ఆదిలక్ష్మి గారు వస్తున్నారంట...
ఆ భగవంతుని దయ వల్ల అమ్మ ఒడి బ్లాగర్ ఆదిలక్ష్మిగారు కోలుకున్నారు. త్వరలో బ్లాగు కూడా రాయడం మొదలుపెడతారంట.చందమామ రాజుగారు ఇచ్చిన సమాచారం ఇది.. బ్లాగు మిత్రులు ఆవిడకు కాల్ చేసి మాట్లాడితే మనమంతా ఆమెకు తోడుగా ఉన్నామని సంతోషిస్తారు..
మనందరికీ మంచివార్త. అమ్మ ఒడి ఆదిలక్ష్మి గారు స్వస్థత పొంది మళ్లీ మనముందుకు రావాలనుకుంటున్నారు. ఇవ్వాళే ఈ విషయం తెలిసింది. ఇన్నాళ్లుగా ఆమె వివరాలకోసం ప్రయత్నించినా దొరకలేదు. ఆదిలక్ష్మి గారి రచనలను, వారి కుటుంబాన్ని బాగా అబిమానించే రేణు కుమార్ గారు ఆమె వివరాలను తెలిపారు. ఆమె ప్రస్తుతం వికారాబాద్ సమీపంలోని ఓ అనాధాశ్రమంలో 50 మంది పిల్లల మధ్య జీవితం గడుపుతున్నారు.
పాప, భర్త.. జీవితంలో అన్నీ కోల్పోయి కూడా తేరుకుని మళ్లీ తన బ్లాగ్ నిర్వహణకు, రచనల కొనసాగింపుకోసం పట్టుదలతో ఉన్నారు. కూడూ, గూడూ కూడా లేని స్థితిలో ఇప్పుడు జీవిస్తున్నానని తన కంటూ ఒక జీవితం, ఉపాధి కల్పించుకుని బ్లాగ్ నిర్వహణను క్రమం తప్పకుండా సాగించాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. ఇటీవలే సెవెన్స్ సెన్స్ సినిమా చూసి రీఛార్జ్ అయ్యానని ఆమె అన్నారు. తొమ్మిది రాజ్యాలు కలిసి ఒక రాజ్యం మీద దాడి చేయడం యుద్ధం అనిపించుకోదని అది ద్రోహం, కుట్రపూరితమేనని ఆమె అన్వయించుకుని చెప్పారు. తన బ్లాగులో వైఎస్ మరణం తర్వాత రాజకీయ కథనాలు ఎక్కువగా జోడించానని, ఇప్పడు తాను కోలుకున్న తర్వాత హైందవమతంపై ముప్పేట దాడుల పర్యవసానాల గురించి విస్తృత రచనలకోసం ప్రణాళిక ఊహించుకుంటున్నానని బ్లాగ్ మిత్రుల సహాయం తనకు చాలా అవసరమని ఆమె ఫీలవుతున్నారు. మీకు వీలయితే ఆమె కొత్త ఫోన్‌నంబర్‌కు ఒకసారి కాల్ చేసి మాట్లాడగలరు.
9603419294
జీవని ప్రసాద్ గారు , మీరు గతంలో జీవని వారి నుంచి ఆమెకు స్కూల్‌లో ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పినట్లు గుర్తు. పునరుజ్జీవితం పొందిన ఆదిలక్ష్మి గారికి మీరు ఈ రకమైన చేయూతను ఇప్పించగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.
తన రచనలు, టైపింగ్, టెక్నాలజీ వంటి విషయాల్లో ఆమె తన సహచరుడు లెనిన్ బాబు గారిపైనే పూర్తిగా ఆధారపడ్డారు కాబట్టి సెల్, కంప్యూటర్ టెక్నాలజీ రెండింటినీ తాను ఇప్పుడు ఓనమాల నుంచి నేర్చుకోవలసి ఉంటుందని ఆమె ఫీలింగ్. ఆమె గత కొన్నేళ్ళుగా అమ్మఒడి బ్లాగులో రాసిన వందలాది బృహత్ కథనాలను మొత్తంగా లెనిన్ బాబుగారే టైప్ చేశారట. ఇప్పుడు ఒంటరిగా మారడంతో అన్నీ ఈమె నే్ర్చుకోవలసి ఉంటుంది.
