Sunday, 12 July 2009

అద్భుత భావగీతం

సంగీతం అంటే ఒక ధ్వని, నాదం మాత్రమేనా. ఒక పాట మన మనసు లోతులను కదిలించి స్పందించేలా చేస్తుంది అంటే దానికి కారణం ఆ పాట సంగీతం, అందులోని సాహిత్యం. గాయకుడి గానామృతం. మన సినిమా పాటలలో నాకు నచ్చినవి మనసుకు హత్తుకునే తక్కువే . ఎన్నో సార్లు ఆలోచించాను. నాకు ఈ కారణాల చేత ఇవి నన్ను ఇంతగా కదిలించాయి అని. ఖచ్చితంగా అది సంగీతం, ఆ పాటలోని పదాల అల్లిక, అలాగే గాయకుడి స్వర మాధుర్యం. ఈ క్రమంలో నటీనటులు గురించి ప్రస్తావన రాదు. నా విషయానికొస్తే పాటలు చూడడం కంటే వినడమే ఇష్టపడతాను. ఒక్కోసారి కొన్ని పాటలు మనలోని బాధను చల్లపరిచి ఆహ్లాదానిస్తాయి. ఆ పాటలలోని అందమైన పదాల అమరిక మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఎన్నో సందేహాలను పరిష్కరిస్తుంది. ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది కూడా. అలాంటి ఒక పాట సిరివెన్నెల చిత్రంలోని విరించినై .. ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అలా అని నేను సిరివెన్నెల గారి అభిమానిని అనలేను. ఆ పాట రాసింది, పాడింది ఎవరైనా సరే. ఎంతో కాలంగా ప్రయత్నించి ఇప్పటికి ఆ పాట అర్ధాన్ని తెలుసుకోగలిగాను.
ఆ విశేషాలు నా బ్లాగులో దాచుకుని , మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

విరించినై విరచించితిని ఈ గీతం
చిత్రం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం :



విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం!
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం!
కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా

విరించినై

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే

విరించినై

నా వుచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సర సస్వర సుర ఝరీగమనమౌ


విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క
తలపున = ఊహలో
ప్రభవించినది = మెరిసినది
అనాది = మొదలు లేని
జీవన వేదం = సృష్టికి మూలమైన వేదం (సృష్టే వేదం, వేదమే సృష్టి)
ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో
స్పందన నొసగిన = ప్రాణాన్ని తట్టి లేపిన
ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము
కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే
ప్రతిబింబించిన = కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం = సృష్టి యొక్క రూప ఆవిష్కరణ
ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో
ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన
విరించి = బ్రహ్మ యొక్క
విపంచి = వీణ
గానం = సంగీతం

సరస = రసముతో కూడిన( నవరసాల రసం )
స్వర = సంగీత స్వరం (, రి )
సురఝరీ = దేవనది, గంగ
గమనమౌ = ప్రవాహము ఐనట్టి
సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది

నే పాడిన జీవన గీతం గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం


విరించినై = నేనే బ్రహ్మనై
విరచించితిని = రచించితిని
ఈ కవనం = ఈ కవిత్వం
విపంచినై = వీణనై
వినిపించితిని = వినిపిస్తున్నా
ఈ గీతం - ఈ పాట

విరించినై...

ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద
దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ
జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు
వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద
పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు
స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట
జగతికి = ప్రపంచానికి , విశ్వానికి

శ్రీకారము కాగా = మొదలు కాగా
విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి

ఇది భాష్యముగా = వివరణగా
విరించినై...


జనించు = పుట్టిన

ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన
జీవన నాద తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల
చేతన = చైతన్యం, అచ్తివషన్

స్పందన = reverberation, రేసోనన్స్

ధ్వనించు = శబ్దం
హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.

అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న
ఆది తాళం = ఆది తాళం
అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా

సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం

విరించినై...

నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి
కవనం = కవిత్వం
నా నిశ్వాసం = వదిలే ఊపిరి,గాలి
గానం = పాట


ఎంత అద్భుతమైన భావం కలిగిన పాట ఇది.

