Friday, 21 September 2012

కొత్త ఉద్యోగం - కొత్త బాధ్యత




అక్షరాభ్యాసం నాడు దిద్దిన తెలుగు అక్షరం అమ్మతోడుగా చందమామ నేస్తంగా నాతోపాటు ఎదుగుతూ వచ్చింది. కాన్వెంట్ చదువైనా కూడా తెలుగు అంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం.. అమ్మ చదివే వారపత్రికలు, నవళ్లు చదవడంతో ఆ ఇష్టం ఇంకా పెరిగింది. ఆ అలవాటు నాతోపాటు పెరిగి ఒక వ్యసనంగా మారింది. పిల్లలకు చెప్పడానికి నా తెలుగు ఎక్కువ ఉపయోగపడకున్నా నాకు మాత్రం సంతృప్తినిచ్చింది ఈ పుస్తకపఠనం. బ్లాగులో మొదలెట్టిన అక్షర ప్రయాణం అస్తవ్యస్తంగా ఉన్నా మెరుగులు దిద్దుకుంటూ వచ్చింది. పిచ్చి రాతలే మంచి రచనలు అయ్యాయి. ఈ అక్షర ప్రయాణంలో నాకు తోడుండి సందేహాలు తీర్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చినవారు ఎందరో. నాలోని ఆలోచనలు, సంఘర్షణలు, చెప్పాలనుకున్న మంచి మాటలు, వాదనలు, స్పందనలు అన్నీ నా బ్లాగులో నిక్షిప్త పరుచుకున్నాను. స్కూలులో వదిలేసాననుకున్న తెలుగు భాష బ్లాగుల్లో కొచ్చాక మళ్లీ నా దరి చేరింది. నా రాతనే మార్చింది.

ఆరేళ్ల క్రింద కంప్యూటర్లో తెలుగు రాయడం ఎంతో సులువు అని తెలుసుకున్న తర్వాత ఆగే ఆలోచనే లేదు. నాకు నచ్చిన విషయాలన్నీ విడివిడిగా బ్లాగుల రూపంలో అమర్చుకున్నాను.ఇది అందరికీ తెలిసిందే. సరదా మాటలు, అప్పుడప్పుడు సీరియస్ కబుర్లతో కాలం గడిపేస్తుండగా ఆముక్తమాల్యద గురించి తెలుసుకుని దాని గురించి నెట్‌లో  వెతికితే ఎక్కడా దొరకలేదు. పండితులైనవారికి పద్యాలు, టీకా తాత్పర్యాలు చాలా సులువుగా అర్ధమైపోతాయి. మరి నాలాంటి వారి సంగతేంటి? తాతలు, తండ్రులు నేతులు తాగారు మా మూతి వాసన చూడండి అనడానికి అటు పుట్టింట్లోనూ, అత్తింట్లోనూ ఎవరూ సాహిత్యాభిలాష కలిగినవాళ్లు లేరు. నేనొక్కదాన్నే పుస్తకాల పురుగును.. తెలుగులో నాకు నచ్చినవన్నీ నా బ్లాగులో ఉన్నాయి..   


 అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో ఉండాలని మొదలుపెట్టబడిన బ్లాగులే ఆముక్తమాల్యద. విజయవిలాసం. నేను చదివి అర్ధం చేసుకుని మరీ బ్లాగులో రాయడం జరుగుతుంది..కంప్యూటర్లో తెలుగు రాయడం చాలా సులువు, ఉచితం ఐనప్పుడు మనకు తెలిసిన తెలుగు సాహిత్యాన్ని అంతర్జాలంలో నిక్షిప్తం చేసి నేటి తరం వారికి, రాబోయే తరంవారి కోసం తయారు చేసిపెట్టడంలో తప్పేంటి? దీనికోసం మనకున్న కొద్దిపాటి తీరిక సమాయన్ని వినియోగిస్తే చాలు.  ఇదే ఆలోచనతో మరి కొందరి సహకారంతో ఈ రెండు బ్లాగులు మొదలయ్యాయి. నేను ఎప్పుడూ అనుకుంటాను. అసలు నేను చేస్తున్నదేంటి? వంటలా? రాతలా? పద్యాలా? కాని నిజం చెప్పాలంటే ఈ వంటలు, రాతలు రెండింటిని సమానంగా నిర్వహించగలను. వంటలకు సంబంధించిన గుర్తింపు, ప్రశంసలు సంతోషాన్ని ఇస్తే, తెలుగు సాహిత్యానికి సంబంధించి వచ్చే గుర్తింపు, ప్రశంస, ప్రోత్సాహం ఆత్మసంతృప్తినిస్తున్నాయి. నా మీద నమ్మకంతో మాలిక పత్రికలో కంటెంట్ హెడ్ గా బాధ్యతలను అప్పగించిన భరద్వాజ్ కు ధాంక్స్. ఈ  పత్రిక వల్ల రచయితలతో పరిచయం, తెలుగు సాహిత్యం మీద పని చేయడానికి అవకాశం పెరిగింది..