వీలైతే మీరు ఇవ్వాళే ఆమెకు కింది మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడగలరు. ఆమెతో, ఆమె రచనలతో పరిచయస్తులుగా మనం చేసే గడ్డిపరక సహాయం కూడా ఆమెకు కొండంత అండగా నిలబడుతుందని నా ప్రగాఢ నమ్మకం. ఆమె తన స్వంత కష్టంతో జీవించేలా ఏదయినా ఏర్పాటు చేయగలరేమో ఆలోచించండి. వెంటనే కాకపోయినా కాస్త ఆలస్యమయినా ఈ విషయంపై మీరు తప్పక ఆలోచించగలరు.
వీలైతే ఇవ్వాళే ఆదిలక్ష్మి గారితో కింది నెంబర్‌కు కాల్ చేసి మాట్లాడగలరు.
9603419294
వీలైతే ఈరోజు రాత్రిలోపు ఆమె క్షేమ సమాచారం గురించి నా బ్లాగు ద్వారా అందరికీ తెలియపర్చాలని ఉంది. ప్రయత్నిస్తాను.
తప్పకుండా మీరు ఈ విషయంలో సహాయహస్తం అందించగలరని ఆశిస్తూ..
రాజు.
21 వ్యాఖ్యలు:
yenta manchi aalochana...jyothi gaaru
ur grt....welcome to amma blog
I just spoke with her.
"Thank you Joythi garu." - This is the message from Adi Lakshmi garu.
happy to hear
best wishes
ఇది నిజంగా గొప్ప సమాచారం.
అందరికీ ఆనందం కలిగించేది.
ఆదిలక్ష్మిగారు నాకు వ్యక్తిగతంగా తెలిసినవారు కాదు.
వారి బ్లాగును కూడా నేను దర్శంచినది లేదు.
కాని యీ విచారకరసంఘటన తరువాత వారి యోగక్షేమాలపై ఆసక్తి కలిగింది.
వారు కోలుకొని నిలబడటం ఆనందదాయకం.
ఇవ్వాళ ఆమెతో మాట్లాడుతుంటే ఆమె ఎంతో దైర్యంగా ఉన్నారు. ఈ పెనుసవాలును ఎదుర్కోగలనని కొండంత విశ్వాసంతో ఉన్నారు. నాకు మాత్రం 3 నెలల తర్వాత ఆమె మాట వింటూంటే దుఃఖం తన్నుకొచ్చింది. ఇంత అన్యాయం జరుగుతుందని ఎవరమూ ఊహించలేక పోయామే అనే బాధ.
ఏమయితేనేం... ఆమె క్షేమంగా ఉన్నారు.
ఒక్కటి మాత్రం నిజం. లెనిన్ బాబు, గీతాప్రియదర్శిని -పాప- తోడు కోల్పోయిన ఆదిలక్ష్మి గారు ఒంటరిగా జీవించడం అంత సులభం కాదు. పిల్లలమధ్య ఉండటమే ఆమె జీవితానికి
నిజమైన ఆలంబనగా ఉంటుంది. ఆమెకు అందించబోయే ఉపాధి సహాయం కూడా ఈ రూపంలో ఉంటేనే చాలామంచిది.
సుజాత గారికి ఈ విషయం చెప్పగానే, ఇంటర్నెట్ మిత్రులు చాలామంది ఆమెకు ఆర్థిక సహాయం కూడా అందజేయడానికి సంసిద్దత తెలిపారని చెప్పారు.
