Wednesday, 16 March 2011

భావవ్యక్తీకరణకు వేదికలు తెలుగు బ్లాగులు


భావవ్యక్తీకరణకు వేదికలు తెలుగు బ్లాగులు



సురుచి కలగూరగంప వీవెనుడి టెక్నిక్కులు సరిగమలు సాహితి మనస్వి గీతలహరి సత్యశోధన మోహనరాగం అక్షరం తూర్పూ పడమర తూలిక భవదీయుడు సత్యాన్వేషి చదువరి నైమిశారన్యం తెలుగుపద్యం రాత గీత మనసులో మాట శ్రీలలిత నాతో నేను నా గురించి నా స్పందన బాతాఖానీ, రేఖాచిత్రం తెలుగుకళ ప్రసీద మంచుపల్లకి కొత్తపల్లి మాయాశశిరేఖ వెన్నెల సంతకం ఏటిగట్టు జ్యోతి నైమిశారణ్యం మనసులో అంతర్వాహిని హృదయస్పందన చిరుసవ్వడి మెంతిబద్దలు సత్యప్రియ దిరిసెన పుష్పాలు కృష్ణప్రియ జాజిపూలు బ్లాగాడిస్తా నెమలికన్ను తెలుగోడు జానుతెనుగు సొగసులు
కబుర్లు. ...

ఇవన్నీ తెలుగుబ్లాగుల పేర్లే...



శరవేగంతో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులు తెచ్చింది. ఇంకా తీసుకొస్తుంది కూడా. ఈ రోజుల్లో టీవీ, ఫ్రిజ్ లా దాదాపు ప్రతీ ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్ తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు అది ఇంగ్లీషు భాష కోసమే కాక తెలుగు చదువులు, రాతలకు కూడా ఉపయోగింపబడుతుంది. రాయాలనుకునే వాడిని రచయితను చేస్తుంది ఈ బ్లాగు.. అసలు బ్లాగు అంటే ఏమిటి? అంతర్జాలంలో మనకంటూ ఒక అందమైన ఇల్లు కట్టుకుని, దానిని అన్ని హంగులతో అలంకరించి, మన భావవ్యక్తీకరణకు వేదిక చేసి పదిమందితో పంచునేదే బ్లాగు. అసలు బ్లాగు ఎందుకు రాయాలి? ప్రత్యేకంగా మనకంటూ ఒక బ్లాగు ఉండాలా? ఇంటి అడ్రస్సు లేదా ఉత్తరం రాయాలంటే ఓ మెయిల్ ఐడి ఉంటుంది చాలదా? మరి ఇదేంటి కొత్తగా?? అంటారా??..... కొత్త సినిమా చూసి వచ్చాం. అది పరమచెత్తగా ఉంది. ఆ చిత్ర నిర్మాత, దర్శకులు కనిపిస్తే చితక్కొట్టాలన్నంత కోపం, ఉక్రోషం కలుగుతుంది. సెలవుల్లో లెదా ఆఫీసులో ఓక మరచిపోలేని సంఘటన జరిగింది. నిత్యావసరాల ధరలు, అద్దె ఇంటి తిప్పలు, స్కూలు ఫీజులు, ఇలా ఎన్నో సమస్యలు. ఎన్నో ఆలోచనలు, మాటలు మనసులో తిరుగుతున్నాయి. ఎవరితోనైనా పంచుకుని చర్చించాలి. ఎలా? స్నేహితులను ప్రతీ విషయంలో డిస్టర్బ్ చేయలేము. ఐనా మనకు నచ్చిన , నచ్చని విషయాలపై మన స్నేహితులు కూడా మనలాగే స్పందిస్తారా? లేదు... అందుకే మన ఆలోచనలకు, భావనలకు ఒక అనువైన చోటు బ్లాగు. వెబ్‌లాగ్ అనే పదం తెలుగులో బ్లాగు గా స్థిరపడింది. ఇది మీ ఆంతరంగిక స్నేహితుడు లేదా స్నేహితురాలు అనుకోండి. మీరు ఏది చెప్పినా వింటుంది. మీరు తోచింది, చెప్పాలనుకున్నది, రాయాలనుకున్నది సులువుగా తెలుగులోనే రాయవచ్చు. మీ చిన్ననాటి జ్ఞాపకాలు, సంతోషాన్నిచ్చిన, బాధపెట్టిన సంఘటనలు, అలుపొచ్చేదాకా రాస్తూ పోవచ్చు. అవి చదివి వెంటనే స్పందించడానికి ఎంతోమంది సహృదయులైన పాఠకులు ఉన్నారు.



