Tuesday, 23 March 2010

రాముడికి సీత ఏమౌతుంది??



రాముడికి సీత ఏమవుతుంది??

అందరికీ తెలిసిన వాడుక మాట ఇది. ఎవరికైనా విషయమంతా చెప్పిన తర్వాత కూడా ఏదో సందేహం వస్తే రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు ఉంది అని వేళాకోళం చేస్తారు. నిజానికి ఈ ప్రశ్న చాలా అర్ధవంతమైనది. అసలు సీతారాములలో ఎవరు గొప్ప అనేకంటే వారి మధ్య ఉన్న బంధం ఎటువంటిది అని తెలుసుకోవడం మంచిది.




రాముడికి సీత ఏమవుతుందో అనుకుంటూ వివరాలు చూద్దాం..

రావణాసురుడిని ఎలా సంహరించాలి అని శ్రీహరి మధనపడుతున్నవేళ ఆ హృదయం మీద నిరంతరం కొలువై ఉన్న లక్ష్మీదేవి (అలా ఎప్పటికి కూర్చుని ఉండడం వల్ల శ్రీవారి హృదయానికి ఓ మచ్చ ఏర్పడింది దాన్నే శ్రీవత్సం అంటారు.) శ్రీహరికి ధైర్యం చెప్తూ తాను భూలోకాన అవతరిస్తాను అని చెప్పి మరుక్షణంలో వేదవతి రూపంలో భూలోకాన అవతరించింది. దీన్ని బట్టి చూస్తే సీత రాముడికి మార్గదర్శకురాలు అయ్యింది.

దశరధుడు చేసిన పుత్రకామేష్టీ అశ్వమేధ యాగాల కారణంగా వచ్చిన పాయసం ద్వారా రాముడు కౌసల్య గర్భాన పదకొండు నెలల తర్వాత యోనిజుడై పుట్టాడు. సీతమ్మ మాత్రం అయోనిజయై జన్మించి జనకుడికి నాగటి చాలులో లభిస్తుంది. దీని బట్టి చూస్తే సీత రాముడికంటే అధికస్థాయిలో పుట్టినదౌతుంది.




అధిక బలశాలిని
తన ఆరవ ఏట ఒకనాడు చెలులతో బంతి ఆట ఆడుతున్న సీత ఎడమచేతితో మహిమాన్వితమైన శివధనుస్సు ఉన్న పెద్ద భోషాణాన్ని అలవోకగా పక్కకు జరిపేస్తుంది. రాముడు తన పదమూడవ ఏట స్వయంవర సభలో అదే వింటిని ధనుర్భంగం చేశాడు. దీన్ని బట్టి రాముడు తన పదమూడవ ఏట చేయగల పనిని ఆరవఏటనే సీతమ్మ చేయగలిగిన బలశాలి అని తెలుస్తోంది.
లోకంలో ఎక్కడైనా పరీక్షించేవాడు గొప్పవాడూ, పరీక్షకి సిద్ధమైన అభ్యర్ధి తక్కువవాడూ అవుతాడు. సీతమ్మ రామునికి శివధనుస్సుని పరీక్షగా పెట్టింది. అడిగిన దానికంటే ఎక్కువ సమాధానమిస్తూ (ఎక్కు పెట్టమంటే ఏకంగా విల్లునే విరిచేసాడు) రాముడు ఎక్కువ అంకాలతో ఉత్తీర్ణుడయ్యాడు. అంటే రాముడిని పరీక్షించగల శక్తి సీతమ్మకు ఉంది అని అర్ధమవుతుంది.

తల్లి కోరిక మేరకు పట్టాభిషేకాన్ని రద్దు చేసుకుని అరణ్యవాసానికి పయనమైన రాముడు "అరణ్యాల్లో పులులూ , సింహాలూ, కొండచిలువలూ , కల్లోల వాతావరణముంటుంది కాని ఏ సౌఖ్యాలూ ఉండవు" కావున సీతమ్మను తనతో రావొద్దని అంటాడు. కాని సీత తాను సౌఖ్యాలకోసం కాదు అరణ్యాలను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను, అందునా భర్త తోడుండగా భయమేల అని రాముడికే ధైర్యం చెప్పి వెంట నడుస్తుంది.