ఆమెకు ఇప్పుడు తన కుటుంబ జ్ఞాపకాలు తప్ప ఏ ఆస్తి లేదు. కణిక వ్యవస్థపై నిప్పులు చెరుగుతూ అమ్మఒడి బ్లాగులో వందలాది రచనలు చేసిన ఈ చేయి తిరిగిన బ్లాగర్, కథా, కథన రచయిత్రికి డబ్బు
అవసరమే తెలియనంతగా సహచరుడిపై పూర్తిగా ఆధారపడిపోయారట. ఏదీ పట్టించుకోలేదని ఆమె చెబుతుంటే మూగపోయాను. ఈ అమాయకత్వం ఆమెను కాలుస్తుంది. అదే ఆమెను నిలబెడుతుందేమో కూడా.
దుర్భర స్థితిలో ప్రపంచానికి తెలియకుండా ఆమె గడిపిన ఈ రెండు నెలల కాలంలో ఆమెకు తోడుగా నిలిచిన కుటుంబసభ్యులకు, ఆమెకు తాత్కాలికంగా ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన డాక్టర్ దంపతులకు, ఆమె అవసరాలను తెలుసుకుంటూ శక్తిమేరకు సాయపడిన రేణుకుమార్ -9700208871- గారికి నిండు కృతజ్ఞతలు చెప్పాలి.
భరద్వాజ్ గారూ! ఈ విషయంలో మీపట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
మీనుంచి, మిత్రుల నుంచి వీలైనంత మంచి సహాయం లభిస్తుందని ఆశిస్తూ..
shubhavartha chepparu. aadilaxmigaaru emaipoyaro theliyaka madhanapaduthunnanu. thanks andi.
ఆదిలక్ష్మి గారు కోలుకున్నందుకు సంతోషంగా ఉందండి.
చాలా సంతోషం.
>>>>
జీవని ప్రసాద్ గారు , మీరు గతంలో జీవని వారి నుంచి ఆమెకు స్కూల్‌లో ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పినట్లు గుర్తు. పునరుజ్జీవితం పొందిన ఆదిలక్ష్మి గారికి మీరు ఈ రకమైన చేయూతను ఇప్పించగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం
<<<
అస్సలు బాగోదు. పిల్లలకి నేర్పించేవాళ్ళు కావాలి...అంటే మానసిక సమతౌల్యం చాలా అవసరం.
బ్లాగులంటే ఉబుసుపోక కాలక్షేపం అనుకునేవాళ్ళకు ఇలాంటిసత్కార్యాలుగూడ వీటిద్వారా చేయవచ్చని చక్కగా చెప్పారు జ్యోతిగార్కి ధన్యవాదాలు. ఆదిలక్ష్మిగార్కి అంతామంచిజరగాలని ఆశిస్తున్నా.
చాలా మంచి సంగతి చెప్పారు జ్యొతి గారు. చాలా సంతొషం. ఆది లక్ష్మి గారికి ఇధి ఇంకొ జన్మ. ఆమె ప్రశాంత జీవనం కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీకు అభినందనలు.
*అస్సలు బాగోదు. పిల్లలకి నేర్పించేవాళ్ళు కావాలి...అంటే మానసిక సమతౌల్యం చాలా అవసరం.*
ఆమే బ్లాగు చదివే వారికి ఆమే మానసిక సమతుల్యం మీద ఎటువంటి అనుమానాలు లేవు. ఆమే బ్లాగును రోజు చదివేవారు బ్లగులోకం లో ఎందరో ఉన్నారు. ఇటువంటి వ్యఖ్యను జ్యోతి గారు ప్రచూరించకుండ ఉండవలసింది.
ఈ రోజు నీహారిక బ్లాగర్ బ్లాగ్ లోనే కాక ఆదిలక్ష్మి గారిని ఫొన్ ఛేసి మరి గొడవ పెట్టుకున్నారు. పెద్దలు, మిత్రులు ఈ విషయంలో త్వరతగతిన స్పందించ వలసినదిగా కొరుతున్నాను.