ఈనాడు వెయ్యికి పైగా తెలుగు బ్లాగులు ఉన్నాయి. కాని అందులో సుమారు వంద బ్లాగులలో మాత్రమే క్రమం తప్పకుండా రాస్తున్నారు. ఈ బ్లాగులలో కొన్ని ప్రత్యేక అంశాల మీద మాత్రమే వ్యాసాలు లేదా టపాలు కలిగి ఉంటాయి. అవి రాజకీయాలు, పద్యాలు, ఆధ్యాత్మికం, సినిమా,పాటలు, శాస్త్ర విజ్ఞానం, అల్లరి.... ఇలా ఎన్నో రాస్తుంటారు. మరి కొన్ని బ్లాగుల్లో తమకు తోచిన అంశాలు, లేదా మనసులో మెదలిన ఏదైనా సంఘటన, స్పందన, ఆవేశం, జ్ఞాపకాలు రాసుకుని చర్చిస్తారు, వాదిస్తారు.. బాధను పంచుకుని సేదతీరుతారు. చాలా మంది బ్లాగును తమ అంతరంగం లేదా హృదయభాను అని వ్యవహరిస్తారు. ఎంతోమంది బ్లాగు రచనల ద్వారా మంచి స్నేహితులను పొందారు. వారి మధ్య ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది. బ్లాగుల ద్వారా తమ రాతలను రచనలుగా చేసుకున్నవారెందరో. తాజా రాజకీయ సంక్షోభాలు, సంచలన వార్తలు , కొత్త సినిమా కబుర్లపై సమగ్రమైన చర్చలు కూడా బ్లాగుల ద్వారా జరుగుతుంటాయి. ఇక్కడ భావవ్యక్తీకరణకు, రచనలకు ఎటువంటి హద్దులు ఉండవు. నిజం చెప్పాలంటే బ్లాగు ఒక పత్రికలాంటింది. తమ ఆలోచనలను, రచనలను నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తమ బ్లాగులో వెల్లడించే స్వాతంత్ర్యం ఆ రచయితకు ఉంటుంది. బ్లాగు రాతలు ఆ వ్యక్తి స్వభావం, ఆలోచనావిధానాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ బ్లాగులు రాసేవాళ్లందరూ సాంకేతిక నిపుణులు కారు. వీరిలో తెలుగు పండితులు, విశ్రాంత వ్యక్తులు, ఉద్యోగస్తులు,,విధ్యార్థులు, పత్రికా ప్రతినిధులు, రచయితలు , గృహిణులు ఉన్నారు. ప్రపంచంలోని వేర్వేరు దేశాలలో, అందనంత దూరంలో ఉన్నా, పరిచయం, చుట్టరికం లేకున్నా బ్లాగులోకంలో కలుసుకుని ముచ్చట్లాడుకుంటారు.



ఇతర భాషా బ్లాగుల్లో లాగా తెలుగు బ్లాగుల్లో ఉబుసుపోక చర్చలు, అనవసరపు గొడవలు ఎక్కువగా ఉండవు. అప్పుడప్పుడు వచ్చినా అవి తొందరగానే సమసిపోతాయి. వాస్తవ ప్రపంచం లాగే ఈ మిధ్యా ప్రపంచంలో కూడా మంచి, చెడు, అసూయా , ద్వేషం కనిపిస్తాయి. అది మనకు ఎంత అవసరమో ఏది అవసరమో అదే తీసుకుంటే సరి. బ్లాగింగులో అనే కాదు.. ఇంటర్నెట్ వాడే ప్రతీవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుక్షణం జాగరూకులై ఉండాలి. తెలుగు మీది అభిమానం, తమకు తెలిసిన విషయాన్ని పదుగురితో పంచుకోవాలనే ఆరాటం, తపన, తెలుగు రాయడానికి ఖర్చులేని ,సులువైన పద్ధతుల వల్ల ఎంతో మంది ఔత్సాహికులు, భాషాభిమానులు తెలుగులో బ్లాగులు మొదలెడుతున్నారు. ఆదాయం విషయంలో ఎటువంటి లాభం లేకున్నా సంతృప్తి విషయంలో మాత్రం ఈ తెలుగు బ్లాగర్లు చాలా లాభపడుతున్నారన్నది కాదనలేని సత్యం.



