Tuesday 6 October 2009

మత్స్యకన్య

మరువం ఉష ప్రారంభించిన జలపుష్పాభిషేకానికి నావంతుగా ఓ తుమ్మిపువ్వు సమర్పిస్తున్నాను. చలాకీ చేపపిల్ల , అమాయకపు ఆడపిల్ల ఒకటే అనే నా భావవ్యక్తీకరణ ఇది..





అదిగదిగో చేపపిల్ల
తుళ్లి తుళ్లి తిరిగేను
ఇదిగిదిగో ఈ చిట్టితల్లి
కేరింతలతో పరుగులెత్తేను

విశాలమైన సాగరానికి భయపడి
అమ్మ వెనకాలే భయంభయంగా
ఈదులాడేను చేప పిల్ల
చుట్టూ ఉన్న వారిని చూసి
భీతిల్లి, తప్పిపొతానేమొ అని
అమ్మ కొంగట్టుకు తిరిగెను చిట్టితల్లి

ఎన్ని రంగులొ, ఎన్ని అందాలో
ఎంతమంది బంధుమిత్రులో
అని కళ్లు విప్పార్చి పలకరించే చేప పిల్ల
ఎన్ని వర్ణాలో, ఎన్నెన్ని అందాలో ప్రకృతిలో
మనసంతా ఆనందాన్ని పదిలపరుచుకునే చిట్టితల్లి

అందరూ మనవారు కాదని అమ్మ
చెప్పెను జాగ్రత్తలు చేపపిల్లకు
అందరినీ నమ్మకు బుజ్జీ అని అమ్మ
హెచ్చరించెను చిట్టి తల్లికి

తనవారే తనకు శత్రువులా
అని మాటవినక సాగిపోయె చేపపిల్ల
అందరూ మనసున్న మారాజులే
అని నమ్మి మోసపోయే చిట్టితల్లి

అన్నా అని చేరబోయి
సొరచేప నోటచిక్కె చేపపిల్ల
తాళి కట్టించుకుని
కట్నదాహానికి బూడిదాయె చిట్టితల్లి.

16 వ్యాఖ్యలు:

మరువం ఉష

"ఓ సీత కథ" లోని "చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందె ఎరుగని ..... అది చెరువులో పెరుతున్న చేపపిల్లా అభం శుభం తెలియని పిచ్చి పిల్ల" పాట అప్రయత్నంగా గుర్తుకువచ్చింది. కానీ ఈనాటి ఆడపిల్లలు సొరచేపలు అని కూడా ధైర్యమొచ్చింది. :) మీ పోలిక బాగుంది. ఇకపై ఆ కట్నమన్నది చిన చేప కావాలి, స్వయం ప్రతిపత్తి అన్నది మన బలం కావాలి.

సృజన

బాగుందండి....Good comparison.

Padmarpita

బాగుందండి.....ఇప్పటి చేపపిల్లలు అంత అమాయకులు కారు వేటగాని వలలో అంత త్వరగా చిక్కరులెండి!

జ్యోతి

అవును ఉషా..
నాకు తెలిసిన ఒక అమ్మాయి,నా ఈడుదే పెద్ద కుటుంబం, అల్లారుముద్దుగా పెరిగింది. పైళ్లైన సంవత్సరంలోనే భర్త, అత్తలు కలిసి కుర్చీలో కూర్చున్న తనను మొహంపై దిండుతో అదిమి చంపేసారు. ఇప్పటికి తన పోటో చూస్తే బాధగా ఉంటుంది. ఈనాటి ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారు కాని వాళ్లు సొరచేపలు కావాలి.ఫ్రతి సంఘటనను ఎదుర్కోవాలి.

SRRao

ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, స్త్రీలు ఎంత పురోగమిస్తున్నారో అంతగా మోసపొవటాలూ, గృహహింసకు బలి కావడాలూ, అత్యాచారాలకు గురవ్వడాలూ కూడా పురోగమిస్తున్నాయి. దీనికి పరిష్కారం స్తీలే ఆలొచించాలి.

భావన

బాగుంది జ్యోతి.. పద్మార్పిత అన్నట్లు ఈ నాటి చేపలు కొంచం కళ్ళు తెరుచుకుని వుంటారని ఆశిద్దాము..

Vijay

జ్యోతి గారు మీ మత్స్యకన్య కవిత్యం చాల భాగుంది. but చివర్లో వున్న చరణం భాగలేదు .

అన్నా అని చేరబోయి
సొరచేప నోటచిక్కె చేపపిల్ల
తాళి కట్టించుకుని
కట్నదాహానికి బూడిదాయె చిట్టితల్లి.

మీరు అనుకున్నాటు అందరు మగవాళ్ళు అల ఉండరు
ok anyway good though and good blog. keep it up.

