Friday, 7 January 2011

ఇంటిపోరు ఇంతింతకాదయా!




సంసారంలో అప్పుడప్పుడు సరసాలు, చిటపటలు ఉంటేనే కదా మజా.. సరసాలు ఒక్కోసారి అభిప్రాయబేధాలు, అలగడాలు .. శ్రుతిమించితే పోట్లాటల వరకు వెళ్తాయి. విషయంలో కొందరు పండితులేమన్నారో చూడండి.


ఇంద్రగంటి : నాకూ, నా భార్యకూ అభిప్రాయబేధాలు రాకుండా ఉండవు, వస్తూనే ఉంటాయి. అలా అభిప్రాయబేధం వచ్చినప్పుడు నా అభిప్రాయం మాత్రం చస్తే ఆవిడతో చెప్పను. ఇక ఆవిడ ఏం చేస్తుంది? నోరు మూసుకుని ఉంటుంది. అర్ధం కాలేదా? అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేనే నోరుమూసుకుని ఊరుకుంటాను.

కాటూరి : మా ఇంట్లో ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అదెలా సంభవం అంటే.. నేను చెప్పిన మాటలన్నీ ఆవిడ వింటుందని కాదు. ఆవిడ చెప్పినట్టే నేను వింటాను. ఏదైనా మాటా మాటా వచ్చి ఆవిడకు కోపం వస్తే నేను వెంటనే... "దోషముగల్గె, నా వలన దోసిలి యొగ్గితి నేలుకొమ్ము నీ దాసుడ" అని " ముట్టెద తత్పద్ద్వయిన్" అంటాను.


దేవులపల్లి : నా ప్రియురాలితో పోట్లాట నేను భరించలేను. ఒకవేళ వచ్చిందో నాకు దుఃఖం వస్తుంది. దుస్సహగాఢ దుఃఖం ఆపుకోలేను ఏడుపు వస్తుంది. మృదుల కరుణా మధురం నా హృదయము.


మొక్కపాటి : మాకు ఎలాంటి పోట్లాటలు లేవు. శాంతంగా జరిగిపోతుంది. ఎలాగంటే నేను మద్రాసులో ఉంటున్నాను. ఆవిడ రాజమండ్రిలో ఉంటున్నది. ఎప్పుడైనా టెలిఫోనులో మాట్లాడుకుంటాము. పైగా చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇక పోట్లాడడానికి వ్యవధి ఎక్కడిది.


గిడుగు : మా ఇంట్లో అస్సలు పోట్లాటలే లేవండి. పోట్లాటలే కాదు అసలు మాట్లాటలే లేవు. ఎందుకంటే నేను ఒక ప్రతిజ్ఞ చేసాను. ఇంట్లో సవర భాషలో మాత్రమే మాట్లాడతాను. బయట సవరభాషను గురించి మాత్రమే మాట్లాడతాను. అందుకని నేను ఏమంటున్నది ఆవిడకు తెలీదు. అందుకే ఏటువంటి పోట్లాటలు లేవు.


వేలూరి : ఇంటావిడకు మన మాటలు వినపడనంతటి దూరంలో ఒక కుటీరం నిర్మించుకొని పొద్దస్తమానమూ అక్కడే కాలం గడపడంవల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య పోట్లాటలు ఉండవు.


ధనికొండవారు : సన్నని వేప బెత్తంతో వీపు చిట్లగొడితే మళ్లీ మాట్లాడదు. ఒకటి రెండుసార్లు ఇలా జరిగిన తర్వాత మా ఆవిడకూ, నాకూ అభిప్రాయ భేదాలంటూ లేకుండా పోయినాయి.


బుచ్చిబాబు: మా ఆవిడ ఎప్పుడూ " మీకేమీ తెలియదు. మీకేమాత్రమూ తెలియదండీ" అంటూ ఉంటుంది. ఇలా ప్రతిరోజూ చెవిలో నూరిపోయడం వల్ల నాకు ఏమీ తెలియదన్న నమ్మకం బాగా కుదిరింది. అన్నీ తెలిసిన విజ్ఞాన సర్వస్వం మా ఆవిడ. ఆవిడ మాట మెదలకుండా వినడమే నా పని. ఇక పోట్లాటలు ఎలా వస్తాయి?


జమ్మలమడక : భార్యాభర్తల మధ్య పోట్లాటలు రాకుండా ఉండాలంటే భర్త తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకోవాలి. భర్త సంస్కృతంలో ఏది మాట్లాడినా ఆవిడకు అర్ధం కాదు.దాంతో గప్ చిప్ గా ఊరుకుంటుంది. నేను అలాగే చేస్తున్నా మొగుల్లకు.



పాపం.. ఎన్ని కష్టాలో ee

17 వ్యాఖ్యలు:

ఆ.సౌమ్య

హహహహ ఎక్కద సంపాయించారోగానీ చాలా బావున్నాయి

బులుసు సుబ్రహ్మణ్యం

ఎంత వారలైనా కాంతా దాసులే అన్నారుట ఆయనెవరో. పాండిత్యం లేకపోయినా ఈ విషయంలో నేను కూడా పండితుడినే వారికి మల్లె. వెరీ గుడ్ పోస్ట్.

