Sunday 31 May 2009

ఎక్కడ ఈ అందాలు???


తిన్నామా.... పడుకున్నామా... తెల్లారిందా...

ఈనాడు ఇదే దినచర్య ఐపోయింది చాలామందికి. అది పల్లె అయినా, పట్టణమైనా... ఎక్కడ చూసినా బిజీ , బిజీ.. మూడేళ్ళ పిల్లాడికి కూడా పొద్దున్నే లేచి ఉరుకులు పరుగులతో తయారయ్యే గ్రహచారం పట్టింది. హాయిగా ఒక్కపనీ చేసుకోవడానికి లేదు. తినడం, పాడుకోవడం అన్నీ యాంత్రికమైపోతున్నాయి.. మరి పల్లెలలో ఎలా ఉందో??

తెల్లా వారక ముందే పల్లే లేచిందీ..
తన వారినందరినీ తట్టి లేపిందీ..
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి..
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది..



తెల్లా వారక ముందే



వెలుగు దుస్తులేసుకునీ సూరీడూ..
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో..
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి..
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..



తెల్లా వారక ముందే



పాలావెల్లి లాంటి మనుషులు...
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ..
పల్లె సీమలో కోకొల్లలూ..
అనురాగం.. అభిమానం...
అనురాగం అభిమానం కవల పిల్లలూ..
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ..



తెల్లా వారక ముందే


ఇక్కడ వినండి.

మామూలుగా ఏదైనా పాట వింటే , సంగీతమో, సాహిత్యమో, లేదా ఆ పాట పాడినవారి స్వర మాధుర్యం మనను ఆకట్టుకుంటుంది. ఓహో అనుకుంటాము.. కాని కొన్ని పాటలు అందంగా ఉంటాయి. చాలా సులభమైన తెలుగు పదాలతో ఉంటాయి. ఆ పాట వింటుంటే ఒక అందమైన దృశ్యం మన కళ్లు ముందు కదలాడుతూ ఉంటుంది. అలాంటిదే ఈ పాట. ముత్యాల పల్లకి చిత్రంలో సుశీల పాడిన మల్లెమాల గీతం. నిజంగా ఈ పాట వింటుంటే ఒక అద్భుత దృశ్యం రూపకల్పన చేసుకుంటుంది. వ్యవసాయపు పనులకోసం సూర్యుడికంటే ముందే లేచి పొలాల వైపు అడుగులేస్తారు రైతన్నలు. సూరీడు తూరుపు తలుపు తీసుకుని కాక తోసుకుని వచ్చాడంట. మరి రోజూ చేసే పని తప్పదు కదా.. ఉద్యోగాలు, స్కూళ్ళు ఇలా మనం కూడా అన్ని పనులు టైం ప్రకారం తప్పనిసరై చేయాల్సి వస్తుంది కదా. నింపాదిగా చేస్తే ఎలా కుదురుతుంది. ప్రతి రోజు అలారం పెట్టుకుని అమ్మ లేచి , పిల్లలను లేపుతుంటే పిల్లలకు చిరాకు, స్కూలు బస్సు వెళ్ళిపోతుందని భయమేసి లేస్తారు .. మామూలుగా కాకుండా వెలుగు దుస్తులేసుకుని వచ్చిన సూరీడుని చూసి పాడు చీకటికి కూడా భయమేసి పక్క దులుపుకుని పరుగుతీసిందంట..

కొన్నేళ్ళ క్రిందట పల్లెటూళ్ళలో కుటుంబ సభ్యుల మధ్యే కాక ఊరంతా కూడా అభిమానంగా కలిసి మెలిసి ఉండేవారు. ఎవరింట్లో శుభకార్యమైనా ఊరంతా చుట్టాలే.. అనురాగం అభిమానం కవల పిల్లలూ.. .. ఎంత మంచి ఊహ కదా.. కాని నిజమైతే బాగుండు అనిపించక మానదు ఎవరికైనా..

9 వ్యాఖ్యలు:

MIRACLE

very nice photo and poetry

యోగేంద్ర

adbhutamaina pata

Malakpet Rowdy

Nice ones - both the Pic and the Poem

భావన

చాలా బాగుంది జ్యొతి.. అవును పాట విన్నప్పుడల్లా ఒక్క సారి పల్లెటూరి వుదయం కళ్ళ ముందు సాష్కాత్కరించుతుంది. మళ్ళీ ఒక్క సారి వినిపించి ఎద తలుపులను తోసినందుకు (తట్టటం కాదు) ధన్యవాదాలు..

చైతన్య

మంచి సాంగ్ గుర్తుచేసారు

పరిమళం

మొన్నే Z సరిగమప ...లో ఒక పాప ఈపాట పాడినప్పుడు బాలసుబ్రహ్మణ్యంగారి వివరణ ఇంతే చక్కగా ఉందండీ !

కటకం సునీత

jyothi garu
mee blaagu naaku chaala nachchindandi.
mee tapaalu chaala baaguntai. okavidanga nenu mee blaagu abhimaanini, meeru pette photolu, paatalu, chuddaniki, vinadaaniki kuda yentho hayiga untaai.
nizanga cheppalante naaku manchi kalakshepam yemanna undi ante mee blaagu chadavadame.
thanku jyothi garu .

Shashank

chakkani paata gurtuchesaranDi.

lalithag

Amazing coincidence.
మీరు చూసే ఉంటారు నేను ఈ రోజు ఏ పాట గుర్తు చేసుకున్నానో.
అది నాకు నిన్న దొరికిన ఈ quote కి సరిగ్గా సరిపోయింది.
"A picture, it is said, is worth a thousand words, but cannot a few well-spoken words convey as many pictures? ~Author Unknown"
ఈ పాట గురించి ఇంకా ఏం దొరుకుతుందో అని గూగుల్ లో వెతుకుతూ ఇటు వచ్చాను.
మీరూ నాకనిపించిందే చెప్పారు, దృశ్యాన్ని మన ముందు ఉంచుతుందని :)
తెలుగు సినిమా పాటలలో ఎంతో అందమైన సాహిత్యం ఉంది.దానిలో నాకు నచ్చినవి ఒక చోట పెట్టుకునే ప్రయత్నం పని గట్టుకుని మొదలు పెట్టాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008