మరో ప్రస్థానానికి సాదర ఆహ్వానం ...
అంతర్జాలంతో పరిచయం చేసుకుని నాకిష్టమైన తెలుగు కోసం వెతుకుతూ సరిగ్గా మూడేళ్ళ క్రింద తెలుగు బ్లాగు గుంపులో చేరాను. ఊరికే అల్లరిగా ఉండే నన్ను వేదించి బ్లాగు తెరిచేలా చేసారు.. అలా మొదలైన బ్లాగు ప్రయాణం మొదటి నెలలో వంటల బ్లాగు మొదలెట్టేలా సాగింది. జాలంలో ఎంత గాలించినా తెలుగులో వంటలు కనపడలేదు. మనమే ఎందుకు మొదలెట్టకూడదు అన్న ఆలోచన షడ్రుచులు బ్లాగుకు అంకురం వేసింది. అది అలా మొక్కలా ఎదిగి చెట్టులా మారింది . ఆ క్రమంలో నా అభిరుచులన్నీ బ్లాగులుగా చేసుకుని రాసుకుంటున్నాను. అందులో కొన్ని ఎంతో మందికి ఉపయోగకరంగా మారాయని తెలిసి సంతోషించాను. ఈ బ్లాగు ప్రపంచం నుండి మరో ప్రస్తానం వైపు అడుగువేయాలనే కోరికతో గత నెలలో అక్షయతృతీయ నాడే అంకురార్పణ జరిగినా బాలారిష్టాలు దాటుకుని వచ్చేసరికి ఇంతకాలమైంది. షడ్రుచులు పేరుతో వెబ్సైట్ మొదలు పెట్టాను. జాలంలో మొదటి తెలుగులో వంటల బ్లాగు, అలాగే వంటల వెబ్సైట్ నేనే మొదలుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సైట్ పనులు ఎవరితో అయినా చేయించుకోవచ్చు. డబ్బులిస్తే ఎంతో మంది చేస్తారు. ఇవ్వకున్నా చేస్తారనుకోండి. కాని మన పప్పు మనమే ఉడకేసుకోవాలి. అప్పుడే ఈ దినుసులు ఎంత పాళ్ళలో వేయాలో మనకే తెలుస్తూంది. అలా ఒక్కోటి తెలుసుకుంటూ, నేర్చుకుని ఈ సైట్ ని అలంకరించుకునే సరికి ఇప్పటికి ఈమాత్రమైనా తయారైంది. ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. సాంకేతిక నిపుణులు ఐతే గంటలో చేసుకోగలరు. కాని ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి ల తో ఆటలాడే నేను ఈ css, html, FTP, వగైరా చేయాలంటే కష్టమే కదా. అందుకే అన్నమాట. పూర్తి స్థాయిలో నిలదొక్కుకునేవరకు కాస్త సహకరించండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, మార్పులు , చేర్పులు చెప్తారు కదూ .. ముందుగా అందరూ నోరు తీపి చేసుకోండి.
ఈ దుర్గ నిర్మాణంలో సహకరించి, ప్రోత్సహించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
పదండి మరి షడ్రుచులు ప్రయాణానికి. http://shadruchulu.com/
20 వ్యాఖ్యలు:
స్వంత డొమైన్ ప్రారంభించిన సందర్భంగా మీకు అభినందనలు.
FTP ఉపయోగించడం కష్టమేమీ కాదు. HTML కూడా సులభంగా ఎడిట్ చెయ్యొచ్చు. మీరు విండోస్ వాడుతున్నట్టు అయితే Pagebreeze ఎడిటర్ ఇన్స్టాల్ చెయ్యండి. ఆ సాఫ్ట్ వేర్ ఆన్లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నేను వాడేది లినక్స్ Bluefish ఎడిటర్.
స్వంత వెబ్సైట్ ప్రారంభించినందుకు అభినందనములు.
ఇంక రోజూ యిది చూసి షడ్రుచులతో చేయమంటరేమో! మా శ్రీవారు .
