Friday 29 May 2009

బ్లాగర్లకు బ్లాగర్ల విజ్ఞప్తి


బ్లాగు మన ఆలోచనలు, భావవ్యక్తీకరణకు ఒక వేదిక. దానివలన మనలోని ఆలోచనాశక్తి, విశ్లేషణ, పరిశీలనాసక్తి పెరుగుతుంది. అలాగే రచనా శైలి మెరుగుపడి , ఏదైనా సంఘటనను, భావాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది అర్ధమవుతుంది. మన రచనలను ఇతరులతో పంచుకోవడం, చర్చించడం వల్ల తప్పు , ఒప్పులు తెలుస్తాయి, అలాగే మరి కొన్ని మనకు తెలీని విషయాలు కూడా అవగతమవుతాయి. మనం రాసిందే ఒప్పు కాదు. ఇతరులు చెప్పిందే తప్పు కాదు. తప్పులు, పొరపాట్లు ఎవరైనా చేస్తారు. అది సహజం. అది తెలుసుకుని తమని తాము దిద్దుకోవడంలో తప్పు లేదు. ఇలా చేయాలంటె మన రచన బాగుందా లేదా అని కాకుండా, అందులొ తప్పులు ఉన్నాయా, ఇంకా మెరుగుపరుచుకోగలమా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనమేం రచయితలం కావాలా. మన వృత్తి మనకు లేదా. ఎప్పుడూ ఈ బ్లాగుల్లొనే ఉంటామా అని అంటారా?? బ్లాగులు రాసేవాళ్లందరూ తమ తమ వృత్తి, ప్రవృత్తి, చదువులు వగైరా స్వంత పనులలో నిమగ్నమై కూడా తమలోని ఆలొచనలను, స్పందనలను తమలా ఆలోచించే వారితో పంచుకుని , చర్చించుకోవాలని బ్లాగులు రాస్తున్నారు. అది మన మాతృభాషలో ఉంది కాబట్టి ఇంకా సంతోషం కదా.



ప్రతి ఒక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఎవరికి వారే గొప్పవారు. ఆ ప్రతిభ ఈ బ్లాగులలోని రచనల వల్ల తెలుస్తుంది. ఒక టపా రాసి అది అందరి మెప్పు పొందాలని దాదాపు ప్రతి బ్లాగరు అనుకుంటాడు. అది కామెంట్ల వల్ల తెలుస్తుంది. ప్రచార మాధ్యమాల మూలంగా ఈ మధ్యకాలంలో తెలుగు బ్లాగులు అభివృద్ధి చెందాయి. శుభం. ముందు చెప్పినట్టు అందరి దగ్గర ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. వాళ్లు చెప్పాలనుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. ఊరికే టపా రాసేసి కామెంట్లకు ఎదురుచూడ్డం. అంత కష్టపడి రాసిన టపాకి ఒక్క కామెంటు రాకపోవడంతో నిరాశ కలుగుతుంది. ముందు కెళ్లడానికి మనస్సంగీకరించదు. కామెంట్లు రాకుంటే పోనీ, అలాగే రాసుకుంటూ పోవచ్చు. కాని మనం రాసిన విషయం గురించి ఏదో ఒక స్పందన ఉండాలని అందరూ అనుకుంటారు కదా. ఆ స్పందన మనం ఎంచుకున్న విషయం, దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము అనేది ముఖ్యం. కొత్తలో అందరికీ ఇది తెలీదు కదా. కాని అంతటితో నిరుత్సాహపడడం మంచిది కాదు. ఏది తనంతట తాను మన దగ్గరకు రాదు. శోధించి , సాధించాలి. అది ఖచ్చితంగా మన చేతిలొకి వస్తుంది. ఇది నిజం.