బ్లాగు మొదలుపెట్టి ,దాన్ని అందంగా అలంకరించి, అవసరమైన హంగులన్నీ చేర్చడం అంత కష్టమేమీ కాదు. ఈ క్రింది సైట్లలోకి వెళ్లి మీ బ్లాగును మొదలుపెట్టండి.

http://www.blogger.com

http://www.wordpress.com

http://www.blaagu.com

http://www. space.live.కామ్


బ్లాగులకు సంబంధించి అన్ని సమస్యలు, సందేహాలు చర్చించడానికి ఒక ప్రత్యేకమైన గూగుల్ గ్రూపు ఉంది.


https://groups.google.com/group/telugublog?hl=en


ఇక బ్లాగుకు సంబంధించిన అన్ని రకాల పాఠాలు ఇక్కడ లభిస్తాయి.


http://telugublogtutorial.blogspot.com



మరి ఆలస్యమెందుకు? మీ ఫోన్ నంబర్, సొంత ఇల్లులాగా అంతర్జాలంలో కూడా మీకంటూ ఒక బ్లాగ్ ఇల్లు కట్టుకోండి


14 వ్యాఖ్యలు:

కనకాంబరం

తెలుగు బ్లాగుల గురించి సమగ్ర వివరణ ల విందు అన్ని రుచులతో అందించినందుకు ధన్య వాదాలు జ్యోతిగారు. ఆ చేత్తోనే నాకూ ఓ విస్తరేసుంటే......... శ్రేయోభిలాషి ...నూతక్కిరాఘవేంద్ర రావు .

kaartoon.wordpress.com

తెలుగు బ్లాగులగురించి చాలా విపులంగా తెలియజేసారు.
అప్పుడప్పుడు నిరుత్సాహం కలుగుతున్న నాలాంటి వాళ్ళకు
నూతనోత్సాహం కలిగించింది మీ రచన. ధన్యవాదాలమ్మా!!

గిరీష్

Encouraging..Thank you

ఆ.సౌమ్య

nice article!

మధురవాణి

Good one! :)

హనుమంత రావు

జ్యోతి గారు నమస్తే..బ్లాగుల గురించి చాలా బాగా వ్రాసారు..నిజానికి మనగురించి మనతో, మనవాళ్ళతో మనసారా చెప్పుకోడానికి ఈ ప్రక్రియ చాలా బాగుంది..అనేక కారణాల వల్ల ఈ మధ్య నేను వ్రాయలేక పోతున్నాను. దానివల్ల నేను మీ బ్లాగుల లిస్టులో స్థానం కోల్పోయానేమో.చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ...త్వరలో బ్లాగులో మాటలాడతాను.శలవు.

హనుమంత రావు

జ్యోతి గారు నమస్తే..బ్లాగుల గురించి చాలా బాగా వ్రాసారు..నిజానికి మనగురించి మనతో, మనవాళ్ళతో మనసారా చెప్పుకోడానికి ఈ ప్రక్రియ చాలా బాగుంది..అనేక కారణాల వల్ల ఈ మధ్య నేను వ్రాయలేక పోతున్నాను. దానివల్ల నేను మీ బ్లాగుల లిస్టులో స్థానం కోల్పోయానేమో.చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ...త్వరలో బ్లాగులో మాటలాడతాను.శలవు.

Lakshmi ...Rasoi ki Malkin..northern and southern spices

Good informative post..

