Tuesday, December 13, 2011

పాఠకుడి దగ్గరకు పుస్తకం... సుపధ


సుపధ :


కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల రాగానే చదివే అలవాటు ఉన్నవారికి, హైదరాబాదులో ఉన్నవారికి గుర్తొచ్చేది, ఎదురు చూసేది ఏంటి? పుస్తకాల పండగ అదేనండి పుస్తక ప్రదర్శన..


పుస్తకాలు చదవడం అందరికీ ఇష్టమే. క్లాసు పుస్తకాలైతే ఎలాగూ తప్పవనుకోండి. చదువు, వృత్తికి సంబంధించిన పుస్తకాలే కాకుండా మనకు నచ్చిన అంశాల మీద మరింతగా తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. దానికోసం వీలైనన్ని పుస్తకాలు కొంటుంటాము. అవి సంగీతం, సాహిత్యం, పిల్లల కథలు, వంటలు, కుట్లు అల్లికలు, ఆరోగ్యం, ఆధ్యాత్మికం మొదలైనవెన్నో అంశాల మీద రాసిన పుస్తకాలు ఉంటాయి. వీటిని కొనుక్కోవడానికి పుస్తకాల షాపుకు వెళ్లాల్సిందే .. లేదా ఏడాదికోసారి ప్రముఖ పట్టణాలలో ఏర్పాటు చేసే పుస్తక ప్రదర్శనల్లో తమకు కావలసిన, నచ్చిన పుస్తకాలు దొరుకుతాయేమో అని వెతుక్కోవాలి. ప్రతీ నగరంలో కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ప్రతీ కాలనీలో, వీధిలో ఉంటారు . కాని ఆ పుస్తకాలు కొనడానికి దుకాణాలు మాత్రం కొన్ని చోట్లే ఉన్నాయి. ఉదా. దిల్‌షుక్ నగర్, లేదా BHEL, ECIL లో ఉన్నవారికి ఏదైన పుస్తకం కావాలంటే కోటీలోని విశాలాంధ్ర, లేదా నవయుగ, నవోదయకు రావాల్సిందే. మధ్యలో కొన్ని ఉంటాయి కాని అన్ని పుస్తకాలు దొరక్కపోవచ్చు. అడ్రస్ తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఎంత దూరమైనా వెళ్లక తప్పదు కదా. అప్పుడప్పుడు పావల కోడికి ముప్పావలా మసాలా అన్నట్టు అవుతుంది కూడా. అందుకని ఒకేసారి కనీసం పది పుస్తకాలైనా కొనేట్టుగా డబ్బులు జమచేసుకుని, సమయం చూసుకుని, ప్రయాణం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఆ పుస్తకం చదవాలనే కోరికను ఆపుకోవాల్సిందే.


