అమర గాయకుడికి అద్భుత గుర్తింపు
ప్రియురాలా సిగ్గేలనే..
నన్ను దోచుకుందువటే
ముద్ద బంతి పూవులో
అలిగితివా సఖి ప్రియ
అందమే ఆనందం..
ఇవన్నీ చూస్తుంటే మీకు ఎం గుర్తొస్తుంది?? ఖచ్చితంగా ఘంటసాలగారే కదా. భౌతికంగా ఆయన మనమధ్య లేకున్నా ఆయన గాంధర్వ గానం ఎప్పటికి తెలుగువారి గుండెల్లో నిలిచిపోతుందన్నది అక్షర సత్యం. ఆ మహా గాయకుడికి ప్రపంచంలోని అద్భుత స్వరాలలో ఒకటిగా చేద్దామా??
ఐతే కదలిరండి.. ఇక్కడ మీ నామినేషన్ వేయండి. ఘంటసాల గారికి అద్భుత నివాళి, గుర్తింపు నిద్దాం.. మీ నామినేషన్తో పాటు ఒక పాట లింక్ ఇవ్వండి. ఈ నామినేషన్ Oct. 5 నుండి Oct. 16,,
ఘంటసాల గారి అద్భుతమైన పాటలు ఇక్కడ లభ్యం..
ghantasala.info
oldtelugusongs.com
chimatamusic.com
త్వరపడండి...
3 వ్యాఖ్యలు:
ఘంటసాల గొప్పోడే. నా వోటు మాత్రం బాలమురళికి.
నా వోటు చెల్లదు. ఎందుకంటే నేను బోల్డు మందికి వేస్తాను.
అయ్యోరామా!! నేను చెప్పేది మన గాయకులలో ఎవరు గొప్ప అని కాదు. అలా అంటే నాకు బాలు, రఫీ కూడా ఇష్టం. ప్రపంచంలోని యాభై మధురగాయకులలో మన తెలుగువాడు ఉండాలని నా కోరిక.అది అందరికి తెలిసిన, మెచ్చిన ఘంటసాలగారు ఐతే మంచిది అని నా అభిప్రాయం..
అదన్నమాట సంగతి.
Post a Comment