Sunday, 19 December 2010

ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

టీవీ చూడడం,వంట చేయడం (ఇది తప్పదనుకోండి) , కుట్లు అల్లికలు, బ్లాగులు రాయడం కాకుండా నేను చేసే ఇంకో పని గురించి చెప్తాను. అదేంటంటే ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా అవసరమైన బట్టలు ఉతికే పొడి, గిన్నెలు తోమే పొడి, ఫినాయిల్, లిక్విడ్ సోప్.. బయట ఎన్నో రకాలు దొరుకుతాయి. అయినా మురికిపొదు. వందలు పెట్టి కొనాలంటే స్తోమతు లేదు. అందుకే అవి ఎలా చేయాలో నేర్చుకున్నా. నాకు అవసరమైనట్టుగా ఒక్కోటి మార్పులు చేసుకుంటూ ఒక లెక్క దగ్గర ఫిక్స్ ఐపోయా. దాదాపు పదేళ్లనుండి ఇంట్లోనే తయారు చేసుకుంటూ వాడుకుంటున్నా. ఐదేళ్ళు మార్కెటింగ్ కూడా చేసాను కాని వదిలేసా. ఇంట్లో ఉండి ఏదైనా పని చేయాలనుకునేవాల్లకు నాలా బాధితులైన మధ్యతరగతి ఇల్లాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఈ వస్తువుల గురించి ఈటీవీ సఖిలో ప్రోగ్రాం కూడా ఇచ్చాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రభూమి దినపత్రికలో కూడా వచ్చిన ఈ వస్తువుల ఎలా తయారు చేసుకోవాలో చూడండి.


ఈరోజు మనకు బజారులో ఎన్నో రకాల వాషింగ్ పౌడర్లు, క్రీనింగ్ పౌడర్లు, ఫినాయిల్, లిక్విడ్ సోప్ వంటివి లభిస్తున్నాయి. కాని అవన్నీ అందరికి అందుబాటు ధరల్లో ఉండవు. ఒకోసారి ధర పెట్టినా మురికి పోదు. పనిమనుషులను నమ్ముకోక తప్పదు. అలాంటప్పుడు ఈ వస్తువులన్నీ మనమే ఇంట్లో తయారుచేసుకోవచ్చు. అందుకు అవసరమయ్యే ముడి సరుకు కూడా సులువుగానే దొరుకుతుంది. దీనివల్ల డబ్బు ఆదా, మురికి వదిలిందన్న సంతృప్తి కలుకుతుంది.



వీటి వలన మన చేతులకుగాని, బట్టలకు , వస్తువులకు గాని ఎటువంటి హాని కలగదు. ఇచ్చిన కొలతలతో తయారుచేసుకుంటే ఎటువంటి హాని లేదు. కాని ఈ మిశ్రమాలను కలిపేటప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే చాలు. వీటిని కలపడానికి ప్లాస్టిక్ లేదా కర్ర సామగ్రి మాత్రమే ఉపయోగించాలి. ముడి సరుకులన్నీ సికిందరాబాదు జనరల్ బజార్ , హైదరాబాదులో తిలక్ రోడ్ .. ఆబిడ్స్ లోని ఇండస్ట్రియల్ కెమికల్స్ అమ్మే దుకాణాల్లో దొరుకుతాయి. మీకు ఇంట్లో చేసుకోవడానికి వీలు కాకపోతే మీరు ముడిసరుకు కొన్న దుకాణంలోనే కాసిని డబ్బులిచ్చి అన్నీ కలిపించి తీసికెళ్ళండి. మూడు నెలలకోసారి వెళితే సరిపోతుంది. ఇవి బజారులో దొరికే వస్తువులకంటే ఎక్కువ మన్నికగా పని చేస్తాయి. ప్రతి ఇంట్లో తప్పకుండా అవసరమయ్యే ఈ వస్తువులు ఇంట్లో తయారుచేసి మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు.

ముడిసరుగు దొరికే దుకాణం...


Opera Trading corporation


Opp. Endowment Office. Tilak Road .


