నాపై ఎందుకింత ప్రేమ??
సంతోషంగా ఉన్నవేళ
నన్ను స్పృశించ సాహసించవు
సమూహంలో ఉండగా
నన్ను పలకరించ భయపడేవు.....
కాస్త దిగులుగా ఉన్నంతనే
నేనున్నానంటూ తడిమేస్తావు
ఒంటరిగా బెదిరి ఉన్న సమయాన
జడివానలా, జలపాతంలా కమ్మివేస్తావు....
నా మనసులో , భావనలలో
అలుముకుని, అల్లుకుపోయిన దుఃఖమా!
ఆనందంలో పలకరించేవు, ఆవేదనలో తోడుండేవు
ఎంత అణచిపెట్టినా, అడ్డు చెప్పినా కంటి కొనలో నిలిచేవు...
ఉప్పెనలా నన్ను చుట్టేసి
భావోద్వేగపు వెల్లువను శాంతపరిచేవు
తుఫానులో చిగురుటాకులా నన్ను వణికించే
దుఃఖమా? నాపై ఇంత ప్రేమ ఎందుకమ్మా???
7 వ్యాఖ్యలు:
బొమ్మ చాలా బాగుంది. :-)
super ga undi post + bomma...
dhukham kadaa anduke daanikanta prema....chala baagundi
చాలా బాగుంది అండి.....
మీరు దుఃఖం మీద రాశారు. ఇది చదువుతుంటే నేను ‘ఒక కన్నీటి చుక్క’ అంటూ రాశినది గుర్తుకు వస్తోంది.
మీరు " ఆనందంలో పలకరించేవు, ఆవేదనలో తోడుండేవు " అన్నారు
నేను " బాధలోనూ నేనున్నానంటుంది
ఆనందమైనా అతిథిలా వస్తుంది " అన్నాను.
కానీ రెండూ ఒకే అనుభూతి కలిగిస్తున్నాయి.
చాలా బాగుంది మీ కవిత.
వీలైతే ఇది కూడా చదవండి.
http://premikudu1.blogspot.com/2009/10/blog-post_27.html
జ్యొతి గరు చాలా బాగుంది కవిత + ఆర్టు .
దుఃఖం,ఆనందం కన్నీటి రూపంలో రాకపోతే మనసులో అవి ఘనీభవించి మనిషికి అర్థం లేకుండా పోతుంది.కానీ మీ కవితలో వాటిని ఎంత ఆర్ద్రంగా ప్రశ్నించారు. good poetry.
Post a Comment