నిన్నోదల బొమ్మాలీ..
అన్నలకు , తమ్ముళ్లకు, అక్కలకు , చెల్లెల్లకు, అందరికీ నమస్తె చెప్తున్న. నేను గుర్తున్ననా. సరూపను. అప్పుడెప్పుడో బత్తీబంద్ అంటే మీతో కొన్ని ముచ్చట్లు చెప్పిన గదా. చాలా రోజులైంది మిమ్మల్నందరినీ కలిసి కదా. ఏం జేసేది. సంసారమన్నాక ఏదో ఒక పరేషానీ. మీకో సంగతి చెప్పనా. మా ఇంట్ల కూడ కంప్యూటర్, ఇంటర్నెట్ పెట్టించిన్రు. పిల్లలకు చాలా అవసరమంటే తప్పలేదు మరి. ఏం సదువులో ఏమో. సదువు సారెడు, బలపాలు దోసెడు అన్నట్టుంది . నేను కూడా కొంచం కొంచం నేర్చుకుంటున్న తెల్సా. బ్లాగులు కూడా సదువుతున్నా. నేను భీ ఒక బ్లాగు షురూ చేద్దమనుకుంట గాని, ఆ ఏం రాస్తంలే అని మళ్లీ ఊరుకుంటున్న. ఈ మధ్య ఇక్కడ కూడ లొల్లి ఐతుందని తెలుసు. అందరూ పరేషాన్ల ఉన్నరు. అందుకే మీకో మస్తు ముచ్చట చెప్దామని ఒచ్చిన.
మొన్నోసారి నేను, నా దోస్త్ రోషనారా కలిసి చార్మినార్ కాడ పని ఉండి పోయినం. చీరలు, గాజులు, ఇంక కొన్ని సామాన్లు కొనుక్కుని ఇంటికొచ్చి హమ్మయ్యా అని కూర్చున్నం. ముందు చాయ్ జేసుకుని తాగుతూ కొన్న సామాన్లు చూస్తుంటే పెద్ద నవ్వు వినిపించింది.
"హ .. హ.. హా"
"ఎవడ్రా అది ?"
"నేను పశుపతిని. గద్వాల నుండి వచ్చాను. నిన్ను వదలను."
"నువ్వు పశుపతివో , ఏట్లపతివో, ఎక్కడినుండొచ్చినవో మాకేం జేసేదుంది కాని. ఏం దమాక్ గిట్ల ఖరాబ్ ఐందా?
" హ..హ.. హా..నన్ను గుర్తుపట్టలేదా. నేను అఘోరీ బాబాను. అందరూ నేనంటే భయపడతారు. నేను చెప్పినట్టు వింటారు."
రోషనారా "నువ్వు ఆగు సరూప .. వీడి సంగతి నేను చూస్త. నువ్వైతే చాయ్ తాగు. "ఏం రా బద్మాష్.. నువ్వెవడైతే ఏంటి. నిన్ను గ్యాస్ నూనె పోసి కాల్చి, ఆ బూడిదకు ఘోరీ కడతా. చల్ నికల్"
"అర్రేయ్! అసలు నీ గురించి ఏమనుకుంటున్నవురా.. మంగలి షాపు ముందు సవరాలు అమ్ముకునే మొహం నువ్వు. నీకు భయపడాలా.. అసలు కథేంది చెప్పు."
" హ..హ..హా... నిన్ను వదల బొమ్మాలీ"
"బొమ్మాలీనా? ఓహో..రోషన్,, వీడు ఆ అరుంధతి సినిమానుండి వచ్చినట్టున్నాడు. వీడి సంగతి చూడాల్సిందే. (నువ్వు ఐపోయావురా ఇవాళ. నీ ఖర్మగాలి ఇక్కడికొచ్చినవ్ బిడ్డ)
"అబే సాలే .. నీ మొఖానికి అరుంధతి అంత సుందర్ లడ్కీ కావాల్సొచ్చిందిరా. నీ మొఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నవా?? తక్కెడ కింద చింతపండు పెట్టి దొంగ జోకుడు చేసి ఆ వచ్చిన పైసలతో గుడిలో అభిషేకం చేయించే పింజారీమొహం (సరూపా! ఇది రైటేనా?) నువ్వూ. నువ్వు మమ్మల్ని వదిలేంటిరా? అని రోషన్ రెచ్చిపోయింది. అది నాకంటే ఖతర్నాక్.
