వంట చేసే విధంబు తెలియండి....
(ఈ టపాకు నెట్ నుండి ఎందుకు బొమ్మ తేవడం అని పాతది నా ఫొటోనే పెట్టేస్తున్నా)
పదకొండు కావొస్తుంది. భర్త పిల్లలు వెళ్లిపోయారు, ఇల్లంతా సర్దడం ఐపోయింది. పని మనిషి కూడా వచ్చి వెళ్లిపోయింది. ఇక ఇంట్లో ఉండే గృహిణులకు బోలెడు తీరిక. మరి ఈ సమయంలో ఏం చేయాలి. హాయిగా కునుకు తీయడమో, ఏదైనా కుట్టుకోవడమో, స్నేహితులతో కాని ఇరుగమ్మ పొరుగమ్మతో ముచ్చట్లేసుకోవడం చేయాలి. కాని అలా వాళ్లు అలా చేయట్లేదే?? మరి మధ్యాహ్నం పదకొండు నుండి మూడింటివరకు లేడీస్ ఇల్లు కదలకుండా ఏం చేస్తున్నారబ్బా?? ఏది తప్పినా సాపాటు తప్పదు. కోటి విద్యలు కూటి కొరకే అని పెద్దలెప్పుడో చెప్పారు కదా!! . చెప్తూనే ఉన్నారు .మరి వంటింటి మహారాజ్ఞి ఐన గృహిణికి ఇష్టమైనది రకరకాల వంటకాల గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇంట్లో చేసేయడం. అన్నింటికి హోటల్ కి వెళ్లి తినాలంటే మధ్యతరగతి వాళ్లకి కుదరదు కదా. అలాంటప్పుడు వాటిని ఎలా నేర్చుకోవడం?? ఈనాడు ఆ లోటు కూడా తీరిపోయింది. ఇంట్లోనే ఉండి వివిధ ప్రాంతాల వంటకాల తయారీ విధానాలు నేర్పిస్తున్నాయి మన టీవీ చానెళ్లు. పన్నెండు అయిందంటే చాలు పలు చానెల్స్ వంటల ప్రోగ్రామ్స్ తో ఘుమఘుమలాడి పోతుంటాయి. ఇది మంచి విషయమే. తమకు తెలిసిన వంటలు చేసి చూపించి బహుమతులు కూడా అందుకుంటున్నారు ఆ ప్రోగ్రాములలో పాల్గొనే మహిళలు.. ఈ కార్యక్రమాల వల్ల పుస్తకాలు, క్లాసులు మొదలైనవి లేకుండానే ఎన్నో వంటకాలు నేర్చుకోవచ్చు. అందుకే ఈనాడు ఈ వంటల కార్యక్రమాలు చాల ప్రాచుర్యం పొందాయి. కొన్ని చానెళ్లలో ఈ వంటల కార్యక్రమాలలో పోటీలు కూడా పెడుతున్నారు. ఈ మధ్యే ఒక హిందీ చానెల్ లో ఒక మహిళ ఈ వంటల పోటీలో గెలిచి కోటి రూపాయల బహుమతి సంపాదించింది. అంత పాపులారిటీ ఉంటుంది.
