Friday 7 May 2010

ఆముక్తమాల్యద

ఆముక్తమాల్యద గ్రంధం సామాన్య పాఠకులకు కొరుకుడు పడదు. అంత సులువుగా అర్ధం కావు అని ఒక భావన ఉంది. కాని కొద్దిగా కష్టపడితే అది నారికేళ పాకం లాంటిదే అని అర్ధమవుతుంది. ఇది నా స్వానుభవం మీద చెప్తున్న మాట. ఆముక్తమాల్యద మొదలుపెట్టినది మొదలు నా బ్లాగులో వివరణలతో ఇచ్చాను. కాని ఈ ఆముక్తమాల్యద కోసమే విడిగా ఒక బ్లాగు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఊహ వచ్చిన వెంటనే కామేస్వరరావుగారితో సంప్రదించి ఆయన సహకారంతో బ్లాగు నిర్వహించవచ్చు అని ఆముక్తమాల్యద అనే బ్లాగును మొదలుపెట్టేసాను. ఈ రచనలోని పద్యాలకు తమ స్వరాన్ని అందించడానికి చదువరి, రాఘవ అంగీకరించారు. ఈ మహామహులతో కలిసి తలపెట్టిన ఈ మహా కార్యాన్ని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ బ్లాగులోని రచనలకు మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియచేయగలరు.

ఈ ప్రభంధ కృతికర్త ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణదేవరాయలను స్మరిస్తూ , ఆ ఏడుకొండలవాడు శ్రీనివాసుడి ఆశీర్వచనాలతో మొదలుపెడుతున్న ఈ బ్లాగు నిర్విఘ్నంగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ బ్లాగు నిర్వహణకు తోడ్పడడానికి వెంటనే అంగీకరించిన భైరవభట్ల కామేశ్వర రావుగారికి, పద్యాలను తమ స్వరంలో శ్రవ్యకాలుగా మార్చి ఇవ్వడానికి ముందుకొచ్చిన చదువరి, రాఘవ గారికీ ధన్యవాదాలు...


ఆముక్తమాల్యద.. http://amuktamalya.blogspot.com/

10 వ్యాఖ్యలు:

Vinay Datta

I had a lesson about aamukthamaalyada with excerpts from it when I was in school. I thoroughly enjoyed it. Iam looking forward to follow your 'collective' blog with enthusiasm and eager.

జ్యోతి

Madhuri,,

click on the name amuktamalyada. Ill be writing in tht blog regularly. You can follow that too..

హను

mee vemTa meamu sarvadaa vastune vumTamu

durgeswara

subham

చింతా రామ కృష్ణా రావు.

చాలా మంచి ఆలోచనమ్మా! పదిమందీ సాహితీ రసాస్వాదన చేయడానికి వీలుగ క్రొత్త బ్లాగు ప్రత్యేకించి నిర్వహింప తలపెట్టిన మీకు ఆ పరమాత్మ ఆయురారోగ్య సౌభాగ్యాలతో పాటు పదిమంది ప్రశంసనీయ సహకారం అందించేలా చేయాలని ప్రార్థిస్తున్నాను.
అభినందనలు.

శ్రీలలిత

జ్యోతీ,
ఎంత మంచి ప్రయత్నమో.. బాగా చెప్తున్నారు...అందరూ చదివి ఆనందిస్తారని కోరుకుంటున్నాను.

రవి

మీరు తలకెత్తుకున్నది సామాన్యమైన పని కాదు. ఈ ప్రయత్నం సఫలమవాలని ఆకాంక్షిస్తున్నాను.

lakshman

Every day I am watching Garikipati vari "Andhra Mahabharatam" in bhakti TV Channel. One day he said every telugu person must read "Pancha Prabhandha Kavyalu and those are AAmuktha Maalyadha, Manu Charithra, Vasu Charitha, Srungara Knyshdham, Panduranga Mahathyam or Parijatha Parinayam".
So I am expecting some from blogger can translate those above kavyalu in blogs.

Fortunately you have taken that task and started

Hats of to you and I will wish all the best. I am thankful to you

RAVICHANDRA

చాలా మంచి ప్రయత్నం. సాహిత్యం దగ్గరకు సామాన్యుడు రానప్పుడు సాహిత్యమే సామాన్యుడి దగ్గరకు వెళ్ళాలి.ఐతే మీ ప్రయత్నానికి ప్రచారం అవసరం.తెలుగు వెలుగు లాంటి మాసపత్రికలలో మీ బ్లాగ్ గురించి ప్రచురింపబడితే చాలామంది సాహిత్యాభిమానులకు చేరువకావచ్చు.
ఇలాంటి ప్రయత్నాలను చూచినప్పుడు తెలుగు తిరిగి వెలుగుతుంది అనే నమ్మకం కలుగుతుంది.
మేడిశెట్టి రవిచన్ద్ర
తెలుగు పండితుడు
జి.ఉ.పా -మార్చాల
మం|| కలువకుర్తి
జి|| మహబూబ్ నగర్
medishettyrpet@gmail.com

జ్యోతి

రవిచంద్రగారు మీ అభిమానానికి ధన్యవాదాలు. విజయవిలాసం బ్లాగు కూడా మొదలుపెట్టాను చూడండి..

http://vijayavilaasam.blogspot.in/

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008