Monday, February 14, 2011

ప్రేమ జీవనరాగంవేలంటైన్ డే సందర్భంగా భూమిలోని వ్యాసం .

ప్రేమ - రెండుక్షరాలు

ప్రేమ ఎంతో బలీయమయింది

ప్రేమ విలువ ప్రేమించిన వారికే తెలుస్తుంది

ప్రేమ ఎందరితోనో ఎన్నో రకాలుగా ఆడుకుంది

ప్రేమ సృష్టి వున్నంత వరకూ వుంటుంది

ప్రేమకు మరణం లేదు!


ఫిబ్రవరీ 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఇది యవ్వనంలో ఉన్న ప్రేమికులు మాత్రమే జరుపుకునే వేడుక కాదు. భార్యాభర్తలు, స్నేహితులు, అన్నదమ్ములు., అక్కాచెళ్లెల్లు.. అందరి మధ్యా ఉండేది ప్రేమ తత్వమే. అందుకే ఈ రోజు ఆ ప్రేమను ప్రకటించుకునే పవిత్ర సందర్భంగా జరుపుకోవాలి. ప్రేమను అప్పుడప్పుడు వ్యక్తపరుచుకోవాలి. వాలెంటైన్స్ డే లేదా ప్రేమికులరోజు అనగానే ప్రేమ తత్వం, ఆనందం వెల్లి విరుస్తుంది.


ఈ రోజు కోసం అందమైన బహుమతులు, గులాబీ పువ్వులతో , అందమైన గ్రీటింగ్ కార్డులతో దుకాణాలు ఆకర్షణీయంగా ముస్తాబవుతాయి. ఈ రోజు ప్రకృతి మరింత అందంగా మారిపోతుంది . పువ్వులు, బహుమతులు, తమ అంతరంగాన్ని ఆవిష్కరించే పదాలతో ఉన్న గ్రీటింగ్ కార్డులను ప్రేమికులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా చేయడం ఒక సంప్రదాయం కాకున్నా తమ ప్రేమను మరింత అందంగా ప్రకటించుకునే రోజిది. ప్రేమకి ఎవరెలాంటి పరిభాషలు చెప్పినా చివరికి అమరమైనది 'ప్రేమ' అనే విషయం అందరూ అంగీకరిస్తారు.ప్రేమికుల రోజుగా పిలవబడే వాలంటైన్స్ డే నిజంగా స్త్రీ పురుషుల ప్రేమకు మాత్రమే సంబంధించినదా? కానే కాదు. ఇది తిరస్కారం, మృత్యువు, క్రూరత్వానికి ముడిపడి ఉన్న పండగ. క్రీ.శ.3వ శతాబ్దంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ కి ఉన్న రాజ్యకాంక్ష కారణంగా తరచూ యుద్ధాలు జరిగేవి. అతని క్రూరత్వానికి జడిసి ప్రజలు సైన్యంలో చేరడానికి సుముఖంగా ఉండేవారు కాదు. దానికి కారణం పురుషులంతా ప్రేమలో పడి తమ ప్రియురాళ్లు, భార్యలను వదిలి ఉండలేకపోతున్నారు అని భావించి క్లాడియస్ తన రాజ్యంలో పెళ్లిళ్ల్లనే రద్దు చేశాడు. ఆ రాజ్యంలో ఒక మతప్రచారకుడు సెయింట్ వాలంటైన్ మాత్రం చక్రవర్తికి తెలియకుండా రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవాడు. అది తెలుసుకున్న చక్రవర్తి అతడిని బంధించి ఉరిశిక్ష విధించాడు. జైలులో ఉన్నప్పుడు పరిచయమైన జైలర్ కూతురిని ప్రేమించాడు. క్రీ.శ.269 సంవత్సరం, ఫిబ్రవరీ 14 ఉరితీయబోయే ముందు తన ప్రేమసంకేతంగా గ్రీటింగ్ కార్డ్ తయారుచేసి "ప్రేమతో... నీ వాలెంటైన్" అని సంతకం చేశాడనీ ప్రతీతి. . ప్రేమను బ్రతికించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టిన వాలెంటైన్ కి నివాళిగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజును వాలెంటైన్ డేగా జరుపుకుంతున్నారు. ఈ రోజున ప్రేమికుల మధ్య చోటు చేసుకునే ప్రతి సంఘటన ఒక తీపి గుర్తుగా ,మధుర స్మృతిగా మిగిలిపోతుంది. మరపురాని బహుమతులతో ఈ అపురూప క్షణాలను మరింత అందంగా మార్చుకుంటారు. న్యూఇయ ర్స్‌డే, క్రిస్‌మస్‌ల తర్వాత ప్రపంచ మంతటా ప్రముఖంగా జరుపుకునే వేడుక వాలంటైన్స్‌డే.ప్రేమ తత్వాన్ని అందరికి పంచే పవిత్రమైన ప్రేమికుల రోజును చిన్న బహుమతి గాని, గులాబీ కాని, ఆత్మీయమైన మాటలతో ఉన్న గ్రీటింగ్ కార్డ్ కాని ఇచ్చి ప్రేమను వ్యక్తపరుచుకోవడం ప్రేమను గెలిపించడమే అవుతుంది. నేటి యువతలో ఈ ప్రేమ వెర్రి తలలు వేస్తుంది. కొద్దిపాటి పరిచయంతోనే ప్రేమించుకుంటున్నాం అని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పబ్బులు, అశ్లీల నృత్యాలు, తాగుడు పార్టీలు అంటూ ఈ పండగ ఉద్ధేశ్యాన్ని మంటగలుపుతున్నారు. అందుకే కొన్ని మత తత్వ పార్తీలు ఈ ప్రేమికుల రోజు జరుపుకునే సంస్కృతి మనది కాదు అంటూ ఇలాంటి వేడుకలు జరుగే చోట ఆందోళనలు చేస్తున్నారు. ఈరోజు ఎవరైనా జంట బయట కనపడితే వాళ్లిద్దరికి పెళ్లి చేయడమో రాఖీ కట్టించడమో చేస్తామని బెదిరిస్తున్నారు.
వాలంటైన్ ఆత్మార్పణ సంకేతంగా ఆరంభమై వాలంటైన్ డే గా విశ్వవ్యాప్తంగా ప్రేమపరిమళాలు వెదజల్లే ప్రత్యేక రోజుగా నిలిచిపోయింది.

1 వ్యాఖ్యలు:

ramu

charitra edainaa kaavochhu.
manishi samskruthini, sampradaayaanni nilupukovadaaniki, pandagalu elaagaithe jarupu kuntunnaamo alage ee premikula rojullantivi.
premanu okka rojuki parimitham cheyyadamlo goppa aalochana undi.. pandagalni aarbhatamga jarupukovaalante karchu ekkuva avuthundi. alaage premikula madhya prema sruthi minchithe anrdhalu jaruguthaayani okka rojuke parimitham chesaaremo.
jyothi garu parimitham gaane premikula roju gurunchi baagaane chepparu.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008