ఈ మధ్య పుస్తకాలు చదివే అలవాటు చాలా తగ్గిపోయింది అంటున్నారు కాని అది తప్పేమో?... చదివేవాళ్లూ ఉన్నారు, రాసే వాళ్లూ ఉన్నారు. ప్రతీ దిన,వార, మాసపత్రికల్లో ఎన్నో కొత్త పుస్తకాల సమీక్షలు, పరిచయాలు వస్తూనే ఉన్నాయి కదా. అవి ఎంత వరకు అమ్ముడుపోతున్నాయో తెలీదు మరి. లక్షలు ఖర్చు పెట్టి తమ పుస్తకాలు అచ్చు వేయించుకున్నా కనీసం పెట్టిన ఖర్చైనా వస్తుందంటే డౌటే. చాలా వరకు స్నేహితులు, తెలిసినవాళ్లకు ఉచితంగానే ఇస్తారు రచయితలు. మిగిలినవి ఇంట్లో అట్టి పెట్టుకుంటారు. ఎవరో కొందరు పేరు పొందినవారి రచనలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయనుకోండి. అది వేరే మాట. అచ్చైన పుస్తకాలన్నీ మనకు తెలివు. తెలిసినా కొనలేము. అన్నీ అన్ని చోట్లా దొరకవు. ప్రముఖ నగరాల్లో ఉన్నవారు ఉన్న కొద్ది షాపుల్లో గాని, పుస్తక ప్రదర్శనల్లో కాని కొనేసుకుంటారు. కాని వేరే ప్రాంతాల్లో , విదేశాల్లో ఉన్నవారి సంగతేంటి?? ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ebooks .. పుస్తకాలను పిడిఎఫ్ లా ebooks చేసి పంపిణీ చెస్తున్నారు. కాని అస్తమానం కంప్యూటర్ ముందు మంచి పుస్తకం చదవాలంటే ఎవరికైనా విసుగే కాని గత్యంతరం లేక చదివే అలవాటు వదులుకోలేక అలా సర్దుకుపోతుంటారు. Amazon, AVKF ద్వారా కూడా తెలుగు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. అది కొంచం ఖరీదైన వ్యవహారం.. ఎమెస్కో వాళ్లు చాలా ఏళ్ళుగా ఇంటింటికి గ్రంధాలయం అనే పధకం నడిపేవారు. ఏమో మరి ఈ మధ్య ఆ పధకం ఆపేసారు. అందులో వాళ్లు ఆయా నెలలో ప్రచురించిన, వారి దగ్గర ఉన్న పుస్తకాలు మాత్రమే మనం ఇంటికి తెప్పించుకోగలం..


అలా కాకుండా మనకు నచ్చిన పుస్తకాన్ని ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసి ఎక్కువ ఖరీదు కట్టకుండానే ఇంటికి తెప్పించుకునే అవకాశం వస్తే ఎలాగుంటుంది??


ఈ సమస్యలకు తగిన పరిష్కారం లభించింది.


పల్లవి , తన్మయి అనే ఇద్దరమ్మాయిలు తమ ఉద్యోగాలతో విసిగిపోయి ఏదైన కొత్తగా చేయాలనుకుని సలహ కోసం తండ్రిని అడిగారు... అపుడు అయన చెప్పిన మాట ........... కోరుకున్న పుస్తకాన్ని కోరినవారి ఇంటికి చేర్చే పథకం ఆలోచించమన్నాను. తెలుగు పుస్తకాలు అమ్ముడుపోవు , పుస్తక ప్రచురణ ఆర్థికంగా గిట్టుబాటు కాదు అని నిర్ధారణకు వచ్చి రచయితలు , చిన్న పబ్లిషర్లు చాలామంది నిస్పృహ చెందుతున్న ఈ కాలంలో యువత ముందుకొచ్చి కొత్త ఆలోచనతో ,కొత్త మార్కెటింగ్ వ్యూహంతో ఏదైనా సీరియస్ గా చేపడితే తెలుగు సాహిత్యానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని చెప్పారు. ఆ ఆలోచన అమలు చేసిన ఆ అమ్మాయిలు మొదలుపెట్టిన కొత్త వెబ్ సైట్... సుపథ


ఈ సైట్ మొదలుపెట్టడానికి గల కారణాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం..


