అష్టవిధ నాయికలు..
అష్టవిధ నాయికలు భరతముని రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొన్న ఎనిమిది రకాల నాయికల గురించి చెప్పిన వివరణ. ఈ నాయికలు వేర్వేరు పరిస్థితుల్లో వారి ఎనిమిది రకాల మానసిక అవస్థలను తెలియజేస్తుంది..తన ప్రియుడు లేదా భర్త కోసం ఎదురు చూసే నాయిక మానసిక స్థితి గురించి అద్భుతంగా వివరించారు ఎందరో మహానుభావులు. ఈ అష్టవిధ నాయికల గురించి దేవులపల్లి కృష్ణ శాస్త్రి చెప్పిన వివరణ, అలాగే పి.సుశీల వివిధ సినిమాలలో పాడిన పాటలు కలిపిన మాలిక ఇది..
ఇరులలో తారక లివియంచు, తానేనా
కురులలో మల్లియ విరులు తురుము!
అసలే కెందమ్ము లీ అడుగు లనుచు, ఎంతో
పొందుగ లత్తుక పూయు తానే!
అదియేదో అంటే నీ అధరాన నని, తన
మెత్తని పెదవుల నొత్తి తుడుచు!
చూచుచు, మరి మరి చూచి మెచ్చుచు, మక
రికల చెక్కిళ్ళ చిత్రించు తానే!
ఎంత పున్నెమ్ము చేసినానే, మగండు
ఒక్క క్రీగంటి చూపులో, ఒక్క లేత
నగవులో, నా మనస్సు నెరిగి గ్రహించి,
తీర్చునే యంచు మురియు `స్వాధీన పతిక '
------------------
విభుని దోతేర పంపిన ప్రియ దూతిక
లెంతకు తిరిగి రారేమో కాని-
ఘనుల సద్గోష్ఠిలో మునిగి యున్నాడని
వెరతురేమో స్వామి దరియుటకును;
నిప్పుల వర్షమై నిలువెల్ల దహియించు
నిలబడనీదు వెన్నెలల వాన;
అయ్యయో మదన దేవా! మ్రొక్కు దాన, నా
పైననా ననతూపు పదను బాకు?
అతనుదవు, నీవు పోగల వటకు, - వారి
ఉల్లమున జేరి నా మాట నూదగలవు;
చనుము - నా ప్రాణముల నిల్పు మని నెలాంత
తల్లడిలు విరహోత్కంఠిత వలవంత?
---------------
పవళింపు గదిలోన, పగడంపు కోళ్ళ చ
ప్పరపు మంచము పైన పాంపు పైన
వలిపంపు జిలుగు దుప్పటి వేసి, కస్తూరి
జువ్వాది కలిపిన గంధ సార,
మగరు వత్తులు, మేలి అత్తరుల్, పచ్చక
ప్పురపు వీడియము పళ్ళెరమున నిడి
ద్వారాన తోరణాల్ కూరిచి, ముంగిట
వన్నెవన్నెల రంగవల్లులుంచి
తానమాడి, పుప్పొళ్ళ నెమ్మేన నలది
నెరుల సిగ నల్లి, నుదుట చెందిరపు బొట్టు,
కనుల కాటుక, అలతి నగవులు మెరయ
విభుని కొరకు వాసక సజ్జ వేచి యుండు
-------------
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది..
ఈ తీవ యోవరియే గదా తాముర
మ్మన్న యేకాంత గృహమ్ము! తాము
మెత్తురనే గదా, మెలత, ఈ కయిసేత!
ఈ నిరీక్ష్ణము లింకెంత శేపె?
కడచెనే రేయి సగ; మ్మైన శ్రీ వారి
అడుగుల సడియును పడదు చెవుల-
మరిమరి పొగడకే మాయల మారిని,
విసిగిన ప్రాణాలు వేపి తినకె!