ఈ మధ్య నేను గమనించిన లేదా నాకు కలిగిన ఇబ్బంది... ఏంటంటే కొన్ని బ్లాగులలో రోజు ఒకటికంటే ఎక్కువ టపాలు వస్తున్నాయి. అది తప్పు కాదు. కాని ఆ టపాలన్ని కూడలి లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాయి. దీనివల్ల ఎన్నో మంచి టపాలు ఎకువమంది చూడకుండానే, అసలు అవి ఉన్నాయని తెలీకుండానే తొందరగా వెనక్కి వెళ్లిపోతున్నాయి .. ఆ ట్రాఫిక్ జాం లో ఏ బ్లాగు చదవాలో కూడా తెలీకుండా ఉంది. కామెంట్లు చూసి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ఎన్నో కొత్త బ్లాగులకు చదువరులు రాకుండా పోతున్నారు. ఇలా ఎంతో మంది నిరాశ చెందుతున్నారు. కొందరికి కోపాలొస్తున్నాయి. కాని దీనికి పరిష్కారం కనుగొనాలి కదా. లేకపొతె పది నిమిషాల కంటే ఎక్కువసేపు కూడలిలో మన బ్లాగు టపా కనపడకుంటె రాసి వృధా కదా. అందుకే నాదో చిన్న మనవి. మీరు రాయాల్సిన విషయాలు ఎక్కువ ఉంటే రాయంది. ఒకే అంశం మీద ఉన్న వ్యాసాలు జాగ్రత్తగా సర్ది పెట్టి ఒకే టపాగా ప్రచురించండి. లేదా రోజొక టపా రాయండి. మీరెక్కడికీ పోరూ, చదివేవారెక్కడికీ పోరూ. అందరూ రోజూ కూడలికి వస్తారుగా.. ఒక్కశారి మీ బ్లాగు టపాల గురించి కాకుండా చదువరుల గురించి, దీనివలన ఇబ్బంది పడుతున్న మిగతా బ్లాగర్ల గురించి ఆలోచించండి. అలాగే రోజు మూడు నాలుగు టపాలు ప్రచురిస్తే అన్నింటికీ చదువరులు , కామెంట్లు ఉంటాయా. లేదనుకుంటా. ఏ టపా ఐనా కాస్త ఫేమస్ ఐంది అంటే దానిలోని కంటెంట్ బట్టి కాని రాసిన బ్లాగరు, అతడి ఆస్థిపాస్థులు, పేరుప్రఖ్యాతులు కావు. ఈ విషయంలో ఆగ్రిగేటర్ల నిర్వాహకులు ఏదైనా పరిష్కారం చూపగలరా??



చాలా మంది బ్లాగ్లోకంలో గ్రూపులు ఉన్నాయి అనుకుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. ఒకే సమయంలో బ్లాగులు మొదలెట్టినవారు బహుశా ఒకే దగ్గర కనిపిస్తారేమో. లేదా వారి చొరవ బట్టి ఆయా బ్లాగులలో కామెంట్ల రూపంలో చర్చిస్తారేమో. మాకు అందులో చోటు ఉండదేమో అనుకోవద్దు. మీరు ఆ చర్చలో పాల్గొనండి. మీరు ఆ గుంపులో కలిసిపోండి. అదీ మీకు నచ్చితేనే.. కొత్త బ్లాగర్లు కాని, పాత బ్లాగర్లు కాని సీనియర్లు, జూనియర్లు అనేది బ్లాగ్ అనుభవం బట్టే ఉంటుంది. ఇప్పుడు జూనియర్లు , మూడు నెలల తర్వాత వచ్చేవారికి సీనియర్లే కదా. బ్లాగర్ల సహాయం కోసం బ్లాగ్ గుంపు ఉండనే ఉంది. అలాగే మహిళా బ్లాగర్ల కోసం ప్రమదావనం. సంకోచించకుండా, మొహమాటపడకుండా తెలీని విషయాలు అడగొచ్చు. అందరూ కాకున్నా కొందరైనా మీకు తప్పకుండా సహాయమందిస్తారు. ఎవరూ అన్ని నేర్చుకుని పుట్టలేదు కదా.