వయసుకి మించిన విజ్ఞత

సామాజిక దృష్టితో , దూర దృష్టితో రామునికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటంతటి ఉత్తమురాలు సీతమ్మ. చిన్న వయసులోనే (వనవాసానికి వెళ్లేటప్పుడు సీత వయసు 18 ఏళ్లు) పెద్దరికం తెచ్చుకుంది. రాముడికీ తోడూ నీడా అయింది. అరణ్యమునకు వెడుతూ సీతారాములు అనసూయాదేవిని దర్శించారు. ఇద్దరినీ ఆశీర్వదించిన అనసూయ సీతతో " అమ్మాయి నీ పెళ్లి కథని వివరించు" అని అడిగింది. సీతమ్మ తమని అరణ్యాలకు పంపి కష్టాల పాలు చేసిన కైకను, దశరధుని, రాముడిని. ఎవరినీ నిందించకుండా ఓపికగా పెళ్లి వివరాలు చెప్పింది. దానికి మురిసిపోయిన అనసూయ సీతకు వాడని పుష్పాలు, నలగని వస్త్రాలని ఇచ్చి ఆశీర్వదించింది.


రాముడికంటే ముందు తాను భూలోకానికి వేదవతిగా రావణాసురుడిని చంపించడానికే పుడతానని చెప్పింది. అలాగే రాముడికంటే ముందే లంకా నగారానికి వెళ్లింది. అదే విధంగా తానే ముందు వైకుంఠానికి వెళ్లింది సీతమ్మ. ఎక్కడెక్కడికి సీతమ్మ తనకంటే ముందు వెళ్లిందో (భూలోకానికి, మిథిలకి, లంకా నగారానికి, వాల్మీకి ఆశ్రమానికి, వైకుంఠానికి) రాముడు అక్కడక్కడికీ వెళ్లాడు. రాముని ప్రయాణం విజయవంతం కావాలని తాను ముందుగా వెళ్లి తన నాధుడికి అనుకూల పరిస్థితులను కల్పించిన సీతమ్మ రాముడికే మార్గదర్శకురాలైంది.

అరణ్యవాసంలో ఉన్న తనని రావణుడు ఎక్కడ అపహరించడో అని తల్లడిల్లిపోయింది సీతమ్మ. రావణుడు తనని అపహరించని పక్షంలో రావణుడిని వధంచడానికి రాముడికి తగిన కారణం దొరకని పక్షంలో రామావతార ప్రయోజనమే దెబ్బతింటుందని భావించిన సీత తన ప్రాణాన్ని, వంశప్రతిష్టతని పణంగా పెట్టి భర్తకోసమే రావణుడు తనని అపహరించేలా చేసుకుంది సీతమ్మ తల్లి. సీతాపహరణ సమయంలొ రావణుడితో జరిగిన పోరులో రెక్కలు విరిగి , చావు బ్రతుకుల్లో ఉన్న జటాయువును దుఖంతో కౌగలించుకుంటుంది. . భూమినుండి ఉద్భవించినందున సకల ఓషధులకు సమానురాలైన సీతమ్మ స్పర్శ కారణంగానే జటాయువు రాముడు వచ్చేవరకు ప్రాణాలతో ఉండగలిగాడు.





మనోబలంలో మిన్న

సీతావియోగానికి తట్టుకోలేక ధైర్యాన్ని కోల్పోయిన రాముడు ఆత్మహత్యకు సంబంధించిన మాటలు మాట్లాడతాడు లక్ష్మణుడితో. అయితే రాముడు తన దగ్గర లేకున్నా. శత్రువు ఇంట ఉన్నా కూడా సీత తన మనోనిబ్బరాన్ని కోల్పోకుండా రావణుడితో ఇలా అంటుంది.


అసందేశాత్తు రామస్య తపస శ్చామపాలనాత్
వ త్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్ధ చేతసా...

