కృష్ణ జ్యోతి - పిచ్చాపాటి
"హాయ్ జో"
"హాయ్! ఏవరు? నేను నీకు తెలుసా? నువ్వు నాకు తెలుసా?"
"తెలుసు. నేనంటే నీకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం"
"ఇష్టమా? ఇంతవరకు నిన్ను చూడలేదు. ఏంటి? తిక్కగా ఉందా. అసలు ఎందుకొచ్చావ్?"
"అదేంటి? నువ్వే నా గురించి ఈ మధ్య తరచూ కలవరిస్తున్నావ్. ఏదో పలకరిద్దామని వస్తే ఇలా అనడం ఏం బాలేదు జ్యోతి "
"ఇది మరీ బావుంది. నువ్వెవరో తెలీకుండా నీ గురించి కలవరించడమేంటి?"
"సరే! నేనే చెప్తా విను.. ఓ నాలుగు నెలల క్రింద నీ బ్లాగులో దశావతారాల గురించి రాసావా? మళ్లీ ఈమధ్యే కృష్ణచైతన్య అని రాసావు. అందుకే వచ్చానమ్మా...నేనే ఆ కృష్ణుడిని అంటే ఇప్పటికైనా నమ్ముతావా తల్లీ"
"సరే నమ్ముతానుగాని నువ్వంటే నాకిష్టం.. నేనంటే నీకిష్టం అంటున్నావ్? అదెలా??
hmmm. నాకు తెలుసుగా నువ్వు ఏదీ అంత ఈజీగా ఒప్పుకోవని.. సరే విను..నా నెమలిపించంలోని రంగులంటే నీకు చాలా ఇష్టం కదా. మరి నువ్వు ఎప్పుడు చెప్పే పాట విరించినై నా వేణుగానం కాదా ?? అవునూ! వారం రోజులనుండి చూస్తున్నా. ఎందుకలా దిగులుగా ఉన్నావ్?
"ఏంటో! ఎప్పుడూ ఈ పోరాటమేనా? కష్టాలేనా? స్తిమితంగా ఉందామంటే కుదరదే? ఏ గొడవ, టెన్షన్ లేకుండా ఉండే రోజు రాదా?
"అంటే నీ ఉద్ధేశ్యం? కష్టాలు నీ ఒక్కదానికే ఉన్నాయా? ఎప్పుడూ అవే తలుచుకుంటూ అలా బాధపడుతూ ఉంటావా? "అంటే నీకు బాధపడ్డం ఇష్టమా? లేదు అంటే ఎందుకు దానికంత ప్రాధాన్యం ఇస్తావ్? నీ జీవితం ఇక్కడితో ఆగిపోదుగా? కష్టాలు కొలిమిలో కాగితేనే కదా మనిషి నిగ్గుదేలేది, సుఖాలను అనుభవించేది. ఎప్పుడూ సుఖాలు కావాలంటే వాటి విలువ తగ్గిపోతుంది. బోర్ కొడుతుంది. చీకటి ఉంటేనే కదా వెలుతురు విలువ తెలిసేది."
"సరేగాని నాదో డౌట్ . ఎందుకు మంచి పనికి ఎప్పుడూ విమర్శలు ఉంటాయి. ఎందుకు ఈ అసూయలు, ద్వేషాలు, అవమానాలు సహించాలి?
"పిచ్చిదానా! అన్నీ సానుకూలంగా జరిగిపోతే వాటి మజా ఉంటుందా చెప్పు? ఒక్కటి గుర్తుపెట్టుకో! కమలం బురదలో, మురికిలో పెరుగుతుంది కదా. ఐనా ఆ వాసన దానికి అంటుతుందా? లేదే? పైగా బురదలో పెరిగినా మధురమైన రంగు, సువాసనలతో అందాలు ఒలికిస్తుంది కమలం. అలాగే మనకు ఎదురయ్యే బాధలు, అవమానాలు అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని విజయులై నిలవాలి ఆ కమలంలా!”
“సరేలే? చెప్పడానికేంటి బానే చెప్తావ్? అనుభవించేవాళ్లకు తెలుస్తుంది. ఐనా ఆడాళ్ల కష్టాలు ఎప్పటికి తీరేను? ఎక్కడ చూసినా అడ్డంకులే. అణచివేతలే? అందుకే అప్పుడప్పుడు నామీద నాకే కోపమొస్తుంది."