కొత్త బ్లాగర్లకు కొన్ని సలహాలు , చిట్కాలు..



కొత్తగా తెలుగులో బ్లాగు మొదలెట్టారు సంతోషం. మంచి పేరు సెలెక్ట్ చేసుకుని బ్లాగు మొదలెట్టాక కూడలి, జల్లెడలో చేర్చండి. ముందుగా మీరు ఏం రాయాలనుకున్నారో అది నిర్ధారించుకోండి. దాని మీద కాస్త హోం వర్క్ చేయండి. ఏదొ రాసి పడేసాం అన్నట్టు కాకుండా. బాగా రాసినట్టు ఉండాలి. తర్వాత దానిని పద్ధటి ప్రకారం, అంటే అర్ధం పర్ధం లేని నేటి సినిమా పాటల్లా కాకుండా సరియైన రీతిలొ introduction, main content, ending ఇలా ... మీ టపాకు తగిన చిత్రం గూగులమ్మని అడిగి చూడండి. అది కూడా పెడితే మీ టపాకి మరికాస్త అందమొస్తుంది. బరువు కూడా పెరుగుతుంది కూడా.. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ... మీ బ్లాగులో అనవసర చెత్త చేరకుండా అనానిమస్ వ్యాఖ్యలు అనుమతించకండి. లేదా కామెంట్ మాడరేషన్ పెట్టుకోండి. తర్వాత కామెంట్ రాసినవారికి వచ్చే అడ్డంకి వర్డ్ వెరిఫికేషన్. అది తీసేయండి. లేదా తర్వాతి టపాలో మీ బ్లాగులో వ్యాఖ్య రాయడానికి అందరికీ చికాకే .. ఇక మీ బ్లాగులు గుర్తింపు రావాలి, అందరికీ తెలియాలి , అందరూ మీ బ్లాగుకు రావాలంటే ఎలా మరి. ఇక్కడ ప్రకటనలు గట్రా పనికిరావే.. ఈ పని మీ చేతిలోనే ఉంది. అన్ని బ్లాగులకు లేదా వీలైనన్ని ఎక్కువ బ్లాగులకు వెళ్లండి. చదవండి, మీ స్పందన తెలపండి. ఆ కామెంట్లతో ఎవరా ఈ వ్యక్తి అని కొందరైనా మీ బ్లాగులు తప్పకుండా వస్తారు. అంటే ముందు మీ గురించి అందరికి కాస్తో కూస్తొ పరిచయం చేయాలన్నమాట. తర్వాత వాళ్లే మీ బ్లాగుకు తప్పకుండా వచ్చి మీ టపా చదువుతారు.నచ్చిందంటే సరే లేకపోతే విమర్శించినా అంగీకరించండి. ఎందుకంటే విమర్శ అనేది ... వేషం మార్చుకుని వచ్చిన ప్రశంస లాంటిది.. వాటివల్లే మీలోని చిన్న చిన్న తప్పులు దిద్దుకొని మెరుగుపరుచుకునే వీలుంటుంది. ఏదో ఒక విషయం మీద రాయలనే అత్యుత్సాహం అందరికీ ఉంటుంది కాదనను. కాని కాస్త మీ బ్లాగు టపా చదివేవారి సంగతి కూడా కాస్త ఆలోచించండి. వారికి చదివి స్పందించడానికి టైమివ్వాలి కదా. రోజూ రాస్తున్నాం, రోజూ కామెంటండి అంటే కష్టమే మరి. ఎవరి పనులు వారికుంటాయి. కామెంట్లు మాకెందుకు అంటారా?? కనీసం టపా చదివే టైం కావాలా వద్దా?? ఒక రోజు మిస్ అయ్యామని వెనక్కి వెళ్లే ఓపిక ఎంతమందికుంటుంది. ఆలోచించండి. సో.. వారానికి మూడు లేదా నాలుగు టపాలు ఓకే.. ఇక కొన్ని బ్లాగులలో విపరీతమైన వాదనలు జరుగుతాయి. అవి అంతగా పట్టించుకోవద్దు. చర్చించుకోవడం మంచిదే. కాని అది వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒకరిని నిందిన్చనతవరకు , అభ్యంతరకరమైన రాతలు రాయనంతవరకు ఎవరి బ్లాగుకు వారే సుమన్, వారే దుష్మన్ కూడా.. మీకు ఇష్టమైనది రాసుకోవచ్చు. వేరే బ్లాగులో మీకు నచ్చింది ఉంటే చదవండి. కామెంటండి , నచ్చకుంటే వదిలేయండి. మళ్ళీ ఆ బ్లాగు తెరవొద్దు. ఇక్కడ ఎవరు ఎవరిని నిర్దేశించడం లేదు. ఎవరి రాతలు వారివే. ఎవరి కామెంట్లు వారివే. ఎవరి విజిటర్స్ వారివే.. అది గుర్తుంచుకుంటే చాలు. టెన్షన్ ఉండదు ఎవరికైనా..


