Monday, July 11, 2011

అంతర్జాలంలో అతివలు - నారీ భేరీ

నిన్న మద్యాహ్నం ఈటీవీ2 లో ప్రసారమైన నారీ భేరీ కార్యక్రమంలో కొందరు మహిళా బ్లాగర్లు పాల్గొన్నారు. అసలు మహిళలు కంప్యూటర్ నేర్చుకుని, జాలంలో తిరుగుతూ, బ్లాగులలో ఏమేమి రాస్తున్నారు. దానివలన వారికి కలిగే లాభనష్టాలు వగైరా ఈ చర్చలో చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో లంగరమ్మ ఒక తప్పు చేసింది అది కనుక్కోంఢి చూద్దాం..:)) అలాగే చివరలో చెప్పిన ఈ మాట నాకు చాలా నచ్చింది..

అంతర్జాలాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రపంచం మనచేతిలో ఉండడంకాదు ప్రపంచానికే మనం పరిచయమవుతాం.. ధాంక్ యూ రూపవాణిగారు..


Untitled from jyothivalaboju on Vimeo.

22 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి

థాంక్స్ జ్యోతి గారూ! ఆ రోజు మాకు పవర్ కట్ వల్ల చూడలేకపోయాను. చాలా comprehensive గా ఉంది ప్రోగ్రామ్

బులుసు సుబ్రహ్మణ్యం

మొదటి నుంచి చివరదాకా చూశాను. లంగరమ్మ అతిగా నవ్వలేదు. నచ్చింది. లంగరమ్మ కాదు నవ్వకపోవడం. చర్చ సాఫీగా నడిచింది. బాగుంది. అభినందనలు.

కృష్ణప్రియ

చాలా బాగుంది.

ఆంకర్ ప్రాస కోసం .. 'ఉత్సాహం, ప్రోత్సాహం' ఎక్కువైంది అన్నది ఆవిడ. అదేనా మీరు చెప్పిన తప్పు?

జ్యోతి

కాదు కృష్ణప్రియ.. చాలా సాధారణమైన పదం అది. అది పలకడానికి పాపం ఆ అమ్మాయి కనీసం ఇరవైసార్లు ప్రాక్టీస్ చేసింది. ఐనా రాలేదు..:))

మాగంటి వంశీ మోహన్

శుభం.....బాగుంది...అందరికీ అభినందనలు...

మీరడిగిన కొచ్చెనుకు సమాధానం తర్వాత - ముందు నావి కొన్ని కొచ్చెన్లు - :)

1) ఒక్క మాలా కుమార్ గారు తప్ప మిగిలిన అందరూ వేరే వాళ్ళు మాట్టాడుతుంటే, తలలు వంచేసుకుని అక్కడ మధ్యలో ఉన్న కార్పెట్టు వంక చూస్తున్నారేం కథ? :)
2) పి.ఎస్.ఎం.లక్ష్మి గారి పేరు సి.ఎస్.ఎం.లక్ష్మి అని వేసారే? ఇంతకీ ఆవిడ ఇంటిపేరు "పి" ఆ? "సి" ఆ?
3) ఈ వీడియోలో పి.ఎస్.ఎం లక్ష్మి గారు. స్వాతి గారి మధ్య కూర్చున్నావిడ గొంతు వినపడలేదే?
4) జాజుల గౌరి గారు ఓ మూడు చోట్ల పుట్ల హేమలలిత అనీ ఇంకోచోట పుట్ల హేమలత అని అన్నారు - ఇంతకీ పుట్ల వారి అసలు పేరు ఏమిటి?


మొత్తానికి భేరీ భారీగానే వినపడిందని అనిపించింది...

Unknown

చాలా బావుంది జ్యోతిగారూ.. మీరందరూ చాలా చక్కగా, చాల నాచురల్ గా మాట్లాడారు.. అందరికీ నా అభినందనలు.. ఇంక లంగరమ్మ తప్పు నాకు రెండు చోట్ల ఉన్నట్టు అనిపించింది.. 1. అంతర్జలం ( అంతర్జాలం అనబోయి) 2. సాంకేతికత ( చివర త మింగేసినందువల్ల కొంచం విచిత్రం గా వినిపించింది). కరక్టేనా? మొత్తమ్మీద బాగానే మాట్లాదింది ఆ అమ్మాయి కొంత పట్టి పట్టి మాట్లాడినట్టు అనిపించినా..

