Friday 29 October 2010

హ్యాపీ బర్త్ డే నేస్తమా...







.వె! కష్టకాలమందు కడగళ్ళ వానలో
తడసి అలసి యున్న తరుణమందు
సేద దీర్చి, నాకు బోధను జేసిన
మాట మరువగలనె! మాన్య మూర్తి!

.వె! మంచి పంచి ఇచ్చు మనుజులు యెందరు?
మార్గదర్శి గాను మదిని నిలిచి
మంచి గంధమోలె పంచిన నెయ్యము
వీడదెపుడు తావి, వీసమయిన.

.వె! జన్మ దినము నేడు! సన్మంగళము నీకు!
జయము గలుగునెపుడు జగతి యందు,
ఆది దేవుడిచ్చు ఆయువు నిండుగ!
శుభము గలుగు నీకు నభయ మిదియె!

15 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్

మీ నేస్తానికి మా జన్మదిన శుభాకాంక్షలు

Unknown

మీ నేస్తానికి జన్మదిన శుభాకాంక్షలు

ఇందు

Happy Birthday to your Friend :)

మాలా కుమార్

మీ నేస్తాని కి జన్మదిన శుభాకాంక్షలు .

మాగంటి వంశీ మోహన్

మీ వారికి జన్మదిన శుభాకాంక్షలు
అది అలా శుభం భూయాత్ అయిపోయాక.....

ఇప్పుడు....ఓ మాట....
ఇలా పద్యాలతో మోతెక్కిస్తున్నారేందుకని?

కవితలేస్కుంటే పోనిలే అని ఊరుకోవచ్చు...చదవకుండా!

పద్యాలైతే చదవకుండా ఉండలేను!

జనాలు బాగుండాలని కోరుకోండి బాబో కోరుకోండి!
:)

గీతిక బి

మీ నేస్తానికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బంధం కలకాలం ఇలాగే వర్థిల్లాలని ఆశిస్తూ, అభిలషిస్తూ...

గీతిక

జ్యోతి

శుభాకాంక్షలు చెప్పినవారందరికి ధన్యవాదాలు.

వంశీగారు. అదేంటంఢి అలా అనేసారు. ఇక రాతల్లో నేర్చుకోవడానికి ఏమిలేదని రీమిక్స్ వీడియోలు, పద్యాలు రాయడం నేర్చుకుంటున్నాను. మనకు కవితలు కూడా అంతగా రాదు కాని అప్పుడప్పుడు వాటిని వదుల్తుంటాను చదివినవారి ఖర్మ అని..:) మీరిలా అన్నారంటే తవికలు మొదలెట్టాల్సి విస్తుంది...

అన్నట్టు ఇవాళ మావారి పుట్టినరోజు కాదండి. పుట్టినరోజులు జరుపుకోవడం మా ఇంటావంటా లేదు.. ఈరోజు నేనిలా ఉండడానికి కారణమైన వ్యక్తి పుట్టినరోజు. ఏమివ్వకున్నా కనీసం శుభాకాంక్షలైనా ఇద్దామని చేసిన చిన్ని ప్రయత్నం...

కొత్త పాళీ

మీరే రాశారా పద్యాలు? ఎంత బావున్నాయో! ఆటవెలది సొంపుని వొడుపుగా పట్టుకున్నారు. నాలుగేసి పాదాల్లోనూ తీగలా సాగింది భావం. మీ ఫ్రెండ్ చాలా అదృష్టవంతులు.

Admin

మీ నేస్తాని కి జన్మదిన శుభాకాంక్షలు .

సి.ఉమాదేవి

ప్రతి మనిషికి పుట్టిన రోజు ఉంటుంది.అయితే ఆ పుట్టిన రోజుకు సార్థకత కావాలంటే ముందు మానవత్వం పుట్టాలి.సాటి మనుషుల యెడ చూపించే దయ,ప్రేమవంటి సుగుణాలు ఈ మానవత్వంలో నుంచే పుడతాయి. అటువంటి మానవత్వానికి మారుపేరైన మీ నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

సవ్వడి

జ్యోతి గారు!
పద్యాలు ఎంత బాగున్నాయో....
మీ స్నేహితులికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఫణి ప్రసన్న కుమార్

మీ నేస్తానికి జన్మదిన శుభాకాంక్షలు. పద్యాలు బాగున్నాయి. రెండో పద్యంలో రెండవ పాదం ' మార్గదర్శి గాను మదిని నిలచి ' అంటే గణాలు సరిపోతాయి.

జ్యోతి

ధన్యవాదాలు...

కొత్తపాళీగారు పద్యాలు బావున్నాయంటారా?? ధాంక్స్. మొదటి ప్రయత్నం..పర్లేదు ముందుకెళ్లొచ్చంటారు..

ఫణిగారు ,
హమ్మయ్యా! ఎవరైనా తప్పులు చూపిస్తారేమో అని ఎదురుచూస్తున్నా.. ధాంక్స్..

హనుమంత రావు

జ్యోతిగారు...నమస్తే......
అలసిన మనస్సుకు ఓదార్పు...జీవన యానంలో
అండాదండా అయిన నేస్తం దొరకడం మీ అదృష్టం
మంచిని పంచే ఆ మంచిహృదయానికి మీతోపాటు
మేమూ హ్యాపీ బర్త్ డే చెప్తున్నాము.....ఆ మంచి
తనపుస్ఫూర్తితో తొలి ప్రయత్నంగా మీ పద్య
రచన సెహభాష్........ నమస్కరిస్తూ...దినవహి

చెప్పాలంటే......

మీ నేస్తానికి మా జన్మదిన శుభాకాంక్షలు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008