ఓ దిక్కుమాలిన కధ..
జీవితమొక తోటలాంటిది.
ఆ తోటలో మనం తోటకూరలాంటివాళ్లం
తోటకూరతో కూర చేయొచ్చు కాని
చారు చెయ్యలేం, సాంబార్ చెయ్యలేం!
షాకింగ్ గా ఉన్నా ఇది జెవిత సత్యం
ఇలాంటి విషయాలలోనే గుండె గులాబ్ జామున్ చేసుకోవాలి.
లేకపోతే లైఫ్ లవంగమైపోతుంది.
ముమైత్ ఖాన్ మంగళగౌరీ వ్రతం చేస్తుందని తెలిసింది.. హాలీవుడ్ భామలందరినీ వాయనం తీసుకోవడానికి విమానం టిక్కెట్లు కూడా పంపిందంట. వాటిని స్పాన్సర్ చేసింది LTTE . ఇది ఇంటర పోల్ వారు ఇచ్చిన సమాచారం. దుబాయి లో ఉన్న ఆయిల్ బావులనుండి రిలయన్స్ వాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఇళ్లకి పైప్ లైన్ వేస్తున్నారు. ఎంత వాడుకుంటే అంత డబ్బులు కట్టాలి. డిపాజిట్ లేదు. ఇది షాలిబండ సరూపక్క తన బస్తీలోని మహిళలతో కలిసి సాగించిన పోరాట ఫలితం. చెట్లను కాపాడ్డానికి పుస్తకాలు ప్రింట్ చేయడం లేదు. సిడిలు చేసి అందరూ చదువుకుని మేస్టారుకు చెప్తే అతనే అందరికి కలిపి పరీక్షలు రాసేస్తాడు. రాజకీయ నాయకులంతా జీవితకాలం అయ్యప దీక్ష చేపట్టి హిమాలయాలకు పయనమైపోయారు. విధ్యార్తులే నాయకులు అని కేంద్రం ప్రకటించింది. ప్రముఖ హందీ సినీనటుడిని తిరుమలలో ప్రధాన పూజారిగా నియమించడమైనది. ప్రముఖులందరినీ చూసుకోవలసిన భాద్యత అతనిదే. త్రీ ఇడియట్స్ సినిమాని సంస్కృతంలో తీయాలని ఒక సినిమాలు లేని సినిమా హీరో, కళంకితుడు కలిసి నిర్ణయించారు. తెలుగులో నిర్మించడానికి ప్రయత్నాలు మొదలైపోయాయి కదా.. అందుకే సంస్కృతంలో నిర్మిస్తారంట. అందులో హీరోలుగా మన మార్తాండ, మలక్, పవన్ సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే వీళ్లు ముగ్గురు జిగ్రి దోస్తులు కదా. ఈ విషయం నిర్మాతలకు ఎవరు చెప్పారో మరి నాకు తెలీదు. ఉండవల్లి పనా??
"మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా బిక్కమొహం వేసుకొని వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టేసుకుని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి ఈ చెక్కబల్ల మీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏ పక్కకో ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కశుద్దితో వాళ్ళను ఢక్కామొక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక్క చక్కటి ఉద్యోగం చేజిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ. అని కసబ్ ని రోజూ బ్రెయిన్ వాష్ చేస్తే దెబ్బకే గుండాగి చచ్చాడు. అదిగో సచిన్ టెండుల్కర్ పారిపోతున్నాడు. పట్టుకుని సుమతీ శతకం నేర్పించండి. జర్దారీని భోజనానికి పిలిచాను. వంట చేయబుద్ధి కావడంలేదు. భావనా! కాస్త క్యాబేజీ స్పెషల్స్ చేసి పంపు. వాడి దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యి పాకిస్తాన్ ని ఇండియాలో కలిపేయాలి. తర్వాత నీకు రోజొక వెరయిటీ బిర్యాని చేసి పెడతాలే..
ఏమైంది?
పాప ఏడ్చింది.
ఒక్కటి పీకమని వాళ్లమ్మతో చెప్పు. చిన్నప్పుడు నువ్వు అస్తమానం ఏడుస్తుంటే నేను అలాగే చేసేదాన్ని.