ఈ క్రమంలో వచ్చిన ఒక ఉద్యోగావకాశాన్ని అందిపుచ్చుకున్నాను. అది తెలుగుకు, తెలుగు పుస్తకాలకు సంబంధించినది కావడం ఒక ముఖ్య కారణం. ఇష్టమైన పని ఎన్నటికీ కష్టం కాదు కదా అందుకే ఈ కొత్తదారిలో  పయనం మొదలుపెట్టాను. నా సంతోషంలో భాగస్వాములై నన్ను ప్రోత్సహిస్తూ, ఆదరిస్తారని కోరుకుంటున్నాను... అవునూ పది రోజుల క్రింద నా బ్లాగు వార్షికోత్సవంనాడు నా ఉద్యోగం గురించి సర్ప్రైజ్ అన్నాను కదా. ఇదిగోండి ఆ వివరాలు..


ఇక నా పని సారంగ్ బుక్స్ వారికి ఇండియాలో రీజనల్ మేనేజర్. మొత్తం ఇండియాకు సంబంధించి, కంపెనీకోసం కొత్త పుస్తకాల పబ్లిషింగ్, ప్రింటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పుస్తకాల అమ్మకాలు వగైరా వ్యవహారాలు చూసుకోవడం. సారంగ బుక్స్ కి సంబంధించి,  పుస్తకాల కొనుగోలు గురించి ఎటువంటి సందేహానికైనా, సమాచారానికైనా మీరు నన్ను  ఈ అడ్రస్ లో సంప్రదించవచ్చు. 

 Email: jyothivalaboju@saarangabooks.com



ఐ పాడ్ , ఐ ఫోన్ ల్లో  సారంగ బుక్స్ లభ్యం
 
సారంగ పుస్తక ప్రచురణలు నవంబర్, 2010 లో ప్రారంభించినప్పుడు తెలుగు పుస్తకాలను కేవలం ప్రింట్ రూపం లోనే కాకుండా యాపిల్  ఐ బుక్స్,  ఇతర ఈ బుక్స్ గా  కూడా అందివ్వాలని సంకల్పించాము. ఆ చిరకాల స్వప్నం ఇవాళ సాకారమయింది. సారంగ ప్రచురణలు యాపిల్ ఐ బుక్స్ ప్లాట్ ఫారం లో కూడా సెప్టెంబర్ 20,2012 నుంచి  లభ్యమవుతున్నాయని సగర్వంగా, సంతోషంగా తెలియచేస్తున్నాము. సారంగ సంస్థ నుంచి ప్రచురితమైన ప్రతిష్టాత్మక పుస్తకాలు తన్హాయి , యమకూపం నవలలు ఇప్పుడు ఐపాడ్, ఐ ఫోన్, ఐ పాడ్ టచ్  లేదా ఏదైనా ఐఓఎస్ సాధనం ( డివైస్) లో చదువుకోవచ్చు. ఈ ఐ పుస్తకాలను సారంగ వెబ్ సైట్ లో అందచేసిన లింక్ ద్వారా యాపిల్ ఐ బుక్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. యాపిల్ ఐ బుక్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవటం తో పాటు,  చదివాక పుస్తకం ఎలా ఉందో రివ్యూ చేసే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరలో సారంగ తొలి ప్రచురణ, అఫ్సర్, వంశీకృష్ణ ల సంపాదకత్వం లో వెలువడిన కవిత్వ సంకలనం “అనేక”  కూడా ఐ బుక్స్ లో అందుబాటు లోకి వస్తుంది.
 
యాపిల్ ఐ బుక్స్ ప్లాట్ ఫారం లో తెలుగు పుస్తకాలు అందుబాటు లోకి రావటం అటు తెలుగు సాహిత్యానికి, ఇటు సారంగ ప్రచురణలకుకూడా ఓ శుభ వార్త. తెలుగు సాహిత్య ప్రచురణ రంగం లో ఈ ఐ బుక్స్  అతి పెద్ద మలుపు. మంచి తెలుగు పుస్తకాలను మరిన్ని ఇతర డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ లోకి కూడా అందుబాటు లోకి తెచ్చే ప్రయత్నం లో సారంగ కు తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు నిరంతరం అండగా నిలుస్తాయని ఆశిస్తున్నాము.
 
నోట్ : ప్రస్తుతానికి ఈ ఐ బుక్స్ కొనుగోళ్ళు  ఇండియా బయట మాత్రమే సాధ్యం . ఇండియా లో వున్న వారు ఈ అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అనేది యాపిల్ సంస్థ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
 
యాపిల్ ఐ బుక్స్ కొనుగోళ్ళు, మొదలైన వాటి గురించి మీ అభిప్రాయాలూ, సలహాలు, సందేహాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాము. సంప్రదించాల్సిన ఈమైల్ kalpana@saarangabooks.com

21 వ్యాఖ్యలు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

జ్యోతి గారు,
అభినందనలు.
మీ నగరంలో ఉండే ఈ పని చేస్తారా? లేక స్థానచలనం ఉంటుందా?