పదవె, అడుసాయె నేల నా బాష్పవారి
ననుచు నెవ్వగ మెయినగ లన్ని ఊడ్చు;
"అసలు దోషము నాదే" నటంచు ఏడ్చు;
విరహమున వేగిపోయిన విప్రలబ్ధ
పెను చీకటాయే లోకం
-----------
"మన సార వలచి వచ్చిన వాడు,నీ రేడు
తొగరేని మించు సోయగము వాడు;
లాలించినాడు, తన్నేలు కొమ్మన్నాడు-
చప్పగా వాయైన విప్పవపుడు.
అవియేటి అలకలో! అ మూతి ముడుపులు
ఆ మొండిపట్టులు, ఆ బిగువులు!
ఇక నిప్పుడోయమ్మ! ఎన్ని నిట్టూర్పులు
అసురుస్సునంటలు, అలమటలును!
ఓసి, ఇవియేటి చేతలే బైసి మాలి!
ఏరు విన్నను నవ్వగలారు లె" మ్మ
టంచు చెలి పల్క, తెలివొంది అలవి కాని
వెతల పాలౌచు కలహాంతరిత తపించు
--------------
ఏమని పాడెదనో ఈ వేళ
విన్నవే యిన్నాళ్ళు, కన్నులారగ చూసి
న్నను, నేడేంతో ఆనంద మాయె;
ఆ చందనాంకము లా తమ్ములపు ముద్ర
లే లేమవో చెప్పలేరు తామె;
వేయికి పైనాయె ప్రియురాండ్రు, రేయికో
మూడే ఝామములాయె - మోహ యాత్ర
నేదో ఈ దారి నూరేగు చుబుసుపోక
వేంచేసినార లీ వేగుబోక
వలదు విడియగ నిట మానవతులే గాని
వలపు బిచ్చ మాశించెడి వారులేరు;
పిలిచుచున్నవి వేరె కౌగిళులు, వెడలు
మనుచు తెగనాడు ఖండిత అయిన రాధ
--------
"అటు చూడ వీటి ముంగిటను మౌనమ్ముగా
తల వాలిచె మన మందార తరువు!
పురి విప్పదు మన పెంపుడు మయూరమ్ము ది
గులుచెంది దిక్కుదిక్కులకు చూచు!
సరెసారెకు మన శారిక పలవించు
కలువరపడి ఏదృ పలుకబోవు!-
ఏలాగు నీ మేఘవేళ ఒంటరి రేల
ప్రాణేశ్వరు ప్రవ్వసి బాసి" యనుచు
చల్లుకొను మేన గొజ్జంగి నీరు;
గుప్పుకొను కప్పురము తోడి పుప్పొడులను;
పొరలు సెజ్జ, లేచి మరల నొరుగు సుంత;
పొగులు ప్రోషిత భర్తృక మగని కొరకు
-------------------
నిన్నే వలచితినోయి
నడి రేయి, చక్కని పున్నమి నాటి వెన్నెల
పాల వెన్నెల జడివాన లీల!
హృదయేశు డున్న ఆ పొదరింటి వర కొరుల్
పసిగట్టకుండ పోవలయు గాదె!
తెలికోక తెలి రైక, తెలిమేలి ముసుగులో
మెయి సోయగపు మిసమిసలు దాచి
కాలి యందెల కడియాల గాజుల మువల్
రవళింపకుండ చెరగున జొనిపి
మోముపై, కేలిపై గంద వొడి నలంది
పులుగు రవ్వంత గూట కదల బెదరుచు
ఆకుసడి కదరుచు, గాలి అడుగు లిడుచు,
వెడలె నభిసారికగ ప్రియు కడకు రాధ
ఆ నాయికల వివరణ మామూలు మాటలలో
1.విరహోత్కంటిత : భర్త చెప్పిన వేళకు రాలేదని ,ఆలస్యానికి తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ.
2.ఖండిత నాయిక : తన భర్త రాత్రంతా పర స్త్రీతో గడిపి ,తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన మగడిని చూచి దుఃఖించే స్త్రీ.