రాముని ఆజ్ఞ లేనికారణంగా నిన్ను బూడిద చేయలేకపోతున్నా అని స్పష్టంగా చెప్తుంది. రావణాసురుడితో నేరుగా మాట్లాడకుండా ఒక గడ్డిపోచను పట్టుకుని దానిని రావణాసురుడిగా భావించి ఈ మాటలు చెప్తుంది. రాముడే తన భార్యను కాపాడుకోగలడు అనే నమ్మకం ఆమెకు సంపూర్ణంగా ఉంది. పురుషుడైన రాముడికంటే సీత ఎక్కువ మనోధైర్యాన్ని కలిగి ఉంది.

రాముడి అంగుళీయకం యొక్క తపశ్శక్తి కారణంగా హనుమంతుడు సునాయాసంగా విఘ్నాలని దాటుకుంటూ నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మని కనుగొనగలిగాడు. అంగుళీయకాన్ని సీతమ్మకు తిరిగి ఇచ్చేశాక తిరిగివెళ్లే శక్తి మారుతికి లేదని గ్రహించిన సీత తన చూడామణిని ఇచ్చి తపశ్శక్తి, ఆశీర్వచనాన్ని కూడా ఇచ్చి పంపింది.




రావణవధ అనంతరం సీతమ్మని అలంకరించుకుని రమ్మని కోరాడు రాముడు. లంకలో సంవత్సరం ఉన్న కారణంగా నన్ను మరచిపోయి ఉంటే లంకాధిపతి విభీషణుడిని కాని, సుగ్రీవుని పంచన కాని చేరవచ్చని అంటాడు రాముడు. తన భార్య సౌశీల్యం గురించి పూర్తిగా తెలిసినా కూడా మహారాజు కనుక లోకానికి వెరసి ఆమె పాత్రివ్రత్య నిరూపణకోసం అగ్నిప్రవేశాన్ని కోరతాడు శ్రీరాముడు. ఐనా కూడా రాముని ఒక్కమాట కూడా అనకుండా అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటుంది.

అగ్ని రెండు విధాలు. ఇంధనం చేర్చగా వెలిగే అగ్ని ( సేంధనాగ్ని - స+ఇంధన_అగ్ని ) ఒకటి. ఇంధనపు అవసరం ఏ మాత్రమూ లేని అగ్ని ( అనింధనాగ్ని - న+ఇంధన+అగ్ని) మరొకటి. ఈ రెండింటిలోనూ అనింధనాగ్ని గొప్పది. ఈ అగ్ని ముందు సేంధనాగ్ని తలవంచి తీరుతుంది. సీతమ్మ ముందు అగ్నిహోత్రుడు తలవంచడమంటే ఇదే. అయోనిజ అయిన సీతమ్మ రాముని ఆదేశం మేరకు అగ్నిప్రవేశం చేసినా కూడాఎవరినీ నిందించక, తన గొప్పదనాన్ని నిరూపించుకుని అగ్నిపునీత అయ్యింది .. లంకాదహన సమయంలో ఎక్కడో ఉన్న హనుమంతుడి తోకని నిప్పు కాల్చకుండా చల్లగా ఉండేలా చేయగల శక్తిగల సీతమ్మ తల్లికి అగ్నిప్రవేశం ఓ లెక్కా? రాముడి మనసు సీతమ్మకు తెలుసు, సీతమ్మ శక్తి గురించి రాముడికి తెలుసు. లోకరక్షణకొరకు ఇద్దరూ సామాన్య మానవుల్లా ప్రవర్తించారు. ఈ రహస్యం తెలియని మూర్ఖులు వితండవాదం చేసి దుమ్మెత్తి పోస్తారు. ఈ సంఘటన ద్వారా సీతమ్మ తనకు తాను గొప్ప కీర్తిని తెచ్చుకున్నా రాముడు మాత్రం అనంతమైన అపకీర్తిని మూటకట్టుకున్నాడు.




సీతమ్మ ఇలా రామునికి మార్గదర్శకురాలు, సహనశీలి , రామునికంటే గొప్ప వ్యక్తిత్వం, శక్తి కలది కావుననే వాల్మీకి తన శ్రీమద్రామాయణానికి "సీతాయశ్చరితం మహత్"(గొప్పదైన సీతమ్మ చరిత్ర) అనే పేరుని పెట్టదలిచాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మానవులుగా అవతరించిన ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీమహాలక్ష్మీ ఇద్దరూ అన్యోన్యమైన, ఆదర్శమైన దాంపత్య జీవనానికి ప్రతిరూపాలు. మంచికి మారుపేరైన శ్రీరామునికి సీతమ్మ ప్రతి అడుగులో తోడూ , నీడా అయింది.