ఇటీవలి వరదల్లో ఒబామా ఇంటి తోటమాలి హస్తముందని అంటున్నారు . ఇది ఎంతవరకు నిజం?? కమిటీ వేయాలని ఆర్డర్ వేసారు. ఎవరంటే? ఏమో? తిరుపతి లో బ్యూటిపార్లర్, విగ్గుల షాపు పెట్టి నష్టపోయిన అనుభవంతో శభరిమలై దగ్గర హెయిర్ కటింగ్, డ్రెస్స్సుల షాపు పెట్టాలని అనుకుంటున్నాను. పెట్టుబడి పెట్టడానికి ఎవరు దొరుకుతారబ్బా?? ఇవాళ పైనాపిల్ పులిహోర, టమాటాలతో పాయసం చేసా. ధైర్యమున్నవాళ్లు వచ్చి ఫ్రీగా తినొచ్చు. తర్వాతి పరిణామాలకూ నాకు ఎటువంటి సంబంధం లేదు . ముందే చెప్తున్నా..
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
చూడచూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వధామిరామ వినురవేమా..
నిన్న సాయంత్రం శివరాత్రి పూజ చేసుకుని భక్తి పారవశ్యంలో ఉన్న నేను ఖర్మ కాలి ఒక మహాపండితుడు రాసిన (బ్లాగుల్లోనే) దిక్కుమాలిన కధ చదవడం జరిగింది. అది సరిపోక ఒక మహానుభావుడు నటించి, నిర్మించిన సినిమా ప్రోమో చూడడం జరిగింది. లలిత ఐతే తట్టుకుందేమో నా పరిస్థితి మాత్రం ఇలా అయ్యింది. ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో అర్ధం కావటంలేదు. ఈ కథను నాకు పంపిన దుర్మార్గుడికి జంధ్యాల తిట్ల దండకం బహుమతిగా ఇస్తున్నాను. హన్నా! నాతో పెట్టుకుంటారా?? ఇపుడు సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిన పని బడింది..
27 వ్యాఖ్యలు:
శభాష్ అండీ, దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ఇటీవల ఏదో బ్లాగులో ప్రముఖ బ్లాగర్ ని రొచ్చులోకి లాగడానికి సన్నాహాలు చేస్తున్నారంటే ఏదో అనుకున్నాను.మీరు మాత్రం ఈ మురికి సన్నాసులతో పెట్టుకోకండి.
పాపం ప్రనాగారు బోడిలింగావతారం ఎత్తినట్టున్నారే :))
అబ్బ చా.... నేను ప్ర.నా అని అంత కరెక్టుగా ఎలా కనిపెట్టారబ్బా... ROFL.. :-)
non stop cinemanaa??
entha dhairyam?
intaki meeku car dorekestunda aite, hero evaro villan evarooo
హహహ
జ్యోతి గారు.......
ఏం చేప్పాలో మాటలు రావడం లేదు..
ప్రనా కధలు రాసినప్పుడు కాదు మీ లాంటి పది మంది దాని గురించి ఇలా (ఏలా గోళ) చదివి తరించినప్పుడే మా లాంటి అభిమానులకు నిజమైన సంతోషం ఈ రోజు అనందం తో మన మనస్సు పులకించి పులుసు అయింది చాలు ఈ జన్మకి ఇది చాలు...
హా హా
ఈ కథను నాకు పంపిన దుర్మార్గుడికి జంధ్యాల తిట్ల దండకం బహుమతిగా ఇస్తున్నాను. హన్నా! నాతో పెట్టుకుంటారా?? ఇపుడు సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిన పని బడింది..
thanks :)))))))))))))
Martanda, Malak and Mahesh would have been better .. 3 Ms :))
And at one point we three were arguing with each other on three different issues :))
మరి మేమంతా చదివి మాకూ పిచ్చి ఎక్కలేదా ఏంటి? మికు మా నుంచి తాత్కాలిక మతిభ్రమణ శుభాకాంక్షలు...
enti asalu ee kadhala godava. asalu em jarugutundi. ekada chusina kadalo kadalo antunnaru.
జ్యోతీగారూ,
ఊపిరి తిరగక ఉక్కిరిబిక్కిరి అయ్యానంటే నమ్మండి...
jyothigaru,
aa kadha ni nenu veteki mari chadevanu, chadevaaka enduku chadevanu raa ani
నాకేడుపొస్తోంది!
గురూజీ ,
ఇది చాలా అన్యాయం . నా బుర్రను ఇలా గిర్రున తిప్పటం మీకేమైనా బాగుందా ?
మనలో మన మాట మీకమైనా టి. వి లో న్యుస్ చదివే వుద్యోగం వచ్చిందా ? చెప్పండి . ముందుజాగ్రత్త చర్యగా టి. వి ని టాంక్ బండ్ లో పారేసి వస్తా . ఆటో ఖర్చు మీదే హా .