"ఏయ్! మీ అంతు చూస్తాను. జేజమ్మనే వదల్లేదు. మిమ్మల్ని కూడా వదలను. ఏంటి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు . అస్సలు భయం లేదా మీ ఆడోళ్లకు?"
"ఓరేయ్! ఏందిరా నీకు భయపడేది. మేము కూడా నీకంటె పెద్దగనే ఒర్లుతం తెలుసా. నోర్ముయ్.. ముయ్ అన్నా ముయ్.. ఎక్వ తక్వ నక్రాల్ చేసినవా.. నీకు పిల్లి బిరియాని పెడతా. ఎలుకల తందూరి చేసి పెడతా ఏమనుకున్నవో.. ఇంకా మాట్లాడితే ఈగలు, దోమలతో పకోడీలు ఏసి తినిపిస్తా..
"వామ్మో! మీరు ఏమంటున్నారు .. నాకు అర్ధం కావట్లేదు.. ఐనా నిన్నొదల బొమ్మాలీ?"
"చుప్.. మల్లీ బొమ్మలీ, అంటడు.. రోషన్ .. ఈడు ఇనేటట్లు లేదు. ఏం చేద్దమంటావ్?"
"సరూప. వీడిని కోసి బిరియాని చేద్దామా , కాళ్లతో పాయ, భేజా ఫ్రై, మిగతా సామాన్లు కలిపి శనగలు వేసి వండి జూలో పసువులకు దావత్ ఇద్దామా. వీడు పశుపతి అంటున్నడు కదా ?"
" అసలు నిన్ను ఆ జేజమ్మ అంత పెద్ద బంగళాలా పాతిపెట్టింది కాని, నిన్ను అసలు ఈ మూసీలో ముంచి పాతిపెట్టాలి. "
" అమ్మో ! నేను పోతాను. వదిలిపెట్టండి తల్లో?"
"ఆగు.. ఏంది పోయేది.. అసలు నువ్వేంటి, నీ అవతారమేంటి. ఎన్నేల్లైందిరా స్నానం చేసి. మా మూసి కూడా ఇంత కంపు కొట్టదు. నిన్ను లారీడు ఫినాయిల్ తో తానం జేయించినా నీ కంపు పోదు. చీ.. మల్లీ కనపడ్డవో.. ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తా.. ఈ దండకం యాద్ పెట్టుకో అందాక తెలిసిందా.మళ్ళీ ఆడోళ్ళను సతాయించినవో??"
"నే పోతున్నా. ... పోయాను.."
"హ.. హ.. హా . భలే మజా వచ్చిందిలే రోషన్."
"ఔను సరూప. ఇగ నేను పోతున్న. రాత్రికి ఒంట జేయకు. మీ అన్న మటన్ బిరియాని చేయమన్నడు. బిరియాని, కుర్బానీ కా మీటా, మిర్చీ కా సాలన్ పంపిస్తా. ఒస్తా మరి."
"సరే.. ఖుదాహ్‌ఫీజ్"
ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. ఊరికే సరదాకి మాత్రమే చేసిన చిన్ని ప్రయోగం. ఎవరైనా నన్నే అన్నారు అని అనుకుంటే నేనేమీ చేయలేను. వారి ఖర్మ. గతంలో చేసిన కోతలరాణి లాంటిదే ఈ టపా. లైట్ తీసుకోండి.
13 వ్యాఖ్యలు:
పేరడీ రచన బావుంది. పేరడీ లు వ్రాయడం కత్తిమీద సాము. చక్కగా వ్రాసారు.ముగింపు హైలైట్
నీకు పిల్లి బిరియాని పెడతా. ఎలుకల తందూరి చేసి పెడతా ఏమనుకున్నవో.. ఇంకా మాట్లాడితే ఈగలు, దోమలతో పకోడీలు ...
వామ్మో ఇటువంటి వంటకాలు కూడా ఉంటాయా??