సర్వం రామమయం..సీతారామమయం..

మూలం.. డా.మైలవరపు శ్రీనివాసరావు...

ఇక కళ్యాణ వేడుకలు చూద్దామా.....

29 వ్యాఖ్యలు:

సుభద్ర

మాటలులేవు ............అత్యద్భుత౦..

The Mother Land

అద్భుతం. మహాద్భుతం. మీ విశ్లేషణ కి జోహార్లు. - సీతమ్మ లేనిదే రామయ్య లేడు. రామయ్య లేనిదే సీతమ్మ లేదు. ఇక్కడ భార్య భర్తల అనుబందాన్ని లోకానికి చాటడానికి ఇద్దరూ దోహదం చేసారు.

The Mother Land

అద్భుతం. మహాద్భుతం. మీ విశ్లేషణ కి జోహార్లు. - సీతమ్మ లేనిదే రామయ్య లేడు. రామయ్య లేనిదే సీతమ్మ లేదు. ఇక్కడ భార్య భర్తల అనుబందాన్ని లోకానికి చాటడానికి ఇద్దరూ దోహదం చేసారు.

kvrn

అద్భుతముగా వుంది. ధన్యవాదాలు

గీతాచార్య

Excellent

పానీపూరి123

బొమ్మలు చాలా బాగున్నాయి...

Unknown

చాలా బాగుంది. తెలియని విషయాలు చాలా విశ్లేషించి చక్కగా చెప్పారు. కాని ఒక చిన్న సందేహం. "రాముడు తన పదమూడవ ఏట చేయగల పనిని ఆరవఏటనే సీతమ్మ చేయగలిగిన బలశాలి అని తెలుస్తోంది" అన్నారు. కాని రాముడు తనకు పదమూడవ ఏడు వచ్చే వరకు ఆ పని చెయ్యడానికి చాన్స్ రాక చెయ్యలేదు కాని, ఆ పని తన ఆరవ ఏటనే చెయ్యగలిగి ఉండేవాడేనేమో. ఊరికే ప్రశ్నించాను. ఏమి జవాబు చెప్పనక్కర్లేదు . మీరు ఉంచిన బాపు చిత్రాలలో ఆఖరుది ఎక్కడైనా ఒరిజినల్ పోస్టర్ దొరుకుతుందా?

జ్యోతి

kk గారు, రాముడికి అవకాశం రాలేదు కనుక ఆ పని చేయలేదు అని కాదు. సీతమ్మ అంత చిన్న వయసులోనే వేయిమంది సైనికులు కలిస్తేనే కదపగలిగే విల్లుని అలవోకగా పక్కకు జరిపింది. అంటే ఆ వయసులోనే ఆమె బలవంతురాలు అన్నట్టేగా..

ఆ చిత్రం మీకు బాపు బొమ్మల పుస్తకంలో దొరకొచ్చు. పోస్టర్స్ సంగతి తెలీదండి. నేను ఒక పుస్తకంలో వస్తే ఫోటో తీసి పెట్టాను. బాపు సైటులో చూడండి. దొరకొచ్చు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు

చాలా బాగా రాశారు.

శ్రీలలిత

చాలా బాగా విశ్లేషించారు. సీతారాములిద్దరూ ఆదర్శ దంపతులు..

Unknown

బొమ్మలు బాగున్నాయి...శ్రీరామనవమి సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు!

kiranmayi

ఒప్పెసుకున్నాం. సీతమ్మే గ్రేట్

చిలమకూరు విజయమోహన్

మూర్ఖులు వితండవాదం చేసి దుమ్మెత్తి పోసేవాళ్ళకు మంచి సమాధానం.

Bhanu

మీ విశ్లేషణ చాలా బాగుంది. సీతమ్మవారి అవతార ఉద్దేశ్యాన్ని హ్రుద్యంగా వివరించారు.

