Friday, 10 December 2010

500 - భారతీయ వ్యక్తిత్వ వికాసం


మధ్య కమ్యూనికెషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అనే మాటలు తరచూ వినబడుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్నవాళ్లకు ఇది చాలా అవసరమంటున్నారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసాక ఉద్యోగాల వేటలో పడ్డవాళ్లు ముందుగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలంట. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్. వ్యక్తిత్వ వికాసం ఏంటి? దానికోసం పుస్తకాలు, సిడిలు, క్లాసులు తీసుకోవాలా?? అవి లేకుండా తెలుసుకోలేమా? నేర్చుకోలేమా? కొన్నేళ్ల క్రిందవరకు లేని కొత్త కోర్సులు ఇప్పుడెలా పుట్టుకొచ్చాయి?? ఒక వ్యక్తి నిర్మాణం ఒక రోజులో , కొన్ని క్లాసులలో , కొన్ని పుస్తకలతో జరిగే పని కాదు. ప్రతీ వ్యక్తిత్వ నిర్మాణం నిరంతరంగా అవిశ్రాంతంగా సాగే ఒక తపస్సు, చిన్న చిన్న పాయలను కలుపుకుంటూ సాగే మహానదీ ప్రయాణం లాంటిది. కాదంటారా?? విషయాలు కేవలం ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వాటిని నిలబెట్టుకుని విజయాలు సాధించడానికి మాత్రమే కాదు. మన జీవితాన్ని అత్యున్నత విలువలతో తీర్చి దిద్దుకోవడానికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం.

ప్రతీ జీవితం ఒడిదుడుకుల మయం. ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఎన్నో తుఫానులు, భూకంపాలను ఎదుర్కొనక తప్పదు. అలాగని జీవితమంతా కష్టాల సాగరం కాదు. ప్రతీ సమస్యని, సంకటాన్ని ధైర్యంతో , వివేకంతో ఎదుర్కొని జీవితాన్ని సుందరమయం చేసుకోవాలి తప్ప కృంగిపోకూడదు. కష్టసుఖాలు సరిసమానంగా ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఎంతగా అనందిస్తామో, దుఖం కలిగినప్పుడూ అంతే ఆనందంగా స్వీకరించాలి. ఇలాటి జీవిత సత్యాలెన్నింటినో మనకు అరటిపండు వలిచి చేతిలోపెట్టినట్టు చెప్తుంది భగవద్గీత. నాడు, నేడు, రేపూ కూడా ఎంతో ఉన్నతమైన, ఉత్కృష్టమైన వ్యక్తిత్వ వికాస పుస్తకం భగవద్గీత. అలాగే భర్తృహరి సుభాషితాలు, మహాభారతం, భాగవతం, వేమన, సుమతీ, భాస్కర శతకాలు మొదలైన గ్రంధాలెన్నో మనకు జీవిత సత్యాలు తెలిపాయి.

వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తి యొక్క వికాసం . కాని భారతీయ వ్యక్తిత్వ వికాసం అంటూ ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు కస్తూరి మురళీకృష్ణగారు. వ్యక్తిత్వ వికాసం అనేది మధ్య పుట్టుకొచ్చిన పదం కాదు. యుగాలనుండి ఎందరో మహానుభావులు ప్రతీ వ్యక్తి తెలుసుకోవలసిన, నేర్చుకొని పాటించవలసిన వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పారు. వివరాలను మనకు పుస్తకం "భారతీయ వ్యక్తిత్వ వికాసం" లో కూలంకషంగా వివరించారు మురళీకృష్ణగారు.

మీకు తెలుసా? అమ్మకంటే పెద్ద మేనేజిమెంట్ గురు ఎవరైనా ఉన్నారా?? బామ్మ, తాత కంటే వ్యక్తిత్వ వికాసాల పాఠాలు చెప్పే గురువులు ఉన్నారా? పిల్లలకు చిన్నప్పటినుండి చెప్పే రాముడి కథలు, కృష్ణుడి లీలలు, ప్రహ్లాదుడు, నీతి కథలు, పంచ తంత్ర కథలు .. ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తాయి. తల్లి పాడే లాలి, జోలపాటలు, బుజ్జగింపులు, తండ్రి నేర్పే నడకలు, జాగ్రత్తలు, పెద్దల మార్గనిర్దేశం పిల్లవాడిని సరియైన వ్యక్తిత్వ సాధన మార్గంలో నడిపిస్తాయి. తాను విన్న కథలసారం నుండి నేర్చుకున్న అంశాలను భవిష్యత్తులో ఉపయోగించుకుంటాడు. కాని నేడు పిల్లలకు ఎక్కడుంది? . టీవీ, మొబైల్ గేమ్స్. యాంత్రికంగా పోటీ తత్వంతో సాగిపోయే చదువులు పిల్లలను స్పందన లేని యంత్రాలుగా మారుస్తున్నాయి. అందుకే పెద్దయ్యాక వారికి వ్యక్తిత్వ వికాసం పాఠాలు నేర్చుకోవలసి వస్తుంది.