"ఇదిగో ఇక్కడే నాకు మండేది. మీ ఆడాళ్లున్నారే! ఎప్పుడూ మొగుడికి. అత్తామామలకి సేవలు చేయాలి అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆరాటపడిపోతుంటారు. తమ గురించి , తమలోని శక్తిసామర్ధ్యాలను గురించి ఆలోచించరు. మా రుక్మిణీ, సత్యలను చూడు. రుక్మిణి ఎంత ధైర్యంగా నన్ను రమ్మని, వచ్చి తీసికెళ్లు అని కబురంపింది. ఆమె అన్నతో యుద్ధం చేసేటప్పుడు తానే రధసారధి అయ్యిందా లేదా? ఇక సత్యకి నేనే లోకం. కాని అలిగినా ఆమెకు ఆమే సాటి, యుద్ధం చేసి రాక్షసుడిని చంపినా ఆమే సాటి. అలా ఉండాలి."
"అందుకేనా సత్యతో తన్నులు తిన్నావ్? ఐనా అదేం అలక. నువ్వేంటి? సర్వాంతర్యామివి. లోకనాయకుడివి భార్యకు దాసుడవైపోయావు. లాలించి, బ్రతిమాలుతావేంటీ? కాళ్లు మొక్కితే ఎంత పొగరుగా తన్నింది? మరీ అంత గర్వమా?
"హ. హా... హా.. జ్యోతి.. ఆలుమగల మధ్య ఇలాంటి సరసాలు, ప్రణయకలహాలు, అపార్థాలు, అలకలు ఉండాల్సిందే కదా. అవే కదా భార్యాభర్తల మధ్య ప్రేమను పెంపొందింపచేస్తాయి. ఏ భార్య , తన భర్తను అవమానించాలని అనుకోదు. కాని ఈ చిన్ని చిన్ని అలకలే వారిని మరింత దగ్గర చెస్తాయి "
" అలాగైతే మరి నువ్వేంటి పదహారు వేలమంది గోపికలతో రాసలీలలు సాగించావ్? ఇంటినిండా పాడి పెట్టుకుని ఈ వెన్న దొంగతనాలేంటీ?
"అమ్మడు!! నేను ప్రతి గోపికతో ఉన్నాను అన్నది వాస్తవం. కారణం ప్రతి జీవిలోనూ ప్రాణం ఉంది. దాని స్వభావం అందరిలోనూ ఒక్కటే. అంచేత "ప్రాణం" అన్న "భావన" ఒకటే అయినా, ప్రతి జీవిలోనూ అది ఉంది. అలాగే పరమాత్మ భావన కూడా. రాసలీల పరమార్థం ఇదే. ఇక ఆ పాలు వెన్న మొదలైనవి జీవుల గుణాలు. వాటిని హరించి వాళ్ళకి మోక్షమివ్వడానికే నేను దొంగతనం చేసింది. అనుమానం తీరిందా?"
"తీరింది కాని.. చివరిగా.. నేను నీకు ఎటువంటి పూజలు చేయలేదు. నీ గురించి ఎక్కువ ఆలోచించలేదు.. మరి నేనంటే నీకెందుకు ఇష్టం ?"
"నాకు కావలసింది పూజలు, నైవేద్యాలు కాదు. ప్రేమ. అది నీ దగ్గర ఉంది. అందరిని ప్రేమించడం, అడిగినవారికి కాదు, లేదు అనకుండా సాయం చేయడం ముఖ్యంగా మాట సాయం.. ఇవే నువ్వు నాకిచ్చే నైవేద్యాలు, అర్చనలు, హారతులు.. అది చాలు నాకు. అందుకే ఎప్పుదూ నిన్ను కనిపెట్టుకుని ఉంటున్నాను. ఒక్కసారి ఆలోచించు. రెండు మూడు సార్లు నువ్వు ఈ జీవన పోరాటంలో విసిగిపోయి .. నేను బ్రతికి వేస్ట్ , ఎప్పుడూ కష్టాలే అని చావాలి అనుకున్నప్పుడు మంచి స్నేహితులను ఇచ్చానా? వాళ్లు నీకు ధైర్యాన్ని ఇచ్చి మనసు మార్చారా లేదా? వాళ్ల పేర్లు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అది నేను కాదా? అవునూ? నువ్వేంటి? కృష్ణచైతన్య పేరు అంటే చాలా ఇష్టం. మావారికి ఆ పేరు లేదు. అందుకే కొడుకుకు పెట్టుకున్నా అన్నావ్. మీ ఆయన పేరేంటమ్మా??
