Friday, 26 March 2010

చిన్న మాట



బ్లాగులు అనేది మన స్వంత అభిప్రాయాలను రాసుకుని పంచుకునే అద్భుతమైన వేదిక. ఇది మన తెలుగు బ్లాగర్లందరికీ స్వానుభావమే.. మూడేళ్ళ క్రింద మొదలైన నా బ్లాగు ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులు, విజయాలు దాటుకుంటూ వచ్చింది. . ఇప్పటి ఈ గౌరవం, గుర్తింపు అంత సులువుగా రాలేదు అని నా మిత్రులందరికీ తెలుసు..మరో గుర్తింపు లభించిన సందర్భంగా నాకు ప్రత్యక్షంగా , పరోక్షంగా సహాయపడిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.


ఈ సందర్భంగా ఒక చిన్ని మాట. ఇది నా అనుభవం మీద తెలుసుకున్న విషయం. మనకు ఉన్న జీవితం చాలా స్వల్పం. రేపటి సూర్యోదయం చూస్తామో లేదో కూడా తెలీదు. మరి గాలిబుడగలాంటి ఈ చిన్ని జీవితంలో ఈర్ష్యా, అసూయ , ద్వేషాలు ఎందుకు??. ఏ బ్లాగర్ అయినా పేరు తెచ్చుకునేది అతని రాతలవల్లనే తప్ప అతని డబ్బు, స్టేటస్, రికమెండేషన్ కాదు. ఎవరి రాతలవల్లో, మాటలవల్లో మరొకరు మారరు. ఈ బ్లాగులలో ఎవరి రాతలు వారివి, నచ్చినవి చదవండి, ఇష్టముంటే కామెంటండి లేకుంటే లేదు. ద్వేషం వద్దు. అందరూ సరదాగా, నవ్వుకుంటూ , చర్చించుకుంటూ తెలియని విషయాలు , తెలిసిన విషయాలు తెలుసుకుందాం, పంచుకుందాం.

వీవెన్ అన్నట్టు తెలుగు బ్లాగులు ఒక శక్తివంతమైన మాధ్యమంగా మారుతున్నాయి. ఎందరో ప్రముఖులు, జర్నలిస్టులు బ్లాగులు రాస్తున్నారు. కొద్ది బ్లాగులు, బ్లాగు రాతలకే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు రాజకీయ నాయకులు, వారి అనుచరులు బ్లాగులలోకి వస్తే అప్పటి పరిస్థితి ఏంటి్? రాసేవాళ్ళ, చదివేవాళ్ళ గతి ఏంటి? ఎన్నెన్ని గొడవలు? ఎవరికైనా ఈ ఆలోచన వచ్చిందా.. ఇప్పటికైతే ఒకరికొకరు ప్రత్యక్షంగా కలవకున్నా బ్లాగుల ద్వారా మిత్రులయ్యారు. తర్వాత ఎలా ఉంటుందో? వేలల్లో వచ్చే బ్లాగులకు, హారం, జల్లెడ, కూడలి సరిపోతుందా? మనకు చదవదగ్గ బ్లాగులు eలా వెతుక్కునేది. పరిష్కారం ఏంటి ??? .

నాకు తోచిన పరిష్కారం ........ కూడలిని వీవెన్ నిరంకుశంగా నిర్వహణ చేయాలి. ఇష్టం లేనివారు తమకంటూ ప్రత్యేక అగ్రి గేటర్ మొదలుపెట్టుకోవచ్చు .. లేదా ఎవరికీ వారే తమ స్వంత కూడలి తయారు చేసుకుంటే సరి. గూగుల్ రీడర్ ద్వారా.. ఏమంటారు ???..

35 వ్యాఖ్యలు:

జ్యోతి

జెస్సిగారు

వార్త చెప్పినందుకు , క్లిప్పింగు ఇచ్చినందుకు కూడా థాంక్స్ అండీ..

SRRao

జ్యోతి గారూ !
మీ ఇంటర్వ్యూ చూసి చాలా సంతోషమేసింది. బ్లాగులకు ప్రాచుర్యం కల్పించినందుకు మిమ్మల్ని చూసి బ్లాగర్లందరూ గర్వపడాలి. వివక్షల్నీ, ఈర్ష్యా ద్వేశాలని పక్కకి పెట్టి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగిస్తే బ్లాగులు శక్తివంతమైన సాధనంగా మారతాయనడంలో నాకెటువంటి సందేహం లేదు. అలా మారడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో బ్లాగర్లందరూ వివేకంతో ఆలోచించాలి. మీకు శిరాకదంబం ధన్యవాదాలు.