అంతా బానే ఉంది. కాని ఈ కార్యక్రమాలలో కొన్ని విషయాలు పంటికింద రాయిలా తగులుతుంటాయి. అవి తీసి పారేసేట్టు ఉంటే బాగుండు కాని అవి చిరాకుతో పాటు కొన్ని సార్లు చీదర పుట్టిస్తాయి. చాలా చానెల్స్ లో గమనిస్తుంటాం . ఈ వంటల ప్రోగ్రాములో పాల్గొనేవాళ్ల అర్హత , వేషభాషలు ఎలా ఉండాలయ్యా అంటే కొత్త పట్టు లేదా హెవీ వర్క్ చీరలు, మెడలో నగలు, చేతి నిండా గాజులు, గోరింటాకు తప్పనిసరిగా ఉండాలి అనిపిస్తుంది. మరి టీవీలో వంట చేయడంతోపాటు అందంగా కనిపించకూడదేంటి?? కొందరైతే వెండిగిన్నెల్లో వంటకు కావలసిన దినుసులు పెట్టుకుంటారు. వాళ్లకు ఉన్నాయి పెట్టుకున్నారు . తప్పేంటి అంటారా?? రోజువారీ వంటలు చేసేటప్పుడు వాళ్లు అలాగే ఉంటారా అని?? అసలు నిజంగా వంట చేసేటప్పుడు సగటు ఇల్లాలు ఎలా ఉంటుంది ఎవరికి తెలీదు. అతిగా ఉంటే వెగటుగా ఉంటుంది ఎవరికైనా. మరో ముఖ్య విషయం ఈ లంగరమ్మలు..అదేనండి యాంకర్లు. వీళ్ళు మాట్లాడేటప్పుడు ఎందుకలా మెలికలు తిరిగిపోతారో అస్సలు అర్ధం కాదు?. మాట్లాడినా కూడా హొయలు.. ఈ లంగరమ్మలు అంతా తెలుగువారే. ఐనా కూడా తమ వ్యాఖ్యానాలలో తెలుగు తక్కువ ఇంగ్లీషు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. వాడుక భాషలో పదాలను కూడా ఇంగ్లీషులోనే చెప్పాలా? ఇక్కడ ప్రోగ్రాం చేసే ప్రొడ్యూసరు, డైరెక్టరు , యాంకరు, చూసేవాళ్లు , ఆ చానెల్ కూడా తెలుగే. మరి ఈ ఇంగిలిపీసు అవసరమా?? నూనె, ఉప్పు, చక్కెర ను కూడా ఇంగ్లీషులోనే పలుకుతారు. మనం వాటిని ఆయిల్, సాల్ట్ , షుగర్ అని అనము కదా. మరి ఉప్పు కారం మధ్య ఈ పదాలు వింటుంటే చిరాకేయదా?? ఇంకో విషయం ఇందులో పాల్గొన్న మహిళలు మాట్లాడేది తక్కువ ఈ యాంకరమ్మల గోల ఎక్కువగా ఉంటుంది. వాళ్లు చెప్పింది ప్రేక్షకులకు ఎక్కడ అర్ధం కాదని అనుకుంటారో ఏమో వీళ్లు వెంటనే మళ్లీ చెప్తుంటారు. ఇక కొందరైతే మాష్ కి స్మాష్ కి తేడా తెలీని ముద్దుగుమ్మలుంటారు. అదేనండి ఉడికించిన బంగాళదుంపలను చిదిమి వాడతాము కదా. ఒక్కోసారి మాష్ అంటారు, ఒక్కోసారి అది బాంబు అనుకుని స్మాష్ అంటారు. ఖర్మరా బాబు..
మీరు చెప్పాల్సింది ఉందా?? మొదలెట్టండి మరి..
11 వ్యాఖ్యలు:
జ్యోతి గారు మీ భాషాభిమానానికి ముందుగా క్రుతగ్నతలు. ఇక విషాయానికి వస్తే లంగరమ్మలు పదం బాగుంది, మీరన్నట్టు నిజమే పట్టుచీర కట్టుకోనిదే వంట కదన్నట్టు ఉంటుంది చానల్స్ వారి ప్రవర్టన, మామూలు మద్యతరగతి వారు వంట చిట్కాలు చెప్తే వినే పరిస్తితి ఉందా ఈరోజుల్లో
1) కారం ఎక్కువగా తినే వాళ్ళు ఏమి చెయ్యాలి అని లంగరమ్మ ప్రస్న, కొంచం ఎక్కువ కారం పొడి వేసుకోవాలి అని వంట చేసే ఆవిడ సమాధానం.
2)నూనె కాగింది అని ఎలా తెలుసుకోవడాం ?