ఇది మామూలు పుస్తకాల దుకాణం కాదు.పెద్ద పబ్లిషర్లకు,పెద్ద బుక్ సెల్లర్లకు పుస్తకాలను అమ్మిపెట్టి లాభపడటానికి దీన్ని మొదలెట్టలేదు. ప్రతి పుస్తకాల అంగడిలో రివాజుగా ప్రదర్శించే పుస్తకాలన్నిటినీ ఇక్కడ కూడా ఎక్కించటం మా ధ్యేయం కాదు. తెలుగు పుస్తకప్రచురణ ఇప్పుడున్న స్థితిలో రచనా వ్యాసంగం ఆర్థికంగా గిట్టుబాటుకాక , ప్రాచుర్యం పెద్దగా లేక అవస్థ పడుతున్న ఎందరో రచయితల సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలన్న ఆలోచన ఈ ప్రయత్నానికి ప్రేరణ.నేరుగా రచయితలనుంచి ,చిన్న పబ్లిషర్ల నుంచి పుస్తకాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లోనూ ,ఇతర విధాలుగానూ విక్రయించి, క్రమప్రకారం రచయితలకు, లేదా వారికి సంబంధించిన పబ్లిషర్లకు చెల్లించాలని మా సంకల్పం. అలాగే లాభాపేక్ష లేక సేవాభావంతో మంచి పుస్తకాలను అతితక్కువ ధరకు అందిస్తున్నా, మార్కెటింగు మీద దృష్టి పెట్టే సావకాశంలేని పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు వీలైనమేరకు ఉపయోగపడాలని మా ఆశయం.ఒక్క మాటలో చెప్పాలంటే మంచి రచయితకు తోడ్పడి, మంచి పబ్లిషర్లకు సహాయపడి మంచి తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ధ్యేయంతో ఏర్పరచిన రచయితల సహకార వేదిక ఇది.


ఎన్ని వేల పుస్తకాలను నెట్లోకి ఎక్కించామన్నది కాదు..ఎన్ని మంచి పుస్తకాలకు ప్రపంచ ప్రాచుర్యం కల్పించగలిగామన్నదే మాకు ముఖ్యం.అవకాశం ఉన్న మేరకు రచయితలను, ప్రచురణకర్తలను సంప్రదించి,కలిసి వచ్చినవారికి వచ్చినట్లు ఇక్కడ స్థానంకల్పించాం. మిగతా రచయితలకూ, పబ్లిషర్లకూ ఇదే మా స్వాగతం.
ఏది పడితే అది కాకుండా పుస్తకాల ఎంపికలో కనీస ప్రమాణాలను పాటించ దలిచాం. ఉండకూడదని మీరు భావించిన పుస్తకాలేవైనా ఇక్కడ మీకు కనపడినా ,ఫలానా పుస్తకాలు ఇక్కడ ఉండదగినవని మీరు అనుకున్నా దయచేసి మాకు రాయండి.


మీరు ప్రత్యేకంగా ఏదైనా పుస్తకం కొనాలని అనుకుంటూంటే దాన్ని ఇక్కడ అమ్మకానికి పెట్టకపొయినా ,దయచేసి మాకు రాయండి ( info@supatha.in). మార్కెట్లో ఉన్నా లేకున్నా ఎలాగైనా దాన్ని సంపాదించి మీకు పంపడానికి ప్రయత్నిస్తాం.ప్రధానంగా తెలుగు పుస్తకాలకోసమే దీన్ని ఉద్దేశించినా,ఇతర భాషా గ్రంథాలకు చోటు పెట్టరాదన్న నిషేధం లేదు.మంచి పుస్తకాలు ఏ భాషలో ఉన్నా ఆయా రచయితలు,పబ్లిషర్లు కోరితే ఇక్కడ పెడతాం.ఇంకా చాలా ఆలోచనలున్నాయి.మీరు కూడా ఈ సైట్ చూసి పుస్తకాలు ఇంటికే తెప్పించుకోండి మరి.. ఇది ఆన్లైన్ అమ్మకాలు మాత్రమే కాదు. ముందు ముందు మరింతగా విస్తృత పరుస్తామని నిర్వాహకులు తెలియచేసారు..

మెయిల్ ఐడి : sales@supatha.in
durgapublications@gmail.com

ఫోన్:
9441257961
9441257962
9441257963


20052824.

11 వ్యాఖ్యలు:

శ్రీలలిత

మంచి విషయం అందించారు. ధన్యవాదాలు...

పరుచూరి వంశీ కృష్ణ .

బావుంది.....మంచి సమాచారం ! థాంక్స్

ఎందుకో ? ఏమో !

Nice

Very Good News

?!

ఎందుకో ? ఏమో !