జ్యోతి

లక్ష్మీగారు,
ధన్యవాదాలు.. నేను ఇక్కడే ఉండి పని చేస్తానండి. స్ధానచలనం అవసరం ఉండదనుకుంటా..

శ్రీలలిత

హృదయపూర్వక అభినందనలండీ..
మీరు సంకల్పించిన పనులన్నింటినీ దిగ్విజయంగా నడిపే మనోశక్తిని మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ..
శుభాశీస్సులతో...
శ్రీలలిత..

సి.ఉమాదేవి

శుభాభినందనలు జ్యోతిగారు.ప్రవృత్తికితగ్గ వృత్తి వరించింది మిమ్మల్ని!మీరు పూర్తి న్యాయం చెయ్యగలరన్న నమ్మకం నాకుంది.

జ్యోతిర్మయి

అభినందనలు జ్యోతి గారు.

మాలా కుమార్

మీ ఈ కొత్త ఉద్యోగం లో కూడా విజయపథం లోకి దూసుకెళ్ళాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ ,
అభినందనలు జ్యోతిగారు .

Admin

అభినందనలు జ్యోతి గారు.

మధురవాణి

Hearty congratulations Jyothi gaaru.. :)

కిరణ్ కుమార్ కే

శుభాకాంక్షలు జ్యోతి గారు, యాపిల్ ఐ బుక్స్ లాగ android లో కూడా ఇవ్వటానికి ప్రయత్నించండి.

Anonymous

శుభాకాంక్షలు

సిరిసిరిమువ్వ

అభినందనలు జ్యోతి గారు. Wishing you all the success.

శశి కళ

ALL THE BEST JYOTHI AKKA

నాగేస్రావ్

చాలా ఆనందం జ్యోతిగారూ! మీవంటలలాగే పుస్తకాలు కూడా అందర్నీ ఆనందింపచేస్తాయి.

భాస్కర్ కె

అభినందనలండి, కొత్త ఉద్యోగం విజయవంతంగా కొనసాగించాలని ఆశిస్తూ...

చక్రవర్తి

పార్టీలు ఇవ్వకుండా ఇలా క్రొత్త ఉద్యోగంలో చేరిపోవటం మేము ఖండిస్తున్నాం.

అధ్యక్షా!! పార్టీ ఇచ్చేంతవరకూ ఇలా ఖండిస్తూనే ఉంటాం అని సభా పూర్వకంగా తెలియజేయడమైనది.

అన్వేషి

జ్యోతిగారు!
హృదయపూర్వక అభినందనలు! "నీఅభిరుచికి తగిన పనిదొరికితే జీవితంలో పనిచేయాల్సిన పనుండ" దని ఎవరో పెద్దాయన చెప్పారు. కాబట్టి మీ మార్గం మరింత సుగమమవుతుందని ఆశిస్తూ మీ పయనం మరింత ఉన్నత స్థాయికి సాగాలని మసారా కోరుకుంటున్నాను.

వనజ తాతినేని/VanajaTatineni

జ్యోతి గారు అభినందనలు. మీలోని అధిక సామర్ధ్యానికి మీకు లభించిన అవకాశం ఇది. విజయవంతంగా కొనసాగించగలరు. మీ భాద్యత నిర్వర్తించ గలరు. అల్ ది బెస్ట్ ..

జ్యోతి

శ్రీలలిత, మాలాకుమార్, ఉమాదేవి, వనజ, శశికళ, అన్వేషి,వరూధిని, మధురవాణి,జ్యోతిర్మయి, లక్ష్మి, the tree,Green star, kvshastri,చక్రవర్తి, నాగేవ్రావ్,,

అందరికి ధన్యవాదాలు..

Lakshmi Raghava

jyothi,
ఎప్పుడూ బ్లాగులు తీరికగా చదివే అవకాసం వుండదు నాకు దానికి కారణాలు చాలా వున్నాయి..అందులో ఒకటి కరెంటు కష్టం...అవి ఓడిలేసేయ్యండి .ఈ రోజు మీ బ్లాగులో కి అడుగిడి మీ ఉద్యోగ విషయమే కాక ఇంగ్లేషు చదువులు చదివి ఇంతగా ఎదిగిన మీ గుర్తింపు ఎంత ఆనందాన్నిచ్చిందో ..నా హృదయ పూర్వక అభినందనలు ..ఆశీర్వాదాలు

ప్రతి-ఉదయం

CONGRATS JYOTHI AUNTY JI.....I WISH U ALL THE BEST...

చింతా రామ కృష్ణా రావు.

అభినందనలమ్మా!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008