సుభద్ర

జ్యోతిగారు,
అభిన౦దనలు...
మీకు గుర్తి౦పు వచ్చి౦ద౦టే అది మీ కృషి,పట్టుదలే కారణ౦..ఒ౦టిచేతో అన్ని బ్లాగులు చక్కబెడుతూ అన్ని అ౦త అ౦ద౦గా,అ౦దరికి నచ్చేలా రాస్తూ మీ ప్రతిభకి తగిన గౌరవ౦ దక్కి౦ది..కష్టలు వచ్చినప్పుడు దైర్య౦గా నిలిచారు..అన్ని౦టికి కలిపి మరో గుర్తి౦పు..
నాకు చాలా చాలా ఆన౦ద౦గా ఉ౦ది..

వేణూశ్రీకాంత్

అభినందనలు జ్యోతి గారు :-)

Kathi Mahesh Kumar

అభినందనలు.

మాలా కుమార్

.మీరిలాగే మరిన్ని గుర్తింపులు పొందాలి అని మన్స్పూర్తిగా కోరుకుంటూ అభినందనలు .

మేధ

Congrats Jyoti garu..

నిషిగంధ

హృదయపూర్వక అభినందనలు జ్యోతీ :-)

మధురవాణి

Hearty congratulations Jyothi garu!

M.Srinivas Gupta

జ్యోతక్కా,
అభినందనలు.

గీతాచార్య

Congrats

Unknown

కంగ్రాట్యులేషన్స్ జ్యొతిగారూ.. మీరు అందరికీ ఒక గొప్ప స్పూర్తినిస్తున్నారు.

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్

అభినందనలు.

స్వర్ణమల్లిక

జ్యోతి గారు, హృదయపూర్వక అభినందనలు

Anonymous

// కూడలిని వీవెన్ నిరంకుశంగా నిర్వహణ చేయాలి. ఇష్టం లేనివారు తమకంటూ ప్రత్యెక అగ్రి గేటార్ మొదలుపెట్టుకోవచ్చు .. లేదా ఎవరికీ వారే తమ స్వంత కూడలి తయారు చేసుకుంటే సరి. //

నిరంకుశత్వం పై మీకున్న అభిప్రాయాలకు , మక్కువకు నా అభినందనలు.

ప్రజాస్వామ్యంలో మీరు వుండబట్టే ఈమాత్రం నిర్మొహమాటంగా అభిప్రాయం వ్యక్తం చేయగలిగారు. అదే ఏ ఇస్లామిక్ లేదా కమ్యూనిస్ట్ దేశంలోనో వుండివుంటే మీరిలాంటి అభిప్రాయాలు స్వేచ్చగా బ్లా.. బ్లా.. బ్లాగుండేవారు కాదేమో.

ఏదో కొద్దిపాటి అవార్డులు, పొగడ్తలు, గుర్తింపూ రాగానే ఎలివేట్ అయి నట్టు అనిపించి , జాతినుద్దేశించి ఎర్రకోటపై నుండి ప్రసంగించాలని అనిపించడం సహజమే, కాని అభిప్రాయాలు వ్యక్తీకరించడంలో చాలా ఆలోచన, భాద్యత కూడా పెరుగుతాయన్నది వాస్తవం.

Anonymous

Congratulations

శ్రీలలిత

జ్యోతీ,
మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాల నివ్వాలని ఆ భగవంతుడుని మనసారా కోరుకుంటున్నాను...

satya

హార్దిక శుభాభినందనలు జ్యోతి గారూ!

Shiva Bandaru

Congratulations

Anonymous

అభినందనలు జ్యోతి గారు

Unknown

congratulations

రవి

వావ్! అవార్డు నాకొచ్చినంత సంబరంగా ఉంది. జ్యోతక్కకు ఓ పది వీరతాళ్ళు!

ఎప్పుడైనా భాగ్యనగరమొస్తే, నేనే మీకు పార్టీ ఇస్తా. (ఒక చిన్న ఇన్ఫో. నా ఫ్రెండ్స్ నన్ను "గజిని" అని పిలుస్తారు. :-))

Unknown

జ్యోతి గారూ! మీకు నా హృదయపూర్వక హార్దిక శుభాభినందనలు!!

కంది శంకరయ్య

వలబోజు జ్యోతి గారికి
యలరుచు తెల్పెదను నా శుభాకాంక్షలివే
సలలిత భావాన్విత బ్లా
గుల నిర్వహణమ్ము మీదు గొప్పయె కాదా.

