ఇంటా – వంటా – తంటా – పెంట
ఈ రోజు మార్కెట్లో కూరగాయల్లా టీవీ చానెళ్ళు పుట్టుకొచ్చాయి. అసలు ఇన్ని చానెళ్ళు చూసే తీరిక, ఓపిక ఎంత మందికుంటుందో ఏమో? చానెళ్ళు అన్నపుడు సీరియల్లు, సినిమాలు, రియాలిటీ షోలు.పాటల ప్రోగ్రాములు , వార్తలు ఇలా అన్నీ ఉండక తప్పదుగా. అలాగే ప్రతి చానెల్ లో తప్పనిసరిగా ప్రసారమవుతున్న ప్రోగ్రాం వంటల ప్రోగ్రాం. మధ్యాహ్నం నారీమణులు పనులన్నీ తీర్చుకుని సేదతీరే సమయంలో ఇవి ప్రసారమవుతాయి. ఒక్కోసారి దాదాపు ఐదారు చానెళ్ళలో ఒకే సారి వంటల ప్రోగ్రాములు వస్తాయి. ఏది చూడాలో తెలీదు. ఇక ఆ రిమోట్ అవస్థ చెప్పనలవి కాదు. దాని తిప్పలు ఆ దేవుడు కూడా తీర్చలేడు. అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రింద రెండు మూడు చానెళ్ళు మాత్రమె ఉన్నా టైంలో ఈ టపా కట్టడం జరిగింది. రోజూ వచ్చే ప్రోగ్రాములలో పాల్గొనే యాంకర్ల అవస్థలు ఎటువంటివో అని ఊహించి రాసిన ఒక చిలిపి టపా ఇది..
ఒకసారి ఇక్కడ లుక్కేయండి మరి..
13 వ్యాఖ్యలు:
హేమిషీ ! మీ ఇంటిదగ్గర టి. వి చానల్స్ అన్ని కూరగాయలొస్తున్నాయా ?
అవి కూరగాయలే !
ఇంటా వంట తంట పెంట టైటిల్ బావుంది మరి మంట
baavumdandi.
చక్కనమ్మ చిక్కినా అందమేట. చిలిపిగా రాసినా చక్కగా వుంది టపా.
మీరు అన్ని చానల్సు కలిపి చూసేసి, ఏదేదో కలగలుపు వంట చేసేస్తే..
అమ్మో! శ్రీ లక్ష్మి అయిపోతారు.
అరె...సరిగ్గా ఇలాంటి ఆలోచనే నా బుర్రలో ఫ్రై అవుతుంది. మీరు రాసేసారు( నేనొప్పుకోను..నేనొప్పుకోను ) . ఇప్పుడు రాస్తే కాపీ కొట్టినట్టు వుంటుందేమో కొన్నాళ్ళాగి రాస్తాలెండి.
జ్యోతి గారూ !
ఇదన్యాయమండీ ! మా సీరియళ్ళకూ, కార్యక్రమాలకు, మొత్తానికి చానళ్ళకు మహారాజ/ణి పోషకులైన మీరే ఇలా విమర్శిస్తే ఎలా ! మిమ్మల్ని అలరించాలనే సదుద్దేశ్యంతో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి చానళ్ళు పెడితే ఇంత వెటకారమా !!
హన్నా !! హన్నన్నా !!! ( సరదాకి )
( ఇప్పుడు సీరియస్ గా ) సినిమాల మాదిరిగా టీవీ రంగం కూడా ఫార్ములా / సేఫ్ గేం లో చిక్కుకుపోయింది. కుహనా రేటింగులాధారంగా మూస కార్యక్రమాలే ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీనికి చానళ్ళ యాజమాన్యాలను నిందించి ప్రయోజనం లేదు. రేటింగ్ మాయాజాలం నుంచి వారిని రక్షించాలి. టీవీ వీక్షకుల్లో అధిక శాతం మహిళలే ! ఇది అత్యంత శక్తివంతమైన మీడియా ! దీన్ని కాపాడగలిగే శక్తి మహిళలకే ఉంది. ఈ విషయంలో ఉదాసీనంగా ఉండకండా తమకు ఎలాంటి కార్యక్రమాలు కావాలో స్పష్టంగా,సూటిగా, ఘాటుగా, ముక్త కంఠంతో చెప్పగలిగితే తప్పకుండా మంచి కార్యక్రమాలే వస్తాయి. ఈ ఉద్యమం మీరే ప్రారంభిస్తారని, బ్లాగు సోదరీమణులు మీకు చేయూతనిస్తారని ఆశిస్తూ....
:) :)
జ్యోతీ గారూ, కొంపదీసి కథలోని ఘుమఘుమల గాయత్రి మీరు కాదు కాదా ! :)
రావుగారు,
మీరనేది ఏంటి?? టీవీ చానెళ్లకు మహిళలే మహారాజపోషకులనా?? నేనొప్పుకొనండి...మార్పు మాత్రం మహిళలు తలుచుకుంటే తప్పనిసరిగా జరిగి తీరాల్సిందే.
భాస్కర్ గారు,
నిన్నటినుండి చూస్తున్నా ఈ ప్రశ్న ఇంకా రాలేదా అని. నాకు తెలుసు మగవాళ్లనుండే వస్తుందని. ఐనా నావంటలు అంత ఘోరంగా ఉండవులెండి. 25 ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ.. :)
జ్యోతి గారూ !
నేననేది కాదండీ ! ప్రస్తుతం టెలివిజన్ రంగాన్ని టం రేటింగులు శాసిస్తున్నాయి. దాని రిపోర్టులు ఆధారంగా ప్రకటనల రేట్లు నిర్ణయించబడతాయి. నిజానికి చానళ్ళ లో కార్యక్రమాలను నియంత్రిస్తున్నది వాటి యాజమాన్యాలు కాదు. వాటికి వాణిజ్య ప్రకటనలు అందించే మార్కెటింగ్ ఏజంసీలు. వాళ్ళందరి నిశ్చితాభిప్రాయం టీవీలకు మహారాజపోషకులు మహిళలేనని. అందుకే ప్రతి చానల్ మహిళలను ఆకర్షించే కార్యక్రమాలు పోటేలుపడి రూపొందిస్తున్నాయి. పగలూ, ప్రతీకారాలూ ఆడవిలన్లూ మన సీరియల్స్ లో చూపిస్తున్నంత స్థాయిలో సమాజంలో ఉన్నారంటారా ? ఒకవేళ ఉన్నా వారిలోని విలనిజాన్ని పెంచే విధంగా కాక రూపుమాపే కథాంశంతో నిర్మించవచ్చు కదా ! కానీ అలాంటి కథాంశాలను రేటింగ్ ఉండదనే సాకుతో ఏ చానల్ తీసుకోవడానికి సాహసించదు. కనీసం మీలాంటి వాళ్ళయినా ఈ అభిప్రాయం తప్పని, కుహనా రేటింగులను తమపై రుద్దవద్దని, తాము మంచి కార్యక్రమాలే కోరుకుంటున్నామని తెలిసేటట్లు చేస్తారని ఆశించాను. అంతే ! మేము చెబితే అది అరణ్య రోదనే !!
మీరు చెప్పేది నిజమే.కాని ఈ విషయం మీద నేను స్పందించలేను. ఆ చెత్త సీరియళ్లు చూడలేకే కదా ఇలా అంతర్జాలంలో విహరిస్తున్నాను.
mee blog chalaa baagundi. ivaalae modatisaari chusanu. malli kaluddam mee blogulo.
Post a Comment