Monday 27 July 2009

అల్లరి వాన




ఈ జీవితం ఎంతో చిత్రమైనది. ప్రతి ఒక్కరిది ఒక్కో మనస్తత్వం. వ్యక్తిత్వం. కాని విలువైన ఈ జీవితంలోని ప్రతి కోణాన్ని, ప్రతీ సంఘటనను గురించి తెలుసుకుని, స్పందించాలి. ఎపుడు కూడా మన ఆలోచనలు ఒకే విధంగా ఉండకూడదు.అది మనకే మంచిది కాదు. మన మనస్సుకు సంకెళ్ళు వేయకుండా, మనం చెప్పినట్టు మాత్రమే వినేలా నిర్దేశించకూడదు. దానికి స్వేఛ్చ నిచ్చి వదిలేయాలి. అప్పుడే మన మనస్సు, ఆలోచనలు ఆ సంఘటనకు తగ్గట్టుగా వివిధ రూపాలుగా స్పందిస్తాయి. Different thoughts at different situations మనం కోపం, బాధ, ఆనందం, అల్లరి, ఆలోచన, సంగీతం, సాహిత్యం... ఇలా అన్నింటినీ సమానంగా అనుభవించి ఎంజాయ్ చేయాలి. ఆ స్పందనను ఎన్నో రూపాలుగా ప్రతిబింబించవచ్చు. వచనం, కవిత్వం, పాట, పద్యం ... ఇలా అన్ని అనుభూతులను మనఃస్పూర్తిగా అనుభవించాలి. దాచుకోవాలి.

ఈ క్రమంలో ఒకరోజు వేసవి చివర్లో తొలకరికి ఎదురుచూపులు. కాని ఈ సారి వాన అలిగిందేమో. ఇంకా దోబూచులాడుతుంది. వేసవి ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ కురిసిన తొలివాన నాలో కలిగించిన స్పందన మొదటిసారి కవితగా రూపుదిద్దుకుంది. చిరు చీకటి కమ్ముకుంటున్న సమయాన, పాట పాటలు వింటూ . చల్లని వాన చినుకుల్లోతడుస్తూ ... ఆ హాయే వేరులే.. ఇక చేతిలో వేడి వేడి టీ ఉంటే??


ఎంత అల్లరిదమ్మ ఈ వాన


రానని ఉడికించి వరవడిగ వస్తుంది


వదలక గిలిగింతలు పెట్టి


ఉల్లాసంగా ఉప్పొంగి నవ్వుతుంది


ఆషాడ మాసాన సాయం వేళ


నేనొస్తున్నా రారమ్మంటూ గాలితో కబురంపింది


రానంటే అలిగింది


రప్పించి నెగ్గింది


ఆనందమో, ఆకతాయితనమో


చినుకులతో తట్టి తనువంతా తడిపింది


అది చూసి మెరుపు కన్ను కొట్టింది


మేఘం రెచ్చి కురిసింది


చెలిమి చేయమంది బాధ మరవమంది


మనసు తెప్పరిల్లి తనువు మించి చల్లనయింది


జగతి మరిచితిని


నెచ్చెలి వానతో జత కలిపితిని ....



20 వ్యాఖ్యలు:

Vinay Chakravarthi.Gogineni

pic baagundi......chaala chaala.....

రమణ

బాగుంది

కొత్త పాళీ

మీరే రాసేశారా?
అక్షరాలా మీరే?
హమ్మ బాబోయ్! చానా బాగా రాశారండీ!

Padmarpita

మీ కవిత చదివి ఆనందంతో నేను తడిచితిని మీ అల్లరి వానలో!:)

జ్యోతి

వినయ్ గారు,
కాస్త వాన ఎఫెక్ట్ ఇద్దామని జాలంలో వెతికితే ఈ చిత్రం దొరికింది.
వెంకటరమణగారు,, ధాంక్స్.
కొత్తపాళీగారు,
థాంక్స్ అండి.అస్సలు కవితలే చదవని, అర్ధం కాని నేను ఈ కవిత రాసానంటే నమ్మకం కలగడం లేదు కదా?? అందుకే అన్నా..different thoughts at different situations :)

పద్మార్పితగారు,
మీ ముందు ఇది గడ్డిపోచలాంటిది. నచ్చినందుకు చాలా చాలా ధాంక్స్.