ఇది నా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది..


31 వ్యాఖ్యలు:

amma odi

మీ టపా బాగుంది.

హరే కృష్ణ

jyothi gaaru..baaga chepparu dhanyavadhamulu

Icanoclast

"విమర్శ అనేది ... వేషం మార్చుకుని వచ్చిన ప్రశంస లాంటిది.."
ఎంత చక్కటి మాట!

జ్యోతి

సాంకేతిక కారణాల వల్ల మరువం ఉషగారు ఇక్కడ రాయలేకపోయిన వ్యాఖ్య..

అనుభవం చెప్పే పాఠాలు, మాటలు అమృతతుల్యం. గమనార్హమైనవెన్నో నుడివారు. ముదావహం. నిజానికి "ప్రశంస పన్నీరు వంటిది అది చల్లుకోవటానికే కానీ తాగటానికి కాదు" అన్న సత్యాన్ని అవగాహనలో వుంచుకుంటే మన దాహార్తి కేవలం మన స్పందనలు, వాటి వ్యక్తీకరణలలోనే తీరుతుంది, తృప్తిని మిగులుస్తుంది అని తోచవచ్చు. అయినా కూడా ఏ పయనంలోనైనా తోటి బాటసారుల సాంగత్యం, మజిలిలో కలబోసుకుని, నెమరేసుకునే మిత్రత్వం - వీటికి ఏవీ సాటి రావు, అంచేతనే టపాకి వ్యాఖ్యలకి సాహితి మిత్రత్వం తప్పనిసరి.

Kathi Mahesh Kumar

హ్మ్మ్. ఆలోచించాల్సిందే!

Anonymous

"విమర్శ అనేది ... వేషం మార్చుకుని వచ్చిన ప్రశంస లాంటిది..
"జ్యోతిగారు...జోహార్లు!!
చాలా విపులంగా వివరించారండి!!

Unknown

ఇతర మిత్రుల పరిస్థితి ఏమిటో తెలియదు కానీ మేగజైన్, ఫోరమ్ బిజీల వల్ల నాలుగు నెలలు బ్లాగులకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇటీవల కూడలి వైపు తొంగిచూస్తుంటే కొన్ని బ్లాగుల నుండి రోజులు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న పోస్టుల ఉధృతిని చూసి చదవాలన్న ఆసక్తీ చచ్చిపోతోంది, ఇక రాయాలన్న ఉత్సుకత సంగతి దేముడికెరుక. ఎవరికివారు ఒక రోజుకి రాసే పోస్టుల విషయంలో పరిమితి విధించుకోకుంటే చాలా కష్టం. ఇతరులు చెప్తే అర్థమయ్యేది కాదు, తమకుతాము అర్థం చేసుకోవలసిన విషయమిది.