జ్యోతి

vijayగారు,

నేను అందరు మగవాళ్లు అలాగే ఉంటారు అనలేదు.ఒక్క చేపపిల్ల,చిట్టితల్లి గురించి చెప్పాను.తరం మారినా, ఎంత ఆధునికమైనా కూడా, ఇప్పటికీ రోజూ ఎక్కడో ఒకచోట అమాయకపు ఆడపిల్లలు కట్నదాహానికి బలవుతున్నారు.

దన్యవాదాలు..

Unknown

Vishayamemitante, Eroju Eee Chepa Pilla Inko 1 year lo Kodukuni kani 20 years Penchi Katnam Entha Theesukovalo Ani Alochisthu Kodaliga Vache Chepa Pillaki Villan Ayyi Kurchutundhi -
Aadadhaaniki Adadhe Sathruvu Anedhi 1000005 True when It comes to Katnam Matters.

sunita

Baagundi!

కొత్త పాళీ

good show

జ్యోతి

Azad గారు, మీరన్నట్టు ఆడదానికి ఆడదే శత్రువు అనుకుందాం.కాని తనను నమ్మి వచ్చిన ఇల్లాలిని కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తదే కదా. అతను కూడా తల్లి మాటలకు గంగిరెద్దులా తలాడిస్తే ఎలా.తన తల్లి గురించి అతనికంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది??

Anonymous

జ్యొతి గారూ చాలా చాలా బవుంది అండి
మీరు చెప్పలనుకున్నది చేపథొ చాలా సున్నితంగా చెప్పించెశారు....

అవునండి ఈ వరశుల్క దురాచారం నసించాలని ఎన్నెళ్ళనుండో ఉద్యమాలు నదుస్తున్నా....

ఆ రొజు కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను ...
పైన పద్మర్పిత గారు చెప్పినట్టు ఈ కాలం ఆడవాళ్ళు సొర చేపలు కాదండి, ఇంకా ఎంతో మంది 97/100 మోసపొతూనే ఉన్నారు . వీటికి చివరి చుక్క పెట్టలన్నదె నా ద్యేయమండి..

ఈ సందర్బం గా నేను రాసిన "కట్నమిచ్చి కొన్నవా కల కాలపు కన్నీళ్ళని " అనె లైన్ గుర్తొస్తుందండి ...

కాని కొంత తప్పు ఆడవళ్ళలో కూడా వుంది దానిని పూర్తిగా వాళ్ళకు తెలియజేసి, నసింప చెయాలనే నా లక్ష్యమండి....

జ్యోతి

tholiadugu గారు
నేటి ఆడపిల్లలు చాలా ధైర్యంగా తమకు కావలసింది ఏమిటో తెలుసుకుని సాధించుకుంటున్నారు. మీరు అన్నట్టుగా కాదనుకుంటా. ఇప్పుడు అమ్మాయిలు తమకు ఎటువంటి భర్త కావాలో నిర్ణయించుకుంటున్నారు. అబ్బాయిలకే ఛాయిస్ తగ్గిపోయింది. అమ్మాయిలు దొరకడంలేదు.అమ్మాయిలకు తగినట్టుగా అబ్బాయిలు తయారవ్వక తప్పడంలేదు.

కథా మంజరి

ఆర్ద్ర మయిన భావానికి చక్కని వ్యక్తీకరణ.

కనకాంబరం

జ్యోతి !,చాల రోజుల తరువాత ,మత్స్య కన్యను చూసే అవకాశం కలిగింది. మీరు మత్స్య కన్నెలో వ్యక్త పరిచి నట్లు
అమాయకంగా మోసపోయే బాలికలు కొందరైతే,.... ఎంతో చదువుకొని, వుద్యోగాలు చేస్తూ, భర్త కన్న ఎక్కువే సంపాదిస్తూ
దిన క్రుత్యాలలో ,భర్త సహకారం అందక,వంటనుంచి పిల్లల్నికనటమ్ వరకు,పెంచటం వరకు, అన్ని భాద్యతలూ నిర్వర్తిస్తూ భారంగా , భారత సగటు యువతి మూగగా యీ అధునాతన ప్రపంచంలో,భూగోళంలో ప్రతి కొనలో..... అందరూ ద్రుష్టి సారించాల్సిన విషయం. ఆదిలోనే అమ్మ వడి నుండీ వ్యత్యాసాలు తొలగి భావ దాస్య భావనల వాసనలు అంట కుండా చూసి భావి సమాజ యువతులలో బాల్యం నుంచీ ఆత్మ విశ్వాసం పెంపొందించ వలసిన ,భాద్యత అందరిదీ. అభినందనలతో.....నూతక్కి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008