Vinay Datta

It's a very beautiful presentation of Seetamma's greatness.I've come across this version for the first time.
As for Rama, it is not proper to say that he could lift the bow only at the age of 13 and not before that.It is also not because he couldn't get a chance to lift it till he turned 13, as 'kk' said.I strongly believe that though Rama was always capable of lifting it, there was no such need till he turned 13. Please check up with your gurus.

నాగప్రసాద్

బాగుంది.

జ్యోతి

మాధురి గారు,

నేను సీతమ్మ మాత్రమే గొప్పది అని చెప్పాలనుకోలేదు. ఆమె కూడా ఎంతో శక్తి కలది రాముడికి తక్కువ కాదు అని మాత్రమే చెప్పాలనుకున్నాను. అసలైతే అన్యోన్యంగా ఉండే దంపతులలో (ఇప్పటికీ కూడా) ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఒకరి శక్తి, ప్రేమ, విలువ మరొకరు తెలుసుకుని ఉంటే ఆ దంపతులు ఎటువంటి కష్టాలైనా సునాయాసంగా దాటగలరు. లోకులు కాకులు ఎన్నో మాటలు అంటారు కదా..

జ్యోతి

విజయ్ మోహన్ గారు ,,

అలా నిందించిన మూర్ఖులలో నేనూ ఉన్నానండి. ఏణ్నర్ధం క్రింద రాసిన టపా చూడండి. అప్పుడు తాడేపల్లిగారు, కామేశ్వరరావుగారు చెప్పిన పిమ్మట పుస్తకాలు చదివి, ఎన్నో భక్తి సంబంధమైన కార్యక్రమాలు చూసి, కొందరు పెద్దలతో చర్చించి అసలు విషయాలు తెలుసుకున్నాను. నిజంగా ఈ సినిమాలు, కథలు అసలు నిజాన్ని మరుగునపెట్టి జనాలను పక్కదారి పట్టిస్తున్నాయి. వాళ్లకేంటి కళ్లముందు ఇపుడు కనిపిస్తుంది,వినిపిస్తున్నదే నిజమనుకుంటారు.. ఒకరు చెప్పేవరకు అది తప్పు అని తెలీదు కదా.

కామేశ్వరరావు

బాగుందండి! మీరెంత కాదంటున్నా, ఇందులో రాములవారికన్నా సీతమ్మవారే గొప్ప అన్న భావమే కనిపిస్తోంది :-) ఈ దృష్టిలో ఆలోచిస్తే అది నిజమే కూడా, సందేహం లేదు. అలా అంటే ఆ రాముడేమీ అనుకోడు కూడా, వారిద్దరి మధ్యా అలాంటి పట్టింపులు, భేదభావం అతనికి/ఆమెకి లేవు కాబట్టి.
ఎటొచ్చీ దీన్ని చదివి కొంతమంది, అయితే సీత పేరిట "సీతానవమి" జరపకుండా "శ్రీరామనవమి" ఎందుకు జరుపుతారు అని అడిగే అవకాశం ఉంది! దానికీ సమాధానం ఉందనుకోండి. :-)

Vinay Datta

Jyothi garu,

Iam not trying to see your post as a competition between husband and wife. They are one, together. I only said that there was no need for Rama to to lift the bow till he turned thirteen. I said that because you commented...Seetha could do it much before Rama. But I thoroughly enjoyed reading and understanding your interpretation with the help of Sri Mylavarapu.

Thanks.

వీర

Jyothi,

Congratulations!
I saw your interview and photo in Today's Times of India paper.

వీర

Your photo was published in TOI paper.

http://timesofindia.indiatimes.com/india/Indic-blogs-Vernacular-is-the-e-way-to-go/articleshow/5725291.cms

Indic blogs: Vernacular is the e-way to go

NEW DELHI: Jyothi Valaboju was prowling the web for sites on education for her kids when she discovered a Telugu internet group. She got chatting. So lively and entertaining was she, that its members suggested she start blogging. The 46-year-old homemaker from Hyderabad needed no further encouragement.

