Monday, May 3, 2010

జయహో ప్రమదావనం

ఈరోజు ఈనాడు వసుంధరలో ఆన్లైన్ స్నేహం, ఆపన్నులకు సాయం అనే శీర్షికలో మహిళా బ్లాగర్ల ప్రమదావనం గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రమదావనం గతంలో చేసిన సహాయ కార్యక్రమాల వివరాలు మరోసారి. ఈ సేవాస్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రమదావనం సభ్యులకు, మా కార్యక్రమాలకు సహాయం చేస్తున్నవారికందరికీ అభినందనలు, ధన్యవాదాలు..

ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న కొందరు మహిళలు ఊరికే బ్లాగులు రాయడం వరకే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రమదావనం అనే గూగుల్ గుంపు. ఎక్కడెక్కడి మహిళా బ్లాగర్లు అప్పుడప్పుడు సరదాగా కలిసి కబుర్లు చెప్పుకోవటానికి, బ్లాగులకు, కాని సాంకేతికమైన సలహాలకి, సందేహాల నివృత్తికి, ఇంకా సభ్యులకి ఏవైనా సలహాలు కాని సంప్రదింపులు కాని అవసరమైతే సహాయ పడటానికి ఏర్పడ్డ ఓ వేదిక. అప్పడప్పుడు వివిధ ప్రదేశాలలో ఉన్న మహిళా బ్లాగర్లందరూ తమ ఇంటినుండే ఒకే సమయంలో సమావేశం ఏర్పాటు చేసుకుని కబుర్లు, ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతుంటారు.ఈ ప్రమదావనం సభ్యులు బ్లాగులు రాసుకోవడం, కబుర్లాడుకోవడం వరకే కాక సమాజానికి తమవంతు చిన్ని సాయమైనా చేయాలనే కోరికతో సహాయ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సహాయ కార్యక్రమాలు ఒకటి రెంఢు సార్లు కాకుండా క్రమం తప్పకుండా నిర్వహించాలనే దృడసంకల్పంతో ఉన్న ప్రమదావనం సభ్యులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకోసం అందరూ స్వచ్ఛందంగా ధనసేకరణ చేస్తున్నారు. ఒకరికొకరు ముఖపరిచయంలేకున్నా కూడా ఎవరికి వీలైతే వారు ఈ బాధ్యతని నెత్తికెత్తుకుని విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. మరికొందరికి స్పూర్తినిస్తున్నారు.ప్రమదావనం సహాయకార్యక్రమాల వివరాలు....

మొదటి కార్యక్రమం

అంకురం


రెండవ కార్యక్రమం..

యామిని


మూడవ కార్యక్రమం..

ఆత్మీయ స్పర్శ


నాలుగవ కార్యక్రమం..

నన్ను బ్రతికించండి...


ఐదవ కార్యక్రమం...

వరదబాధితులకు ఐదువేలు విరాళంగా పంపడమైంది..ఆరవ కార్యక్రమం....

వెచ్చదనపు స్పర్శ


లింకు పనిచేయని పక్షంలో ఇది ఉపయోగపడుతుంది..

ఆన్‌లైన్‌ స్నేహం... ఆపన్నులకు సాయం
మాజంలో మనమూ ఒకరం... మన వంతుగా సమాజానికి ఏదో ఒకటి చేద్దాం. రోజులో కొంత సేపు.. వారానికో గంట.. ఇలా అనుకునే గృహిణులు, మహిళలు ఇప్పుడు ఆన్‌లైన్‌ బాటపడుతున్నారు. స్నేహ బృందాలుగా ఏర్పడి... ఆపన్నులకు ఆసరాగా నిలుస్తున్నారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో... కమ్యూనిటీలనే అందుకు వేదికలుగా మలుచుకుంటున్నారు. క్షణం తీరిక లేనిజీవితాల్లోనూ సేవకు సిద్ధమనే వారితో 'వసుంధర' ముచ్చటించింది.
అందరూ నడిచే ఆ రహదారికి పక్కగా ఓ పాఠశాల. పేరుకే చదువుల నిలయం. కానీ సౌకర్యాల లేమి. ఉపాధ్యాయుల కొరత. దాంతో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితి అటుగా వచ్చీపోయే వారందరికీ తెలిసినదే. అయినా ఎవరూ చొరవ చూపింది లేదు. కానీ ఓ రోజు అకస్మాత్తుగా ఆ స్కూలుకి చేరుకున్న కొందరు అమ్మాయిలు పరిస్థితుల్ని గమనించారు. స్కూలు పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు బాధ్యత తీసుకున్నారు. స్వల్ప కాలంలోనే సకల సౌకర్యాలు సిద్ధం చేశారు. టీచర్లు, నెల జీతాలు, పిల్లలకు మంచి నీటి వసతి వంటివి కల్పించి, దాన్నొక చక్కటి విద్యాకేంద్రంగా మలిచారు. ఇన్ని ఏర్పాట్లు చేసిన ఆ బృందం పేరు అభిలాష. ఆ స్కూలు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉంది. ఆన్‌లైన్‌లో పరిచయమై... స్నేహ బృందంగా ఏర్పడి... అభాగ్యులకు ఆసరాగా నిలవాలన్న సదాశయంతో అడుగులు వేస్తున్న బృందాల్లో అదొకటి. ఈ రకంగా ఏర్పాటవుతోన్న ఆన్‌లైన్‌ కమ్యూనిటీ బృందాల్లో విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులు... ఇలా అన్ని వర్గాల వారూ ఉన్నారు.