Hyderabad.


Ph.. 24753932



వాషింగ్ పౌడర్


బట్టల సోడా (Soda ash ) 2.5 kg


సోడియమ్ సల్పేట్ (Sodium Sulphate ..S.S ) 500 gm


సోడియమ్ బొరాన్సెలో (Sodium Borancelo …S.B.C ) 500 gm


సోడియమ్ టైఫాలీ ఫాస్పేట్ (Sodium Typholi Phosphate…S.T.P ) 50 gm


కార్బాక్సి మిధైల్ సెలో (Carboxy Methyl Celo …C.M.C ) 50 gm


ట్రైసోడియమ్ ఫాస్ఫేట్ (TriSodium Phosphate…T.S.P ) 250 gm


సోడియమ్ మిధైల్ సల్పేట్ (SodiumMethylSulphate…S.M.S) 500 gm


సోడియమ్ పెర్బోరేట్ ( Sodium Perborate ) 50gm


ఆసిడ్ స్లరీ (Acid Slurry ) 1200 gm


బ్లూ కలర్ (Blue color) 200 gm


టినోపాల్ (Tinopal ) 50 gm


పెర్ఫ్యూమ్ (Perfume) 25 ml


ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకుని ఆసిడ్ స్లరీ, పెర్ఫ్యూమ్ తప్ప మిగిలిన పొడి వస్తువులన్నీ వేసి అన్నీ సమానంగా, ఉండలు లేకుండా కర్రతో కలపాలి.. ఎప్పుడు కూడా చేతితోగాని, స్టీలు , ఇనుప వస్తువులుగాని ఉపయోగించకూడదు. తర్వాత ఆసిడ్ స్లరీని మెల్లిగా పొడిలో పోస్తూ కర్రతో మొత్తం కలిసేట్టుగా కలపాలి. పెర్బ్యూమ్ కూడా వేసి మొత్తం పొడిని బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. తర్వాత ఈ పొడిని జల్లించి ప్లాస్టిక్ డబ్బాలో కాని, ప్లాస్టిక్ కవర్లలో కాని వేసి పెట్టుకోవాలి. జల్లించేటప్పుడు చేయితో పొడిని తాకినా ఏమీ కాదు.




వైట్ ఫినాయిల్ ….



వీడాల్ ( Veedol ) 1/4 lit


పైన్ ఆయిల్ ( Pine oil ) 1/2 lit


సోప్ ఆయిల్ ( Soap oil ) 1/2 lit


సెటోనిల్ ( Cetonil ) 50 ml


మంచినీరు ( Water ) 6 lit



ఒక ప్లాస్టిక్ బకెట్లో ఆరు లీటర్ల మంచినీరు పోసి పై వస్తువులు ఒక్కటొక్కటిగా వేసి కలపాలి. బాగా కలిపి సీసాల్లో భద్రపరచుకోవాలి. ఈ ఫినాయిల్ చేయడానికి ఎప్పుడూ త్రాగునీరు మాత్రమే వాడాలి. బోర్ వాటర్ వాడితే తెల్లగా ఉంఢక నూనెలాగా ఉంటుంది. చిక్కగా ఉందనుకుంటే అవసరమున్నంత నీరు కలుపుకోవచ్చు.







లిక్విడ్ సోప్ ….



కాస్టిక్ సోడా ( Caustic soda ) 100 gm


ట్రై సోడియమ్ ఫాస్ఫేట్ ( Tri Sodium Phosphate )..T.S.P 50 gm


యూరియా ( Urea ) 100 gm


ఆసిడ్ స్లరీ ( Acid slurry ) 600 gm



ముందుగా పది లీటర్ల నీరు ఒక బక్కెట్‍లో తీసుకుని అందులో యూరియా, సోడా, ఆసిడ్ స్లరీ ఒక్కొక్కటిగా కర్రతో కలపాలి. T.S.P ని విడిగా ఒక మగ్గులో అర లీటరు నీటిలో వేసి జాగ్రత్తగా కర్రతో కలిపి మొత్తం కరిగాక మిగతా మిశ్రమానికి కలపాలి. మొత్తం మళ్ళీ బాగా కలిపి అరగంట వదిలేసి సీసాల్లో వేసి భద్రపరచుకోవాలి.

