Saturday, January 30, 2010

ఒక పేదరాలికి సాయం చేయండి...

ఈ మధ్యనే తల్లైన ఒక పేదరాలికి మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉంది. అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కాని ఆపరేషన్ , మందుల ఖర్చులు (సుమారు మూడు నుండి మూడున్నర లక్షలు ) తలకు మించిన భారం అయ్యాయి. మూడు రోజుల క్రింద ఆపరేషన్ జరిగింది. అక్కడా, ఇక్కడా సేకరించిన సొమ్ము 1.2 లక్షలు కట్టేశారు . ఇంకా 1.8 to 2.3 లక్షల రూపాయలు కట్టవలసి ఉంది. ఇపుడు ఆ ఇల్లాలు శ్రీమతి లక్ష్మి మల్కాజిగిరిలోని Gurunanak Care hospital లో ఉన్నారు. మీ వంతు సాయం అందించండి.

భద్రాచల నరసింహ బ్లాగులో చదివి పేషంట్ మరిదితో మాట్లాడి కనుక్కున్న వివరాలు ఇవి.

వారి ఇంటి అడ్రస్:

T. లక్ష్మి,
W/O T. నాగరాజు
హైదరాబాదు గోషామహల్ దాటాక మల్లేపల్లి పోలీస్ ఔట్ పోస్ట్ దగ్గర ఉన్న హనుమాన్ మందిర్ (ఇంతకుముందు రామ్ మందిర్ అనేవారంట) పక్క సందులో నాగరాజుగారి ఇల్లు ఉంటుంది.

ఫోన్ నంబర్ :

9347431437,

9397008241

వేలు , లక్షలు ఇవ్వకున్నా మనకు చేతనైనంత సాయం చేద్దాం.

5 వ్యాఖ్యలు:

డ్రెంచకుడు

Sure we try

శ్రీనివాస్

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేప్పుడు కొంత మొత్తం కట్టవలసి ఉన్నదట. తర్వాత మెడిసిన్స్ కొరకు కొంత వ్యయం అవుతుంది అని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉండే వారు సహాయం చెయ్యాలి అనుకున్న వారు రేపు ఎలాగు ఆదివారం కనుక ఒకసారి ల ముషీరాబాద్ లోని గురునానక్ కేర్ హాస్పిటల్ కి వెళ్లి నేరుగా మీ సహాయం అందిస్తే ..... సహాయం చేసామన్న తృప్తి మీకు ఉండే అవకాశం ఉంది. విదేశాల్లోనూ ఇతర ప్రాంతాల వారు చేయాలనుకుంటే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం

భావన

తప్పకుండా జ్యోతి. నేను ఇంతకు ముందు నువ్వు ఇచ్చిన ఎకౌంట్ లో వెయ్యనా. నా కొడుకు మొన్నీ మధ్యే వారానికి మూడు గంటల పని మొదలెట్టేడూ, వాడీ మొదటి నెల జీతం ఇంకా ఉషా కూతురు హైటీ రిలీఫ్ ఫండ్ కు ఉషా నా తరపున కట్టింది అది ఎలాగో ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఒక తల్లి కి సాయం ఎలాంటిదైనా చెయ్యగలగటం మన అదృష్టం.

జ్యోతి

భావన,

ధాంక్స్ వెంటనే స్పందించినందుకు. నా నంబర్ ఇస్తాను. అందులో వేద్దువుగాని. మా బాబుతో పంపిస్తాను డబ్బులు మరికొన్ని కలిపి..

భావన

వో సారీ శ్రీనివాస్, మీరు రాసినది చూడలేదు. జ్యోతి పోస్ట్ చూసి కామెంటు పెట్టేను, మీరు జ్యోతి కలిపి చేస్తున్నారా ఈ ఎఫర్ట్. థాంక్యూ మీ/జ్యోతి ఆఫర్ కు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008