించినారు దైవం వైపు మన ధ్యాన్ని మళ్ళించినారు. ఈ మన జమనా లో వచ్హిన/వస్తున్న స్వాములు మనలా అంతర్జాలం ఎట్ సెట్రా తెలిసిన మన జమానా కి మన సో కాల్డ్ ఇంటెల్లిజెన్స్ కి తగ్గట్టు దీటు గా మరో స్టెప్పు పైకి రమ్మని ఆహ్వానిస్తున్నట్టున్నారు. ఈ మధ్య కాలం లో వచ్హిన స్వాములు మీలా మాలా బుద్ధి జీవులు కూడా. ఓ రెండు క్షణాలు కళ్ళుమూసుకుని ధ్యానం చేసి చూడండి - విపులంగా సమజ్ అవుతుంది - "అంతా విష్ను మాయె"!
చీర్స్
జిలేబి.
http://www.varudhini.tk
Jyothi gaaru
yes..ee TapA cUsE...:)...and hope there was no misunderstanding from my question...
Vamsi
Q: Why does man get bored?
UG: Because man imagines that there is something more interesting, more meaningful, more purposeful to do than what he is actually doing. Anything you want above the basic needs creates this boredom for the human being. But you get the feeling, "Is that all?"
Nature is interested in only two things - to survive and to reproduce one like itself. Anything you superimpose on that, all the cultural input, is responsible for the boredom of man. So we have varieties of religious experience. You are not satisfied with your own religious teachings or games; so you bring in others from India, Asia or China. They become interesting because they are something new. You pick up a new language and try to speak it and use it to feel more important. But basically, it is the same thing.
NoWay out by UG
http://www.well.com/user/jct/
జ్యోతి గారు,
ఇక్కడ తప్పు ఒప్పుల ప్రసక్తి లేదండి.
"మతం" అంటే "నమ్మకం" అని కదా అర్థం. ఒకే మతం ( హిందూ, ముస్లిం ఇలా) వారయినా వారి వారి నర్చర్ ను బట్టి వారి వారి నమ్మకాల స్వరూపాలు, తీవ్రత (form or degree of belief) ఉంటుంది.
మీ నర్చర్ ను బట్టి మీకు మనః పూర్వకమయిన చర్యలపై నమ్మకం ...అది మీ "మతం"
ఇంకొకరి నర్చర్ ప్రకారం వారికి ఆచార వ్యవహారాల పై నమ్మకం...అది వారి "మతం"
ఒకరికి హాని చేయనంత వరకు, మనకు మంచి చేస్తున్నంత వరకు, ముక్కు మూసుకు తపస్సు చేసినా రైటే, మానవ సేవ చేసినా రైటే...ఇందులో ఇంకొకరు తప్పు ఒప్పు అని నిర్వచించే అవకాశమే ఉండకూడదు.
ఇలా అనుమానాలు రావటానికి కారణం మనం చేస్తున్న దానిపై మనకు "కాన్ఫిడెన్స్" లేకపోవటమేమో అనిపిస్తుంది నాకు ...(స్వానుభవం సుమండీ :-)...ఇది నేను కించపరుస్తూ అనట్లేదు...
ఏ విషయంపై "నమ్మకం" పెట్టినా "బుద్ది" కలిగిన జీవులకు "నేను చేస్తున్నది తప్పా ఒప్పా" అన్న అనుమానం కలగటం సహజం...అదే "రిఫ్లెక్శన్".....
అది మాటి మాటికీ మనల్ని బాదిస్తుందంటే మాత్రం "మనం ఆలోచించి నిర్ణయానికి రాలేదు" లేదా వచ్చినా దానిపై "గురి లేదు"-----ఈ రెండిటిలో ఏదో ఒక కారణం అయి ఉంటుంది....ఆలోచించండి.
amma meeru koddigaa svotkarshaku paalapadutunnaarani pistunnadi.komchem pariseelimchukomdi. mee varaku paivi cheyaleremo.sare kaani vellevaallamtaa meelaamti bhaavanato vellatam ledu aalochimchi choodamdi.mee asahananni bhagavamtuni talache aneka maargaalanu tappu anelaa vyaakhyaanimchi velibuchchutunnatlani pistunnadi. mee istam mee blog anukumte naamaatalu teesi veyamdi
ఒక గృహిణి కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వటం చాలా సరైనపని. అది పూజతో సమానమే. యోగ: కర్మసు కౌశలమ్. మీ ఆలోచన సరైనదే. కానీ కొంతమంది హైందవ గృహిణులకు పూజ పునస్కారం దినచర్యలో భాగమవుతుంది. అది కూడా మంచిదే. వారి వారి ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవటం ఆనందదాయకం.
"ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకండి. కొన్ని సేకరణలు ఉన్నాయి. చదవండి.. ఆనందించండి. ఇష్టం లేకపోతే ముందుకెళ్ళండి...జైహింద్.."
ఈ మీ స్టేట్మెంటే వంశీ గారి డౌటుకు కారణమనుకుంటా
మీరు 100% కరక్ట్ .
దుర్గేశ్వరగారు,
లేదండి ఇవి నామీద నాకు కలిగిన సందేహాలు. ఏం చేయాలో తెలీక అడిగా..
మీ విషయంలో మీరు చేస్తున్నది ఒప్పు.
ఏదో మొక్కుబడిగా దేవుణ్ణి ప్రార్ధించకపోవటమే మంచిది.
కానీ, మిగతా వాళ్ళు ఎందుకు ప్రార్ధిస్తున్నారో మనకు
తెలియదు కదా. వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు.
మనకి నష్టం కలిగించనంత వరకూ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు.
మనం తప్పు పట్టకూడదు.
బాగుంది మీ సంశయం. నేనైతే ప్రేమే భగవంతుడు అని నమ్ముతా. కొందరు నమ్మకమే భగవంతుడంటారు. గుడికి వెళ్లేది ప్రశాం తత కోసమైతే, ఆ ప్రశాంతతని ప్రయత్నంతో మన ఇంట్లోనే సాధించ వచ్చు కదా..? మనసు బాగోలేనప్పుడు కాస్త ధ్యానం చెయ్యడం, ప్రకృతిని పరిశీలించడం చేస్తుంటా. గుడికి వెళ్లడమూ చేస్తా. ఏమి చేస్తున్నాము అని కాదు, ఎందుకు చేస్తున్నాము అని ఆలోచిస్తే మీ ప్రశ్నకు సమాధానం మీకే దొరక వచ్చు.
జ్యోతిగారూ, మీ సందేహాన్ని చూసి "గుడికి వెళ్ళలేకపోవడం తప్పా?" అని ఒక పోస్టు వేసాను. సమాధానం దొరుకుతుందేమో చూడండి.! http://jeedipappu.blogspot.com/2009/02/blog-post_10.html
* ఆ వ్రతాలు కుంటే నిజంగా కీడు జరుగుతుందా?? *
కీడు జరగదు కాని మీ పిల్లలకు ఒక్క మంచి అనుభుతిని ఇచ్చిన వారౌతారు. ఉత్సాహకరమైనా వాతవరణము పండుగలు, వ్రతాలు వలన కలుగుతాయి.అదె కాకా మీకు పండుగ పబ్బలనాడు కొంచెం పని ఎక్కువ ఉండటం మూలన మీ పిల్లల కి కొంత పని అప్పచెప్పటంవలన వాళ్లకు చిన్నప్పటి నుంచి పని విలువ తెలుస్తుంది నలుగురి తో కలసి పని చేయటం అర్థమౌతుంది. మీరు రోజు ఎంత కష్టపడి పని చెస్తున్నరో వాల్ల మనసుకు తెలుస్తుంది. మనిషిని మనిషి గా చూడటం అనేది అలవడుతుంది ( పని విలువ అర్థమౌతుంది). అంతె కాని ఈ రొజుల లో నేను మా బంధువుల ఇంటి కి పోవడం మని వేశాను. ఎప్పుడు చూసినా చదువుతుంటారు వాళ్ల పిల్లలు వాళ్ల అమ్మ నోట్లొ అన్నము కలిపి పెడుతూంటుంది 9 వ తరగతి చదివే పిల్లలకు కూడను. ఇటువంటి పిల్లలకి చదువు వస్తుందేమో గాని బుద్ధి వికసించదు. స్వయంగా నిర్ణయాలు తీసికోలేరు.