3.స్వాధీన పతిక : తను చెప్పినట్లు విని, కోరినట్లు నడుచుకునే భర్త గల స్త్రీ.
4.ప్రోషిత పతిక : భర్త తనకు దూరం లో వున్నప్పుడు అతని తలపులు నెమరు వేసుకుంటూ విరహ వేదన పడే స్త్రీ.
5.వాసక సజ్జిత : దూరాన ఉన్న భర్త చాల రోజుల తరవాత వస్తున్నాడని తెలిసి విరహ వేదనతో తను, తన పడక గదిని అలంకరించి ,ప్రియుని రాక కోసం ఎదురు చూసే స్త్రీ.
6.విప్రలబ్ద : తాము ఏర్పాటు చేసుకున్న సంకేత స్థలానికి తన ప్రియుడు రాక పోతే , విరహంతో భాద పడే స్త్రీ.
7.కలహాంతరిత : భర్త ఎంత చెప్పినను వినక ,అది అబద్ధమని నమ్మి,అతనితో దెబ్బలాడి వెల్ల గొట్టి, తరువాత అయ్యో! ఎంత పని చేసాను !ఎంత నోచ్చుకున్నాడో! అని దిగులు పడే స్త్రీ.
8.అభిసారిక : అందంగా అలంకరించుకుని ప్రియుని దగ్గరకు తానే వెళ్ళేదిగాని , లేదా ప్రియుడ్ని తన దగ్గరకు పిలిపించుకునే స్త్రీ.
ప్రవత్ప్యత్పతిక : ప్రియుడు దూర ప్రయాణానికి వెళుతున్నప్పుడు యా వాస్తవాన్ని తట్టుకో లేక కన్నుల నీరిడే తొమ్మిదవ కథానాయిక.
19 వ్యాఖ్యలు:
super collection.very nice.
జ్యోతిగారు ఎంత ఓపికండీ మీకు . నాయికల సంగతి నాకు అంతగా తెలీదుకానీ , మంచిపాటలు సెలెక్ట్ చేసిపెట్టారు థేంక్యూ
good collection and good connection - from the songs to the Nayika-bhava :)
శశి, లలిత, కొత్తపాళీ గారు, ధాంక్స్ అండి.. నిజంగానే చాలా టైమ్ పట్టింది ఇది రాసి , పాటలు వెతికి పెట్టేసరికి..:)) తల బ్రద్దలైపోతుంది..
ఈ టపాకి మీరు చేసిన కృషి నిజంగా ప్రశంసనీయం. మంచి పాటలను సేకరించారు కానీ ఆ నాయికల వివరణ మామూలు మాటలలో ఇవ్వాలనిపించి ఇక్కడ రాస్తున్నా.
1.విరహోత్కంటిత : భర్త చెప్పిన వేళకు రాలేదని ,ఆలస్యానికి తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ.
2.ఖండిత నాయిక : తన భర్త రాత్రంతా పర స్త్రీతో గడిపి ,తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన మగడిని చూచి దుఃఖించే స్త్రీ.
3.స్వాధీన పతిక : తను చెప్పినట్లు విని, కోరినట్లు నడుచుకునే భర్త గల స్త్రీ.
4.ప్రోషిత పతిక : భర్త తనకు దూరం లో వున్నప్పుడు అతని తలపులు నెమరు వేసుకుంటూ విరహ వేదన పడే స్త్రీ.
5.వాసక సజ్జిత : దూరాన ఉన్న భర్త చాల రోజుల తరవాత వస్తున్నాడని తెలిసి విరహ వేదనతో తను, తన పడక గదిని అలంకరించి ,ప్రియుని రాక కోసం ఎదురు చూసే స్త్రీ.
6.విప్రలబ్ద : తాము ఏర్పాటు చేసుకున్న సంకేత స్థలానికి తన ప్రియుడు రాక పోతే , విరహంతో భాద పడే స్త్రీ.