శరత్ కాలమ్

Kondariki hitloo, Alexa rankingulu maatrame pradhaanam. Meeru cheppinatlu pratirojoo anni tapaalanu oke tapaagaa veste vaariki anni hitlu raavu, Alexa raankoo peragadu! Mari vaariki meeru soochince parishkaaram?

(Copy& Paste enduko panicheyakapovadam valla ilaa Tenglish lo vraastunnaanu)

జ్యోతి

శరత్ గారు,

అమెరికా వాళ్లకి ఇవాళ ఇదే సమస్య వస్తుందేంటి..
అసలు ఒకేరోజు అన్ని టపాలు రాస్తే నిజంగా ప్రతి టపాకు అంతమంది వస్తున్నారనుకోను. తెలిసినవాళ్లు, లేదా ఎవరికి వారే అయ్యుండొచ్చుగా. వర్డ్ ప్రెస్ లో మన నంబర్ మన బ్లాగులో లెక్కింపబడదు, బ్లాగర్ లో అలా కాదు. ఈ హిట్లు, ర్యాంకింగులవల్ల పేరు వస్తుందా?? ఆదాయం వస్తుందా?? రాదనుకుంటాను.. ఎక్కువ టపాలకన్నా కూడా కంటెంట్ ఉంటే ఒక్క టపాకి కూడా హిట్లు ఉంటాయి..

మాలతి

అవునండి, ఏదో రాసేయాలీ, పోస్ట్ చేసేయాలి అని కాక అనేక కోణాలు ఆలోచించుకుని పరిశీలించుకుని, మనరాతలకి మనమే మొదటి విమర్శకిలమై ప్రచురించిన టపాలకి మంచి ఆదరణ వుంటుందనుకుంటాను. మంచి టపా!

Shiva Bandaru

గూగిలమ్మ నుంచి చిత్రాలు సేకరించేడప్పుడూ కాపీరైట్ నిబందనలు గుర్తుపెట్టుకోవాలి. వీలైనంతవరకు GPL/CC పద్దతిలో ఉన్న ఇమేజీలనే ఉపయోగించడం మంచిది.

శరత్ కాలమ్

Edo virus valla Copy & Paste samasya vastondi anukuntunnanau. Choodaali.

Aadaayam emogaani vaallaki peru maatram baagaa vastondandi - meeku teliyadaa? Chaalaa comedy vrastunnaarani chalaamandi vaariki abhimaanulu, veeraabhimaanulu ayipoyaaru. Jeedipappu, Prasaad, nenu vaariki veeraabhimaanulamu. Oka abhimaana sangham koodaa nelakolpaalani anukuntunnaanu. Intaloke meeru ilaa vaariki salahaalu icchi maa entertainment chedagottadam meeku bhaavyamaa cheppandi? Vaari palu tapaalu chadivite vacchinanta aanandam oke tapaato vastundaa cheppandi? Meeru ennayinaa cheppandi - Maa abhimaana blaagu rachayitalaku quality mukhyam kaadu - quantity ne mukhyam!

జాహ్నవి

vimarsa anedi maro roopam lo vunna prasamsa laantidi.

mee blog ki meere suman

ee dialogues adurs mam.

meerichina soochanalaki dhanyavaadamulu.

-Jahnavi
http://www.jaahnavi.blogspot.com

teresa

బాగా చెప్పారు.

జీడిపప్పు

చాలా చక్కగా చెప్పారు జ్యోతిగారు. మీ పోస్టు చూసి నేను వేసిన పోస్టు చూడండి.
http://jeedipappu.blogspot.com/2009/05/blog-post_29.html

oremuna

We write for our blogs, not for aggregators.

సుజాత వేల్పూరి

మంచి టపా జ్యోతి గారు!

"విమర్శ అనేది ... వేషం మార్చుకుని వచ్చిన ప్రశంస లాంటిది. చాలా బాగుందీ మాట.

