వేసుకోండి వీరతాడు.
ఆంతా ఇంగ్లీషుమయమైన ఈ రోజుల్లో అచ్చమైన తెలుగు పదాలు వినగానే మనసు పులకరిస్తుంది.. ఎవడూ పుట్టించకుంటే మాటలెలా పుడతాయని అలనాడే పింగళి వారు నొక్కి వక్కాణించారు మన ఘతోత్కచులవారినోట.. అదే మాట స్పూర్తిలో తెలుగు పదం మొదలైంది. ఎన్నో ఆంగ్ల పదాలకు సమానార్ధకములైన తెలుగుపదాలు వాడకం మొదలుపెట్టారు తెలుగు బ్లాగర్లు. ఇదే విధంగా మరో మాట కూడా తెలుగు బ్లాగర్లు విరివిగా వాడుతున్నారని చెప్పవచ్చు. "వీరతాడు" .. ఎవరినైనా అభినందించాలంటే ఒక వీరతాడు వేసేస్తారు. అసలు వీరతాడు అంటే ఏంటి ? ఎలా ఉంటుంది? అంటే మాయాబజార్ లోని లంబు జంబులని అడగాలి. మరి అడిగేద్దాం. ఆ వీరతాడు ఎలా ఉంటుందో చూడండి మరి.
5 వ్యాఖ్యలు:
జ్యోతి! చాల బాగుందమ్మా! వీరత్రాడు వ్యవహారం. మీ యీ ప్రయత్నమున్నూ. శ్రేయోభిలాషి ...నూతక్కి
జ్యోతిగారూ! వీరతాడు వ్యవహారం మాయాబజార్ లింక్ బాగున్నాయండి. ....అభినందనలు. రాఘవేంద్ర.
మీరు చెప్పిన తరువాత ఈమాట కొసం గూగులమ్మలో చూస్తే మంచి మంచి వ్యాసాలు కనపడ్డవి:
http://www.eemaata.com/em/issues/199911/880.html
http://www.pingali.info/biography/chitrajune2009.html
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2007/veerataallu.html
నెనర్లు
స్వరూప్ గారు మంచి లింకులు ఇచ్చారు. చాలా కాలంగా తెలుగు బ్లాగర్లు వీరతాడు గురించి మాట్లాడుతుంటే అర్ధమయ్యేది కాదు. ఎలా ఉంటుంది అని కూడా అడిగాను. ఎవ్వరూ ఆ చిత్రం ఇవ్వలేదు. గూగులమ్మని కూడా అడిగి అలిసిపోయాను. పొద్దు గడి స్లిప్పు కోసం మాయాబజార్ సినిమా చూస్తుంటే ఈ సీన్ దొరికింది. ఆ సీన్ కత్తిరించి బ్లాగులో పెట్టాను. నాకోసం, నాలాంటివారికోసం..
ఏదైనా సాధించినప్పుడు, విజయం సాధించినప్పుడూ ఏదో ఒక బహుమతి ఇస్తే వారి ఆనందం రెట్టింపు అవుతుందని ఘటోత్కచుడు ఆనాడే మొదలుపెట్టాడన్నమాట.. :))
meekoka veera thradu andi jyothi garu :P
Post a Comment