వనజ తాతినేని

అభినంధనలు జ్యొతి గారు.
పాల్గోన్న అందరికి..శుభాబివందనలు. మంచి కార్యక్రమం

ఆ.సౌమ్య

నేను లైవ్ చూసాగా...నా బజ్జులో కూడా ఢంకా బజాయించాను, ప్రోగ్రాం బావుంది.....లంగరమ్మ ఫరవాలేదనిపించింది.

లత

ప్రోగ్రాం బావుంది జ్యోతిగారు

జ్యోతి

అందరికి ధన్యవాదాలు. మహిళలు కూడా అంతర్జాలాన్ని గురించి తెలుసుకుని తమ తీరిక సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలని మేము చేసిన చిన్ని ప్రయత్నం సఫలమైతే చాలు..

సుభద్ర నువ్వు చెప్పింది నిజమే.

జ్యోతి

వంశీగారు
భలేవారండి .మీరు చాలా జాగ్రత్తగా వీడియో చూసారని అర్ధమవుతుంది. మీ కొచ్చన్లకు సమాధానాలు తత్సంబధిత ఇస్టోరీలు కూడా చెప్తాను. కాస్త ఓ చాప కాని, కుర్చీ కాని వేసుకుని కూర్చోంఢి.

శుభం.....బాగుంది...అందరికీ అభినందనలు...

మీరడిగిన కొచ్చెనుకు సమాధానం తర్వాత - ముందు నావి కొన్ని కొచ్చెన్లు - :)

1) ఒక్క మాలా కుమార్ గారు తప్ప మిగిలిన అందరూ వేరే వాళ్ళు మాట్టాడుతుంటే, తలలు వంచేసుకుని అక్కడ మధ్యలో ఉన్న కార్పెట్టు వంక చూస్తున్నారేం కథ? :)

నావంతు ఐపోయాక వేరేవాళ్లు మాట్లాడుతుంటే కెమెరా కన్ను అటువైపే ఉంటుంది కదా, మనం కనపడం అని వాళ్లు చెప్పేవి వింటూ ఇంకా ఏ విషయాలు చెప్పాలి అని ఆలోచిస్తున్నానన్నమాట.. కాని ఇలా కనపడేస్తాననని అనుకోలేదు. ఇంతవరకు ఎవరూ ఈ విషయం అడగలేదులే. హమ్మయ్యా అనుకున్నాను. కాని మీరు పట్టేసారు కదా!! :))

2) పి.ఎస్.ఎం.లక్ష్మి గారి పేరు సి.ఎస్.ఎం.లక్ష్మి అని వేసారే? ఇంతకీ ఆవిడ ఇంటిపేరు "పి" ఆ? "సి" ఆ?
ఆవిడ పేరు పి.ఎస్. ఎమ్ లక్ష్మి. నేను ఇలాగే రాసి పంపాను. కాని ఆ నాలుగుకళ్ల సుందరి పి ని సి లా చదువుకుందేమో.. సో.. అఫ్పుతచ్చన్నమాట..

3) ఈ వీడియోలో పి.ఎస్.ఎం లక్ష్మి గారు. స్వాతి గారి మధ్య కూర్చున్నావిడ గొంతు వినపడలేదే?
ఆవిడ మా మరదలు. ఊరికే టీవీముందు కూర్చుంటుంది అని బ్లాగు మొదలెట్టించాను. నేను కాస్త బిజీ అయ్యేసరికి తను మళ్లీ టీవీ ఛానెళ్లను ఉద్ధరించడానికి వెళ్లిపోయింది. ఈ ప్రోగ్రాముకు నాకు తోడుగా రమ్మంటే వచ్చింది మాట్లాడాలంటే భయం. కాని లక్ష్మిగారు, స్వాతి మధ్యలో ఖాళీగా ఉందని డైరెర్టరమ్మ ఇందిరను అక్కడ కూర్చోబెట్టారు. కాని తర్వాత తనకు బానే అక్షింతలు పడ్డాయిలెండి ఎందుకు మాట్లాడలేదని..:))

4) జాజుల గౌరి గారు ఓ మూడు చోట్ల పుట్ల హేమలలిత అనీ ఇంకోచోట పుట్ల హేమలత అని అన్నారు - ఇంతకీ పుట్ల వారి అసలు పేరు ఏమిటి?