Three years later, Valaboju has emerged a prolific Telugu blogger with five blogs on topics including cookery, music and religion. On a productive day, she makes as many as 10 posts. "I have a blog for every hobby," she says.

It started around 2004-05, speeded up during 2006-07 and broke into full gallop in 2008. Now, the Indic blog — blog in Indian script — has arrived bigtime. It's not an exclusive playground of the software developers anymore with many 'lay' users plunging in. Crosswords in Hindi, film reviews in Telugu and market analysis in Tamil, they are doing it all. Bhopal-based technical consultant Ravishankar Shrivastava, 50, has translated an entire desktop environment into Chhattisgarhi. And how's this for epic? The whole of Ramcharitamanas is at ramayan.wordpress.com.

Aggregators gathering Indic blogs report a rapid growth in their number. Number of Hindi blogs, or 'chitthas', with Chitthajagat, swelled from 1,500 to 6,000 in 2008 and is now over 12,000; Thiratti.com started in 2007 with 14 Tamil blogs. It now has 5,100.

Founder A Venkatesh estimates there are about 6,400 Tamil and 3,500 Telugu bloggers. A Bangla aggregator shows over 25,000 blogs, most by Bangladeshis. The numbers forced Indibloggies founder, Pune-based software consultant, Debashish Chakraborty to exclude Indic blogs from the 2008 awards. That category was big enough to deserve a separate one.

"Now more people have internet-access and more computers are Indic-enabled. The Inscript keyboard, which allows you to type Indic, is popular. Primary school kids and grandpas can learn typing with Inscript in three weeks," says Alok Kumar of Chitthajagat, explaining the proliferation.

Blogging hasn't exactly been a lucrative venture for Indic bloggers although some offer their sites for advertising. "But I get love, respect and appreciation. Many bloggers call me didi or jyothakka," says Valaboju. Money, surely, can't buy those things

నేను మీ నేస్తాన్ని

jyothi gaaru meeru seeta yela puttindoo sarigaa cheppaledu nenu vinna kathalaki meeru raasinaa daaniki teda undi seeta yela pudutundoo naaku cleargaa cheppagalaru nannu tittavaddu naaku teliyaka adiginaa nantee and manaku telisi janakuni polam dunnutuntee dorukutundi ani andariki telisindee kaani aaa avataram yela jarigindi anedi meeru cheppaledu aamee yela janminchindi ani kooda cheppaledu plz. meeku teliste naaku cheppandi
naa ID: seshagiri75@gmail.com

జ్యోతి

శేషగిరిగారు,

సీత మీరు చెప్పినట్టుగానే జనకమహారాజుకు నాగటిసాలులో పాపలాగే దొరికింది. అందుకే అయోనిజ అన్నారు.. రాముడిని మాత్రం కౌసల్య తొమ్మిది నెలలు గర్భాన దాల్చి కన్నది.

Seetharam

Good Analysis...

Few observations from my side.

Handling Lord Shiva's bow is not a matter of strength. It is a matter of immortal capability. Both of them possessed it like Janaka and other sages. So, they could move it. It is not due to age factor. We humans, can happily interpret it as strength of body, but I believe it is more mental.

Birth of Sri Rama cannot be undermined, just because, he is born in the womb. It is to kill Raavana, Lord Vishnu had to honor that and yet, he is the fruit of Yajna.

Raama himself liked being called, Seethapati. "Raamaaya, raama bhadraaya, raama chandraaya vedhase, Raghunaathaaya naathaaya, seetayah patayennamah.." He heard the cries only after the last word..

Unknown

Jyothi garu,

Really it is too good. I have seen sitama in a different angle this is too good.

Sathish Kumar

Unknown

asyaa devyaa yathaa ruupam anga pratyanga sauSThavam |
raamasya ca yathaa ruupam tasya iyam asita iikSaNaa

నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి, ఆవిడ అంగ ప్రత్యంగములయందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు ( సీతమ్మని చూడడం అంటె ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతియందు పురుషుడిని{రాముడిని} చూడడం, అంటె హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు

మౌనిక

chaka bavundhi its true

మౌనిక

chala bavundhi chala kotha vishayalu telusukunnanu thank you!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008