Anonymous

బావున్నాయి . భలే సేకరించారే !

బాలు

మా ఇద్దరి మధ్యా వాదులాట వస్తే... మా ఆవిడ కోపం తారస్థాయికి చేరుకున్నాక, సడన్గా రూటు మార్చి నువ్వే రైట్ చిన్నీ, ఐయామ్ సారీ’ అంటా. తర్వాత తను ఏమన్నా ‘నువ్వే రైట్... నువ్వేరైట్’ అని నేనంటుంటే తను ఉడుక్కుంటుంటే చూడాలీ... నాసామిరంగా :)

కథా మంజరి

చాలా మంచి టపా. చక్కని సేకరణ. అభినందనలు.

మునిమాణిక్యం నరసింహా రావు గారి కాంతం కథలలో ఈ ముచ్చట చూస్తాం:

వారికి వారి భార్యతో ఏదో అభిప్రాయ భేదం వచ్చి, ఒక సారి మాట్లాడు కోవడం మానేసారుట. ఓ రోజు ఇద్దరూ మేడ మెట్ల మీద తారస పడ్డారుట.
నేను మూర్ఖులకు దారి యివ్వను అందిట భార్య.
సరే, నేను ఇస్తాను అంటూ తొలిగి పోయారుట భర్త గారు.
మీ టపా చదివేక ఇది గుర్తుకు వచ్చి రాసేనంతే.

రవి

జమ్మలమడక ఆయనెవరో గానీ, నా అవుడియా కాపీకొట్టాడు.

E.V.Lakshmi

మరే !పాపం ఎన్ని కష్టాలో !

Ennela

hahahah,,memayite dooramgaa untunna phone bill assalu lekka cheyyam...bill ochchaaka 'nee valla ante nee valla' ani inkoka chakkati potlaata pettukovachchugaa anduku...

శరత్ కాలమ్

మా నాన్నగారు తమ మిత్రులతో మా అమ్మకు ఏదయినా తెలియకుండా మాట్లాడలి అనుకున్నప్పుడు ఉర్దూలో మాట్లాడుతుండేవారు. ఆ ఉర్దూలోని సంభాషణ అర్ధం కాక మా అమ్మకి బాగా కోపం నషాళానికి అంటి ఏవయినా వస్తువులు చప్పుడు వచ్చేలా విసిరేస్తూవుండేవారు. మా అమ్మగారికి కోపం వస్తే వచ్చింది కానీ విషయం అర్ధం కాలేదు కదా అని మా నాన్నగారు సంతోషించేవారు.

హనుమంత రావు

అయితే మహా మహులకే తప్పలేదన్నమాట
ఇంక మన మెంత ?..బెటర్... మౌనగీతాలాపన

రాధిక(నాని )

హహ్హహ్హ ..చాలా బాగుందండి.

జ్యోతి

ఇది రాస్తున్నంతసేపు సరదాగానే రాసాను. కాని ఈ వ్యాఖ్యలు చదువుతుంటే మావారి గురించి ఆలోచించాను. ఆయనేం చేస్తరబ్బా? అని. పెళ్లయిన కొత్తలో అంటే ఇరవై ఏళ్లవరకు ఆయన స్వరం ఎక్కువ వినిపించేది. నా వాదన తక్కువే. కాని ఈ మధ్యే నేను తక్కువ తిన్నానా అంటూ వాదిస్తున్నాను. అప్పుడు ఆయన తగ్గుతారు. ఇంకా నేను అరుస్తుంటే ముసిముసి నవ్వులు.. :))

బాలు.. :))

Ennela

"పెళ్లయిన కొత్తలో అంటే ఇరవై ఏళ్లవరకు "..hahaha..idi naaku baaga nachchindi...

సత్యవతి

అంతా పురుషుల అభిప్రాయాలే సేకరించారు.మరి రచయిత్రులేమనుకుంటున్నారో కూడా వెతకండి ..వాళ్లకి ఇంటిపోరులేదా?

శ్రీలలిత

జ్యోతీ,
చాలామంది వినే వుంటారీ మాట..
పెళ్ళైన సంవత్సరం భర్త మాట భార్య వింటుందిట. తర్వాతి సంవత్సరం భార్య మాట భర్త వింటాడుట..
ఆ తర్వాత అన్ని సంవత్సరాలూ వీరిద్దరి మాటలూ ఇరుగూ, పొరుగూ వింటారుట..

Kalpana Rentala

జ్యోతి,
సేకరణ బావుంది. ధనికొండ...అంటే ధనికొండ హనుమంత రావు గారా? వేప బెత్తం తో భార్యను కొట్టినది కాక మళ్ళీ చెప్పుకున్నారా? ఆయన బతికున్నప్పుడు ఈ విషయం తెలిస్తే నాలుగు అడిగి కడిగేసేవాళ్ళాము కదా) సత్యవతి గారు చెప్పినట్లు...రచయిత్రులు కూడా చెప్పినవి ఎక్కడైనా వుంటే సేకరించు.

SRRao

మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008