జయహొ

జ్యోతి గారు,
సుమారు 50 తెలుగు బ్లాగులను ఆంధ్రభూమి పేపర్ చదివేవారికి పరిచయం చేయటం చాలా బాగుంది. క్రమం తప్పకుండా రాసే బ్లాగులలో అమ్మఓడి బ్లాగు కూడా ఉంది. ఆబ్లాగు పేరుని మీరురాయ లేదు. మీరు రాసిన వ్యాసం ఆంధ్రభూమికి కాబట్టి ఆ బ్లాగు పేరు ప్రస్తావించి ఉండవచ్చు. ఎందుకంటే మీడీయా లో ఉన్న అతికొద్ది హిందూ మధ్యతరగతి భావాలను ప్రతిభింబించే వారిలో
K. రామచంద్రమూర్తి(HMTV Editor), యం.వి.యర్. శాస్త్రి గారి భావాలతో అమ్మఓడి బ్లాగులో రాసే భావాలు సరి పోతాయి. నిజానికి మీరు పైన రాసిన బ్లాగుల స్థాయికి ఆ బ్లాగులో రాతలు ఏమాత్రం తీసిపోవు. ఇంకా చెప్పాలంటె పేపర్ లో వచ్చే సంపాదకీయాలకన్నా ఆబ్లాగులో కొన్నిటపాలలో విశ్లేషణలు ఎంతో బాగుంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. మీరు ఆబ్లాగు పేరు కూడా ఆంధ్రభూమిలో రాసి ఉండవలసినదని నా అభిప్రాయము.

జ్యోతి

అందరికి ధన్యవాదాలు

రాఘవేంద్రగారు, మీరు బ్లాగుల్లో రాయడం లేదుకదా అందుకే మాకందరికి కాస్త అలుక. తప్పకుండా విస్తరేద్దాం..

అప్పారావుగారు,, నిరుత్సాహం ఎందుకండి?? కొత్త కొత్తగా నేర్చుకోవాలి. మనదగ్గరున్న సంపదను వినూత్నరీతిలో అందించడం తెలుసుకోవాలి. అలా చేస్తే ఎప్పటికప్పుడు కొత్తగా, ఉత్సాహంగా ఉంటుంది..

హనుమంతరావుగారు, నేను రాసిన లిస్టు ప్రముఖులుకారు, పాతవాళ్లు కాదు, కొత్తవాళ్లు కాదు. వ్యాసం రాసేటప్పుడు గుర్తొచ్చినవి రాసాను. అంతే. మీరు కూడా తొందరగా రాయడం మొదలుపెట్టండి మరి..

జయహో గారు, మీరు చెప్పిన విషయాలతో నేను కూడా ఏకీభవిస్తాను. అమ్మఒడి కాక ఇంకా ఎన్నో విశిష్టమైన బ్లాగులు ఉన్నాయి. చూద్దాం ముందుముందు ఏం జరుగుతుందో...

Lakshmi Raghava

andhra jyoti chadavaka enta miss chestunnano

మాలా కుమార్

మీ ఈ ఆర్టికల్ ఇప్పుడే చూసాను . బాగా రాసారు . నా 'సాహితి ' పేరు కూడా చెప్పినందుకు థాంక్స్ అండి .
ఈ ఆర్టికల్ ఎప్పుడు , ఏ పేపర్ లో వచ్చిందండి ?

ఆత్రేయ

మీ ఆర్టికల్ ఇప్పుడే చదివా అందులో నా బ్లాగ్ పేరు ప్రస్తావించ నందుకు ఉక్రోషం గా మీ బ్లాగ్ పేజ్ ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేస్తున్నా ఇలా పది సార్లు నా కసి దీరా... :P

జ్యోతి

లక్ష్మీరాఘవగారు, ఇది ఆంధ్రభూమి పేపర్లోనండి.

ఆత్రేయగారు, ఐతే నేను మీ పేరు అస్సలు తలవను, తలచినా రాయను.అప్పుడే కదా మీరు నన్ను తిట్టుకుంటూ ఒకటికి పదిసార్లు నా బ్లాగుకు వస్తారు. ప్రహ్లాదుడికంటే హిరణ్యాక్షుడే గొప్ప భక్తుడంటారు కదా. భక్తుడికంటే శత్రువే ఆ పరమాత్మను ఎక్కువగా స్తుతిస్తారు...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008