తలా కొంత.. ధైర్యం నింపేంత!
ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌, యాహూ, గూగుల్‌ గ్రూప్స్‌, ఇండ్యారాక్స్‌.. సోషల్‌ కమ్యూనిటీ సైట్‌ ఏదైనా కానివ్వండి.. అవి టీనేజీ స్నేహాలకే పరిమితం అనుకుంటే పొరబాటు. వీటినే తమ సదాశయాలకు వేదికలుగా మలుచుకుని ఇంతింతలుగా సేవని విస్తృతం చేస్తున్నారు. ఒక్కరుగా సేవా మార్గంలో నడవడం, ఆపన్నులను చేరుకొని సాయం అందించడం సులువైన విషయం కాదు. ఇక్కడే ఆన్‌లైన్‌ పరిచయాలూ అందుకు ఉపకరిస్తున్నాయి.

మనసుంటే తోటి వారికి ఏదో రకంగా సాయపడొచ్చు.. అది డబ్బు రూపంలోనే కానవసరం లేదు.. అని నిరూపిస్తున్నాయి ఆన్‌లైన్‌ స్నేహ లు. తోటివారిని ఆర్థికంగా ఆదుకోవడం, కనీస సౌకర్యాలు కూడా లేనివారికి అవి అందించడం, కష్టకాలంలో నీడ నివ్వడం... మనసుకు ఊరట కల్పించడం, నవ్వులు మృగ్యమైన వారి మోముల్లో సంతోషాలు పంచడం ఇలాంటివే మేము చేస్తుంటాం. వీటన్నింటికి డబ్బే ఉండాలనేం లేదు కదా.. చేయాలన్న తపన ఉంటే చాలు అంటారు నెల్లూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ ప్రశాంతి. యాహూ గ్రూప్స్‌లో 'బర్డ్స్‌ ఆఫ్‌ సేమ్‌ ఫెదర్స్‌', 'టు మేక్‌ ఎ డిఫరెన్స్‌' పేర్లతో ప్రత్యేక బృందాల్ని నిర్వహిస్తున్న ప్రశాంతి ఏమంటున్నారంటే.. 'డబ్బు అవసరమైతే సభ్యులందరికీ సమాచారమిచ్చి, వచ్చిన మొత్తంతో పాఠశాలల్ని దత్తత తీసుకున్నాం. గదులు, వసతులు, పుస్తకాలు అన్నీ సమకూర్చాం. పేదలకు ఆరోగ్య చికిత్సలు, ఈ వేసవిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. డబ్బు అందించలేని వారు ఇటువంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారితో ఆడుకోవడం, అనాథ పిల్లల్ని, వికలాంగుల్ని కలిసి మాట్లాడటం, ఆత్మవిశ్వాసం అందించడం చేస్తుంటాం' అని చెప్పుకొచ్చారు.