మొన్న ఈ మధ్యన "నేను" అనే book చాల బాగుంది, అని అనుభవజ్ఞులు చెప్పగా విని పుస్తక సమీక్షలో ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెళ్లి పోస్తకం తెచ్చుకునేప్పటికి రోజు అయిపొయింది.
ఆ తదుపరి "तेरा नाम एक सहारा" అనే book కోసం కూడా అల్లంత దూరం వెళ్తే తీర నా అదృష్టం బాగుంది ఒక్క copy అన్న ఉండి ఇక ఆ రచయోత గారికి phone చేసి నా నేస్తలకోసం మరికొన్ని తీసుకున్నాను
ఈ facility మా లాంటి వారికీ బాగా ఉపయోగ పడుతుంది
చక్కని సమాచారం అందజేసినండులకు ఈ పుస్తక ప్రియుని
ఆనంద పూర్వక అభినందనలు
కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు
మరో మాట ఈ weekly లలో వచ్చే పుస్తక సమీక్షలలో కావాలనే ఫోన్ number వేయరు ఎందుకో తెలియదు
?!

your blog is awesome

తెలుగు పాటలు

!!జ్యోతి !! గారు మంచి విషయం చెప్పారు ధన్యవాదములు

రసజ్ఞ

మంచి సమాచారం! ధన్యవాదాలు!

జ్యోతిర్మయి

ధన్యవాదాలు జ్యోతి గారూ..

Supani

కొంగ్రొత్త ఆలోచనలకు పునాదివేస్తున్న శాస్త్రి గారి సుపుత్రికలకు అభినందన చందనం
మీ ప్రయత్నం తెలుగు భాషా సహిత్యాలపట్ల నానాటికీ తరిగిపోతున్న ఆసక్తిని ఇతోధికంగా వడివడిగా
వృద్ధి చేయగలదన్న ఆశ.
శుభం భూయాత్
రావెల పురుషోత్తమరావు
గుంటూరు

mvrsastri

మీ అభిమనానికి ధన్యవాదాలు- పల్లవి తన్మయి (04020052824)

వెంకట్. బి

చాల , చాల మంచి విషయం చెప్పేరు

Sailajamithra

నిజమే జ్యోతి గారు.. ఎందుకంటే నేను practical గా చాల మందిని కలుస్తున్నాను ఈ మధ్య పుస్తకాలపై ఎందరికి ఆశక్తి ఉందో తెలుసుకుందామని. ఒక్కోసారి కొన్ని పుస్తకాలు దొరకడం లేదు అనే మాట తరచు వింటుంటాము. అలాగే ఈ మధ్య గోవిందన్ అనే retaired teacher వైతాళికులు అనే కవిత్వం పుస్తకం కోసం ఎంతో వెదికాను. నాకు దొరకలేదు అన్నారు. అలాగని ఎన్ని shops కని తిరగను అన్నారు. నాకా ఓపికా లేదు అన్నారు. అప్పుడు నేను మీ ఇంటికి తెచ్చి ఇస్తే తీసుకుంటారా అన్నాను. ఎలా ఆంటే సుపద గురించి వివరించాను. ఇలా వీరే కాదు చాలా మంది ఒకరు దేవుని పుస్తకమనో, లేదా నవలలనో అలాగే ఒక్కొక్కరు ఒక్కో గ్రంధం గురించి అడిగారు. దాంతో పుస్తక పటనం చాలా తగ్గిపోయింది అనడానికి తావు లేదని అనిపించింది. ఒక్కో shop కు తిరుగుతూ అడిగే అవసరం లేదని తెలిస్తే తమకు పుస్తకాలు కావాలని చాల మంది ముందుకు వస్తారు అనడానికి పెద్ద సమయం పట్టదని అనిపించింది. నిజంగా పల్లవి, తన్మయి చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. అభినందనలు.. ఎంతగా టీవీ లు వచ్చినా చూడటానికి ఒక్క మంచి కార్యక్రమం లేదు కదా, serials లో violence అనే మాటలు ఎక్కువయ్యాయి. పుస్తకాలకు పూర్వపు వైభవం వస్తుంది అనడానికి పెద్ద వ్యవధి అక్కర్లేదు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008