7.కలహాంతరిత : భర్త ఎంత చెప్పినను వినక ,అది అబద్ధమని నమ్మి,అతనితో దెబ్బలాడి వెల్ల గొట్టి, తరువాత అయ్యో! ఎంత పని చేసాను !ఎంత నోచ్చుకున్నాడో! అని దిగులు పడే స్త్రీ.
8.అభిసారిక : అందంగా అలంకరించుకుని ప్రియుని దగ్గరకు తానే వెళ్ళేదిగాని , లేదా ప్రియుడ్ని తన దగ్గరకు పిలిపించుకునే స్త్రీ.
ప్రవత్ప్యత్పతిక : ప్రియుడు దూర ప్రయాణానికి వెళుతున్నప్పుడు యా వాస్తవాన్ని తట్టుకో లేక కన్నుల నీరిడే తొమ్మిదవ కథానాయిక.
రసజ్ఞగారు, మీ మాటలు టపాలో కలిపేసాను..
చాలా సంతోషం జ్యోతి గారు
బాబోయ్ ఇన్ని రకాల స్త్రీ లున్నారా ఆ కాలంలో కూడా !
పురుషులను ప్రేమ పేరు తో ఎనిమిది విధాలుగా విసుగ్గెతించేవారన్నమాట.
SAVE MALE. SAVE HUMANITY:-)
మీ కృషి కి జోహార్ జ్యోతి గారూ! చాలా బాగుంది.
మీ కృషి కి జోహార్ జ్యోతి గారూ! చాలా బాగుంది.
కావ్య నాయికల వివరణకు సినిమా పాటలు జోడించాలనే ఆలోచనే ఎంతో బాగుంది. భలే!
జ్యోతిగారూ,
అష్టవిధ నాయికల గురించి వినడమే తప్ప, ఇంత చక్కటి సమాచారం పొందలేదు మునుపు. కృతజ్ఞతలు. ఈ వివరాలు దాచుకున్నాను.
రసజ్ఞ గారు తేలిక పదాలతో భావాన్ని వివరించడం కూడా బాగుంది. మరి ఈ తొమ్మిదవ నాయిక ఎక్కడి నుండి వచ్చింది ? దాని గురించి ఏమైనా వివరాలు తెలిస్తే పంచుకోగలరు.
-మానస
sending mail on ashtanayikalu.
madhuri.
రావుగారు ఎనిమిది రకాలకే బాబోయ్ అంటారేంటి? :))
రమ/రామ .. ప్రియురాలి/ ఇల్లాలి ప్రేమ విసిగిస్తుంది అనే మగాళ్లు రాందేవ్ బాబా ఆశ్రమంలో చేరి సొరకాయ జ్యూస్ తాగుతూ యోగాసనాలు వేసుకోవాలండి. ప్రతిమనిషికి ప్రేమ కావాల్సిందే కదా. అది మితిమీరినప్పుడే ప్రమాదం కాని..
సుధామ గారు, ధన్యవాదాలు..
కొత్తావకాయగారు, ఏధో అలా జరిగిపోయింది. కృష్ణశాస్త్రిగారు రాసిన నాయికలు నిజంగా ఉంటారా అని వెతికితే కొందరు దొరికారు.:).. అసలు ఈ అష్టవిధ నాయికల వర్ణన, అభినయం ఎక్కువగా నాట్యంలో జరుగుతుంది. కాని ఇలా పాటల్లో చూస్తే మరింత ఆనందంగా ఉంటుంది కదా.. ఇంకా వెతికితే మరిన్ని పాటలు దొరుకుతాయి కాని ఓపిక లేదు...
మానస గారు. తొమ్మిదవ నాయిక గురించి ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏముంధి.దానికోసం పాటలు వెతకాలి..:)
మాధురిగారు, మీరు పంపిన చిత్రం చాలా అందంగా, అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. థాంక్స్..
ఎంతో హృద్యంగా సమన్వయపరిచారు. అభినందనలు.
