Sunday 29 November 2009

వంకాయల వసంతోత్సవం




వంకాయ వంటి కూరా, పంకజముఖి సీత వంటి భార్యామణి,,, గుత్తి వంకాయ కూరొండినానోయ్ బావ !,,, ఆహా ! ఏమి రుచి అంటూ తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయే అని ఎన్ని పాటలో. నవనవలాడే వంకాయను చూస్తే వెంటనే గుత్తి వంకాయ కూర కాని, అల్లం, కొత్తిమిర కారం పెట్టి కాని వండుకోవాలని అనిపించనిది ఎవరికీ చెప్పండి. ఇక ఇప్పుడు వేడి తగ్గి చలి పెరుగుతున్న కాలంలో ఎన్ని రకాల , తాజా వంకాయలో మార్కెట్లో? అందుకే వంకాయలతో వసంతోత్సవం జరుపుకుంటే పోలా అని షడ్రుచులు లో వచ్చే వారం వంకాయల ఉత్సవం మీకోసం..
ఇప్పటికే రెండు వంటకాలు ఉన్నాయి అవి చూస్తూ ఉండండి. సోమవారం నుండి మరిన్ని ..

గుత్తి వంకాయ కూర

వంకాయ కొత్తిమిర కారం



చంద్రగారు ఇది మీకోసమే.

3 వ్యాఖ్యలు:

Chandra Latha

నోరూరిస్తూ ఎలా విప్లవాలు ప్రకటించవచ్చో ... ఉప్పూ కారం తో పాటు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మసాలాలు దట్టించవచ్చో.. మీ 1 కాయ వసంతోత్సవం చెప్పకకే చెపుతోంది. మీకు ధన్యవాదాలు.అనేక శుభాకాంక్షలు.
జ్యోతిగారి కమ్మని వంకాయ ...మనతో దాగుడు మూతలాడుతున్న జంకాయ ను ఒక పట్టు పట్టే వరకూ ..ఈ వంకాయ వసంతం వెల్లివిరయాలని కోరుకొంటూ..
సర్వేజనా వంకాయ ప్రాప్తిరస్తు! తధాస్తు!

kaartoon.wordpress.com

వంకాయకూరల గురించి మీరు వ్రాసి మా నోరూరించారు.
వంకాయకూరోయ్ బావా కోరి వండినానోయ్,నా వలపంతా
కూరి పెట్టినానోయ్ అన్న పాట,ఎక్కడైనా బావగాని వంగ
తోట కాడ కాదు అనే నానుడి ఈ వంకాయలమీద మన
వాళ్ళు చెప్పరు.రేపే మా ఆవిడ తో చెప్పి చేయిస్తాను.
వుంటానమ్మా,జ్యోతి.
యమ్వీ.అప్పారావు(సురేఖ)

kiranmayi

అమ్మయ్య. మంచి తెలుగు వంకాయ రెసిపి కోసం చూస్తున్నా. ఇక చూస్కోండి. ఈ సండే వండేస్తా.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008