మనం మరచిపోయిన, తెలిసినా పట్టించుకోని వ్యక్తిత్వ వికాస పాఠాలను పురాణ గ్రంధాలనుండి సేకరించి మనముందుంచారు రచయిత. ఇది ఒక పాఠ్య పుస్తకంలా కాక భారతీయ సంస్కృతిలోని విశిష్టతను కూడా తెలుసుకునేలా చేస్తుంది .. వ్యక్తిత్వం వికసింపచేసుకోవాల్సింది ఒక ప్రత్యేకమైన అంశంలోనే కాదు. అందుకే వ్యక్తిత్వ వికాసం గురించి వివిధ వర్గాలుగా విభజించి విశ్లేషించారు.
1. వ్యక్తిత్వం - విజయం
2. వ్యక్తిత్వం - మనస్సు
3. వ్యక్తిత్వం - దైవభావన
4. వ్యక్తిత్వం - ఆదర్శం
5. వ్యక్తిత్వం - మాట
6. వ్యక్తిత్వం - భయం
7. వ్యక్తిత్వం - ఆలోచనలు
8. వ్యక్తిత్వం - బ్రహ్మచర్యం
9. వ్యక్తిత్వం - శాంతం
10. వ్యక్తిత్వం - ధనం
11. వ్యక్తిత్వం - అధికారం

ఈనాడు లభిస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, వ్యక్తిత్వ వికాస డాక్టర్లు బోధిస్తున్నదంతా మన పూర్వీకులు ఏర్పరచిన వ్యవస్థలోనే పొందు పరచబడి ఉంది. దానిని వెలికి తీసి మనకు అందించారు రచయిత కస్తూరి మురళీకృష్ణ. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, సుమతీ, భాస్కర, వేమన శతకాలు, రామాయణ, భారత,భాగవత,భగవద్గీత మొదలైన గ్రంధాల ఆధారంగా "భారతీయ వ్యక్తిత్వ వికాసా"న్ని విశ్లేషిస్తూ, వివరిస్తూ రాసిన వ్యాసాల సంకలనం. తప్పకుండా మన ఇంట ఉండవలసిన అమూల్యమైన పుస్తకం ఇది.

ప్రచురణ: ఎమెస్కో బుక్స్
వెల : రూ. 150 /-

ఇది నా 500 టపా..

8 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి

భారతీయుల వ్యక్తిత్వం విలక్షణమైనది.భగవద్గీత,ఇతిహాసాలు,శతకాలు,పంచతంత్రం,ఉపనిషత్తులు,వేదములు మన సంస్కృతిని తెలుపడమేకాదు మన జీవన విధానాన్ని నిర్దేశించే మార్గదర్శకాలు.ఇవన్నీ ఉగ్గుపాలతో అందించిన ఆనాటి తరం ఈనాడు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తోంది. సాంకేతికత ప్రవర్ధమానమైనది. విషయ అవగాహనకు ఆకాశమే హద్దు అంటోంది నేటి తరం. అయితే పుష్పానికి తావిలా వ్యక్తిత్వ వికాసం తాపడం కావాలి.ఉత్కృష్ట గ్రంథాలలోని వ్యక్తిత్వ విశ్లేషణతో మనిషి మనవలసిన విధమిదీ అని తెలియపరచిన కస్తూరి మురళీకృష్ణ గారు అభినందనీయులు.500వ పోస్టుగా భారతీయ వ్యక్తిత్వ వికాసం రావడం మీ వ్యక్తిత్వానికి మరో కలికితురాయి.

రాధిక(నాని )

మంచి పుస్తకం గురించి మీ పరిచయం బాగుంది.అలాగే మీ టపాలు ఐదు శతకాలుకు చేరుకున్నందుకు సుభాబి వందనాలు.

బులుసు సుబ్రహ్మణ్యం

హార్ధిక శుభాభినందనములు 500 టపా కి. మరెన్నో ఇల్లాగే రాస్తుండాలని మనసారా కోరుకుంటున్నాను. Well done. మీ 1000 వ టపాకీ ఇల్లాగే ఎదురు చూస్తాం.

వేణూశ్రీకాంత్

అభినందనలు జ్యోతిగారు.

లత

మీరు మరెందరికో స్ఫూర్తి నివ్వాలని కోరుకుంటూ,
అభినందనలు జ్యోతి గారూ

చింతా రామ కృష్ణా రావు.

హృదయ పూర్వక అభినందనలమ్మా! సహస్రాధికంగా మీ రచనలు సామాజికులకు స్ఫూర్తిదాయకం కావాలని ఆశిస్తున్నాను.

రుక్మిణిదేవి

congrats jyothi gaaru..

తృష్ణ

Hearty congrats jyothi gaaru.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008