21 వ్యాఖ్యలు:

Padmarpita

నాకూ చాలా ఇష్టమైన పాట...

జాహ్నవి

ardam teliyakapoyina ee patani ishtapadevaallu chaala mandi vuntaaru. ee pataki poorti ardam naaku teliyadu intavarakoo. but ee pata naaku full gaa vachu.

thanks for u r pratipadaardam

గీతాచార్య

తెలుగు ప్రజల మనసుల పైన సిరివెన్నెలజల్లులు కురిపించిన ఈ పాటని ఇష్టపడని వారెవరు? అసలు ఈ పాట స్క్రోలింగ్ కోసమే నేను మీ బ్లాగుకి వచ్చేఆడిని మొదట్లో. :-)

రాజు జీవించు రాతి బొమ్మలలోన, సుకవి జీవించు ప్రజల నాల్కలపైన! అని పెద్దలంటారు.

పాటలోని పదాల భావం అర్థ్ద్ం అయినా కాకపోయినా, ఆ పదాల సౌందర్యానికే ముగ్ధులమవుతాము. చాల తేలికగా పాడుకునే విధంగా ఉండే ఈ పాట మనకు ఒక గొప్ప గీత రచయితని అందించింది.

Vinay Chakravarthi.Gogineni

recent ga ekkado chadivaanu elane explanation but u gave for toatal song excellent work........

Vinay Chakravarthi.Gogineni

swrnakamalam lo last song ki raayagalara..........

జ్యోతి

గీతాచార్య,

ఈ పాటను స్క్రోలింగ్ లో మారుద్దామని ఎన్నోసార్లు అనుకున్నా. కాని మనసు రాలేదు. నాకిష్టమైన ఎన్నో పాటలు ఉన్నా ఈ పాట అంటే మరీ ఇష్టం.

జాహ్నవి,వినయ్ గారు, ధాంక్స్ . మీరు చెప్పిన పాట కూడా ప్రయత్నిస్తాను.

పద్మగారు,
ఇష్టమైన పాటల పూర్తి అర్ధం తెలుసుకుంటేగాని వదలను. ఏదైనా ఆనందించాలంటే వాటిగురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే అవి సంపూర్ణమైన అనుభూతిని,ఆనందాన్నిస్తాయి...

Anonymous

jyothi garu mi blog chaala bavundi..shadruchulu annapoorna super andi

MIRCHY VARMA OKA MANCHI PILLODU

I like very much this song. chala santoshamu ga undi pata ardam teliyajesinaduku

Please watch my postings

జ్యోతి

Thanku varma garu,

i ll chek ur blog..

Shashank

1986 లో ఈ సినిమా విడుదలైనప్పుడు తిరుపతిలో మా పెద్దమ్మా వాళ్ళతో సెకండ్ షో కి వెళ్ళాను (అదే నన్ను తీసుకెళ్ళారు).. కొద్ది సేపు తర్వాత హయిగా పడుకున్నా.. కాని నాకు రెండే రెండు వాక్యాలు గుర్తుండేవట (మా అమ్మ చెప్పారు) "విధాత తలపున.." ఒకటి ఇంకోటి "జనించు ప్రతిశిసు " అని (రెండు సగం సగమే అదీ నాకిష్టం వచ్చిన పదాలతోలేండి). కొంచం పెద్దయ్యాక, నాకు బాగా గుర్తు మనీ సినెమా విడుదలైన సమయంలో మళ్ళా ఈ పాట గురించి వెతికా. అప్పుడు ఈ పాటని అర్థం చేసుకోవాలని చాలా కష్టపడ్డా. మా తాత గారి "శబ్ధార్థచంద్రిక" ముందేసుకొని ప్రతి పదానికి అర్థం వెతికి రాసుకొని వాక్యం అర్థం చేసుకొని పాటని జీర్నించుకున్నా. ఈ పాట ప్రభావమే నా బ్లాగు కి ఆ పేరు.

మీ ఈ టపా చూస్తే అదే గుర్తొచ్చింది. ధన్యవాదములండి అవ్వన్ని గుర్తుచేసినందుకు. :)

@వినయ్ - అందెల రవమిది పాటే కద నువ్వు అడిగింది?

