Sunday, September 6, 2009

షడ్రుచులు - కొన్ని వంటల పోటీలు

వంటల మీద ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన బ్లాగులు ఎన్నో ఉన్నాయి.అందులో భారతీయుల బ్లాగులు లెక్కలేనన్ని. నా షడ్రుచులు బ్లాగు తెలుగు, ఇంగ్లీషు రెండు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. మీకుతెలుసా మన కూడాలి లాగా ఆహార బ్లాగులకోసం ఒక అగ్రిగేటర్ ఉంది. మీరూ ఓ లుక్కేసుకోండి.. పనికొస్తుంది..

గత నెలలో చాలా బిజీ బిజీగా గడిచిపోయింది. పండగ హడావిడి. వంటకాల పోటీలలో పాల్గోవడం. ఇదే మొదటిసారి అయినా సాహసం చేయవే డింభకి అని రంగంలోకి దూకేసాను. ఒకదానికొకటి సంబంధం లేని పోటీ. వాటి వివరాలు మీకోసం. అప్పుడప్పుడు అందరికీ సహాయకరంగా ఉంటుందని ఇక్కడ ఇస్తున్నాను.. అందులో నా వంటలేవో మీరే కనుక్కోండి..

Zaiqa - రంజాన్ సందర్భంగా నా వంతు వంటకాలు ఇక్కడ


WYF Breakfast event : ఇక్కడ మీకు బోలెడన్ని టిఫిన్ల గురించి తెలుస్తుంది.

గణేష్ చతుర్ధి

APPYAYAN - ఇక మాంసాహారులకు, జలపుష్ప ప్రేమికులకు కూడా ఒక పోటీ జరిగింది..

FIC-ZODIAC SIGNS మన రాశి యొక్క రంగును ప్రతిబింబించే వంటకాలు చేసే పోటీ కూడా జరిగింది. నా రాశి ప్రకారం నేను చేసింది.. మరి కొన్ని ఇక్కడ చూడండి.

Microwave Potluck party - నా స్నేహితురాలు ఉమ సాయంతో ఈ పోటీలో నా కప్ కేక్ పంపించాను. మైక్రోవేవ్ వాడేవాళ్లకోసం ఎన్నో వంటకాలు చూడండి..

Indian Cooking Challenge : చివరిగా వినాయక చవితి సందర్భంగా ఇతర రాష్ట్ర వంటకాలు నేర్చుకునే అవకాశం కూడా కలిగింది ఈ పోటీ వలన కలిగింది. మీరు కూడా ప్రయత్నించండి..

కనీసం ఇలాగైనా వేర్వేరు ప్రాంతాలు, రుచుల గురించి తెలుసుకోవచ్చని ఇక్కడ ఆ వివరాలు పొందు పరుస్తున్నాను.

2 వ్యాఖ్యలు:

తృష్ణ

జ్యోతిగారు,
చాలా ఆసక్తికరమైన లింక్స్ ఇచ్చారు.ధన్యవాదాలు.

శ్రీలలిత

ఏంటండీ బాబూ,

మీరిలా సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఇచ్చుకుంటూ పోతున్నారు. మీరు బలే ఆల్ రౌండర్. గొప్ప సైట్లు చూపించారండీ. ముందు మీ చాకొలెట్ కేక్ చదివా. చాలా బాగుంది. మిగిలినవి తీరుబడిగా, నెమ్మదిగా చదువుతా.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008