తెలుగువారి వేదిక - తెలుగువన్
వృత్తి ప్రవృత్తి, చదువులు, వ్యాపారాల మూలంగా ఉన్న ఊరిని వదిలి
పొరుగు రాష్ట్రాలు, ఖండాంతరాలు దాటి పోక తప్పదు ఎవరికైనా..
అలా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు తమ నివాసం ఏర్పరుచుకున్నారు. ఎంత దూరం
వెళ్లినా మాతృభాషాభిమానం , పండగలు, పూజలు వగైరా వదులుకోలేరు. విదేశీ సంస్కృతిలో పూర్తిగా ఇమడలేక, భారతీయ
సంస్కృతికి దూరం కాలేక తల్లడిల్లిపోయే తెలుగువారు ఎంతో మంది ఉన్నారు. తనవారిని,
ఊరిని,అందరినీ వదిలి
విదేశాలలో ఉన్నప్పుడు ఏకాకులుగా, దిగాలుగా ఉంటారు.. పండగలు, సినిమాలు, రేడియో, జ్యోతిష్యం, వార్తలు మొదలైనవెన్నింటినో
తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కోసం
పన్నెండేళ్ల క్రింద ఒక అద్భుతమైన వేదిక ఏర్పాటు చేసారు కంఠమనేని రవిశంకర్. అదే
తెలుగువన్. తెలుగువాళ్లం ఎక్కడున్నా ఎప్పుటికి నంబర్ వన్ అని చాటి చెప్పేదే ఈ
తెలుగువన్.
స్వతహాగా సాఫ్ట్‌వేర్ నిపుణుడైన
రవిశంకర్ తన ఉద్యోగాన్ని వదిలి 2000 లో తెలుగువన్ అనే సైట్ మొదలుపెట్టారు. తెలుగువారందరికోసం ఇందులో
ఎన్నో విభాగాలలో ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. వనితలకోసం
ఆరోగ్యం,
ఫాషన్, వంటలు, పిల్లల పెంపకం, అందం అలంకరణ మొదలైన విషయాలెన్నో
వివరంగా చర్చించబడ్డాయి. తనవారికి దూరంగా భర్తతో పరాయిదేశంలో నివసిస్తూ పిల్లలు,
వంటలు, ఆరోగ్య విషయాలలోకలిగే ఎన్నో సందేహాలు, అవసరాలకు ఎవరిని అడగాలో తెలీక, ప్రతీ సారి ఇండియాకు ఫోన్ చేయలేక బాధపడే మహిళలకు ఈ విభాగం ఎంతో
ఉపయోగపడుతుంది. దేశం కాని దేశంలో ఉన్నప్పుడు మన తెలుగు పండగలు, పర్వదినాల గురించి తెలుసుకోవడానికి తెలుగువన్ లో ఒక విభాగంలో పంచాంగం కూడా
ఉంది . ఈ విభాగంలో తెలుగు కాలెండర్, పంచాంగ వివరాలు,
తిథి వార నక్షత్ర ఫలాలు. అవసరమైన వారికి నామ
మాత్రపు రుసుముతో ప్రత్యేకంగా వ్యక్తిగత జ్యోతిష్య ఫలితాలు కూడా అందిస్తారు.
భక్తి లో తెలుగు వారి పండగల గురించిన
వివరాలు, పురాణగాధలు, పుణ్యక్షేత్రాల గురించిన సమగ్రమైన వ్యాసాలు, వివిధ దేవతల స్తోత్రమాలికలు, పూజా వివరాలు
మొదలైన అంశాలెన్నో పొందుపరిచారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, తెలుగువారు తమ పిల్లలకు
సంగీతం, నాట్యం అన్నమయ్య కీర్తనలు మొదలైనవి
తెలుగువన్ ద్వారా నేర్పించవచ్చు.. దీనివల్ల తాము తెలుగుదేశానికి, తెలుగువారికి, తెలుగు
సంస్కృతికి, బాషకు దూరమవుతున్నాము, తమ ఉనికిని కోల్పోతున్నామన్న అసంతృప్తి వారికి
ఉండదు. భారతీయ సంస్కృతిని తమ పిల్లలకు కూడా అందిస్తున్నామన్న తృప్తి కలుగుతుంది.
అంతే కాదు ప్రతీరోజు ప్రాంతీయ, జాతీయ వార్తా విశేషాలు, పాత, కొత్తసినిమా విశేషాలు కూడా ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల తెలుగుదేశానికి దూరంగా ఉన్నా ఇక్కడ
జరిగే ప్రతీ విశేషం వారు తెలుసుకోగలుగుతారు. ఇక్కడినుండి విదేశాలకు వెళ్లినవారు
మనలా బయట తిరగలేక, తలుపులేసుకుని ఇంట్లోనే మొహాలు చూసుకుంటూ ఖైదీలుగా ఉండే అవసరం లేదు.
ఎంచక్కా ఈ తెలుగువన్ పోర్టల్ లో తమకు నచ్చిన కార్యక్రమాలు చూస్తూ సమయాన్ని ఇట్టే గడిపేయొచ్చు. అంతేకాదు తెలుగువన్
లో వేల తెలుగు సినిమాలు చూసే సదుపాయం కూడా
ఉంది. ఇంట్లో కూర్చునే ఉచితంగా తమకు నచ్చిన పాత కొత్త సినిమాలు చూసుకోవచ్చు.. సాహిత్యాభిలాష ఉన్నవాళ్లకు కూడా ఈ సైట్లో గ్రంధాలు,
కావ్యాలు, శ్రీ శ్రీ, శరత్, తిలక్ మొదలైనవారి రచనలు, సాక్షి వ్యాసాలు కూడా ఉన్నాయి.