ఇది చేతులు కడగటానికి, ఇల్లు కడగటానికి, బాత్రూమ్స్, టైల్స్ వంటివి కడగడానికి వాడుకోవచ్చు. చిక్కగా ఉందనుకుంటే కావలసినంత నీరు కలుపుకోవచ్చు.




క్లీనింగ్ పౌడర్


డోలమైట్ ( Dolomite ) పౌడర్ 10 kg


ఆసిడ్ స్లరీ ( Acid slurry ) 300 gm


బట్టల సోడా ( Soda ) 500 gm


వెడల్పాటి ప్లాస్టిక్ టబ్‍లో ముందుగా డోలోమైట్ పౌడర్, సోడా వేసి బాగా కలిపాలి. తర్వాత ఆసిడ్ స్లరీ వేసి కలిపి కొద్ది సేపు వదిలేయాలి. తర్వాత పొడినంతా జల్లించి సంచీలో కాని , డబ్బాలో కాని వేసుకోవాలి.


ఇందులో సబ్బు శాతం సరియైన మోతాదులో కలపబడిఉంది. మామూలుగా బజారులో దొరికే క్లీనింగ్ పొడిలో మళ్ళీ మనం కొద్దిగా వాషింగ్ పౌడర్ లేదా సబ్బు కలుపుకుంటాము. కాని ఇలా తయారుచేసుకున్న క్లీనింగ్ పొడిలో అలా అవసరం లేదు. ఒక చిట్కా. ఒక చిన్నె గిన్నెలో పొడి వేసి కొద్దిగా నీరు పోసి ముద్దగా చేసి వాడుకుంటే గిన్నెలకు పొడి అంటుకోదు. అలాగే పొడిగా వాడితే గిన్నెలకంతా పొడి ఉంటుంది ఆరిన తర్వాత. పొడి కాస్త బరకగా ఉంటుంది కాబట్టి మాడినవి, పెనంలాంటివి త్వరగా శుభ్రం అవుతాయి.

5 వ్యాఖ్యలు:

భమిడిపాటి సూర్యలక్ష్మి

గత 30 సంవత్సరాలనుండి లిక్విడ్ సోప్ మేము ఇంట్లోనే చేసుకుంటున్నామండి. మాకు ముడిసరుకులు లక్ష్మీ రోడ్ లో దొరకుతాయి( పూణే).మిగిలినవి ఎప్పూడు ట్రై చేయలేదు.పొదుపుకి పొదుపు. మనమే చేసుకున్నామన్నతృప్తి.

మంచు

జ్యొతిగారు -
హృదయపూర్వక జన్మదిన శుబాకాంక్షలు.

ఇందు

జ్యోతిగారు జన్మదిన శుభాకాంక్షలండీ :)

Admin

జ్యోతి గారు నేను ఈటీవీ సఖిలో మీ ప్రోగ్రాం చూసానండి. అప్పుడు నేను మీకు ఫోన్ కూడా చేశాను. అప్పటినుంచి మేము

క్లీనింగ్ పౌడర్ ని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము. కానీ మీరు చాలా గ్రేట్. ఎందుకంటే మీకు తెలియని విషయాలు ఏమి లేవు, అన్ని విషయాలు తెలుసు. నేను మూడు నెలలు నుంచి బ్లాగ్ రాస్తున్న. కాని మీలా అన్ని విష యాలు తెలిసిన వారు నాకు ఎక్కడ కనబడలేదు . మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది.

జ్యోతి

లక్ష్మిగారు, మిగతావి కూడా ట్రై చేయండి. మీరన్నది నిజమే..

మంచుగారు, ఇందు ..ధాంక్స్

లక్ష్మిగారు, నిజమా! గ్రేట్.ఇలా కలవడం. మరి మిగతావి కూడా చేసుకోండి.. మీ అభిమానానికి ధాంక్స్..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008