ఉషగారి వ్యాఖ్య..అయినా కూడా ఏ పయనంలోనైనా తోటి బాటసారుల సాంగత్యం, మజిలిలో కలబోసుకుని, నెమరేసుకునే మిత్రత్వం - వీటికి ఏవీ సాటి రావు...ఉషా, టోపీ తీసేశాం!

Kathi Mahesh Kumar

ఒరేమునా గారితో నేను ఏకీభవిస్తాను. మన బ్లాగులో మనం రాసుకోవడం మానేసి కూడలిని రెగ్యులేట్ చెయ్యాలని అనుకోవడం ఎందుకు?

జ్యోతి

మహేశ్ కుమార్ గారు,

ఇక్కడ సమస్య కూడలిని రెగ్యులేట్ చేయడం కాదు. రోజుకు ఒకే బ్లాగునుండి ఎక్కువ టపాలు ... దానిని నియంత్రించడం సదరు బ్లాగర్లమీదే ఉంది. అలా చేయనపుడు అగ్రిగేటర్లు ఏదైనా పరిష్కారం చూపగలరా అని. ఇది అందరు బ్లాగర్లు ఎదుర్కోంటున్న ఇబ్బంది కదా..

Kathi Mahesh Kumar

@జ్యోతి: మీ టపా ఉద్దేశాన్ని తప్పుబట్టడం లేదు. చర్చలో వస్తున్న కూడలి విషయం గురించి నా వ్యాఖ్య.

విశ్వక్శేనుడు

థాక్స్ అండి, నా లాంటి కొత్త బ్లాగర్లకి మీ సలహాలు చాలా ఉపయోగకరం

హను

తెలుగు బ్లాగర్లలొ నా బ్లాగు ఎలా కలపాలి, కొంచం చెప్పండి, నాకు అక్కడ బ్లాగు చేర్చండి దగ్గర కొట్టినా కూడా నా బ్లాగు ఏడ్ అవ్వటం లేదు

Praveen Mandangi

జ్యోతి గారూ, మీరు ఆడవారు అయ్యుండీ బూతు పురాణకర్త శరత్ ని ఎలా నమ్ముతున్నారు? ఈ టపా చదవండి: http://telugu-blog.pkmct.net/2009/06/blog-post_6107.html అతని బూతు బ్లాగులకి పాపులారిటీ తగ్గిపోయిందని ఆరోపణలు చేస్తున్నాడు.

విశ్వక్శేనుడు

@ప్రవీన్ గారు
నేను ఇప్పటికే మీ బ్లాగ్లో వ్రాశాను. శరత్ ఎలాంటి రచయితో నాకు తెలియదు గాని బూతు అన్నమాటకి విమర్శ పేరుతో మీరు వాడడమే ఎక్కువగా వుంది. ఇక్కడ మీరు ఇచ్చిన లింక్ అవసరమా. అసలు ఈ టపాకి, శరత్ కామెంట్ కి, మిగిలిన చర్చ కి మీ కామెంట్ కి దాంట్లో లింక్ కి ఏమన్నా అసలేమన్నా సంభందం వుందా. ఐనా శరత్ గారి కామేంట్ కి జ్యొతి గారు రిప్లై మాత్రమే వ్రాశారు. దానికి నమ్మడానికి సంభంధం ఏంటి అసలు. మీరు మీ టపాలు మాత్రమే కాదు కమెంట్స్ కూడా చూసుకొని, ఆలొచించుకొని వ్రావలసినది గా మనవి.
ఈ బ్లాగ్ లో చిన్నవాడినైన(వయస్సులో, అనుభవంలో, బ్లాగింగ్ లో కూడా) మీ అసంబధ్ధమైన కమెంట్ కి ఇలా అసంబధ్ధమైన కమెంట్ ద్వార సమధానం చెప్పడం తప్పే ఐనా తప్పలేదు.

