Wednesday 23 March 2011

నవ్వు బహు "బ్లాగు"

నవ్వు బహు బ్లాగు

http://bulususubrahmanyam.blogspot.com/

తెలుగుమీద ఇప్పుడు బోలెడు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్లు, ఒకరిద్దరు తప్పితే, మాకు టిఫిన్లు బాగా పెట్టేవారు. పెసరట్టు, మినపరోస్ట్ వీపుమీద, కొంచెం లైట్ గాపడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్ట్ అని అర్ధం. తొడమీద గిల్లితే పకోడి అనీ, మెలిపెట్టి గిల్లితే పునుకులు అనీ, బుగ్గమీద పొంగిస్తే బూరెలు అనీ, అరచేయి వెనక్కి తిప్పి ముణుకులు వాయగొడ్తే కజ్జికాయలు, మైసూర్ పాక్ అనీ అనేవాళ్ళం.



సంధులు, సమాసాలు, విభక్తులు, భక్తులతోటి కుస్తీ పడుతుంటే, తీరుబడిగా, చిద్విలాసంగా నవ్వుతూ గురువులు, లఘువులు మా మీదకు దూకేసాయి. తోడుగా గణాలను తెచ్చుకున్నాయి. యగణం, మగణం, భగణం అ౦టూ హోరెత్తించేశాయి. మేము బిత్తరపోయి చూస్తుంటే ఉత్పలమాలలు, చంపకమాలలు, వాటికి కాపలాగా శార్దూలాలు, మత్తేభాలు పైనపడ్డాయి వికటాట్టహాసాలతో. ఇంకా మేమేమైనా మిగిలి ఉంటే మీద పొయ్యడానికి సీసంలను తోడుతెచ్చుకున్నాయి. ఒకళ్ళా, ఇద్దరా కవులు కొల్లేటి చాంతాడంత లిస్టు. ఒక్కొక్కడు కనీసం ఓఅరడజను వ్రాసిపడేసాడు. ఎవరు, ఎందుకు, ఏంవ్రాసాడో ఎలా గుర్తుపెట్టుకోవడం? నానా అవస్తలు పడేవాళ్ళం. గురువులను, లఘువులను గుర్తి౦చడం ఓ యజ్ఞం లాగ ఉండేది. లఘువులు కొంచెం తేలిక అనిపించినా, గురువులు కష్టం అయ్యేది.



ఇలా తెలుగు బాష మీద తను చేసిన కర్రసాము గురించి చెప్పే శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు హైదరాబాదువాసి . ఉద్యోగ విరమణ తర్వాత తీరిక సమయంలో ఆరునెలలక్రింద మొదలుపెట్టిన నవ్వితే నవ్వండి బ్లాగు నిరంతరం చదువరులను నవ్విస్తూనే ఉంది. తెలుగేతర ప్రాంతాలలో ఉద్యోగం చేసి బాషాప్రావీణ్యం అంతగా రాదంటూనే ఆయన రాసే టపాలు ఒకదానికి మించి ఇంకొకటి అని ఒప్పుకోక తప్పదు. సహజంగా హాస్యప్రియుడిని కావడంతో అందరిని కాకున్నా పదిమందినైనా నవ్వించగలిగితే ధన్యుడను అంటున్నారు సుబ్రహ్మణ్యం. నవ్వు నాలుగువిధాల చేటు అన్నవాళ్లే నవ్వనివాడు రోగి అని కూడా అన్నారు. యాంత్రికంగా మారిన నేటి జీవనయాత్రలో నవ్వు చాలా ఖరీదైపోయింది. ఇటువంటి పరిస్దితుల్లో ఈ బ్లాగు టపాలు ఓ డోస్ గా వేసుకుంటే హాసం మందహాసంగా మారుతుందని చెప్పవచ్చు. అన్నింటికంటే అవతలివాళ్లను నవ్వించడం కష్టమేమో కాని సుబ్రహ్మణ్యంగారు నిరంతరం తన బ్లాగు టపాలతో నవ్వించక ఉండలేరు. ఈ మధ్యే పోలీసు అధికారులకు, సదరు మంత్రిగారికి ఉత్తరాలు రాసి బాధితులకు సాయం చేయమని చెప్పి మరీ, తన బ్లాగులో తన గేయాన్ని చదివించారు.

7 వ్యాఖ్యలు:

బులుసు సుబ్రహ్మణ్యం

నా గురించి ఆంధ్ర భూమి లో వ్రాసినందుకు ధన్యవాదాలు.

నేను తెలుగులో వ్రాయగలనా అని భయపడుతూనే వ్రాయడం మొదలు పెట్టాను. మీ అందరి సహాయ సహకారాలతో, ప్రోత్సాహాలతో నేను వ్రాయ గలను, అనే నమ్మకం కుదిరింది. ఇప్పుడు మీరు నన్ను ఒక దినపత్రిక, ఆంధ్ర భూమి లో పరిచయం చేసి ముందుకు నడిపిస్తున్నారు.

మీ, బ్లాగ్మిత్రుల ఆదరాభిమానాలకు, ప్రోత్సాహానికి సర్వదా కృతఙ్ఙుణ్ణి.

కృష్ణప్రియ

మంచి పరిచయం.. బులుసు సుబ్రహ్మణ్యం గారి బ్లాగ్ గురించి బహు చక్కగా చెప్పారు.

Unknown

namaste jyothi garu,
iam writing unrelated to this.pls sort out my problem. i want join in mallika. I am sending mail about my blog Id to the admin but i am not able to send to admin. pls give me some advise. thankyou
gayathri

జ్యోతి

గాయత్రిగారు,
మీరు ఈ అడ్రస్ కు మెయిల్ పెట్టండి మీ బ్లాగు చిరునామాతో
admin@maalika.org

Unknown

thankyou

Unknown

jyothi garu,
Onace again I am asking a help from you. I am getting problem in typing vathulu in telugu. how can i get away from that problem. I am using quillpad for tying telugu.

how can i paste maalika aggregator logo in my blog?

I am sorry for distrubing you .
thankyou

జ్యోతి

గాయత్రిగారు,
పర్లేదులెండి. మీరు లేఖిని ఎందుకు వాడకూడదు? అది చాలా సులువుగా ఉంటుంది. నెట్ కనెక్షన్ ఉన్నా లేకున్నా వాడుకోవచ్చు.

మీకు మాలికకు సంబందించి ఎటువంటి సందేహమున్నా మాలిక నిర్వాహకులకు మెయిల్ పెట్టొచ్చు.. ఇంతకుముందు ఇచ్చిన చిరునామానే..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008