బాండీ పైన చెయ్యి పెడితే వేడిగా అనిపిస్తే అప్పుడు నూనె కాగినట్టు
... ఇలా చెత్త ప్రశ్న లు కూడా అడుగుతారు
మీరు కూడా ఓ యాంకరమ్మ ను పెట్టుకున్నారే....ఇహ టీవీ ప్రోగ్రామ్ములో నాకు నచ్చిన ఒకే ఒక్క అంశం వంటయిపోగానే దాన్ని రుచి చూసిన యాంకరమ్మ "వావ్! ఎంత టేస్టీగా వుందో" అని అష్టవంకర్లు తిరుగుతూ వుంటుంది.. ప్రోగ్రాం అయిపోగానే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళే సీన్ వూహించుకుంటా..
post antha bagundi kaani jyothi garu
naaku title ardam kaledandi..
typo unda leka post title kavalane ala rasara ?
Vanta chese Vidhambu 'teliyandi????'
ante entandi ??
springగారు,
ఈ తప్పును ఎవరు ఎత్తి చూపుతారా అని చూస్తున్నా.. టీవీ ప్రోగ్రాముల్లో వస్తున్న తెలుగుబాష ఇలా ఉంటుంది అని తెలియజేయటానికి టైటిల్ అలా పెట్టాను. తప్పును ఎత్తి చూపటానికి తప్పని తెలిసీ చేసాను...:)))
టైటిల్ గురించీ నేనూ అనుకున్నానండీ..
సీరియల్స్,గేం షోలు,వంటల కార్యక్రమాల్లకు, ఈ ఏంకర్ల భాషా ప్రతిభకు,భయపడి ఈ చానల్స్ అన్నీ చూడటం మానేసానండి.
>తప్పును ఎత్తి చూపటానికి తప్పని తెలిసీ చేసాను
తప్పెందుకో, ఒప్పోమిటో చెప్తారా?
హుష్..ఊరుకొండి....ఇలాగైనా మగ వాళ్ళు పట్టు
చీరలు తీసిస్తారు...మన కొత్త వంట తినటానికి ఒకరు
దొరికారని సంతొషించాలి.
Hi Jyoti
mee blog bagundi...mee telugu abhimanam chuste chala muchata vestondi.Ivala telugu TV channels lo telugu vintunte...cinema patalu vintunte navvalo edavalo ardham kavatledu,simple ga ma varu antaru telugu aggorinchi nattu vundi antu vuntaru ha ha happy to see your wonderful thoughts in your blog.
warm wishes
rani
అందరికి ధన్యవాదాలు. ఇక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్లు బానే మాట్లాడతారు ఈ యాంకరమ్మలదే ఎదవ గోల. కొన్ని చానెల్స్ పర్లేదు అనిపిస్తుంది.. కాని వంటకు వాడే వస్తువుల పేర్లను మాత్రం ఖూనీ చేస్తుంటారు. ఓవర్ యాక్షన్ కూడా..
శశి,,
నిజంగా మొగుళ్లు పట్టుచీర కొనిస్తారా . మీరు మరీను..
వోలేటిగారు, లేదండి బానే తింటారు, కాని చేసేవాళ్లను బట్టి ఉంటుంది.షూటింగ్ చేసిన టీమ్ అదృష్టం. బావుంటే మంచిదే. అద్వాన్నంగా ఉంటే మాత్రం బలి అవ్వాల్సిందే మీరన్నట్టు..
శేశగారు,
ఒప్పు .... తెలుసుకోండి..
తప్పు... తెలియండి.. టీవీ వాళ్ల తెగులు ఇలాగే ఉంటుంది...
రాణిగారు,
వెల్కం టు మై బ్లాగ్..
jyothi garu,
namste!
mee blog nenu regular ga chaduvutanu.
chala baga raastaru.
chavithi chandrudini chusaka chadive katha gurinchi meeku teliste kasta pamputara.
thanking you,
keerthi
Post a Comment