Hilarious :))
హి హి హి సూపరు జ్యోతి.. నవ్వి నవ్వి కళ్లవెంబడి నీళ్ళు వచ్చాయి నాకు. హి హి నువ్వు అడగాలే కాని క్యాబేజీ కూర తప్పకుండా పంపుతా నాకు పలావు మాత్రం నువ్వు సైకియాట్రీ నుంచి వచ్చి మంచి గా పలావు ఆకు కు తులసాకు కు తేడ తెలిసేక చేసిపెట్టమ్మోవ్, ఇప్పుడొద్దు నువ్వు వున్న మూడ్ లో చేస్తే ఆ జర్దారి పాకిస్తాను కలిపేసినందుకు గాను ఆంధ్రా ను వాడికి బహుమానమిచ్చేస్తా నేను. ;-)
ఆ దిక్కుమాలిన కథ ఎవరిదండి?
హ హ హ .. సూపర్.... ముఖ్యం గా "మొక్కుబడికి బుక్కులెన్ని...." పేరాగ్రఫ్.. నాలుగు సార్లు చదివా.. మీ బాధ అర్ధం చేసుకొదగ్గది.. మాలొ కొంతమందిది అత్మహత్యా ప్రయత్నం అయితే మీమీద పక్కగా హత్యప్రయత్నం జరిగిందన్నమాట..
అందరూ హాయిగా నవ్వేసుకున్నారా? ఐతే వాకే..
శ్రీలలిత, మాలగారు,
ఇలాటి ప్రయోగమే చాలారోజుల క్రింద చేసాను.
http://jyothivalaboju.blogspot.com/2008/08/blog-post_11.html
భావన..
నేను వెళ్లిన సైకియాట్రిస్ట్ కే కాస్త తికమక పెట్టాలే. నేను ఇప్పుడు బానే ఉన్నా.
చైతన్యగారు,
ఎందుకండి మీ జీవితాన్ని రిస్క్ లో పెడతారు. ఈ కధలేంటో, సినిమాలేంటో??
మంచుపల్లకిగారు,
ఈ డవికాగుకు మాత్రం జై జంద్యాల అనాల్సిందే. ఇక ఆ సినిమా సంగతేంటి మరి.. ఎవరైనా చూసారా?
జ్యోతిగారు మీరిది చూసినట్టు లేరు.
http://onlyforpraveen.wordpress.com/
ఈ కింది కథ కూడా చదివి విజ్రుంభించండి మరో పోస్ట్ తో
http://streevadam.co.cc/mag/node/12
సౌమ్యా,,
ఎందుకమ్మా నామీద పగ? ఒక్క కధ అలా చదివే నా పరిస్ధితి ఇలా ఐతే అతికష్టం మీద నిలదొక్కుకున్నా. ఇంకా పిల్లల పెళ్లిల్లు చేయాలి. అత్తల సంఘం ఏర్పాటు చేయాలి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలి. నన్ను వదిలేయ్ తల్లి. ఈ బ్లాగు చాలా రోజుల క్రింద చూసాను. అందులోని కామెంట్లను చూసి ఒకటే పరుగు. ఆ బ్లాగు పేరంటేనే భయంగా ఉంది. మీ అందరిలా కాదు నాది సున్నిత మనస్సు. దంఢం...
ఆ:-
ఒక్కముక్కకూడ చిక్కకున్నదిమీదు
దిక్కుమాలినకథ నిక్కిజూడ.
రెక్కతెగిన పక్షి, బిక్కమొహంమొక్క,
మొక్కుబడికిబుక్కు, చెక్కు, తప్ప.
చక్కగా వ్రాసారు :-)
హ..హ్హ..హ్హ....భలే భలే ,
ఇంతకీ ఏమాకధ ? ( అహ నేను చదవనులెండి. ప్రింటు తీయించి నా ఆగర్భ శతృవు తలగడకింద పెడతా )
దెబ్బకు ఠా...
sowmya garu enduku maa meeda mekentha kaksha?
aa link chusi tarinchamu, chelliki malli malli pelli laaga, naa bonda laaga, ...........
ఆ మరి మేమొక్కళ్ళమే చదివి ఎందుకు బాధపడాలి?బాధని అందరితో పంచుకుంటే తగ్గుతుందంటారు. అందుకే అందరికి ఇలా లింకులిస్తున్నాను :)
baagundhi:):)
hahahaa hihihee huhuhoo hohohO
జ్యోతిగారూ....ఇలా కూడ తిట్టొచ్చని నిరూపించారు.ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా....నకు బాగ నచ్చినవి...టమాటా పాయసం..పైనాపిల్ పులిహోర :))
Post a Comment