Thursday, July 9, 2009

రాగం
ప్రకృతి లో ఎన్నో రంగులు.. హంగులు.. దానిని ఆస్వాదించి , అనుభవించి, ఆనందిస్తాం మనం. కాని కొందరికి ఆ అవకాశం ఉండదు. అలాంటి వారు నిర్భాగ్యులు అవుతారా? లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని వెలికి తీయాలి. మన చుట్టూ ఎంతో మంది ఆదరణ లేక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారికి సహాయం అందించి చేయూత నివ్వడం మానవ ధర్మం.

వికలాంగులు, విధివంచితులు అయిన వారికి ఆర్ధిక సహాయం, విద్య, మరియు కనీస అవసరాల కోసం సహాయఫౌండేషన్ పని చేస్తుంది. ఎయిడ్స్ బాధిత పిల్లలు, వృద్ధాశ్రమాలకు ఆర్ధిక సహాయం, మొదలైన కార్యక్రమాలు ఉత్సాహవంతులైన సభ్యులతో క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తుంది. కొందరు అంధులు మరియు వికలాంగులైనవారి ఉన్న వివిధ రకాల కళల ను నైపుణ్యాలను అందరికి తెలియచేయాలనే ఉద్దేశం తో మరియు వారి ఉన్నత విద్య ఇతర అవసరాలకు సహకరించే ఉద్దేశం తో సహాయ ఫౌండేషన్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిన్స్తుంది. అందులో భాగంగా గత సంవత్సరం హృదయ స్పందన అనే సంగీత కార్యక్రమం విజయవంతంగా ఏర్పాటు చేయడమైనది. ఎవరన్నారు ఈ పిల్లలు విధి వంచితులు అసహాయులు అని. కాని దేవుడు చూపు తప్ప వారికి అన్నీ ఇచ్చాడనిపిస్తుంది ఆ కార్యక్రమానికి హాజరైనవారికి. దాని వివరాలు ఇక్కడ చూడవచ్చు.

http://picasaweb.google.co.uk/sahaayafoundation412/HrudayaSpandanaGr8AchievementOfSahaaya#


అదే స్ఫూర్తితో వారిని ప్రోత్సహించడానికి, మరింత మందికి సహాయం చేయడానికి నిధులకోసం, రెండవ వార్షికోత్సవ సందర్భంగా మరో సంగీత కార్యక్రమం "రాగం"((A Cultural Program by Differently able People) ఏర్పాటు చేయబడింది.


వేదిక : హరిహర కళా భవన్,పాట్నీ సెంటర్, సికింద్రాబాద్.
తేది : 08-08-2009.
సమయం: 6.30 pm - 9.30 pm .

దయచేసి మీయొక్క సహాయ సహకారాలు వారికీ అందించి మరియు కార్యక్రమానికి హాజరై వారిని ఉత్సాహపరచండి.

రాలేని వారు కూడా టిక్కట్లు కొని వారికి సహాయ పడవచ్చు.

టికెట్ల ధరలు: Rs. 100/-, Rs. 200/-, Rs. 500/-, Rs. 1000/-.

టిక్కెట్ల కోసం మరియు ఇతర వివరాలకు సంప్రదించండి.

బాలాజీ :9848494254
బాలచంద్ర :9989057887
పవన్:9949041682
సూర్య తేజ:9703670771
ప్రణీత్: 9701199515
శ్రీనివాస్ : 9177093999

మీరు టిక్కట్లు కొనలేక పోవచ్చు , రాలేక పోవచ్చు కాని ఈ మెసేజ్ ని మరింతమందికి తెలియచేసి పరోక్ష సాయం చేయండి. ఒక సాయంత్రం ఆ పిల్లల కోసం కేటాయించండి. వారిని ఆదరించి, ఆదుకోండి... ఆత్మసంతృప్తి పొందండి.

7 వ్యాఖ్యలు:

Srujana Ramanujan

Very nice gesture.

నందు

మందాకిని గారూ ఆఖరులో ఒక అచ్చుతప్పు ఉందండోయ్..."ఆదుకోండి" అనటానికి బదులు "ఆడుకోండి" అన్నారు. ఏదేమైనా ఒక మంచి మాట చెప్పారు సంతోషం. పది మందికీ చేరవేస్తాను.

కెక్యూబ్ వర్మ

tappakumDaa. meekunna concern ku hats off.

పరిమళం

మంచివిషయం తెలియచేశారు జ్యోతిగారూ !

గీతాచార్య

Sure. Sure.

చైతన్య

thanks for promoting it!

lalita

జ్యోతిగారు,

వారు చక్కటి ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వారిని తప్పక ప్రోత్సహించాలి. నాకు చేతనైనంతవరకు నేనూ వారిని కలవడానికి ప్రయత్నిస్తాను.
lalita

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008