ఎపుడు పిలుపు వినపడదో - దేవులపల్లి కృష్ణశాస్త్రి
భావకవిత్వాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు చూస్తే ఆయన సౌందర్య ప్రస్థానంలో శాశ్వతమైన స్వేచ్చ కోసం, నిర్మలమైన ప్రేమ కోసం తపన పడ్డారని తెలుస్తుంది. ప్రకృతి ప్రీతి, మానవత, భక్తి, ప్రణయం, దేశభక్తి మొదలైన అంశాలెన్నో ఆయన కవిత్వంలో స్థానం కల్పించుకుని మానవ విలువల్ని ఆవిష్కరించాయి అని అందరమూ ఒప్పుకోక తప్పదు.
కృష్ణశాస్త్రిగారు చివరి రోజుల్లో తన గొంతు పోగొట్టుకున్నారు. దానికి ఆయన బాధపడ్డా. క్రుంగిపోకుండా మరిన్ని రచనలు చేసారు. భుజానికి ఒక జోలె తగిలించుకుని అందులో కొన్ని పేపర్లు పెట్టుకుని తన మనసులోని భావాలను ఆ కాగితంలో రాసి చూపించేవారు. ఆ సమయంలో రాసిన ఒక గీతం ఇది.
ఈ గీతాన్ని అందించి, పాడి వినిపించినవారు శ్రీ ఏం.ఎస్.రావుగారు. ఆయన MLN Music Academy ద్వారా ఎంతో మంది ఔత్సాహికులకు సంగీత శిక్షణ ఇస్తున్నారు. అంటే కాదు ఈటీవీలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి పాడుతా తీయగా కార్యక్రమానికి Music Associate గా పని చేస్తున్నారు.
ఎపుడు పిలుపు వినపడదో
అపుడు అడుగు పడదు
ఎచటికో పయనమెరుగక
ఎందుకో వైనమందక //ఎపుడు//
చిరిగిన నా జోలెలోన
వరమేదీ అగపడదు
బిగిసి ఏకతార గొంతు
పెగలనే పెగలదు
అపుడేదో మనసులోన
అదే తపన తపన //ఎపుడు //
ఆగి ఆగి సాగి సాగి
అదే నడక నడక
ఆగి ఆగి మ్రోగి మ్రోగి
అదే పిలుపు పిలుపు
తెమలనీవు నా జాతర
తెలవారదు కృష్ణరజని //ఎపుడు//
అలసినప్పుడు కాస్త ఒదిగి
నిలువనీ నీ పిలుపు విన
అంతలోనే నేతి గరిగి
అంతులేని దారినీ
అదే నడక నడక
ఏదో ఆశవిడక // ఎపుడు //
17 వ్యాఖ్యలు:
బావుందండీ పాట..
Wow Song Chaalaa Bagundi Manchi Song ni
Paricheyam Chesharu Dhanyavaadamulu...
Ee Paata Naaku Kaavali Elaaa?
కృష్ణ శాస్త్రి గారి బాధ ఆయన బాధైనా .. వారి గొంతు మూగపోయిన వైనం మనకి విషాదం. భావ కవి అక్షరాలలో జీవించి ఉన్నారు.
సాహిత్యం తో మంచి గీతం ని .. శబ్ద గీతంని అందించారు. ధన్యవాదములు ..జ్యోతి గారు.
మంచి పాటను అందించారండి.కృష్ణశాస్త్రి గారి గురుంచి చెప్పేదేముంది.ఎం.ఎస్.రావు గారు చాలా బాగా పాడారు
భావ కవితా నెలరాజు దేవుల పల్లి వారి పాటలు,కవితలు అజరామరం
Song chala bagundi..M.S.Rao gari voice lo inka bagundi..inka manchi manchi light music songs publish cheyandi..