మరువం ఉష

చక్కని అనుభూతి. చిక్కని వ్యక్తీకరణ.

Srujana Ramanujan

Very pleasant. The pic is cool.

గీతాచార్య

So cute a poem. After a long time?

But this time no fight. Kudos.

Unknown

భావుకత చాలా బాగుంది. చక్కని వ్యక్తీకరణ.

Hima bindu

ఆ ఫోటో చాల బాగుంది , చూసేకొద్దీ దానిలోకెళ్ళి తడవాలనుంది..బాగుందండి.

lalita

jyothigaru,
chinnappudu paadukunna 'vaanaa vaanaa vallapaa' paaTa gurtoccindi.
amandaanandakandalita hrudayaaravinduraalanayitini.
srilalita.

పరిమళం

జ్యోతిగారూ ..మంచి ట్యూన్ కట్టి , మీరే పాటగా పాడి మాకు వినిపించరూ !

Dhanaraj Manmadha

;-)

Already tuned. Hehehe.

సృజన

అల్లరివాన అదరకొట్టిందిగా!!!

గీతాచార్య

ఇంత అల్లరిదమ్మ ఈ వాన
ముదుముద్దుగ జల్లులు కురుస్తుంది
మనసు తడిసేలా, తనువు పులకరించేలా

ముత్యాలంటి చినుకులు
మేమున్నామని ఊసులాడితే
నా పెదవుల పైన చిరునవ్వొకటి మెరిసింది.

ఇన్నిరోజులూ ఏమయ్యావని
పలుకరిస్తే మబ్బు చాటున దాగాను,
నీతో దాగుడుమూతలాడాలని,
లేత ఆకుపై జారాను,
ఇప్పుడు నిన్ను చేరాలని,
సూర్య కాంతిలో మెరిశాను,
నువ్వు నన్ను గుర్తు పట్టాలని.

నువ్వు సంధించే వర్ణాస్త్రం
నా ఎదను ఛేదిస్తే
కనిపించిందట నీ పేరే
నెలరాజునకు... గుడ్లప్పగించి చూశాడు.
అగుపించిందట నీ రూపే
దివాకరునికి... చల్లబడ్డాడు.

అని నువ్వంటే.. నవ్వాను పెద్దగా
ఈ క్షణాన్నే నిన్ను చేరాలని రెక్కలు కట్టుకుని
మొదలెట్టాను నా పయనముని
ఆటలాడాను నా దారిలో
పువ్వులతో పిల్ల తెమ్మెరలతో నీ కథలే చెబుతూ.

భమిడిపాటి సూర్యలక్ష్మి

కవిత చాలా చాలా చాలా బాగుంది. ఆ అల్లరి వానని ఈ ఊరు కూడా పంపండి.



లక్ష్మిఫణి

నేస్తం

కవిత,ఫొటో చాలా బాగున్నాయి

Revanth

కవిత , ఫొటో చాలా బాగున్నాయి . ఒకదాని మించి ఒకటి పోటీ పడుతున్నాయి.

జ్యోతి

ఉష, భరద్వాజ్, సృజన,శ్రీధర్, చిన్ని,లలిత,ధనరాజ్, నేస్తం, రేవతి .. ధన్యవాదాలు..

పరిమళంగారు, మీరు మరీను. ఏదో నావరకు నేను పాడుకుంటాను. ఇంతవరకు నా భావాలు రాతల్లోనే ప్రకటిస్తున్నాను. నాకు కాని ఎవరిమైదైనా తన్నేటంతగా కోపమొస్తే అప్పుడు పాడి బ్లాగులో పెడతానులెండి. అప్పుడు మీ ఖర్మ.నేనేమీ చేయలేను.

లక్ష్మిగారు,
మరేనండి. ఈ వాన అలిగినట్టుందండి. దోబూచులాడుతుంది.

గీతాచార్య,

ఏంటి .. నా కవిత చదివాక మీరు వానలో తడిసినట్టుంది. చాలా బావుంది..నిజంగా గాలి, వాన, చంద్రుడు, సూర్యుడు వీటన్నింటిని మన నేస్తాలుగా చేసుకుని అల్లరి చేస్తే భలే ఉంటుందిః :)

సుభద్ర

KEVVU KEKANDI.
YEDARI LO NAAKU VAANA CHUPINCHAARU.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008