హేమలతగారి అసలు పేరు పుట్ల హేమలత, హేమలలిత కాదు.(మీరు చెప్పేవరకు మేము గమనించనేలేదుస్మీ..

మొత్తానికి భేరీ భారీగానే వినపడిందని అనిపించింది.
ధన్యవాదాలు. చూడాలి దీని ఫలితం ఎలా ఉంటుందో. కాని పత్రిక ఇచ్చినంత స్పందన చానెల్ ఇవ్వదనుకుంటా..

కొత్త పాళీ

బాగుంది. అందరూ చక్కగా మాట్లాడారు. ఆభినందనలు.

సుభద్ర

జ్యోతి గారు,
అయ్యో మా కు రాదే అనుకున్నా!! బ్లాగ్ లో పెట్టి మంచి పని చేశారు..థాంక్స్..అంతా బాగా మాట్లాడారు..ముఖ్యం గా లలితగారు..మాలగారికి,లలితగార్కి,యాత్ర లక్ష్మి గార్కి,జ్యోతి గార్కి మిగతావారు నా కు తెలియదు అందరికి అభినందనలు......జయహో ప్రమదలు జయహో...

తృష్ణ

బావుందండి కార్యక్రమం. అభినందనలు.

జ్యోతి

కొత్తపాళీగారు, తృష్ణగారు, సుభద్ర ..ధన్యవాదాలు..

Admin

జ్యోతి గారు మిమ్మలనందరని ఇలా చుడడటం చాలా ఆనందంగా ఉంది.

Deepak

Congratulations Jo... for the such a valuable achivement.

జ్యోతి

లక్ష్మిగారు మీరు హైదరాబాదులొనే ఉంటారు కదా. రావాల్సింది. నేను నా బ్లాగులో కూడా చెప్పాను ఈ ప్రోగ్రామ్ గురించి..

Thank you Deepak..

శశి కళ

చాలా మంచి కార్యక్రమం.తెలుసుంటె తప్పక
చూసెదాన్ని.అయితెనెమి ఇక్కడ చూసినందుకు
చాల సంతొషంగా ఉంది.

రాజేశ్వరి నేదునూరి

జ్యోతి గారూ ! మీ " నారి ,భేరి " కార్య క్రమం చక్కగా ఉంది. ఒకసారి ౨౦౦౬లొ నేనుకూడా పాల్గొన్నాను [ అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ] అప్పుడు " హైమ " ఉన్నట్టు గుర్తు . మీ కార్య క్రమం చూస్తుంటే నాకని పించింది " నేను కుడా అక్కడ ఉండి ఉంటే పాల్గొనే దాన్ని కదా " అని [ నేను ఈనాడుకి " ఫ్రీ లాన్సర్ని " ]ఏది ఏమైనా నన్ను అయిదు సంవత్సరాలు వెనక్కి తీసు కెళ్ళి నందుకు ధన్య వాదములు

Shakthi

హేయ్ జ్యోతి...
పోగ్రాం చాలా బాగుంది...మీకని ఒక గ్రూపు ఉందని ఇది చుసాకె తెలిసింది
నిన్ను టివిలో చూసి భలే సంతోషించాను..

మా వారికి పిల్లలకి చూపి ఇవడే నా Friend jyothi అని చెప్పాను .

బ్లాగుల గురించి విన్నదంతా యధార్తంగా ఉంది..మీరందరు చదువులకీ..
ఇంకా అలాటి వాటికి కూడా సహాయం చేస్తున్నారని విని చాలా చాలా సంతోషం కలిగింది.

ఎనివే...చాలా మంచి పోగ్రాం చూపినందుకు..మీ అందరికీ థాంక్స్..
నీకు ప్రత్యేకంగా లవ్లీ థాక్ యు .....

ప్రేమతో
సుందర్‌ప్రియ

Ennela

ajjajjo, nenu idi miss ayyaanenduku ani prasnistunnaa...face book lo pettinappudanna choodaledaa nenu...aaay..annaa!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008