"హి . హి.. హి.. సరే . మనస్పూర్తిగా నమ్ముతున్నా. నువ్వు నాకు స్నేహితుడిలా, గురువులా వెన్నంటి ఉన్నావని. నిన్ను విసిగించినందుకు సారీ. దండన ఇస్తావా ?"
" సరే .. ఇక నేను వెళ్తాను. ఒకటి అడుగుతా. నీకెంతో ఇష్టమైన , నీ స్నేహితులు కానుకగా ఇచ్చిన "ముద్దుగారే యశోద" అర్ధం చెప్పు.
ముద్దుగారే యశోద ముంగితి ముత్యము విడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మానికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడులోకాల గరుడపచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల నందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలక్షుడు
కాళింగుని తలలపైన కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాల జలనిధిలోన పాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగి పద్మనాభుడు.
ఈ కీర్తనలొ నవరత్నాలను పొదిగాడు అన్నమయ్య. బాలకృష్ణుడుగా నువ్వు యశోద ముందు అందమైన ముత్యం వంటివాడివే మరి. వంకలు పెట్టడానికి వీలు లేని మహిమలు చూపిన దేవకీ సుతుడివి . మరి గోపికలకేమో తామరపువ్వు వంటి కెంపు రంగు కల అరచేతిలో మాణిక్యం అయ్యావు కదయ్య నల్లనయ్య. దుష్టుడైన కంసుని హతమార్చడానికి కఠినమైన వజ్రంలా మారావు. మూడులోకాలలో కాంతులనిచ్చే మరకతానివి కాగా . రుక్మిణీదేవి పెదవి రంగులో ఉండే పగడం, గోవర్ధపర్వతాన్ని చిటికెనవేలితో ఎత్తే సమయంలో గోమేధికం వంటి గట్టిదనం కలిగి ఉన్నావు. నిత్యంగా ఉండే శంఖచక్రాల మధ్య వైడూర్యంలా మెరిసిపోతావు. కాళిందుని తలలపై నర్తించువేళ పుష్యరాగం వలె ప్రకాశించావు. ఏడుకొండలపై వెలసిన వేంకటేశ్వరుడిలా నువ్వు కూడా ఇంద్రనీల వర్ణం వాడివి కదా. నీవు నవరత్నాల వలే ప్రకాశించడమే కాదు క్షీరసాగరంలొ ఉన్న దివ్యరత్నానివి ఐనా బాలునివలె అమాయకంగా మా అందరిని సంతోషపెట్టిన పద్మనాభుడివి దేవా!
" చాలా సంతోషం .. జ్యోతి. ఇక నేను వెళతానమ్మా!! నువ్వు దిగాలుగా కూర్చుంటే కావాలని వచ్చి డిస్టర్బ్ చేసాను. ఇదిగో వెళ్లే ముందు నీకో సర్ప్రైజ్.. ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం నీకే కాదు. నాకు కూడా వచ్చామ్మాయ్!!.. ఈ బుట్టలో ఏమున్నాయో చెప్పు? అన్నీ నీకు చాలా ఇష్టమైనవే "
" ఏమున్నాయేంటీ? నువ్వే చెప్పు. ఐనా నాకు చాలా ఇష్టమైనవి నాకు తప్ప ఎవరికీ తెలీదుగా?"
" నీకు ఇష్టమైన తెలుపు, పసుపు, ఆకుపచ్చ సంపెంగలు, చమేలీ పూలు, అడుగున పూతరేకులు, బంగారంకంటే ఎక్కువగా ఇష్టపడే ఘంటసాల, రఫీ పాటలు.. చాలా? మరో ముఖ్య విషయం."
Happy Birthday Jyothi
Bye
-->
33 వ్యాఖ్యలు:
Happy Birthday ;) Just repeating after him..
జ్యోతి గారికి,జన్మదిన శుభాకాంక్షలు
jyoti ,
happy birthday .
జ్యోతి,
పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ...
కల్పన
జ్యోతి గారు,
జన్మదిన శుభాకాంక్షలు
హాప్పీ హాప్పీ బర్త్ డే !!
భమిడిపాటి సూర్యలక్ష్మి, ఫణిబాబు
Happy Birthday jyothakka!
మాకు స్వీట్లు, మిరపకాయ బజ్జీలు కావాలి అధ్యక్షా!
జ్యోతక్కకు జన్మదిన హార్దిక శుభాకాంక్షలు.
జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ......
Happy Birthday Jyothi. Many many many happy returns of the day. Hope krishnayya blessed you with so many boons. Happy Birthday one more time.