ఫెద్దలు ధయచేసి నన్ను క్షమించండి.
జ్యోతి గారు మీకు మరీ మరీ క్షమాపనలు

Praveen Mandangi

కామెంట్లు రాకపోయినా ఫర్వా లేదు. నాగ ప్రసాద్ గారు పెట్టిన http://scienceintelugu.blogspot.com బ్లాగ్ కి కామెంట్లు తక్కువగానే వచ్చాయి. విజ్ఞానానికి సంబంధించిన విషయాలని కామెంట్ల కొలమానంతో చూడకూడదు. తెలుగులో సైన్స్ వెబ్ సైట్లు తక్కువగా ఉన్నాయి కనుక నేను కూడా http://science.teluguwebmedia.net అనే వెబ్ సైట్ పెట్టాను. ఈ వెబ్ సైట్ నిర్వాహణ వల్ల నాకు ఆదాయమేమీ రాదు. జార్జియా డేటా సెంటర్ లో ఉన్న నా సర్వర్ కి bandwidth ఖర్చు పెరుగుతుంది. కూడలికి సబ్మిట్ చెయ్యని తెలుగు బ్లాగులు కూడా ఉన్నాయి. విషయం రిలవెంట్ గా ఉంటే search engines నుంచి కూడా మన బ్లాగులకి వీక్షకులు వస్తారు. 2008లో నాకు కూడలి గురించి తెలియదు. అప్పట్లో నా వెబ్ సైట్లకి search engines నుంచే వీక్షకులు వచ్చేవారు.

జ్యోతి

ప్రవీణ్ గారు,
నేను శరత్ గారిని ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. నా బ్లాగులో కామెంటుకు సమాధానం ఇచ్చాను. అంతమాత్రాన ఆయనను, ఆయన రాతలను నేను సమర్ధించినట్టు ఎలా అవుతుంది. గతంలో శరత్ గారి బ్లాగు విషయంలో జరిగిన గొడవలో నేను కూడా విమర్శించాను. కావాలంటే అడగండి. ఈ టపాలో ఎన్నో విషయాలు ప్రస్తావించాను. అందులో ఈ మల్టిపుల్ టపాలు. దీనివలన కూడలిని దర్శించేవారందరికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాను. గతంలో నేను రోజుకు 20 టపాలు కూడా రాసాను. కాని అవి గీతలహరి, షడ్రుచులు లో. మెయిన్ బ్లాగు, నైమిశారణ్యం మాత్రమే కూడలి మొదటి పేజీలో వస్తాయి. మిగతావన్నీ సేకరణలులోఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. మీరు కూడా అందరి గురించి ఆలోచించండి..

మరువం ఉష

సుజాత, జీడిపప్పు గారి వ్యాఖ్య వలన మళ్ళీ తొంగి చూడ్డంతో మీ మాట చదివాను. "ఉషా, టోపీ తీసేశాం!" ముదావహం, సఖీ, ;) [ముదావహంకి అదే తగిన పిలుపని వాడేసా...]

కాలనేమి

"We write for our blogs, not for aggregators."

To make that statement meaningful, "remove it from the aggregator, and it wouldn't make any difference!"

Praveen Mandangi

నేను కొత్త ప్లానెట్ డిజైన్ చేసి అందులో పేజికి వంద పోస్టులు కనిపించేలా సెట్టింగ్ పెట్టాను. http://blaaglokam.net అందులో మీకు నచ్చిన బ్లాగ్ కనిపించకపోతే ఆ బ్లాగర్ యొక్క పోస్టుల సెక్షన్ లోకి వెళ్ళి అతని/ఆమె పోస్టులు చూడొచ్చు. అలా కూడా ఏర్పాటు చేశాను.

Vinay Datta

Pls ask Veeven garu to inclide new blog names for a short period in a special column. That will enable us to read it and welcome the blogger.

DARPANAM

జ్యోతి గారూ,
మీ సూచనలే కాదు టపా లోని ప్రతి వాక్యమూ
అర్ధవంతంగా ఉన్నాయి.ముఖ్యంగా "విమర్శ అనేది ....."
చాలా బాగుంది

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008