Thursday, 6 August 2009

తెలుగదేయన్న ..


గత నెలలో ఎయిర్ టెల్ వాడి ఫోన్ బిల్లు తెలుగులో పంపినట్టు గమనించాను. భలే భలే అనుకున్నా.. కాని ఒక్కోటి చదువుతుంటే తికమకగా ఉంది. అదేం తెలుగో ?అదేం పదాలో?? ఇందులో అన్నీ సరియైనవేనా కాస్త చెప్పండి ప్లీజ్..
నాకైతే ఆ బిల్లు లో తెలుగు పదాలు పెట్టినవాడిని ఫోన్ చేసి మరీ తిట్టాలనిపిస్తుంది.
బొమ్మ మీద తట్టి పెద్దగా అయ్యాక చూడండి.. అర్ధమవుతుంది..

14 వ్యాఖ్యలు:

శ్రీలలిత

జ్యొతిగారు,

మీరు అప్ లోడ్ చెసిన ఎయిర్ టెల్ వాడి బిల్లు చూసి తెల్లబోయాను. మనకు అర్ధంకాని తెలుగు పదాలు వాడడంకంటే ఒక్కొక్కసారి వాడుకలో వున్న ఇంగ్లీష్ పదాలు వాడడమే నయమనిపిస్తుంది.

ఇదివరకు విన్న ఒక విషయం గుర్తొచ్చింది. మాకు తెలిసిన ఒకాయన తెలుగు అకాడమీ లొ పనిచెసేవారు. అందరిచేత ఇంగ్లీషు లో వున్న టెక్స్ట్ బుక్స్ కి తెలుగు అనువాదం చేయించెవారు. అందులో"వైర్ లెస్" అన్న మాటకి ఒకాయన వితంతువు అని రాసారుట. "ఇదేంటయ్యా" అనడిగితే ఇలా చెప్పాడుట. వైర్ అంటే తంతి కదా.. వైర్ లెస్ అంటే తంతి (అంటే తీగ) లేకుండా వుండడం. అంటే ఆపోజిట్ అదే వితంతి కదా. అందుకని "వితంతువు" అని రాసానని అన్నాడుట. అంతెకాని ఇది తెలుగు భాషకి సరిపోతుందా, లేక మరో అర్ధం వస్తుందా అని చూడలేదతను. ఇలా వుంటాయి మన తెలుగు పలుకులు.
srilalita

భావన

హ హ హ చాలా బాగుంది తెలుగులో మీ బిల్ల్ (మీ బకాయి కాయితం అనాలా)
balance అంటే బానే వుంది బకాయి అంటే వాడికేదో మనం అప్పైనట్లు అనిపించటం లేదు..
పైన చూసేరా ఎలా రాసేడో అకౌంట్ కాదు మీ ఏకంటు సమాచారం అట... charge కు శుల్కం సరి ఐన పదమేనేమో కాని వింటుంటే నవ్వు గా వుంది.. మళ్ళీ అన్ని తెలుగు కాదు చూసేరా... వేల్యూ ఏడెడ్ సర్వీసెస్ కాల్ చార్జెస్ రోమింగ్ (తెలుగు లో ఏమనవచ్చో) డిస్కౌంట్ తెలుగు లో మార్చలేదు ఓత్సాహికులు ఈ పదాలకు తెలుగు లో ప్రయత్నించవచ్చని ఒక పోటీ పెట్టండి జ్యోతి..

Unknown

ROKKAM ANI RASINA BAGUNDEDI..

కొత్త పాళీ

సూపర్.
శ్రీలలితగారూ, మీ ఉదాహరణ ఇంకా సూపర్.

తారక

కాల్ శుల్కం అని ఎందుకు రాయలేదు?
కాల్ ని ఆంధ్రీకరించలేదు.
Discount = ముదర వాడలేదు?
VAS= ??

కాలనేమి

తిట్టండి. ఫోన్ చేసి మరీ తిట్టండి యెదవని

Saahitya Abhimaani

శుల్కం ఏమిటి?? వాడి పిండాకుడు. ఆంగ్లంలో ఉన్న రోడ్ తెలుగులో రోడ్డు అయినట్టుగా చార్జెస్, చార్జీలు అంటే సరిపోలేదా.బిల్లులో చూడండి మూడో పదానికి మళ్ళీ చార్జీలు అనేశాడు పాపం. ఎవరికీ అంతుచిక్కని ఒక కంకర్రాయి లాంటి పదాన్ని తెచ్చిపెట్టుకునే బదులుగా ఆంగ్ల పదాన్ని ఆంధ్రీకరిస్తేనే(ఆ పదానికి ఉ కారమో అ కరమో తగిలించి) సులువుగా ఉంటుంది, తెలుగులోకి మరొక పదం వచ్చి చేరుతుంది. అసలు కొన్ని కొన్ని ఆంగ్లపదాలు మనం ఇప్పుడు తెలుగు పదాలుగానే వాడేస్తున్నాము డిస్కౌంటు అనే పదం దీనికి ఉదాహరణ. ఈ పదానికి తెలుగు??? ముదరా!! ఒక 80 శాతం వారికి తెలియదు అటువంటి పదానికి అర్ధం. అలా అని అన్నీ ఆంగ్ల పదాలను తెచ్చి తెలుగులో పడెయ్యమని కాదు.ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న ఆంగ్ల పదాన్ని యధాతధంగా వాడటమే ఉత్తమం లేక పోతే "వితంతువు" లాగ హాస్యాస్పదమవ్వటమే కాకుండా చెప్పదలుచుకున్న అర్ధం చదివే వారికి వినేవారికి చేరే అవకాశం ఉండదు.