రేణుకుమార్ గారు, మీరు ఆదిలక్మిగారికి చెప్పండి. ఆ పిచ్చిదాన్ని పట్టించుకోవద్దని. కట్ చేయమనండి లేదా నోరు మూసుకోమని తిట్టమనండి. లేదా నీహారిక నంబర్ నోట్ చేసుకుని జ్యోతి గారికి ఇవ్వమనండి. నేను తీసుకుని ఆ నీహారిక సంగతి చూస్తాను. బాధలో ఉన్నవారిని ఓదార్చాల్సింది పోయి గొడవ చేస్తుందా?? మావారు పోలీస్ కమీషనరేట్ ఆఫీసులో వర్క్ చేస్తున్నారు. ఈ కేసు గురించి కంప్లెయింట్ నేను చేస్తాను. పోలీస్ లేదా మెంటల్ ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందే ఈ మహాతల్లికి...
సర్వం కోల్పోయి నిస్సహాయంగా మిగిలిన ఆదిలక్ష్మిగారిని ఓదార్చాల్సింది పోయి ఆ నీహారిక అనే పిచ్చిమనిషి ఇంతలా బాధపెడుతుందా. అసలు లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.
అయినా నీహారిక లాంటి వాళ్ల ఓదార్పు ఆదిలక్ష్మిగారికి అవసరమా? ఆ మహాతల్లి ఫోన్ చేసి అంతలా బాధపెడుతుంటే ఆదిలక్ష్మిగారు ఫోన్ కట్ చేసి ఉండాల్సింది. అసలే బాధలో ఉన్న తనను బాధపెట్టిన నీహారికను ఎవరూ క్షమించాల్సిన అవసరం లేదు. జ్యోతిగారూ ఆమె కథ మీరే చూసుకోండి. విషయం తెలియగానే చాలా చిరాకుగా, బాధగా ఉంది.
నీహారిక నంబర్ ఎవరైనా సంపాదిస్తే తెలియజేయండి. అందరం ఆమె పని పడితే సరిపోతుంది. తిక్క కుదురుతుంది.
నీహారిక గారు, మీ పని మీరు చేసుకోక ఆదిలక్ష్మిగారికి కాల్ చేసి మరీ గొడవ పెట్టుకుంటున్నారు..మీకిది భావ్యమా? బాధలో ఉన్న వ్యక్తిని ఓదార్చకపోతే పోనీ కనీసం విసిగించకండి..మీరు చేయాలనుకున్న పనులు బోలెడు ఉన్నాయి కదా.. వాటి సంగతి చూడండి. ఈవిడను వదిలేయండి..
మీకు నా మీద వ్యక్తిగత కోపాన్ని మీరు ఇలా వాడుకోవడం మీకు భావ్యమా? ఆవిడను అనాల్సిన అవసరం నాకు ఏముంది?
నీహారిక గారు మరి ఆదిలక్ష్మిగారితో ఉన్న రేణుకుమార్ గారు చెప్పింది అబద్దమంటారా??
నేను ఆవిడతో మాట్లాడిన మాట నిజం , ఆవిడని బాధ పెట్టాననటం అబద్దం.
నీహారిక గారు , టపాకు సంబంధంలేని కామెంట్లు నేను అంగీకరించను.
జ్యోతిగారూ..
ఇందాకే ఆదిలక్ష్మిగారితో ఫోన్లో మాట్లాడాను. ఆవిడకు నిహారిక ఫోన్ చేసినమాట వాస్తవమే. ఏవేవో తిక్క విషయాలు మాట్లాడిన మాటా వాస్తవమే. చాలాసేపే వాదించిందట. చివరికి మీరు నన్ను బాధపెట్టేందుకే ఫోన్ చేసినట్లయితే, నేను మాట్లాడను అని ఫోన్ పెట్టేశారట. తను మాట్లాడను అంటున్నప్పటికీ మాట్లాడుతూనే ఉందట సదరు నీహారికగారు.
ఆ విషయాన్ని ఇప్పుడు ఆదిలక్ష్మిగారితో ప్రస్తావిస్తే.. పోనీలేండి ఆవిడ విచక్షణకే వదిలేద్దాం అన్నారు. సో.. నీహారిక విచక్షణకే ఈ విషయాన్ని వదిలేసేద్దాం జ్యోతిగారు.
Post a Comment