హాస్యాన్ని కోరుకునేవారికోసం హాస్యభరితమైన వీడియోలు, సినిమాలు, నాటికలు, హాస్య నటీనటుల సీన్‌లు, హాస్య రచనలు
కూడా అందుబాటులో ఉంచారు .. ఎవరికి వారు తమకు నచ్చిన రచనలు, పాటలు, సినిమాలు, ఏవైనా చూడగలిగే అవకాశం ఈ తెలుగువన్‌లో ఉంది.
తెలుగువన్ వారు పిల్లలకోసం ప్రత్యేకంగా
కిడ్స్ వన్ నిర్వహిస్తున్నారు. ఇందులో మాతృదేశాన్ని వదిలి విదేశాలలో ఉన్నవారి
పిల్లలకు తెలుగుని మరచిపోకుండా ఉండాలని వాళ్లకు నేర్పించడానికి తెలుగు పాఠాలు
పొందుపరిచారు. అందమైన బొమ్మలతో, ఇంగ్లీషు, తెలుగులో రాసి వినిపించే తెలుగు పాఠాలు పిల్లలందరికి చాలా సులువుగా
అర్ధమయ్యేలా ఉన్నాయి. అంతేకాక జాతీయ నాయకులు, పురాణగాధలు, పద్యాలు, పిల్లల కథలు, పంచతంత్ర కధలు మొదలైనవెన్నో ఇందులో
పొందుపరిచారు. ఇవి తెలుగు, హిందీ, తమిళ బాషలలో లభ్యమయ్యే ఈ పాఠాలు క్లాసు పాఠాలలా కాకుండా ఆడుతూ పాడుతూ
నేర్చుకునేలా తయారు చేసారు.
విదేశాలలో ఉన్న మీ పిల్లలకు, బంధువులకు, స్నేహితులకు బహుమతులుపంపాలనుకుంటున్నారా? ఇక్కడినుండి వెళ్లేవాళ్లు లేరు,
ఎలా మరి?? బట్టలు, నగలు, వెండి సామాను, పర్సులు, పుట్టినరోజు కేకులు, వగైరా ఎన్నో బహుమతులు తెలుగువన్ ద్వారా
ఆర్డర్ చేసి వివరాలు అందించి తగిన రుసుము చెల్లిస్తే చాలు ఆ బహుమతులు విదేశాలలో
ఉన్నవారికి మీరు కోరిన సమయానికే చేరిపోతాయి. అలాగే శుభాకాంక్షలు, బహుమతులు అక్కడినుండి పంపించగలిగే వీలు కల్పించారు.. అమెరికాలో కాని,
చైనాలోకాని, జపాన్, ఆఫ్రికాలో ఉన్నా ఇండియా, హైదరాబాదులోని ప్రముఖ దుకాణాల నుండి షాపింగ్ చేసి ఆ వస్తువులు తమ
దగ్గరికే తెప్పించుకోవచ్చు ఈ సైట్ ద్వారా..
ఇంతేకాదు తెలుగువన్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టారు. గుండె ఆపరేషన్లు, కంటి చూపు, వినికిడి సమస్యలు ఉన్నవారికోసం విరాళాలు సేకరించి అవసరమైనవారికి, అర్హులైనవారికి అందచేసారు. అలాగే వరద బాధితులకు కూడా అన్ని జిల్లాలలో బట్టలు, నీరు, మందులు వగైరా సరఫరా చేసారు. ఈ సాహాయ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా తెలుగువన్ ఫౌండేషన్ ఏర్పాటు చేయబడింది. అన్నీ చట్టబద్ధంగా నిర్వహిస్తున్నారు.
ఇంతేకాదు తెలుగువన్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టారు. గుండె ఆపరేషన్లు, కంటి చూపు, వినికిడి సమస్యలు ఉన్నవారికోసం విరాళాలు సేకరించి అవసరమైనవారికి, అర్హులైనవారికి అందచేసారు. అలాగే వరద బాధితులకు కూడా అన్ని జిల్లాలలో బట్టలు, నీరు, మందులు వగైరా సరఫరా చేసారు. ఈ సాహాయ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా తెలుగువన్ ఫౌండేషన్ ఏర్పాటు చేయబడింది. అన్నీ చట్టబద్ధంగా నిర్వహిస్తున్నారు.
తెలుగు వన్ వారి టోరి రేడియో ఇరవై
నాలుగు గంటలు లైవ్ షో లతో అందరికి నచ్చిన, అందరూ మెచ్చిన
పాటలతో, ప్రముఖుల ఇంటర్వ్యూలతో అలరిస్తుంది. ఏ
దేశంలో ఉన్నా తెలుగు టీవీ చానెళ్లు చూడాలనుకుంటే ఆ సదుపాయం కూడా తెలుగు వన్ కల్పిస్తుంది.
ఇన్ని సదుపాయాలు, కార్యక్రమాలను తెలుగువారందరికోసం
అందిస్తున్న ఒక సంపూర్ణమైన వేదిక తెలుగువన్ పుష్కరకాలంగా తన సేవలను అందిస్తుంది.
4 వ్యాఖ్యలు:
nice,
నాకు చాల ఇష్టమైన websites లో teluguone ఒకటండి.
teluguone.com chala manchi website..naku chala estam. ravi shankar garu chala manchi pani chesaru teluguone.com site open chesi.
Nice Article.
Patas is a collection of all videos like telugu comedy, comedy videos ,funny videos clips , amazing videos,Telugu comedy videos, cricket videos, funny videos, video clips etc.
Post a Comment