Mahesh, Germany
prathi paataki, saahithyam entha mukhyamo bhavayukthanga paadagalagadam kuda anthe mukhyam..... ee paata paadina varu maa guruvu garu ani cheppukovadam chaala garvanga bhavisthunnanu..... atuvandi guruvu deggra sangeetham nerchukogalagadam naa adrustanga bhavisthunnanu.... bhagavanthudu aayanaki sakala aarogya aishwaryalu ivvalani manaspurthiga korukuntunnanu.... ee paata ma guruvu gari deggare nerchukunnanu... adbhuthamaina kalyani raagam lo cheyabadina ee paata sangeetha priyulake kaaka prathi okkariki nache vidanga undi.... thappakunda vini nerchukuntarani aashisthunnanu...
బాగుందండి. ఈ పాట పల్లవి (కొద్ది తేడాతో) మరొక ప్రసిద్ధమైన గొంతులో ఒకచోట వినిపిస్తుంది. అదెక్కడో, ఆ గొంతెవరిదో తెలుసా? :-)
అందరిమాటే నాదీను జ్యోతి, మంచి పాట. శ్రీ ఏం.ఎస్.రావు గారి కృషికి వందనాలు. ఈ అకాడెమీని గూర్చి తెలుసుకోవాలి. నీకు థాంక్స్ విషయం పంచుకున్నందుకు.
కృష్ణశాస్త్రి గారి సమీప బంధువు నాకు సీనియర్. హాస్టల్లో నా దగ్గర స్వీట్స్ లంచాలు తీసుకుని ఆయన మాటలవీ చెప్పేది, అందులో ఒకటి గొంతు పోయినా ఆయన ఎలా రాయగలుగుతున్నారన్నదే నాకూ ఆశ్చర్యంగా, ఆసక్తిగా ఉండేది.
భైరవభట్ల కామేశ్వరరావుగారి వ్యాఖ్య..
బాగుందండి. ఈ పాట పల్లవి (కొద్ది తేడాతో) మరొక ప్రసిద్ధమైన గొంతులో ఒకచోట వినిపిస్తుంది. అదెక్కడో, ఆ గొంతెవరిదో తెలుసా? :-)
thelayadhandi kameshwar rao garu.... miru teliyajesthe thelusukovalani aasakthiga undi.... theliyajeyagalarani prardhana...
దివ్యగారు,
ఎవరైనా గుర్తిస్తారేమోనని చూస్తున్నాను. అందాకా ఒక క్లూ, ఇదొక సినిమాలో వస్తుంది. :)
palukave naa raamachiluka.. aggibarAtA movie lodi?
కామేశ్వరరావుగారు ఇదే పాటా..
http://www.chimataamusic.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=118
జ్యోతిగారు,
cimatamusic సైటు నాకెందుకో వెళ్ళడం లేదు.
పలుకవే నా రామచిలుక పాటలో యిదెక్కడా కనిపించ లేదే. అయినా అది కొసరాజుగారి పాటనుకుంటాను.
సరే, ఇంకెక్కడైనా ఉందేమో నాకు తెలియదు కాని, నేను విన్నది యిక్కడ:
http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=a0002097. అక్కడ Poems వినండి. కృష్ణశాస్త్రిగారి పాటలే కాకుండా, కొన్ని పద్యాలను, గేయాలలో పంక్తులను కూడా ఆ సినిమాలో వాడుకున్నారు. అందులో యీ పాట పల్లవి ఒకటి.
-కామేశ్వరరావు
ఒహ్...
నిజమేనండి.. ధాంక్స్ అండి కామేశ్వరరావుగారు.
నేనిచ్చిన చిమట లింకు పని చేస్తుంది కదా.. ఇంకోసారి చూడండి.. నేను పాట రాసినవారు కాక ట్యూన్ అనుకున్నా. తప్పులో కాలేసా..:))
చిమట మ్యూజిక్ వాళ్లు తమ సైట్ పేరు కొంచెం మార్చారు. chimatamusic లో music ముందు ఇంకో a పెట్టాలి.. chimataamusic
ఏనాటిదో ఒక మంచి తీయని పాట వినిపించారు
కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారిన ఏ అక్షరమైనా పదమైనా ఒక అద్భుతం
Post a Comment