జ్యోతి గారు,
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మొక్కవోని ధైర్యంతో మీదైన శైలిలో జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
కృష్ణుడితో కబుర్ల తర్వాత కధ చివర ఇచ్చిన కొస మెరుపు బాగుంది అంటే అది చిన్న మాటే అవుతుంది. జ్యోతక్కా! O. Henry కధల ముగింపు స్ఫురణ కొచ్చింది. ఇంతకీ ఎన్నో పుట్టినరోజు?
జ్యోతి గారికి,జన్మదిన శుభాకాంక్షలు
Wish you a very Happy Birthday..
Many many happy returns of the day.
Happy Birthday jyothakka!Many more happy returns of the day
జన్మదిన శుభాకాంక్షలు
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జ్యోతిగారు.
జ్యోతీకి
జన్మదిన శుభాకాంక్షలు...ఒక్కసారి నా బ్లాగ్ లోకి తొంగిచూడరా.. ప్లీజ్..
Happy Birthday Jyothi!
జ్యోతి గారికి పుట్టినరోజు జేజేలు.!
అందరికి మన:పూర్వక ధన్యవాదాలు. ఇంతకంటే చెప్పడానికి మాటలు లేవు..
జ్యోతి గారు జన్మదిన శుభాకాంక్షలు. :)
లేట్ గా వచ్చినట్టున్నాను. అయినా పరవాలెదులే జ్యోతక్కా. మీ కిట్టయ్య నా వాటా బర్త్ డే కేక్ వుంచాడా లేక అదికూడా ఆరగించేసాడా? టపా బాగుంది. మీకు జన్మదిన శుభాకాంక్షలు.
జ్యోతి,
పుట్టిన రోజు పాపాయికి జేజేలు!
జ్యోతిగారికి,హార్దిక జన్మదిన శుభాకంక్షలు
కృష్ణయ్య ఇచ్చినవన్నీ మీకేనా ....మాకు భాగం పంచరా ?
అర్రె మర్చిపోయానే .. జన్మదిన శుభాకాంక్షలు. నవరత్నాల్ని బాగానే భద్రంగా దాచిపెట్టుకున్నారే! :)
కిష్టుడితో ఇష్టాగోష్టి బాగుంది
భాస్కర్ ,, లేటుగా వచ్చావుగా. పర్లేదు. కొంచెం కేకు ముక్క ఉంది ప్రిజ్ లో. నేను తినకుండావుంటే ఇస్తాలే.
పరిమళం,
మరి నాకు ఇష్టమైనవే మీకు ఇష్టమవ్వాలికదా.అలా ఐతే కష్టమైనా , మీకోసం ఇస్తాలెండి. వచ్చేయండి..
జ్యోతి గారూ !
జన్మదిన శుభాకాంక్షలు.
( ఆలస్యంగా చెబుతున్నందుకు సారీ !
మోడెం మొరాయించడం వలన గత 6 రోజులుగా
నాకు అంతర్జాలం అంతర్ధానమయింద )
jyothi gaaru, namasthe...mee blagu ivvale choosa. ninna adigithe choosanannanukani adi nijamga abaddham. nijaniki choosanoledo marachanu amdukane priyamaina abaddham cheppavachchu kada ani ala cheppa. telugu lo vrayalamte konchem time padtundi amdukani directga vrastunna...mee blagu bahumukhamaina mee knowledge teliyachostondi.krishna jyothi pichchaapati baagumdi. bharta perucheppadaniki krishnududaggara sampradayam...... snehaniki meerichche viluva prasputham gaa kanapadimdi. shadruchula loki vellaboyi bhayapadi vachchesa.artham chesukomdi. imkosari telugulo blogta mari salavu.....dinavhi.
Wow Jyothakka, how lucky are you! Saakshath Srimannarayanudaina Chinni Krishnaiah vocchi bahumathulu shubhaakaankshalu icchi vellaru! Chadivinanduku memu tarinchamu!
What a wonderful work! Not only that, you are also giving strength to all those people in weak moments when they might hurt themselves because they lack the strength to sustain His testing times. Alanti andariki spoor thi nichchu gaaka mee blog!
Annattu ink oka maata, Meeru shadruchulu tinipinchi maa cholesterol Inka BMI ekkuva chestunnaru, evaina manchi exercises, yoga, taravata Hyderabad chuttupakkala chudagalanu dagga pradeshalu kuda include cheyyandi, please!
Post a Comment