తారక

Discount = తగ్గింపు, అని వాడొచ్చుగా చక్కగా, వెధవకి ఈనాడు పేపర్ చదవటం కూడా రాదేమొ,
VAT ని విలువ ఆధారిత పన్ను అని ఎంత చక్కగా మార్చారు,
శుల్కం = సుంకం, అంటే మనం వాడికి పన్ను కడుతునట్టా?

మాలా కుమార్

ఏమిటో ఈ జ్యోతి గారు అన్నిటికీ హైరానా పడి పోయి ఎనిమిక్ అయిపోతున్నారు.
ఆ రాసినవాడు కన్యాశుల్కం ఇచ్చి పెళ్ళి చేసుకున్నడేమో పాపం అనుకోవచ్చుగా !

నేస్తం

హ హ తెలుగు భాషలో బిల్లు కాదు గాని వైర్లెస్ ,రొడ్డు ఇలా చాలా విషయాలు తెలుస్తున్నాయి ఈ పొస్ట్ వల్ల :)

సుజాత వేల్పూరి

అన్నీ అచ్చతెలుగులోకి మార్చెయ్యాలనే దురద అనుకుంటా! మొదటి సారి ఎయిర్ టెల్ బిల్లులో నేను కూడా ఈ శుల్కం అనే మాట చూసినపుడు తెల్లబోయి ఇప్పుడు అలవాటు పడ్డాను.

మరి వాల్యూ ఆడెడ్ సర్వీసులు(కొన్ని చోట్ల విలువ ఆధారిత సేవలు అని వాడుతున్నారుగా) రోమింగ్(తిరుగుడు శుల్కం అనాలా?),డిస్కౌంట్...వీటికి తెలుగు వర్తించదా?

తల బాగానే తిరుగుతున్నట్లుంది వీళ్ళకి.

M.Srinivas Gupta

తెలుగులొ అచ్చు వేయించె ప్రాసెస్ ఎయిర్‌‌టెల్ వారి వద్ద ఇంకా బీటా పొజిషన్‌‌లొ వున్నట్టుంది. ఒకరిద్దరు పోన్ చెసి చెబితె వారు తప్పులను సరిదిద్దుకునె వీలు వుంది. ఎదిఏమైనా తెలుగులొ బిల్లు పంపటానికి ప్రయత్నిస్తున్న తీరు సంతోషించదగ్గ విషయమె. తెలుగు వ్యాప్తికి ఇది కొంతలొ కొంత ఉడుత సహాయమనవచ్చు.

మంచి ప్రయత్నం చేస్తున్న Airtel వారు అభినందనీయులు.

జ్యోతి

శ్రీనివాస్ గారు,

ఇదేమన్నా విదేశీ భాషా .. ఇలా తప్పులు తడకలు ఇవ్వడానికి. దీనికంటే మొత్తం ఇంగ్లీషులో ఇస్తే ఎవరైనా తంతారా?? ఆమాత్రం తెలుగు రాయగలిగేవారు Airtel వాడికి దొరకలేదా??

M.Srinivas Gupta

జ్యొతి గారు ,

విదేశీ బాష అని నెను అనను కాని, ఆంగ్లము వచ్చాక మన తెలుగు నాన్‌‌స్టాండర్డ్ భాష అయిపొయింది. ఆంగ్లమునుండి తెలుగులొ తర్జుమా చెయటంలొ ఇబ్బందులన్న మాట వాస్తవమే.

అలాగని ట్రయిన్‌‌ను "ధూమశకటమని", వాటర్ ట్యాంక్‌‌ను "జల భాండము" అని అనమనట్లెదు కాని ఒకసారి అన్ని పదాలను ప్రామణికం చెసుకున్నట్లైతె ఆ పదాలకు అలవాటుపడిపోతాం కదా!

అందుకే ప్రభుత్వ మరియు ప్రైవేటు తప్పులున్నప్పుడు పత్రాలలొ తప్పులు గమనించినప్పుడు వారికి సమాచారం ఇస్తే సదరు సంస్థలు సరిదిద్దుకునె వీలు వుంటుంది. తేటతెలుగును అంతటా చూసుకునె వీలు కూడ వుంటుంది అన్నదే నా అభిప్రాయము.

ఇక వాళ్ళు తప్పులు ఎందుకు వ్రాస్తున్నరన్నది,
కార్పొరేట్ స్థాయిలొ వున్న పెద్దపెద్ద కంపనీ మెనెజ్‌‌మెంట్ లెవల్లొ స్థానికుల కన్న వివిద రాష్ట్రలకు సంబందించిన వ్యక్తులు ఎక్కువగా వుండటమో,
అలాగె కంపనీలు రొబస్ట్‌‌గా నడవటానికి యువకుల్ని ఎక్కువగా నియమించటవల్లనొ,
బాషా దోషాలు చెసిన వ్యక్తుల తప్పులు కంపనీ దృష్టిలొనికి రాకపొవటం జరగవచ్చు

ఎదెమైన తెలుగును పెంచెవిదంగా ఎంకరేజ్ చెయాలన్నదె నా కామెంటునొని ఉద్దేశ్యం

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008