జ్యోతి గారు,
నేను పంపిన చిత్రాన్ని మీ టపాకి జోడించినందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడ చెన్నైలో ప్రతి మార్గశిర మాసంలో ( ఇక్కడ మార్గళి అంటారు ) సంగీత, నాట్యోత్సవాలు జరుగుతాయి. నాలుగు వందల పైచిలుకు సభలు కనీసం నాలుగు వేల సంగీత కచ్చేరీలు, నాట్య ప్రదర్శనలు, ప్రాయోగిక ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తారు. ఫ్యూజన్ సంగీతం, తమిళ నాటకాలు కూదా ప్రదర్శింపబడతాయి. ఇదొక అంతర్జాతీయ ఉత్సవం. విదేశీయులు, ప్రవాస భారతీయులు, సభా నిర్వాహకులు ఈ కార్యక్రమాలలో పాల్గొనేందుకు, కేవలం చూసేందుకూ ఇక్కడికి వస్తారు. ( ఒకే రోజు తెల్లవారుఝామున నుంచి రాత్రి వరకు వంద కార్యక్రమాలు వివిధ వేదికలలో జరుగుతూంటే ఎలా ఉంటుందో ఊహించండి! ) ఈ కార్యక్రమాలలో చాలావరకూ టికెట్టు ఉంటుంది. అయినా హాజరు బాగానే ఉంటుంది. ఇక్కడ పేరొస్తే ప్రపంచమంతా అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ ఉత్సవాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తారు.
ఇటువంటి నేపథ్యంలో తమిళ, ఆంగ్ల పత్రికలతోబాటూ మన తెలుగు పత్రికలు కూడా కవరేజ్ చేసి ప్రత్యేక కథనాలు ప్రచురిస్తాయి. ఈనాడు దినపత్రికలో డిసెంబరులో సెంటర్ పేజీ అంతా సంగీతమయమే. ఆరు సంవత్సరాలుగా నేను కూడా ఈ సంగీత యఙ్ఞంలో ఒక చెయ్యి వేస్తున్నాను. నాట్యం మీది మక్కువతో అందుకు సంబంధించిన కొన్ని కథనాలు సంగీతాన్ని గురించిన కథనాలతోపాటూ ఇస్తూ ఉంటాను. వాటిలో భాగమే ఈ అష్టవిధ నాయికలు.
కూచిపూడి నాట్యాచార్యుడు, మాధవపెద్ది సత్యంగారి కుమారుడూ ఐన మాధవపెద్ది మూర్తి గారు 'శివ ఫౌండాషన్ ' పేరిట నృత్య శిక్షణాకేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మా ఫోటోగ్రాఫర్, నేనూ వెళ్ళి ఆయన శిష్యురాళ్ళతో ప్రత్యేకంగా ఫోటో సెషన్ పెట్టుకున్నాము. అష్టవిధ నాయికలను గురించిన సమాచారం మరొక నాట్యాచార్యుడు, వేదాంతం రాఘవయ్య గారి కుమారుడూ ఐన వేదాంతం రాము గారు ఇచ్చారు. మీకు మరొకసారి ధన్యవాదాలు.
నోట్ : ఇక్కడి టీవీ చానెళ్ళు కూడా సంగీత,నాట్యోత్సవాలను ఏర్పాటు చేస్తాయి, స్పాన్సర్ చేస్తాయి, ప్రసారం చేస్తాని. మన ఆంధ్రప్రదేష్లో మాత్రం ఇటువంటి మంచి కార్యక్రమాలని దగ్గరికెందుకు రానీయవో మరి!
such a wonderfull post jyothi gaaru...i loved it....enjoyed a lot...pai paina chaduvutune...purtigaa chadavaledu..deenni aaswadistu chadavaali intikelli chaduvutaa...chalaa baaga raasaru..manchi collection..asalu naayikaa laksanaalato paatalanu meeru identify cheyyadam..chalaa great.....ante meeku subject anta baaga ardhamayyindannamata..and aa paatalanu coreect gaa pattukovadam loni mee krushi...abhinandaneeyam...mee nunchi yenno nerchukovalasina vishaalunnayi...
Post a Comment