Sunday, 8 August 2010

జై శ్రీరామ్




పువ్వు పుట్టగానే పరిమళిస్తుందా? ఏమో కాని కృషి ఉంటే సాధన చేస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఒక యువకుడు ఈరోజు సంగీత ప్రపంచపు సింహాసనానికి చేరువలో నిలిచాడు. అతని ప్రతిభను ఎన్నో వారాలుగా సోనీ టేవీలో చూస్తూనే ఉన్నాం. సుమారు రెండులక్షలమంది ఔత్సాహికులలో ఎన్నికైన 120 మంది పోటీదారులలో తలపడి ఇండియన్ ఐడల్ కిరీటాన్ని అందుకోవడానికి అతి చేరువలో ఉన్న శ్రీరామచంద్ర. గతంలో ఈటీవీ వారు నిర్వహించిన ఒక్కరే పాటల పోటీలో గెలిచిన శ్రీరాం తన స్వరప్రస్థానాన్ని జాతీయ స్థాయిలో మొదలుపెట్టి ఎందరో ప్రముఖుల అభినందనలు, ఆశీస్సులు అందుకుంటూ ఉన్నాడు. మనవాడైన , హైదరాబాదు వాసుడైన శ్రీరాం ఇండియన్ ఐడల్ పోటీ గెలవడానికి అక్కడి న్యాయనిర్ణేతలే కాక మనందరి సహకారం తప్పకుండా అవసరమున్నది. ప్రజల సందేశాల (SMS) ల ద్వారానే అతని గెలుపు స్వాతంత్ర్య దినోత్సవం రోజు సాకారమవుతుంది. అతను తెలుగువాడు అని మాత్రమే కాకుండా అతని ప్రతిభను చూసి గెలిపించాలి. దాదాపు చాలా పోటీలలో ఉత్తరాదివారే పాల్గొంటారు. హిందీ చానెళ్లు దక్షిణాదివారు తక్కువగా చూస్తారు అందుకే ఈ పోటీల గురించి అంతగా తెలీదు. ఈ పోటీ గెలిస్తే అతనికి డబ్బు, పేరు వస్తుంది మనకేంటి అంటారా? అలా అనుకుంటే మాత్రం నేనేమి చెప్పలేను. ఈ పాటలు చూసి అతనికి ఓటేస్తారని అనుకుంటున్నాను. అతను పాడే బాలు , ఘంటసాల, రఫి, కిషోర్, శంకర్ మొదలైన వారి పాటలు వింటుంటే ఆ గాయకులే అతనిలో పరకాయ ప్రవేశం చేసారేమో అనిపిస్తుంది. బాలుకి వారసుడు ఈ శ్రీరాం అవుతాడా??


మా అబ్బాయి తన క్లాస్‌మేట్ ఐన శ్రీరాం గురించి నా స్నేహితులకు చెప్పమంటే ఈ టపా పెడుతున్నా.. కాని నిజంగా అతను ప్రతిభావంతుడే..

రేపటినుండి ఇండియన్ ఐడల్ షో సోనీ టీవీలో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతుంది. శ్రీరాం పాటలు నచ్చితే ...

SREERAM అని టైప్ చేసి 52525 కి SMS చేయండి.

6 వ్యాఖ్యలు:

Chari Dingari

మంచి గాయకుడు....కానీ "శంకర్" అని రాయాలనుకున్నారేమో...సరి చేయండి.

జ్యోతి

శంకర ఆ ఎక్కడండి??

చిలమకూరు విజయమోహన్

షంకర్
మైనంపాటి శ్రీరామచంద్ర పాటతో మమేకమై ఆనందంగా పాడుతూ ఉంటే చూడడం చాలా బాగుంటుంది.

కత పవన్

best of luck ram

Shiva Krishna

he going to be an indian idol.. jayahp SRIRAM...

Shiva Krishna

nenu cheppanu kadha !.. thane gelustadani..

Nammakam unte 'kala' neraveruthundi..!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008