* ఇలాంటి వాటివల్ల ఏ పుణ్యక్షేత్రానికెళ్లాలన్నా చిరాకేస్తుంది. ఏం చేసేది?? *
జనం తక్కూవ ఉన్న రొజులలో వెళ్ళేది. ప్రత్యేకము గా మీబోటి వారు ఎందుకంటె మీకు నేను చేసేది తప్పా?? ఒప్పా?? అనే లాంటి ప్రశ్నలు సమాధానాలు అక్కడే (పుణ్య క్షేత్రాలలో) లబిస్థాయి. ప్రశ్నలు తల్లెతవు. మనసు ప్రశాంతంగా వుంటుంది. అంతకు మించి మీకు ఎమీ కావాలి?
*అలా చేయలేకపోతే ఆ దేవుడికి కోపమొస్తుందా?? *
రాదు కాని చేయాతం మాత్రం మను కో కుడదు. మనకు మత గ్రంధాలలో నిష్కామ కర్మ అని చెపుతూనంటారు అది అసలికి ఎక్కడైనా వుందా అని అలోచినచాను ఎందుకంటె ఏ పని మిరు చెసిన ఫలితం అశిస్తారు ఖచ్చితంగా.
without any benifit nobody works. current system is like that. For example Will you send your kids to school if they are not going to get any job after education and will people put so much effort to get seat in any entrance exam? Starting from chaildhood we are expecting some output from everyone. Put it in a single word socity means expecatation.
మీరు ఇంట్లొ చెసే ఆ దేవుడి పూజ ఒక్క దాని మీదె మికు expectation లేనిది ( మీరు ఒక కారణం చెప్పి చెయ్య లేక పొయాను అంటె ఎవ్వరు మిమల్ని బలవంతం పెట్టరు )అందువలన నే అక్కడ అందరు పాలుమారుతారు / వాయిదావేయడానికి ప్రయత్నిస్తారు. కాని ఈ పూజ వలన మీకు దెవుడికి ఒక సంబంధం ఏర్పడుతుంది. కష్టాలలో వున్నపుడు మిరు నమ్మిన వారు మిమ్మల్ని ముంచినప్పుడు ఈ పూజ చెయడం వలన దాని నుంచి త్వరగా బయటపదతారు మాములు వారు అవుతారు. ఇది నాకు తెలిసిన నిష్కామకర్మ ఉపయోగం. My above answers are based on my experience.
I will tell you one thing that Jaggi vasudev answer was wrong. It did not have any impact on you. If you were satisfied with that answer you would not write this blog and ask others.
Hope my reply address your doubts. Incase if you don't like it throw it into a dust bin.
Jyothi garu,
good question from you and good discusstion from bloggers. is it your own writing or collection.
Srikar garu,,
thanks a lot ..will study it
madhugaru,
this is my own writing. and doubt on myself..
జ్యోతి గారూ !చాలా లేట్ గా వచ్చాననుకుంటా !వ్రతాలు ,పూజలు చేయక పోవడం తప్పని అనను కాని శ్రీకర్ గారితో కొంతవరకు ఏకీభవిస్తా .మనం పూజలు ,వ్రతాలు చేసేది మనకోసం మాత్రమె కాదు మన సంస్కృతిని మనద్వారా మన తర్వాతి తరాలకు అందించడానికి కూడా .అమ్మ పూజ చేస్తుంటే ఆమె కొంగు పట్టుకు తిరుగుతూ ,పూలు కోస్తూ ,ఆమేది చేస్తే పాప కుడా అదే చేయడం కూడా సమ ఫలాన్నిస్తుందని చెప్తారు .ఆ పుణ్య ఫలాన్ననుసరించి భగవంతుడు ఆమెకు వర నిర్ణయం చేస్తాడట .ఇది నిజమో కాదో తెలీదు కాని వ్రతాలు ,పూజల వల్ల మన హైందవ సంస్కృతిని మన పిల్లలు కొంతవరకైనా మర్చిపోకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం మనపై ఉందని నమ్ముతాను.
Post a Comment