Anonymous

జ్యోతిగారు,మావారికి చాలా ఇష్టమైన పాటండి ఇది.పెళ్లయిన కొత్తలో ఇలానే పాటలోని ప్రతి పదానికీ అర్ధం చెప్పారు నాకు.మళ్ళి ఆ జ్ఞాపకాలు మెదిలాయి ఈ పోస్టు చూస్తే..ధన్యవాదాలు.

sruti

good tase, please write about eee.. gali..eee nela from sirivennela, with u r tasty heart

జ్యోతి

Thanku trishna,,

sruti.. i ll try this song next time.. even tht song has lots of beautiful meaning which touches our hearts..

Sai Srujan

చాలా సంతోషం చాలా తేలికగా అర్థం అయ్యింది.
ధన్యవాదాలు

డా.ఆచార్య ఫణీంద్ర

ఇంత చక్కని గీతాన్ని రచించిన శాస్త్రిగారు ఒక్కచోట మాత్రం " ప్రాగ్దిశ వీణియ " అని దుష్ట సమాసాన్ని ప్రయోగించడంతో కాస్త చివుక్కుమంటుంది. " ప్రాగ్దిశ వీణకు పైన " అంటే సరిపోయేది. ఏమైనా తెలుగు చలనచిత్ర సాహిత్యంలో వేళ్ళ మీద లెక్కించదగ్గ మణి సదృశమైన గీతాలలో ఇది ఒకటి. చక్కని చిక్కని గీతాన్ని గుర్తు చేసినందుకు జ్యోతి గారికి ధన్యవాదాలు !

himajwala.blogspot.com

చాలా బాగా అర్ధం విడమరిచి చెప్పారు...

kalyan

chala super gaa undhi, nice thought

kalpa latika

superrrrrr jyothi gaaru....chalaa baga vivarinchaalu..chala thanks..chala manchi composition idi...kavitwaaniki sangeetaniki parakashta ee pata....wonderfull job...mee nundi elanti klishtamaina saahityam unna inkoni paatalaku ardhaalu yeduru chustu...
Uma Durga Prasad

వనజ తాతినేని/VanajaTatineni

జ్యోతి గారు ధన్యవాదములు. ఈ పాట సాహిత్యంకి అర్ధం తెలిసి వింటే కావ్యమృతంని సేవించినట్లే ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన పాట.

నేను నా బ్లాగ్ కి సిరివెన్నెల,చందమామ ఈ రెండు పేర్లు పెట్టాలని ప్రయత్నించినప్పుడు అవకాశం లేక ఇక నా పేరుతొ.. ఖరారు చేసుకోవాల్సి వచ్చింది. అలాగే పాట స్క్రూలింగ్ మీ ఈ బ్లాగ్ లో చూసి అయ్యో! నాకు అంతటి అదృష్టం దక్కలేదే అనుకున్నాను. ఈ పాటని ఇష్టపడని వారు ఉండరు. కానీ నన్ను ఎన్నో సార్లు అమ్మ ఒడిలా సేదీర్చిన పాట..ఈ పాట. ముఖ్యంగా పండిట్ హరిప్రసాద్ చౌరాసియ గారి బాన్సురి..మనని..మైమరపింపజేస్తుంది. నా అభిమానాన్ని చాటుకుంటూ.. ఇలా పాట సాహిత్యాన్ని చిత్ర పటం గా చేసి మురిసిపోయాను. అదండీ..విషయం. ఎవరికైనా ఎప్పటికైనా ఇష్టపడే పాట ఇది. అందులో మనం ఉన్నందుకు సంతోషకరం. ధన్యవాదములు.

గిరీష్

>> ఒక్కోసారి కొన్ని పాటలు మనలోని బాధను చల్లపరిచి ఆహ్లాదానిస్తాయి >>

true..

thanks for wonderful explanation.

Unknown

మీకు చాల దన్యవాదాలు, ఈ గీతంకు అర్థం చెప్పినందుకు, చిన్న సవరణ.
విరించినై = నేనే బ్రహ్మనై.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008