కలసి చేసే సాయం..
ఓ మంచి పని చేసే యత్నంలో అందరి మనోభావాలు తెలుసుకొని అడుగేస్తే ఫలితాలు బావుంటాయి. ఈ సమస్యను అధిగమించడం కోసం ఏం చేస్తారో వివరించారు గూగుల్‌ గ్రూప్స్‌లో 'ప్రమదావనం' బృందంతో సేవా కార్యక్రమాలు చేస్తోన్న గృహిణి జ్యోతి వలబోజు. 'ప్రతి ఒక్కరి అభిప్రాయానికీ విలువిస్తాం. బాగున్న ఆలోచనకు మద్దతిస్తాం. పేరుకు ఆన్‌లైన్‌ ఫ్రెండ్సే అయినా ఎక్కువ మంది సభ్యులుండేది హైదరాబాద్‌లోనే. అందుకే తరచూ కలుస్తుంటాం. ప్రతీ కార్యక్రమానికి ప్రణాళిక వేసుకుంటాం. కర్నూలు వరద బాధితులకు సాయం, వృద్ధాశ్రమాల్ని సందర్శించి అవసరమైనవి సమకూర్చడం, రోడ్డుపక్క ఎండకి వానకి చలిలో గజగజలాడే వారికి దుప్పట్ల పంపిణీ.. లాంటివన్నీ అలా చేసినవే. ఏ ఒక్కరికీ భారం కాకుండా పనుల్ని పంచుకుంటాం' అంటారు.అనురాగాల మాలిక
సమాజంలో కష్టాలని, కన్నీళ్లని కొంతైనా దూరం చేయగలిగితే చాలనే సద్భావంతో ఆన్‌లైన్‌లో కలిసి... సేవతో సాగుతోన్న బృంద సభ్యుల మధ్య చక్కని అనుబంధం పెనవేసుకుపోయింది. ఒక బృందం అంటే ఒక కుటుంబం అన్నట్టు మెలగుతారు. 'అభిలాష' బృందం సభ్యురాలు, ఇంజినీరింగ్‌ విద్యార్థిని తేజస్విని ఏమంటుందంటే 'అక్కా, చెల్లి, అన్నా అని ఆత్మీయంగా పిలుచుకునే పిలుపులే కాదు.. వీటన్నింటిని మించిన సేవాభావం మా అందరినీ ఏకతాటిపై నడిపిస్తోంది. తరచూ కలుస్తూ ఉంటాం. ఒకరి కష్టాలు ఇంకొకరం తెలుసుకుంటాం. ఎవరైనా మూడీగా కనిపిస్తే.. 'ఊర్కోరా.. కష్టాల్లో ఉన్నవారందర్నీ గట్టున పడేస్తున్నాం, నిన్ను పడేయలేమా' అంటూ ఊరటనందిస్తాం.. అంత చనువు మాకు' అని ఆ అనుబంధాల తీరుని వివరించారు. యువ బృందంగా పేరొందిన అభిలాషలోని అమ్మాయిలు స్వైన్‌ఫ్లూ సమయంలో మందుల పంపిణీ చేశారు. వికలాంగుల్ని ఆదుకోవడంలో ముందుంటారు. 'పండుగలకు, పుట్టిన రోజులకి పాఠశాలలు, వృద్ధాశ్రమాలకు వెళతాం. ఆ రోజంతా అక్కడి వారితో గడుపుతాం. మాకు తోచిన సాయం అందించి వస్తాం. త్వరలో మా బృందం తరఫున ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధిచేయాలనే ఆలోచనలో ఉన్నాం' అని తెలిపారు దాన్లో సభ్యురాళ్లు సుప్రియా రెడ్డి, స్రవంతి. మీరూ ఇలాంటి వారితో జత కట్టాలంటే నచ్చిన సోషల్‌కమ్యూనిటీ వెబ్‌సైటులో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోండి. ఆ తరవాత కమ్యూనిటీలను ఎంచుకొని వాటిలో సభ్యులుగా చేరిపోవచ్చు.

15 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar

అభినందనలు.

Anonymous

Eeroju vasundhara lo mee gurinchi chadivi chalaa inspire ayyaanu. You people are doing really great work.
Wish you all the best madam.

Malakpet Rowdy

Good Job by the way

SRRao

జ్యోతి గారూ !
అభినందనలు. మీరిచ్చిన లింక్ లో చదువుదామని ప్రయత్నం చేస్తే......
Sorry, the page (or document) you have requested is not available.

Please check the address and try again.
ఈ మెసేజ్ వస్తోంది. ఒక్కసారి పరిశీలించండి.

జ్యోతి

రావుగారు,
చెక్ చేసాను. నాకు బానే ఒపన్ అవుతుంది మరి. ఎందుకైనా మంచిదని వ్యాసం మొత్తం టపాలోనే పెట్టాను..

సుజాత వేల్పూరి

Excellent Jyothi garu,
My hearty congratulations to all the members of Pramadavanam!

ఓ బ్రమ్మీ

జయ్ హో.. జయ హో.. జయ్ హో..

శేఖర్ పెద్దగోపు

గ్రేట్!!...జ్యోతిగారికి మరియు ప్రమదావనం సభ్యులందరికీ అభినందనలు...

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్

అభినందనలు.

Naresh Patnaik

జ్యోతి గారూ...
వసుంధర లో మీ గురించి చదివాను.
అభినందనలు.

వేణూశ్రీకాంత్

జ్యోతి గారికి మరియు ప్రమదావనం సభ్యులందరికీ అభినందనలు.

జ్యోతి

ఆందరికీ ధన్యవాదాలు.. ఈ సేవాకార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను..

Jayabharathi

జ్యోతి గారూ...
వసుంధర లో మీ గురించి చదివాను.
అభినందనలు.

జ్యోతి

భారతిగారు ,
థాంక్స్ అండి..

రుక్మిణిదేవి

jyothi garu,,బాగుంది.. సమాజ సేవా kaaryakramaallo nenu కూడా ఎక్కువగానే పాల్గొంటూ వుంటాను..మా వారి సహకారం మరియు కాలనీ వారి సహకారం తో.. individyual gaa koodaa naa sahaayam వుంటుంది..యు are doing అ గుడ్ job.. god bless u.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008