చాలా - చాన
కొంచం కొంచం - జరజరంత
బ్లాగులు కూడా - బ్లాగులు గిన
సారెడు-శారెడు
దోసెడు -దోశెడు
ఐతుందని - ఐతదని
కూర్చున్నం-కూసున్నం
ఎక్కడినుండొచ్చినవో - ఏడికేనొచ్చినవో
వినిపించింది - ఇనిపిచ్చింది
ఐపోయావురా - అయిపొయ్నవ్ ర
ఇంక మస్తు ఉన్నయి జోతక్కో గిట్లాసుంటియి.. కని ఓపిక లేదిగ రాస్తందుకు. మంచిగనే ఉందనుకో ఆడికైనా.. రాయి మల్ల అప్పుడప్పుడు గిట్లనే..
మస్తుగ రాసినవక్క....
నాకు మస్తుగ మస్తుగ నచ్చింది(క్షమించాలి సరదాకి ఇలా వ్రాసాను)
You people are torturing every one with this kind of stupid posts.. cant you guys stop this nonsense?
నిన్న CB రావు గారు, ఇవాళ మీరు.. ఆరిపోయిందనుకున్నదాన్ని మళ్ళీ మొదలుపెట్టారా జ్యోతిగారూ? ఆల్రెడీ ఒక కౌంటరు వేసారు రవి గారు, కాగడా గారు. కానివ్వండి.. జంతికలు తెచ్చుకొని చూస్తాము ఆసక్తిగా.
బుజ్జిగారు,
ఇది సిటిలో ఉన్న గృహిణి మాటలు. కాస్త ఆధునికంగానే ఉంటాయి కదా...
అశోక్ గారు,
sorry , i didnt mean to insult anyone..
జీడిపప్పుగారు,
నేను ఈ పోస్ట్ పదిరోజుల క్రింద రాయాలనుకున్నాను. ఎందుకు రాయలేకపోయానో మీరు అర్ధం చేసుకుని ఉంటారు. ఈ మధ్య నా టపాలు ఎవరినో ఉద్ధేశ్యంతో రాస్తున్నానని కొందరు మహానుభావులు అనుకుంటున్నారు. అందుకే ఈ disclaimer.. ఎవరేం రాసారో చూసే ఆసక్తి లేదు. అసలు సంగతి చెప్పనా.. నేను ఈ సినిమా ఇంకా చూడలేదు.. అంతగా భయపెట్టేలా ఉందా అన్నదానికి చిన్నిసరదా కౌంటర్. అంతే...
జ్యోతిగారు, మొన్న మొన్ననే గొడవలు సద్దుమణిగాయి.వాళ్ళు కూడా "అలాంటి" పోస్టులు వెయ్యడం లేదు. ఈ తరుణం లో మీరు "పదిరోజుల క్రిందట" వెయ్యాలనుకున్న పోస్టు చూసి మీలో ఇంకా కోపం తగ్గక అదే పనిగా వేసారు అనుకున్నాను. పైగా నిన్న CB రావు గారు గొప్ప నిజం బయటపెట్టారుగా!!
"ఇది ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు" అని చివర్లో వ్రాయటం వలన ఇది ఎవరినో ఉద్దేశించినట్లే ఉంది అనిపిస్తుంది. మీరు ఇటువంటి అనవసర విషయాల మీద టైం వేస్ట్ చేసుకుంటున్నారని నా ఉద్దేశం. పెంట మీద రాయేస్తే మన మీదే పడుతుంది(రాయి కాదు పెంట) అని గమనించగలరు. అలాగే ఆకాశం మీద ఉమ్మేసినా మనమీదే పడుతుంది.
బాగుంది.
జీడిపప్పుగారు,
నా కోపం ఇప్పటికి అలాగే ఉంది. మీరనుకున్నట్టు ఈ పోస్ట్ కోపంతో రాయలేదు.మామూలుగానే రాసాను.దైవానికగారు అన్నట్టు పెంట మీద రాయేస్తే అది మనమీదే పడుతుంది .. అందుకే అలాంటి చెత్త రాతలపై నా సమయం వృధాచేయక నా పని చేసుకుందామని నిర్ణయించుకున్నాను.
first lo means 20 days back....i impressed alot with ur blog(not only urs,sujathagaru...)
but later....i lost my intrest...u know y...
i want 2 say onething......2 all.just do good(if possible)... otherwis atleast try to be good.thats it.tc byeeeeeeeee.
మస్త్ గా రాసిన్రు ........
Post a Comment