Saturday, 18 February 2012

బ్లాగ్ పుస్తక పరిచయ సభకు స్వాగతం

ఆఫీసుల్లో ఉండే కంప్యూటర్ ఇంటర్నెట్ ఈనాడు దాదాపు ప్రతీ ఇంటిలోకి వచ్చేసింది. సాంకేతిక నిపుణులే కాక ఉద్యోగాలు చేయని, కంప్యూటర్స్ గురించి తెలియనివారు, విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు అందరూ ఉపయోగిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉపయోగానికే కాక కంప్యూటర్ , నెట్ ని తమకు తెలిసిన ఆలోచనలనన్నింటికి అవలీలగా వాడుకుంటున్నారు. అందులో ఒక ప్రముఖమైన భాగం బ్లాగులు. అసలు రాయడానికి ఏముంటాయిలే. మాట్లాడమంటే మాట్లాడటం కాని రాయమంటే మావల్ల కాదు. మేమేమన్నా రచయితలమా.. అబ్బే..


సభాస్థలికి చేరు మార్గ వివరాలు...



ఇలా అనుకునేవారికి అసలు బ్లాగులంటే ఏంటి? ఎలా రాయాలి. ఎందుకు రాయాలి. దానివల్ల ఉపయోగాలేంటి? బ్లాగుకు హంగులు ఆర్భాటాలు ఎలా జత చేయాలి వగైరా విషయాలన్నింటిని సవివరంగా రాసి పుస్తకంలా అందిస్తున్నారు . "బ్లాగు పుస్తకం" ... ఈ పుస్తకాన్ని రాసినవారు సుజాత , రహ్మాన్.. రేపు ఆదివారం ఈ బ్లాగు పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ పుస్తకావిష్కరణకు తప్పకుండా విచ్చేయవలసిందిగా అంతర్జాలంలో తెలుగు, తెలుగు బ్లాగులను చదివేవారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు నిర్వాహకులు..

5 వ్యాఖ్యలు:

వీరయ్య కె

manchi prayatnam. thanks

శశి కళ

advanced congratulations sujata garu,rehman gaaru

పల్లా కొండల రావు

మంచి ప్రయత్నం. సుజాత గారికి,రెహ్మాన్‌ గారికి అభినందనలు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలి. తెలుగు బ్లాగులలో సమాచారం అందరికి ఉపయోగకరంగా అందరూ వ్రాయగలిగే విధం సహకరించే ఇలాంటి ప్రయత్నాలు పెరగాలని కోరుతున్నాను.

Ennela

sujatha gaariki rehmaan gaarikee abhinandanalu..

హనుమంత రావు

చాలా మంచి ఆలోచన.. సుజాత గార్కి, రెహమాన్ గార్కి శుభాభినందనలు.. ఈ పుస్తకం విడుదల ఐన తర్వాత ఎలా పొందాలో కూడా తెలియపరచగోర్తాను.. తప్పక వెల చెల్లించి తీసుకుంటాను.. either by post or in person..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008