Friday, 23 October 2009

వసుధైక కుటుంబం -జింతాత

అందరూ కలిసి ఉండాలని ఎవరికీ మాత్రము ఉండదు. ఒక ఇంటిలో కాని, వీధిలో కాని, జిల్లాలో కాని, రాష్ట్రంలోకాని, దేశంలో కాని, చివరకి ప్రపంచంలోని వారందరూ కలిసి మెలసి ఉండాలి . అందరూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని అందరూ కోరుకుంటారు.కాని ఇది సాధ్యమా. ఒక ఇంటిలో పుట్టి పెరిగిన అన్నదమ్ములే కలిసి ఉండే పరిస్థితి లేదు. ఈర్ష్యా అసూయ ద్వేషాలు మితిమీరిపోయాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. ఎక్కడ చూసినా ఎవరు ఎక్కువ , ఎవరు తక్కువ అని పోటీ. ఇలాంటి సమయంలో ప్రపంచంలోని ప్రముఖులంతా కలిసి సరదాగా గడిపితే ఎలా ఉంటుంది.





ఎలా ఉంది. ఇది చేసింది మన మలక్పేట్ రౌడీనే. ఈ మధ్యే ఈ వీడియో సంగతి తెలిసింది. సరే అని ఆయన్ని అడిగి మరీ ఎత్తేశాను. హాయిగా నవ్వుకోండి..


రెండు నెలలనుండి పండగలు .. ఏదో ఒక పనితో బిజీ బిజీగా గడిచిపోతుంది. కాస్త రిఫ్రెష్ అవుదామని ఈ వారమంతా సరదాగా గడిపేద్దామని డిసైడ్ ఐపోయా. అదేంటో మొదట్లో ఎక్కువ సరదా టపాలే రాసేదాన్ని. ఆ అల్లరి ఎక్కడకు పోయిందో ఏమో. మళ్ళీ ఆ పాత రోజులను గుర్తు తెచ్చుకోవడానికి అలనాటి టపాలను వైజాగ్ డైలీలో ప్రచురించాను. ఇక చివరిగా ఇవాళ ఈ వీడియో. ఇక ఆటలు ,సరదా ఎక్కువైంది కాని వచ్చే వారం నుండి బుద్ధిగా , సీరియస్సుగా రాసుకోవాలి. ఉంటా మరి.

మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండోయ్..

మూడు,నాలుగు,ఐదేళ్లుగా (కరెక్టుగా తెలీదు) జెమిని టీవీలో వస్తున్న ఝాన్సి సీరియల్ ఇవాల్టికి శుభం కార్డు వేసారు. అంతకు ముందు వచ్చే పిన్నీ సీరియల్ ఎంత ఆసక్తిగా చూసేదాన్నో.మద్యాహ్నం వీలుకాకపోతే రాత్రి. ఇంకా ఆతృత ఎక్కువైతే భాష రాకున్న సన్ టీవీలో తమిళంలో చూసేదాన్ని. అబ్బో .. దానితర్వాత వచ్చిన ఈ సీరియల్ తల లేదు,తోక లేదు. ఎందుకు మొదలైందో.ఎందుకు పూర్తయిందో. ఎవరికీ ఎవరు ఏమవుతారో?? అస్సలు అర్ధంకాలేదు. ప్చ్.

9 వ్యాఖ్యలు:

ఏక లింగం

ఆయనేమో టచ్ లో ఉండడానికని పాత సామాను ముందరేసుకొని రోజుకొక విడియో జనాల మీదికి ఒదులుతున్నాడు. మీరేమో అందులో నుండి కొంత తెచ్చుకొని మీ బ్లాగులో నింపుకుంటున్నారు. బాగుంది.. ఇలా అయితే ఇంకా కొన్ని రోజులయితే సగం బ్లాగుల్లో ఈ రీమిక్స్ పాటలే ఉంటాయేమో.

Malakpet Rowdy

LOL Ekalingam. By the way I heard that the TV9 guys had telecast this video sometime last year. They didnt let me know about it though.

ఏక లింగం

@ Malak
అమ్మా... మీకు తెలియకుండా అంత పని చేసారా.? వాళ్లకు బ్లాగు ఉందా?

Malakpet Rowdy

Nope - they reportedly telecast it on their TV channel

Ravi

రీమిక్స్ రారాజు మలక్‌పేట్ రౌడీ గారికీ జై... :-)

Anonymous

జ్యోతి గారు, ఎంత శుభవార్త చెప్పారు. ఝాన్సి( లక్ష్మి) బాల్చీ తన్నేసిందా! అదేనండీ అయిపోయిందా . మా అమ్మా, మా అత్తగారు ఎంత ఇంట్రస్ట్ గా చూస్తారో ఆ సీరియల్ ని. నేను మాత్రం చెవుల్లో దూది కుక్కుకొని ఇంట్లో తిరుగుతాను ఆ టైం లో . అయితే రాధిక మరో సీరియల్ తియ్యటం పూర్తయి ఉంటుంది. అందుకే దీన్ని ఆపేసింది. హిందీలో ఏక్తా కపూర్ , మనకి ఈ రాధిక . ఎప్పుడు వదులుతుందో వీరిభాధ.

సుజాత వేల్పూరి

అబ్బ, నేనివాళ పార్టీ చేసుకోవాలి! నా చిన్నప్పుడు మొదలంది ఈ ఝాన్సీ! అయిపోయిందా అయితే! పీడా వదిలింది.

రీమిక్సులు మలక్ పేట్ రౌడీ చేసినట్లు మన తెలుగు ఛానెల్స్ లో ఎవ్వరూ చేయలేరని పందెం కట్టి చెప్పచ్చు. ఇంత టాలెంటూ ఎక్కడో సప్త సముద్రాల ఆవల ఉండి బ్లాగ్లోకానికే పరిమితం కావడం బాలేదు! మన ఛానెల్స్ మీదకు వదిలితే సుపర్బ్ గా ఉంటుంది మరి!

kiranmayi

ఇప్పుడే ఆయన బ్లాగ్ కి వెళ్లి వీడియొ లన్ని చూసా. ముందు మనందరం ఎం చేద్దామంటే, ఆయనకీ పెద్ద వేదిక మీద సన్మానం చేసి, "ఈ వీడియొ లన్ని కలిపి, ఎడిట్ చేసి, మీరే ఒక సినిమా తీయ్యండి బాబు, కనీసం వెండి తెర చూసి నవ్వుకుంటాం. ఈ మధ్యన అలా సినిమా చూసి నవ్వుకునే భాగ్యం కూడా లేకపోయింది" అని అడుగుదాం.

sunita

Hmmm...Interesting.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008