ప్రవీణ్ గారు,
మీకో పెద్ద నమస్కారం. ఇప్పటికే నా బుర్ర వాచిపోయింది. ఇంకా కొత్త విధానాలా.. కాని థాంక్స్..
సూర్యలక్ష్మిగారు,
మీకు రాని వంటలా??? వెరైటీగా మీవారినే నేర్చుకోమనండి.:)... కాని ఇంతకు ముందే షడ్రుచులు బ్లాగు ఉందిగా.. మీరు చూడలేదా...
అభినందనలు మరియూ శుభాకాంక్షలు.
బైదవే, ప్రస్థానం అంటేనే ప్రయాణం అనుకుంటా.
కొత్తపాళీగారు,
థాంక్స్ .. అవును కదా.. :)...
Pagebreeze వల్ల HTML ఎడిటింగ్ సులభమవుతుంది. అందుకే అది సజెస్ట్ చేశాను. డౌన్ లోడ్ చేసి ప్రయత్నించండి. నేను వాడే Bluefish ఎడిటర్ కంటే Pagebreeze వాడడం సులభమే. C ప్రోగ్రామింగ్ సౌలభ్యం కోసం Bluefish వాడుతుంటాను, అంతే.
అభినందనలు. శుభాకాంక్షలు కూడా!!
అభినందనలు, శుభాకాంక్షలు. మీ మరో ప్రస్థానం మజిలి మజిలిలో మంచి మలుపులు తిరుగుతూ సాఫీగా సాగిపోవాలని ఆశిస్తున్నాను.
శుభాకాంక్షలు . మీ సైటు తెరిస్తే నా అవాస్ట్ ,HTML Iframe వైరస్ అని హెచ్చరిస్తుంది . నాకొక్కడికే ఇలా వస్తుందా?.
శివగారు, గంట క్రింద స్కాన్ చేస్తే వైరస్ ఉండింది. తీసేసాను, ఇప్పుడు కూడా చెక్ చేసాను. వైరస్ లేదు మరి..
ఐతే ఈ సారి నేను చందనా బ్రదర్స్ దగ్గర ఏనిమిది చేతుల జ్యొతి ని వెతుక్కోవాలేమో!
అభినందనలు.
Happy for you :)
హెంతన్నాయం? హెంతాలస్యం?
ఇక పరిగెట్టండి. శుభం భూయాత్.
congratualtions!!
great going jyothi garu.
జ్యొతి గారు, అభినందనలు,శుభాకాంక్షలు..
అభినందనలు.
కొత్త సొంత డొమైన్ సందర్భంగా అభినందనలు.
ఎలాగూ సలహా అదిగారు కబట్టి,
అసలు ఉచిత సలహాలు ఇవ్వడం లో మనం వోల్ మొత్తం అంధ్రా ఫస్ట్, సలహా ఎంటంటే మీరు చెసే సారీ వ్రాసే వంటలలొ నా లాంటి బాచిలర్స్ కి అందునా విదేశాలలో ఉండే వాళ్ళకి సులభం గా ఉండే విధం గా కొన్ని వ్రాయమని మనవి.
అందరికి ధన్యవాదాలు..
విష్వక్సేనుడు గారు, హమ్మయ్య మీరైనా సలహా ఇచ్చారు. కాని ఒక్క సవరణ: ఇక్కడ నేను చేసి, వ్రాస్తున్నానండి.. ఇక నాకు బద్ధకం ఎక్కువ. ఓపిక తక్కువ. ఏదైనా త్వరగా ఐపోవాలంటాను. అందుకే నా వంటలన్నీ తక్కువ దినుసులు, త్వరగా, సులువుగా ఐపోయేలా ఉంటాయన్నమాట.
జ్యోతి గారి కొత్త వెబ్ సైట్ చూసిన తరువాత నేను కూడా ఇంటి పెరటిలో కూరగాయల మొక్కలు పెంచడం పై కాన్సెంట్రేషన్ పెంచాను. I like vegetarian cuisine.
Post a Comment