భావన

congratulations Jyothi. You Rock...

cbrao

"కూడలిని వీవెన్ నిరంకుశంగా నిర్వహణ చేయాలి." -? I disagree.

జ్యోతి

అభినందించిన మిత్రులందరికీ ఆత్మీయ వందనాలు. ఈ గుర్తింపు నా ఒక్కదానిదే కాదు. తెలుగు బ్లాగర్లందరిదీ. మరీ ముఖ్యంగా మహిళా బ్లాగర్లది. నేను ప్రతినిధిని మాత్రమే అని అనుకుంటున్నాను...

S గారు,

స్టేజి ఎక్కించి దండ వేసాక ఆమాత్రం స్పీచ్ ఇవ్వకుంటే ఎలాగండి. జనాలు ఫీలవ్వరూ? ఐనా మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి అందరూ తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పవచ్చు. వినేవాడు వింటాడు లేకుంటే లేదు. దానికి బలవంతం చేయలేము కదా. ఏమంటారు??
సర్వే జనా సుఖినోభవంతు..

జాన్‌హైడ్ కనుమూరి

అభినందనలు

Sirisha

Congrats jyothi garu naku ma mother ki kuda mee blogs antey chala istam mukyam cookery amma regular ga choosi tidutundhi nannu ala upayogapadevi raya radu nenu help chestanu ani....

hearty congrats andi...

చింతా రామ కృష్ణా రావు.

అమ్మా! జ్యోతి గారూ! ముందుగా మీకు మా కుటుంబూకులందరి అభినందనలు తెలియఁ జేస్తున్నాను.
మీ అసాధారణ ఆలోచనా సరళే మిమ్ములను ఇంతటి స్థాయికి తీసుకువెళ్ళింది. మందులో ఉండే బలాన్ని పట్టే కదా తారాజువ్వ గగన తలంలో ఎగిరే ఎత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే మీనిరంతర సాధన; ఏదో మంచి చేసెద్దామనే తపన;తెలుగు బ్లాగులు నిత్యమూ అనంత జ్యోతిమయం కావాలని మీరు పడే కష్టమూ వెరసి మీ ఉన్నత శిఖరాల నిలిచిన కీర్తి పతాక.
మీ సేవలిలాగే నిరంతరం నిరంతరాయంగా సాగాలని కోరుకొంటున్నాను.
మీ సహృదయతయే తెలుగు బ్లాగులకు శ్రీరామ రక్ష.
May God bless you.

Padmarpita

కంగ్రాట్యులేషన్స్ జ్యొతిగారూ..

శ్రీధర్

జ్యోతీ! దేవుని దీవెనలు. మీ సహ్రుదయం, నిరంతర కార్యవ్యగ్రత. పట్టుదల, కార్యదీక్ష మీకీ గుర్తింపు నిచ్చాయి.నా కోసం మీరు చేసినది నా సొంత మనషులే చేయలేదు.మీ వ్యాఖ్య చూస్తే ఈ బ్లాగుల్లోకంలో ఏదో మంచుతెర ఉన్నట్లే ఉంది! అదేదో అర్థం కాకపోయినా నా కింకా కొత్త పూజారిత్వం గనుక, త్వరలోనే తెలియవచ్చని అనుకొంటున్నాను.మీరన్నట్లు బ్లాగుల్లో వ్రాతలని బట్టే వాటిగుర్తింపు కూడా ఉంటుందనే నా అభిప్రాయం!అయినా సరే కొంత మేనేజ్మైంటు కంట్రోలు అవసరమే! మీకు మరోసారి ధన్యవాదాలు!--శ్రీధర్. ఎ

జ్యోతి

మీ ఆశీస్సులకు ధన్యవాదాలు.

థాంక్స్ రవి. నువ్వొక్కడివే నాకు పార్టీ ఇస్తానన్నావు. మళ్లీ గజిని అనే ఫిటింగ్ పెట్టావు. ఇది బాలేదు. ఆ ఎఫెక్ట్ రాకముందే నా పేరుమీద ఓ చెక్ రాసి పంపేయ్.. నువు హై కి వచ్చినపుడు దాని సంగతి చూద్దాం..

psm.lakshmi

congratulations jyothi. All the best for future.
psmlakshmi

balu

hai madam. nenu mee blog chudadam idhe first time. saradaga browse chesthunte thagilindhi.chala bagundhi mee blog. na peru krishna . mee inspiration tho nenu kuda oka blog prarambhidham anukuntunnanu.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008